Exodus - నిర్గమకాండము 3 | View All

1. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.
అపో. కార్యములు 7:30

పురాతన ప్రపంచంలో ఈజిప్ట్‌దేశం నాగరికతలో ముందంజ వేసిన దేశాల్లో ఒకటి. మోషే ఈజిప్ట్ జ్ఞానమంతటిలో పాండిత్యం సంపాదించినవాడు. తన మాటల్లోను క్రియల్లోను బలప్రభావాలు ఉన్నవాడు (అపో. కార్యములు 7:22). జీవితంలో ఏది సాధించడానికైనా సరైన ప్రాయంలో ఉన్నాడు. మగతనం, బలం అతనిలో ఉరకలు వేస్తున్నాయి. తన జాతిపట్ల అభిమానం, దేవునికోసం ఏమైనా చెయ్యగల ఆసక్తి అతనిలో పొంగిపొరలుతున్నాయి. అప్పుడే తన ప్రజలను ఈజిప్ట్‌నుంచి విడిపించి తీసుకురావడానికి అతడు సమర్థుడని అనుకోవచ్చు. అయితే దేవుని ఆలోచన వేరుగా ఉంది. దేవుని సంకల్పం ప్రకారం మోషే ఎడారిలో 40 ఏళ్ళు గడిపాడు (అపో. కార్యములు 7:23 అపో. కార్యములు 7:30 తో; నిర్గమకాండము 7:7 కలిపి చూడండి). తన మామగారి గొర్రెలకు కాపరి అయ్యాడు. దీన్ని బట్టి చూస్తే ఇస్రాయేల్ ప్రజను దాస్యంనుంచి విడిపించి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నాయకుడై నడిపించగలిగేటందుకు అతడు ఇంకా తెలుసుకోవలసినది ఒంటరితనం, దీనదశ, కష్టాలు నిండిన జీవితంలోనే నేర్చు కోవాలని కనిపిస్తున్నది. నమ్మకంగా గొర్రెలను కాస్తూ ఉన్నవేళ దేవుడతనికి ప్రత్యక్షమై ఒక ఉన్నతమైన సేవకు పిలిచాడు. (ఇలాంటి విషయానికి మరి కొన్ని ఉదాహరణలు: గిద్యోను – న్యాయాధిపతులు 6:11 ఎలీషా – 1 రాజులు 19:19 పేతురు – మత్తయి 4:18-19). తన ప్రజలను దాస్యంనుంచి విడిపించేందుకు దేవుడు నియమించిన సమయం ఆసన్నమైంది, గనుక ఆయన మోషేను హోరేబు కొండకు నడిపించాడు (హోరేబు సీనాయి కొండకు మరో పేరు). దీనికి దేవుని కొండ అని పేరు. ఎందుకంటే తరువాతి కాలంలో దేవుడు ఈ కొండమీదే అద్భుత రీతిలో తనను తాను వెల్లడి చేసుకొని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు నిర్గమకాండం 19–40 అధ్యాయాలు, లేవీయకాండం, సంఖ్యాకాండం మొదటి 10 అధ్యాయాలు ఇచ్చినది ఇక్కడే. “యిత్రో”– నిర్గమకాండము 2:18 నోట్ చూడండి.

2. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు.
మార్కు 12:26, లూకా 20:37, అపో. కార్యములు 7:35, అపో. కార్యములు 7:30-31

“యెహోవా దూత”– ఆదికాండము 16:7 నోట్ చూడండి. “పొద”– మార్కు 12:26 అపో. కార్యములు 7:30. “మంటల్లో”– బైబిల్లోని కొన్ని సార్లు మంటలు దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నాయి. నిర్గమకాండము 13:21 నిర్గమకాండము 19:18 ఆదికాండము 15:17 లేవీయకాండము 9:24 సంఖ్యాకాండము 11:1-3 సంఖ్యాకాండము 16:35 ద్వితీయోపదేశకాండము 4:11-12 ద్వితీయోపదేశకాండము 5:4 ద్వితీయోపదేశకాండము 9:3 1 రాజులు 18:24 1 రాజులు 18:38 1 దినవృత్తాంతములు 21:26 2 దినవృత్తాంతములు 7:1 కీర్తనల గ్రంథము 18:8 యెషయా 4:5 యెషయా 33:14 యెహోషువ 1:4 మలాకీ 3:2 హెబ్రీయులకు 12:29. అగ్ని ప్రత్యేకంగా దేవుని పవిత్రతను తెలియజేస్తుంది. అయితే దేవునికి గుర్తుగా ఉన్న అగ్నిని పూజించాలని దేవుడు ఎప్పుడూ మనుషులకు చెప్పలేదు. అగ్నినీ, అన్నిటినీ చేసిన దేవుణ్ణే ఆరాధించాలి.

3. అప్పుడు మోషే - ఆ పొద యేల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను.
అపో. కార్యములు 7:30-31

4. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

ఆదికాండము 22:11 1 సమూయేలు 3:4.

5. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.
అపో. కార్యములు 7:33

యెహోషువ 5:15.

6. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.
మత్తయి 22:32, మార్కు 12:26, లూకా 20:37, Acts,3,13,-732, హెబ్రీయులకు 11:16

అపో. కార్యములు 7:32 న్యాయాధిపతులు 13:22 ప్రకటన గ్రంథం 1:17.

7. మరియయెహోవా యిట్లనెను - నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.
అపో. కార్యములు 7:34

నిర్గమకాండము 2:25 చూడండి; నెహెమ్యా 9:9 కీర్తనల గ్రంథము 106:44 యెషయా 63:9 అపో. కార్యములు 7:34.

8. కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి యున్నాను.

ఆదికాండము 15:13-14 ఆదికాండము 50:24 నిర్గమకాండము 6:6-8 నిర్గమకాండము 12:51.

9. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని.

10. కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.

11. అందుకు మోషే - నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని దేవునితో అనగా

నలభై ఏళ్ళ క్రితమే దేవుడు తనద్వారా ఇస్రాయేల్ ప్రజలకు దాస్య విముక్తి చేస్తాడని మోషే గట్టిగా నమ్మాడు. అయితే తనకు తోచిన విధంగా తన శారీరక బలాన్ని ఉపయోగించి అలా చెయ్యడానికి ప్రయత్నించాడు – అపో. కార్యములు 7:25. ఇప్పుడైతే అతడు వినయాన్ని అలవరచుకున్నాడు – నిర్గమకాండము 4:10 నిర్గమకాండము 4:13 నిర్గమకాండము 6:12.

12. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను.
అపో. కార్యములు 7:7

ఆదికాండము 28:15 ఆదికాండము 31:3 నిర్గమకాండము 4:12 నిర్గమకాండము 33:14-16 యెహోషువ 1:5 యెషయా 43:2 యెషయా 57:15.

13. మోషే చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని నడిగెను.

14. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.
ప్రకటన గ్రంథం 1:4-8, ప్రకటన గ్రంథం 4:8, ప్రకటన గ్రంథం 11:17, ప్రకటన గ్రంథం 16:5

ఇక్కడ దేవునికున్న ఒక ముఖ్యమైన పేరు “ఉన్నవాడను” కనిపిస్తున్నది. ప్రకటన గ్రంథం 1:8 లో కనిపించే “పూర్వం ఉండి ప్రస్తుతం ఉంటూ భవిష్యత్తులో వచ్చేవాణ్ణి” అనే పేరు లాంటిదే ఇది కూడా. యెహోవా అనే మాట “ఉండడం” అని అర్థం ఇచ్చే హీబ్రూ పదంనుంచి వచ్చింది. కొందరు హీబ్రూకు దగ్గరగా ఉండేలా “యావే” లేక “యాహ్వే” అని రాస్తారు. దీనికే “ఉన్నవాణ్ణి” అని అర్థం. అంటే, ఆయన శాశ్వతంగా ఎవరితోనూ నిమిత్తం లేకుండా దేవుడై ఉండేవాడు, స్వయంభవుడు. పాత ఒడంబడికలో యెహోవా అనే మాట 6,000 కంటే ఎక్కువ సార్లు కనిపిస్తుంది. ఇది దేవునికి జ్ఞాపకార్థ నామం. తరతరాలుగా యూదులు ఈ పేరును జ్ఞాపకం ఉంచుకోవాలి (కీర్తనల గ్రంథము 135:13). దేవుని స్వభావం, లక్షణాలు నిర్గమకాండము 34:6-7 లో వెల్లడయ్యాయి. కొందరు విద్వాంసులైన యూదులు హీబ్రూ భాషలోని పాత ఒడంబడికను క్రీస్తుకు 2,3 శతాబ్దాల క్రితమే గ్రీకులోకి అనువదించారు. వారు యెహోవా అనే పేరును గ్రీకులో కూరియొస్ అనే పదంగా తర్జుమా చేశారు. కూరియొస్ అంటే ప్రభువు అని అర్థం. ప్రభువు అనే పదం 700 కంటే ఎక్కు సార్లు క్రొత్త ఒడంబడిక గ్రంథంలో కన్పిస్తుంది. చాలా చోట్ల యెహోవా అనే పేరుకు “ప్రభువు” అని అనువాదం కనిపిస్తుంది (మత్తయి 3:3 తో; యెషయా 40:3 మత్తయి 4:7 మత్తయి 4:10 తో; ద్వితీయోపదేశకాండము 6:13 ద్వితీయోపదేశకాండము 6:16 అపో. కార్యములు 2:20-21 తో; యోవేలు 2:31-32 రోమీయులకు 4:8 తో; కీర్తనల గ్రంథము 32:2 మొ।। పోల్చి చూడండి). ప్రభువు అనే బిరుదు యేసుక్రీస్తు విషయంలో వందలాది సార్లు రాశారు. అంతేగాక క్రీస్తు తన గురించి తాను “ఉన్నవాడను” అనే పేరు చెప్పుకున్నాడు (యోహాను 8:24 యోహాను 8:28 యోహాను 8:58). పాత ఒడంబడికలో కనిపించే యెహోవాదేవుని అవతారమే క్రొత్త ఒడంబడిక క్రీస్తు. పాత ఒడంబడికలో యెహోవాకు కొన్ని సంక్లిష్ట నామాలున్నాయి. “యెహోవా యీరే” అంటే “యెహోవా చూచుకొంటాడు” – ఆదికాండము 22:13-14. “యెహోవా రొఫా” అంటే “యెహోవా బాగు చేసేవాడు” – నిర్గమకాండము 15:26. “యెహోవా నిస్సీ” అంటే “యెహోవా నా ధ్వజం” – నిర్గమకాండము 17:8-15. “యెహోవా షాలోం” అంటే “యెహోవాయే శాంతి” – న్యాయాధిపతులు 6:24. “యెహోవా త్సిద్కేను” అంటే “యెహోవాయే మనకు నీతిన్యాయాలు” – యిర్మియా 23:6. “యెహోవా షమ్మా” అంటే “యెహోవా ఉన్నస్థలం” – యెహోషువ 48:35. ఈ పేర్ల గురించిన నోట్స్ కోసం ఈ రిఫరెన్సుల దగ్గర చూడండి. క్రొత్త ఒడంబడికలో క్రీస్తు ఈ పేర్లన్నిటి అర్థాన్నీ పూర్తిగా నెరవేరుస్తూ ప్రత్యక్షమయ్యాడు. “యీరే” – యోహాను 10:11 యోహాను 10:17-18 “రొఫా” – మత్తయి 9:35 “నిస్సీ” – రోమీయులకు 8:37 1 కోరింథీయులకు 15:57 “షాలోం” – ఎఫెసీయులకు 2:14 కొలొస్సయులకు 1:20 “త్సిద్కేను” – 1 కోరింథీయులకు 1:30 2 కోరింథీయులకు 5:21 “షమ్మా” – మత్తయి 1:23 మత్తయి 28:20. నిన్న, నేడు, నిరంతరమూ ఒక్కటే రీతిగా ఉన్న యెహోవాగా క్రీస్తు తనను తాను వెల్లడించుకున్నాడు (హెబ్రీయులకు 13:8). మరి కొన్ని వచనాలను పోల్చి చూస్తే యేసుకూ యెహోవాకూ ఉన్న ఐక్యత, సంబంధం అర్థమౌతాయి (కీర్తనల గ్రంథము 23:1 తో; యోహాను 10:11 మొ।।). లూకా 2:11 నోట్స్‌లో రిఫరెన్సులు చూడండి.

15. మరియదేవుడు మోషేతో నిట్లనెను మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.
మార్కు 22:32, లూకా 12:26, అపో. కార్యములు 20:37, హెబ్రీయులకు 11:16

16. నీవు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుదేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, నిశ్చయముగా చూచితిని,
మత్తయి 22:32, మార్కు 12:26

ఆదికాండము 28:13 ఆదికాండము 48:13.

17. ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము.

ఆదికాండము 50:24.

18. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజు నొద్దకు వెళ్లి అతని చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను.

19. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును;

నిర్గమకాండము 5:2 చూడండి.

20. కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును.

“చెయ్యి”– నిర్గమకాండము 7:4-5 నిర్గమకాండము 9:15 నిర్గమకాండము 13:3 నిర్గమకాండము 13:9 నిర్గమకాండము 13:14. “అద్భుతాలు”– నిర్గమకాండము 7:3 నిర్గమకాండము 10:2 నిర్గమకాండము 15:11 ద్వితీయోపదేశకాండము 6:22 నెహెమ్యా 9:10 కీర్తనల గ్రంథము 105:27 కీర్తనల గ్రంథము 135:9 యిర్మియా 32:20 అపో. కార్యములు 7:36. అద్భుతాలు చూపించడం ద్వారా తాను ఉన్నానన్న సత్యాన్నీ తన శక్తినీ దేవుడు కనపరిచాడు. మనుషుల హృదయాలు కఠినమైనవి, నమ్మకానికి తావివ్వనివి. దేవుళ్ళు, ప్రభువులు అనబడేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఈజిప్ట్‌లో దేవుడు చేసిన సూచనలవల్ల, అద్భుతాలవల్ల ఇస్రాయేల్‌వారి దేవుడైన యెహోవాయే నిజమైన ఏకైక దేవుడు అని అందరికీ తేటతెల్లమైంది (నిర్గమకాండము 8:18-19). ఈ అద్భుత క్రియలు ఈజిప్ట్‌వాళ్ళ దేవుళ్ళ విషయంలో తీర్పులుగా ఉన్నాయి – నిర్గమకాండము 12:12. ఈ క్రొత్త ఒడంబడిక కాలం ఆరంభమైన రోజుల్లో క్రీస్తు శుభవార్త వాస్తవమైనదనీ ప్రపంచానికి రక్షకుడు ఆయనేననీ తెలియజేసేందుకు ఆయన అనేకమైన అద్భుతాలను చేశాడు (హెబ్రీయులకు 2:4). క్రొత్త ఒడంబడిక గ్రంథంలోని అద్భుతాల గురించి మత్తయి 8:1 యోహాను 2:1 మొదలైన చోట్ల నోట్స్ చూడండి.

21. జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు.

ఈజిప్ట్‌వారి చేతుల్లో వారు అనుభవించిన దాస్యానికీ ఇక్కట్లకూ వారికి రావలసిన నష్టపరిహారం ఇదే. యెహోషువ 39:10 హబక్కూకు 2:8 లో లాగా ఇది కూడా దేవుని ప్రతిక్రియ.

22. ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
దేవుడు మోషేకు మండుతున్న పొదలో ప్రత్యక్షమయ్యాడు. (1-6) 
మోషే నలభై సంవత్సరాల మూడు సెట్లు జీవించాడు. మొదటి నలభై సంవత్సరాలలో, అతను ఫారో ఆస్థానంలో యువరాజుగా ఉన్నాడు. రెండవ నలభై సంవత్సరాలు, అతను మిద్యానులో గొర్రెల కాపరిగా పనిచేశాడు. మరియు గత నలభై సంవత్సరాలలో, అతను యెషూరులో రాజుగా ఉన్నాడు. జీవితం ఎలా మారుతుందో చూపిస్తుంది. దేవుడు మోషేకు మొదటిసారిగా కనిపించినప్పుడు, అతను గొర్రెలను చూసుకుంటున్నాడు, ఇది అతని విద్య మరియు సామర్థ్యాలతో పోలిస్తే సాధారణ ఉద్యోగంలా అనిపించవచ్చు. కానీ అతను దానితో సంతృప్తి చెందాడు మరియు వినయంగా మరియు సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడు. ఈ గుణమే అతనికి మత గ్రంథాలలో ప్రసిద్ధి చెందింది. దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనల్ని మనం బిజీగా ఉంచుకోవాలి మరియు ఒంటరిగా ఉండటం వల్ల దేవునితో సంభాషించవచ్చు. ఒకసారి, మోషే కాలిపోతున్న పొదను చూశాడు, కానీ మంటలు లేవని అనిపించింది. ఇది ఈజిప్టులోని చర్చికి చిహ్నంగా ఉంది, ఇది ఆ సమయంలో బందీగా ఉంది, కానీ ఇప్పటికీ దేవుని సహాయంతో బలంగా ఉంది. బైబిల్లో, దేవుని పవిత్రత మరియు న్యాయాన్ని, అలాగే దేవుని ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను సూచించడానికి అగ్ని తరచుగా ఉపయోగించబడింది. మండే పొద కూడా పవిత్ర ఆత్మకు సంకేతం, ఇది ప్రజలను మార్చగలదు మరియు వారిని దేవునిలా చేస్తుంది. దేవుడు మోషేను పిలిచాడు మరియు అతను ఆసక్తిగా స్పందించాడు. మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటే, ఊహించనిదిగా లేదా అసాధారణంగా అనిపించినప్పటికీ, అతను మనకు తనను తాను బహిర్గతం చేసే మార్గాల్లో మనం పాల్గొనాలని ఇది మనకు గుర్తుచేస్తుంది. మీ షూ తీయడం గౌరవం మరియు వినయం చూపించే మార్గం. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, మనం గంభీరంగా మరియు జాగ్రత్తగా ఉండాలి, వెర్రి లేదా అగౌరవంగా ప్రవర్తించకూడదు. అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు వంటి చాలా కాలం క్రితం జీవించిన ప్రజలకు దేవుడు ఇప్పటికీ దేవుడు. వారి శరీరాలు చనిపోయినప్పటికీ, వారి ఆత్మలు ఇప్పటికీ దేవుని వద్ద ఉన్నాయి. మరణం తర్వాత జీవితం ఉందని నమ్మడానికి ఇది మాకు సహాయపడుతుంది. యేసు కూడా దీని గురించి మాట్లాడాడు మరియు ప్రజలు మృతులలో నుండి లేపబడతారని చూపించడానికి దీనిని ఉపయోగించారు. Luk 30:27 మోషే భయపడ్డాడు మరియు దేవుని వైపు చూడటానికి సిగ్గుపడ్డాడు, కాబట్టి అతను తన ముఖాన్ని కప్పుకున్నాడు. దేవుని దయ మరియు వాగ్దానాల గురించి మనం మరింత తెలుసుకున్నప్పుడు, మనం ఆయనను ఆరాధించేటప్పుడు గౌరవంగా మరియు జాగ్రత్తగా ఉండాలని భావించాలి. 

ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు మోషేను పంపాడు. (7-10) 
ఇశ్రాయేలీయులు తమ బాధను దాచిపెట్టినప్పుడు కూడా దేవుడు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు చూస్తాడు. వారు సహాయం కోసం మొరపెట్టినప్పుడు అతను వింటాడు మరియు శక్తిమంతులచే వారు దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు ఆయనకు తెలుసు. ఊహించని విధంగా వారిని త్వరగా రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. గతంలో క్లిష్ట పరిస్థితి నుండి తప్పించుకోవడానికి దేవుడు తన ప్రజలకు ఎలా సహాయం చేశాడో, భవిష్యత్తులో మంచి ప్రదేశంలో ఆనందాన్ని కనుగొనడంలో వారికి సహాయం చేస్తాడు.

యెహోవా పేరు. (11-15) 
చాలా కాలం క్రితం, మోషే ఇశ్రాయేలు ప్రజలను తనంతట తానుగా రక్షించగలనని భావించాడు మరియు దానిని చాలా త్వరగా చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు, అతను ఉద్యోగం కోసం ఉత్తమ వ్యక్తి అయినప్పటికీ, అతను తనంతట తానుగా సరిపోలేడని అతనికి తెలుసు. ఎందుకంటే అతను దేవుని గురించి మరియు తన గురించి మరింత నేర్చుకున్నాడు. అంతకుముందు, అతనికి చాలా విశ్వాసం మరియు చాలా ఉద్వేగభరితమైనది, కానీ అతను తనపై కూడా చాలా విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇప్పుడు, అతను మరింత వినయంగా ఉన్నాడు మరియు దేవుణ్ణి ఎక్కువగా విశ్వసిస్తున్నాడు. నిజంగా మంచి వ్యక్తులు కూడా బలహీనతలను కలిగి ఉంటారు. కానీ దేవుడు మోషేతో ఉంటాడని చెప్పాడు, అంతే ముఖ్యం. దేవుడికి ఇప్పుడు రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి అంటే "నేనే నేనే" మరియు మరొకటి యెహోవా. ఇది దేవుడు ఎలా ఉంటాడో చూపిస్తుంది మరియు అతను ఎల్లప్పుడూ మనతో ఉంటాడని మనకు గుర్తు చేస్తుంది. 1. దీనర్థం అతను ఉనికిలో ఉండటానికి ఎవరికీ లేదా మరేదైనా అవసరం లేకుండా తనంతట తానుగా ఉనికిలో ఉన్నాడు. 2. అతను ఎప్పటికీ చుట్టూ ఉన్నాడు మరియు ఎప్పుడూ చుట్టూ ఉంటాడు, ఎప్పుడూ మారడు, అతను నిన్న, ఈ రోజు మరియు ఎప్పటికీ. దేవుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం మరియు ప్రశ్నలు అడగడం ద్వారా మనం అతని గురించి ప్రతిదీ కనుగొనలేము. కానీ అతను ఎప్పుడూ తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు మరియు ఎప్పటికీ మారడు అని మనకు తెలుసు. అతను తనంతట తానుగా ఉనికిలో ఉన్నాడు మరియు ప్రతి ఒక్కరూ అతనిపై ఆధారపడి ఉంటారు. మోషే ప్రజలతో మాట్లాడటానికి వచ్చినప్పుడు, వారి పూర్వీకులు నమ్మిన మరియు మంచి వాగ్దానాలు చేసిన దేవుడే దేవుడు అని వారికి గుర్తు చేశాడు. 

ఇశ్రాయేలీయుల విమోచన వాగ్దానం చేయబడింది. (16-22)
మోషే తన మాట వినమని ఇశ్రాయేలు నాయకులను ఒప్పించే మంచి పని చేసాడు మరియు దేవుడు అతనికి సహాయం చేశాడు. దేవుడు మోషే మాట వినడానికి నాయకులను ఇష్టపడేలా చేశాడు. అయితే, ఫరో విషయానికి వస్తే, మోషే చక్కగా అడగడం మరియు అతనిని చక్కని ఉపాయాలు చూపించడం పనికిరాదని చెప్పబడింది. కానీ దేవుని మాటలను వినని వ్యక్తి చివరికి దేవుని శక్తితో ఓడిపోతాడు. ఇశ్రాయేలీయులు ఫరో పాలనలో బానిసలుగా ఉన్నప్పుడు, వారు నిజంగా విచారంగా మరియు సంతోషంగా ఉన్నారు. కానీ దేవుడు వారికి సహాయం చేయాలని కోరుకున్నాడు మరియు అతనిని అనుసరించమని ఆహ్వానాలు పంపాడు. దీంతో వారు స్వేచ్ఛగా ఉండి దేవుణ్ణి సేవించాలని కోరుకున్నారు. వారు చాలా సంపదలతో ఈజిప్టును విడిచిపెట్టి, దేవుని చర్చికి సహాయం చేయడానికి వాటిని ఉపయోగించారు. మనం నిజంగా సంతోషంగా లేనప్పుడు మరియు చెడు పరిస్థితిలో చిక్కుకుపోయినట్లు అనిపించినప్పుడు, దేవుడు మనకు సహాయం చేయగలడు మరియు సరైనది చేసే శక్తిని ఇస్తాడు.Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |