2. దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై యుండవలెను.
3. దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను.
4. దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను; దాని రెండు ప్రక్కలయందలి దాని రెండు మూలలమీద వాటిని ఉంచవలెను.
5. అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను.
6. సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును.
7. అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.
లూకా 1:9
పరిమళ ధూపం క్రీస్తు చేసే ప్రార్థనలకు సూచన.
8. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము.
9. మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీయమునైనను దానిమీద పోయకూడదు.
తన ప్రజల పక్షంగా దేవునికి విన్నపాలు చేసేవాడుగా క్రీస్తును ఈ ధూపవేదిక, పరిమళం సూచిస్తున్నాయి. పరలోకంలో క్రీస్తు గాక మధ్యవర్తి మరింకెవరూ లేరు (1 తిమోతికి 2:5). కాబట్టి మరి ఏ ఇతర పరిమళమూ వేయకూడదని దేవుడు ఆదేశించాడు. హోమబలి మొదలైనవి ఈ వేదిక మీద వెయ్యకూడదు. ఆవరణలో ఉన్న బలిపీఠం మీదే ఇది జరగాలి. చిహ్నంగా ఉన్న ప్రతిదీ దేని స్థానంలో అది ఉండాలి. చిందరవందరగా ఉండకూడదు. లేవీయకాండము 10:1-2 నోట్ చూడండి.
10. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది.
హెబ్రీయులకు 9:7
12. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణపరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు.
13. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ.
మత్తయి 17:24
14. ఇరువది సంవత్సరములు గాని అంతకంటె యెక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను.
15. అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్యకూడదు.
16. నీవు ఇశ్రాయేలీయుల యొద్దనుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క సేవనిమిత్తము దాని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును.
17. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటనుచేసి
18. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను.
19. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులును తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను.
20. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును సేవచేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను.
21. తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును.
23. పరిశుద్ధస్థల సంబంధమైన తులము చొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తులముల యెత్తును
24. నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులములును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని
25. వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభారముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.
26. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును
27. బల్లను దాని ఉపకరణములన్నిటిని దీప వృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను
28. దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి
29. అవి అతిపరి శుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును.
30. మరియు అహరోనును అతని కుమారులును నాకు యాజకులై యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను.
31. మరియు నీవు ఇశ్రాయేలీయులతోఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేకతైలమై యుండవలెను;
32. దానిని నర శరీరము మీద పోయకూడదు; దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠిత మైనదిగా నుండవలెను.
33. దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.
“లేకుండా చేయాలి”– దేవుడు ఇంత నిష్కర్షగా ఎందుకు హెచ్చరిక ఇచ్చాడంటే నూనె పవిత్రాత్మకు గుర్తు. ఆయన శక్తినీ ప్రభావాన్నీ మనుషులెవరూ కనపరచలేరు. అలా చేయడానికి ఎవరూ ప్రయత్నించకూడదు. యాజులకు (కొత్త ఒడంబడిక విశ్వాసులందరికీ అన్నమాట) తప్ప ఈ అభిషేకం మరెవ్వరికీ ప్రసాదించడం అసాధ్యం. అలా ప్రయత్నించడం దుష్ట తలంపు (అపో. కార్యములు 8:18-23 చూడండి). సన్నిధి గుడారం సేవకు సంబంధించి మరణశిక్షను తెచ్చిపెట్టే ఇతర పొరపాట్ల గురించి నిర్గమకాండము 28:35 నోట్ చూడండి.
34. మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని
“పరిమళ ద్రవ్యాలు”– సువాసనగా, పవిత్రంగా ఉన్న ఈ ధూపద్రవ్యం క్రీస్తు తన ప్రజలకోసం చేసే విజ్ఞాపనలకు సూచన. 38 వచనంలో ఉన్న హెచ్చరిక బహుశా ప్రార్థన, ఆరాధన అనేవి స్వార్థపూరితమైన మనస్సుతో చెయ్యకూడదని చెప్పేందుకు అయి ఉండవచ్చు. తన ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు దీన్ని చెయ్యకూడదు. విశ్వాసి కాని వ్యక్తి ఎవరూ ఇలాంటి పవిత్రమైన సంగతుల జోలికి పోకూడదు. దేవుడు నియమించిన రీతిలో అర్పించని ఆరాధన దేవునికి అంగీకారం కాదు (యోహాను 4:23-24 కొలొస్సయులకు 2:18 కొలొస్సయులకు 2:23 సామెతలు 14:12).
35. వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము.
36. దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారము లోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను.
37. నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను.
38. దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 30 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ధూపవేదిక. (1-10)
ధూపపీఠం మానవునిగా యేసుకు చిహ్నం వంటిది మరియు ధూపం నుండి వచ్చే పొగ అతను తన ప్రజలకు సహాయం చేయమని దేవుడిని కోరినట్లుగా ఉంది. మనకు సహాయం చేయమని యేసు ఎల్లప్పుడూ దేవుణ్ణి అడుగుతున్నాడని చూపించడానికి ప్రతిరోజూ ధూపం వేయబడింది. సంవత్సరానికి ఒకసారి, యేసు భూమిపై బాధలను అనుభవించినప్పుడు అతని సహాయం వచ్చిందని చూపించడానికి బలిపీఠంపై రక్తాన్ని ఉంచారు, మరియు మనకు సహాయం చేయడానికి మరెవరూ అవసరం లేదు, కేవలం యేసు.
ఆత్మల విమోచన క్రయధనం. (11-16)
ధనవంతులైనా, పేదవారైనా సరే, ప్రతి ఒక్కరూ దేవుడికి ముఖ్యమే కాబట్టి అందరూ సమానమైన డబ్బు ఇవ్వవలసి వచ్చింది. ఇది దాదాపు పదిహేను నాణేలు, మరియు అది అందరికీ సరిపోతుంది.
Act 10:34 యోబు 34:19 గతంలో, ప్రజలు వివిధ విషయాల కోసం వివిధ మొత్తాలను ఇచ్చారు, కానీ వారి ఆత్మలను రక్షించడానికి ఈ ప్రత్యేక చెల్లింపు కోసం, ప్రతి ఒక్కరూ అదే మొత్తాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆత్మ సమానంగా ముఖ్యమైనది మరియు ప్రమాదంలో ఉంది, కాబట్టి వారందరికీ ఒకే సహాయం కావాలి. అలా సేకరించిన డబ్బును ప్రజలు దేవుణ్ణి పూజించే ప్రత్యేక స్థలం కోసం ఉపయోగించారు. దేవుణ్ణి ఆరాధించడంలో మనకు సహాయపడే వస్తువులకు చెల్లించడం చాలా ముఖ్యం. డబ్బు మన ఆత్మలను రక్షించదు, కానీ అది దేవుణ్ణి గౌరవించడానికి మరియు మనకు రక్షించబడటానికి సహాయపడే బోధనలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించవచ్చు.
ఇత్తడి లావర్. (17-21)
ఒక ప్రత్యేక గుడారం తలుపు దగ్గర ఉంచిన నీటితో నిండిన ఇత్తడితో చేసిన పెద్ద గిన్నె ఉంది. అహరోను మరియు అతని కుమారులు పని చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడల్లా, వారు గిన్నెలో చేతులు మరియు కాళ్ళు కడుక్కోవాలి. ఇది వారికి ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉండాలని మరియు తప్పు పనులు చేయకుండా ఉండాలని వారికి గుర్తుచేయడం. వారు మొదట పూజారులుగా మారినప్పుడు ఒక్కసారి మాత్రమే కాదు, వారు లోపలికి వెళ్ళిన ప్రతిసారీ కడగాలి. మనం ఎల్లప్పుడూ మంచిగా ఉండటానికి ప్రయత్నించాలని మరియు తప్పులు చేసినప్పుడు క్షమించమని అడగాలని ఇది మనకు బోధిస్తుంది.
పవిత్ర అభిషేక తైలం, పరిమళం. (22-38)
ప్రత్యేక పూజా స్థలంలో ఉపయోగించడానికి ప్రత్యేకమైన నూనె మరియు ప్రత్యేకమైన సువాసనను తయారు చేయడానికి ఇవి సూచనలు. ఈ నూనె మరియు సువాసన నిజంగా మంచివి మరియు ప్రజలకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రదేశం ఎంత ప్రత్యేకమైనదో మరియు పవిత్రమైనదో అవి మనకు గుర్తు చేస్తాయి. ఇది మనం మన చర్మంపై మంచి స్మెల్లింగ్ లోషన్ను ఉపయోగించినప్పుడు లాగా ఉంటుంది, కానీ ఇది మన శరీరానికి బదులుగా ప్రత్యేక స్థానం కోసం. వాటిని ఉపయోగించినప్పుడు మనం కూడా యేసును గుర్తుంచుకుంటాము.
ప్రసంగి 7:1 యాజకులు బలిపీఠం మీద ప్రత్యేక ధూపం వేసినప్పుడు, వారు చిన్న ముక్కలుగా నలిగిన సుగంధ ద్రవ్యాలను ఉపయోగించారు. ఇది దేవునికి ప్రీతికరమైన అర్పణగా యేసు తనను తాను ఎలా బలి చేసుకున్నాడో అలాగే ఉంది. ధూపం కేవలం పూజలో మాత్రమే ఉపయోగించబడింది మరియు రోజువారీ వస్తువులకు ఉపయోగించకూడదు. దేవునికి సంబంధించిన విషయాలను గౌరవంగా చూడాలని మరియు వాటిని ఎగతాళి చేయవద్దని ఇది మనకు గుర్తుచేస్తుంది. ప్రపంచంలో మనం కోరుకున్నది పొందడానికి మతాన్ని ఉపయోగించడం చాలా తప్పు.
Shortcut Links
Explore Parallel Bibles
21st Century KJV |
A Conservative Version |
American King James Version (1999) |
American Standard Version (1901) |
Amplified Bible (1965) |
Apostles' Bible Complete (2004) |
Bengali Bible |
Bible in Basic English (1964) |
Bishop's Bible |
Complementary English Version (1995) |
Coverdale Bible (1535) |
Easy to Read Revised Version (2005) |
English Jubilee 2000 Bible (2000) |
English Lo Parishuddha Grandham |
English Standard Version (2001) |
Geneva Bible (1599) |
Hebrew Names Version |
Hindi Bible |
Holman Christian Standard Bible (2004) |
Holy Bible Revised Version (1885) |
Kannada Bible |
King James Version (1769) |
Literal Translation of Holy Bible (2000) |
Malayalam Bible |
Modern King James Version (1962) |
New American Bible |
New American Standard Bible (1995) |
New Century Version (1991) |
New English Translation (2005) |
New International Reader's Version (1998) |
New International Version (1984) (US) |
New International Version (UK) |
New King James Version (1982) |
New Life Version (1969) |
New Living Translation (1996) |
New Revised Standard Version (1989) |
Restored Name KJV |
Revised Standard Version (1952) |
Revised Version (1881-1885) |
Revised Webster Update (1995) |
Rotherhams Emphasized Bible (1902) |
Tamil Bible |
Telugu Bible (BSI) |
Telugu Bible (WBTC) |
The Complete Jewish Bible (1998) |
The Darby Bible (1890) |
The Douay-Rheims American Bible (1899) |
The Message Bible (2002) |
The New Jerusalem Bible |
The Webster Bible (1833) |
Third Millennium Bible (1998) |
Today's English Version (Good News Bible) (1992) |
Today's New International Version (2005) |
Tyndale Bible (1534) |
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) |
Updated Bible (2006) |
Voice In Wilderness (2006) |
World English Bible |
Wycliffe Bible (1395) |
Young's Literal Translation (1898) |
Telugu Bible Verse by Verse Explanation |
పరిశుద్ధ గ్రంథ వివరణ |
Telugu Bible Commentary |
Telugu Reference Bible |