Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. అంతట యూదావంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైనవారు, చెరనివారణ యయినవారు ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని
“శత్రువులు”– వీరు ఇస్రాయేల్వారు కాదు. విదేశీయులు. సహాయం చేస్తామని వారు ముందుకు రావడంలో వారికి ఉన్నది మంచి ఉద్దేశం కాదు. ఇది త్వరలోనే బట్టబయలు అయింది (4,5 వ). దేవుని పనిని చెడగొట్టేందుకు సైతాను అవలంబించే ఒక పద్ధతి ఏమిటంటే కపట సహాయకుల్ని అందులో ఇరికించడం. మత్తయి 13:24-30 మత్తయి 13:37-39; 2 కోరింథీయులకు 11:13-15; 2 పేతురు 2:1-2. విశ్వాసులకు ఇలాంటి సహాయకుల అవసరం లేదు. ఇలాంటివారి విషయంలో అప్రమత్తులై ఉండాలి.
2. జరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధా నులయొద్దకును వచ్చిమీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోనుయొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి.
ఏసర్హద్దోను– ఇతడు క్రీ.పూ 681–669 కాలంలో రాజ్యపాలన చేశాడు. అంతకుముందు మరో అష్షూరు రాజు సమరయ ప్రాంతంలో నివసించేందుకు మరి కొంతమందిని పంపించాడు (2 రాజులు 17:24). ఇస్రాయేల్ వారి దేవుణ్ణి కొలుస్తున్నామని వీరు చెప్పారు, ఆయన గాక వారి స్వంత దేవుళ్ళు అనేక మందిని కూడా వారు కొలిచేవారు. 2 రాజులు 17:25-34 చూడండి.
3. అందుకు జెరుబ్బాబెలును యేషూవయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులునుమీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు;మేమే కూడుకొని పారసీకదేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞప్రకారము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకుమందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి.యోహాను 4:9
ధర్మశాస్త్రంలో యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను పాటించకుండా ఇతర దేవుళ్ళను ఆరాధించేవారి నుంచి ఎలాంటి సహాయమైనా పొందడానికి యూదుల నాయకులు నిరాకరించారు. పవిత్రులైన ప్రత్యేక ప్రజగా ఉండాలన్న ఇలాంటి పట్టుదలే నేటి విశ్వాసులకు కూడా ఉండాలి – 2 కోరింథీయులకు 6:14-18.
4. దేశపు జనులు యూదావంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి.
దేవుని పనికి విరోధులైనవారు ఒక మార్గం ద్వారా దాన్ని చెడగొట్టలేకపోతే వేరొక దారిగుండా ప్రయత్నిస్తారు. కోరెషు క్రీ.పూ. 559–530లో రాజ్యమేలాడు. దర్యావేషు పాలన 522లో ఆరంభమైంది.
5. మరియు పారసీకదేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోను పారసీకదేశపు రాజైన దర్యా వేషుయొక్క పరిపాలనకాలమువరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి.
6. మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదాదేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారిమీద తప్పు మోపిరి.
జెరుసలం గోడల్ని తిరిగి కట్టించాలన్న యూదుల ఉద్దేశానికి కలిగిన అవరోధాన్ని ఈ భాగం వివరిస్తున్నది. కాల క్రమం ప్రకారం చూస్తే ఈ భాగం 6–7 అధ్యాయాల మధ్య ఉండవలసింది – ప్రస్తుత కథనంలో దీన్ని రచయిత ఇమిడ్చాడు. 5వ వచనంలో సాగుతున్న కథనం 24వ వచనంనుంచి మళ్ళీ ఆరంభం అవుతుంది. “అహష్వేరోషు”– ఎస్తేరు 1:1. ఇతడు క్రీ.పూ. 486–465 మధ్య పర్షియా (ఇప్పటి ఇరాన్) సామ్రాజ్యాన్ని పాలించాడు.
7. అర్తహషస్తయొక్క దినములలో బిష్లామును మిత్రి దాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసిపంపిరి. ఆ యుత్తరము సిరియాభాషలో వ్రాయబడి సిరియాభాషలోనే తాత్పర్యము చేయబడినది.
“అర్తహషస్త”– ఎజ్రా 7:1 ఎజ్రా 7:7 ఎజ్రా 7:21. ఇతడు క్రీ.పూ. 465–424 మధ్య పర్షియా సామ్రాజ్యాన్ని పాలించాడు.
8. మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షివ్షుయియు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతినిగూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్తయొద్దకు పంపిరి.
“ప్రాంతీయాధిపతి”– తన ప్రతినిధిగా చక్రవర్తి చేత నియమించబడినవాడు.
9. అంతట మంత్రి యగు రెహూమును లేఖకుడగు షివ్షుయియు వారి పక్ష ముగానున్న తక్కినవారైన దీనాయీయులును అపర్స త్కాయ్యులును టర్పెలాయేలును అపార్సాయులును అర్కెవాయులును బబులోనువారును షూషన్కాయులును దెహావేయులును ఏలామీయులును
10. ఘనుడును, శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యివతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములును, నది యివతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి.
“అస్నప్పరు”– అష్షూరు రాజులలో ప్రధానమైనవారిలో చివరివాడు. క్రీ.పూ. 669–627 కాలంలో రాజ్యమేలాడు. ఈ వచనం, 2 వ వచనం, 2 రాజులు 17:24 – ఈ మూడింటిని బట్టి చూస్తే మొత్తం ముగ్గురు అష్షూరు రాజులు ఆయా సమయాల్లో బయటి ప్రజలను సమరయ ప్రాంతానికి పంపించి స్థిరనివాసం ఏర్పరచారు అని అర్థమౌతున్నది.
11. వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యివతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియ జేయునదేమనగా
12. తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయు చున్నారు.
13. కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువ బెట్టినయెడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని యియ్యకయుందురు, అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును.
ఆర్థిక కారణాలను చూపి యూదుల విరోధులు తమ పన్నాగాన్ని రాజు కూడా సమర్థించేలా చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆర్థికంగా నష్టపోవడానికి ఏ రాజుకు ఇష్టం ఉంటుంది?
14. మేము రాజుయొక్క ఉప్పుతిన్నవారము గనుక రాజునకు నష్టమురాకుండ మేము చూడవలెనని ఈ యుత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియ జేసితివిు.
15. మరియు తమ పూర్వికులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచినయెడల, ఈ పట్టణపువారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదు రనియు, అందువలననే యీ పట్టణము నాశనము పొందె ననియు రాజ్యపు దస్తావేజులవలననే తమకు తెలియ వచ్చును.
16. కావున రాజవైన తమకు మేము రూఢిపరచున దేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినయెడల నది యివతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు.
17. అప్పుడు రాజుమంత్రియగు రెహూమునకును లేఖకుడగు షివ్షుయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవ తలనుండు తక్కినవారికినిమీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా
18. మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకొన్నాము.
అరమేయిక్ భాషనుంచి పారసీక భాషకు అనువదించారు.
19. అందువిషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా, ఆదినుండి ఆ పట్టణపువారు రాజులమీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది.
20. మరియు యెరూషలేముపట్టణమందు బలమైనరాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది యవతలి దేశములన్నిటిని ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లు చుండెను.
1 రాజులు 4:21; 1 దినవృత్తాంతములు 18:3-6.
21. కాబట్టి యిప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి, మేము సెలవిచ్చువరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి.
22. ఇది తప్పకుండ చేయుటకు మీరు జాగ్రత్తపడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరుగకుండ చూడుడి అని సెలవిచ్చెను.
వచనాల్లో చూపిన ఆర్థిక కారణాలు వారు కోరుకున్న ఫలితాన్ని ఇచ్చాయి. ఈ లోక విషయాల్లో ఇది సహజమే కదా.
23. రాజైన అర్త హషస్త పంపించిన యుత్తరముయొక్క ప్రతి రెహూమునకును షివ్షుయికిని వీరిపక్షముగా నున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదులయొద్దకు వచ్చి, బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా
“పని మానేలా”– పని ఆపించడమంటే జెరుసలం నగర ప్రాకారాన్ని కట్టించే పనిని ఆపించడమన్న మాట.
24. యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీకదేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరమువరకు ఆ పని నిలిచిపోయెను.
రచయిత మళ్ళీ 4,5 వచనాల్లోని కథనానికి అంటే అర్తహషస్త పరిపాలన కంటే ముందు జరిగిన విషయాలకు తిరిగి వచ్చాడు.