Numbers - సంఖ్యాకాండము 25 | View All

1. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి.
1 కోరింథీయులకు 10:8, ప్రకటన గ్రంథం 2:14, ప్రకటన గ్రంథం 2:20

1. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా షిత్తీము దగ్గరే నివాసం చేస్తున్నారు. ఆ సమయంలో పురుషులు మోయాబీ స్త్రీలతో లైంగిక పాపం చేయటం మొదలు పెట్టారు.

2. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి.
ప్రకటన గ్రంథం 2:14

2.

3. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.

3.

4. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ప్రజల అధిపతులనందరిని తోడుకొని, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీదనుండి తొలగిపోవునని చెప్పెను.

4. “ఈ ప్రజల నాయకులందర్నీ పిలువు. ప్రజలంతా చూసేటట్టు వారిని చంపు. వారి శరీరాల్ని యెహోవా ఎదుట పడవేయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవా కోపగించడు” అని మోషేతో యెహోవా చెప్పాడు.

5. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధి పతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయో రుతో కలిసికొనిన తన తన వశములోనివారిని చంపవలెనని చెప్పెను.

5. ఇశ్రాయేలీయుల న్యాయమూర్తులతో “పెయోరులో నకిలీ దేవుడైన బయలును కొలిచేందుకు ప్రజలను నడిపించిన మీ వంశపు నాయకులను ఒక్కొక్కరిని మీరు తెలుసుకోవాలి. తర్వాత మీరు వారిని చంపేయాలి” అని మోషే చెప్పాడు.

6. ఇదిగో మోషే కన్నుల యెదుటను, ప్రత్య క్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజము యొక్క కన్నులయెదుటను, ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనివచ్చెను.

6. ఆ సమయంలో మోషే, మరియు ఇశ్రాయేలు పెద్దలూ అంత సన్నిధి గుడార ద్వారం దగ్గర చేరారు. ఇశ్రాయేలు మగవాడొకడు ఒక మిద్యానీ స్త్రీని తన ఇంటికి, తన కుటుంబం దగ్గరకు తీసుకొనివచ్చాడు. మోషే, మరియు పెద్దలూ అందరూ చూసేటట్టుగా వాడు ఇలా చేసాడు. మోషే, ఆ పెద్దలూ చాల విచారపడ్డారు.

7. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి,

7. అహరోను కుమారుడైన ఎలీయాజరు కుమారుడు ఫీనెహసు యాజకుడు ఇది చూసాడు. కనుక అతడు సమాజంనుండి వెళ్లి తన ఈటె తీసుకున్నాడు.

8. సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవు నట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచి పోయెను.

8. ఇశ్రాయేలు పురుషునితోబాటు వాని గుడారంలోకి అతడు వెళ్లాడు. ఆ ఇశ్రాయేలు వానిని మిద్యానీ స్త్రీనీ ఈటెతో అతడు చంపేసాడు. ఆ ఈటెతో అతడు వారిద్దరి శరీరాలూ పొడిచినాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప రోగం పుట్టింది. అయితే వీళ్లద్దర్నీ ఫీనెహసు చంపగానే ఆ రోగం ఆగిపోయింది.

9. ఇరువది నాలుగువేలమంది ఆ తెగులు చేత చనిపోయిరి.
1 కోరింథీయులకు 10:8

9. ఈ రోగం మూలంగా 24,000 మంది చనిపోయారు.

10. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,

10. మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:

11. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.

11. “యాజకుడు అహరోను కుమారుడైన ఎలీయాజరు కుమారుడు ఫీనెహసు ఇశ్రాయేలు ప్రజలను నా కోపం నుండి రక్షించాడు. నన్ను సంతోష పెట్టేందుకు అతడు ఎంతో కష్టపడి ప్రయత్నించాడు. అతడు నాలాగే ఉన్నాడు. ప్రజల మద్య నా మర్యాద కాపాడటానికి అతడు ప్రయత్నం చేసాడు. అందుచేత నేను అనుకొన్న ప్రకారం ప్రజలను చంపను.

12. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను.

12. కనుక నేను ఫీనెహసుతో ఒక శాంతి ఒడంబడిక చేస్తున్నానని అతనితో చెప్పండి.

13. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రా యేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

13. అతడు, అతని తర్వాత జీవించే అతని కుటుంబీకులు అందరికీ ఒక ఒడంబడిక ఉంటుంది. వారు ఎప్పటికీ యాజకులే. ఎందుచేతనంటే అతడు తన దేవుడి మర్యాద కాపాడటానికి ఎంతో కష్టపడి ప్రయత్నించాడు. అతడు చేసినది ఇశ్రాయేలు ప్రజల తప్పులకు ప్రాయశ్చిత్తం చేసింది.”

14. చంపబడిన వాని పేరు జిమ్రీ, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధానియైన సాలూ కుమారుడు.

14. మిద్యానీ స్త్రీతో బాటు చంపబడ్డ ఇశ్రాయేలు మగవాడు, సాలు కుమారుడైన జిమ్రీ. షిమ్యోను వంశంలో ఒక కుటుంబానికి అతడు నాయకుడు.

15. చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధానియై యుండెను.

15. చంపబడిన మిద్యానీ స్త్రీ పేరు కొజ్బీ. ఆమె షూరు కూమారై. షూరు మిద్యానీ ప్రజల్లో నాయకుడు. అతడు తన వంశానికి పెద్ద.

16. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రములవలన మీకు బాధకులై యున్నారు; వారిని బాధపెట్టి హతము చేయుడి;

16. మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:

17. వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను,

17. “మిద్యానీ ప్రజలు మీకు శత్రువులు. మీరు వాళ్లను చంపేయాలి.

18. తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను, మిమ్మును మోసపుచ్చిరి.

18. ఇప్పటికే వాళ్లు మిమ్మల్ని శత్రువులుగా చేసుకున్నారు. మీరు పెయోరు నకిలీ దేవుడిని కొలిచేటట్టుగా వాళ్లు మిమ్మల్ని మోసం చేసారు. మిద్యానీ నాయకుని కుమారై కొజ్బీని మీ వాడొకడు దాదాపు వివాహం చేసుకున్నంత పని చేసారు వారు. అదే ఇశ్రాయేలు ప్రజలకు రోగం వచ్చినప్పుడు చంపబడ్డ స్త్రీకి పెయోరులో ప్రజలు బయలు నకిలీ దేవణ్ణి కొలిచిన కారణంగానే ఆ రోగం వచ్చినది.”



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 25 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఇశ్రాయేలీయులు మోయాబు మరియు మిద్యాను కుమార్తెలచే ప్రలోభింపబడ్డారు. (1-5) 
శత్రువుల కంటే చెడ్డ వ్యక్తులతో స్నేహం చేయడం చాలా ప్రమాదకరం ఎందుకంటే చెడు స్నేహితులు మనల్ని తప్పుడు పనులకు ప్రలోభపెడతారు. డబ్బు మరియు సరదా యొక్క టెంప్టేషన్ వలె మాయాజాలం కూడా మనల్ని బాధించదు. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మరియు మిద్యాను బాలికలచే శోధించబడినప్పుడు ఇది జరిగింది. మన ఘోర శత్రువులు మనల్ని శారీరకంగా బాధపెట్టేవారు కాదు, చెడు పనులు చేసేవారు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు, దేవుడు వారిని వ్యాధులతో శిక్షించాడు. ఇతరులను పాపంలోకి నడిపించే వ్యక్తులు ఇతరులకు ఉదాహరణగా శిక్షించబడాలి.

ఫినెహాస్ జిమ్రీ మరియు కోజ్బీలను చంపాడు. (6-15) 
ఫీనెహాస్ జిమ్రీ మరియు కొజ్బీలు ఏదో తప్పు చేసినందున వారిని శిక్షించినప్పుడు ధైర్యంగా పనిచేశాడు. అయితే మనం ఫినెహాస్‌ను కాపీ కొట్టి, ప్రజలపై మనమే పగ తీర్చుకోకూడదు లేదా వారి మతం కారణంగా ప్రజలను బాధపెట్టకూడదు. మేము దానిని నిర్వహించడానికి బాధ్యతగల వ్యక్తులను అనుమతించాలి.

మిద్యానీయులు శిక్షింపబడాలి. (16-18)
మిద్యానీయులు దేవుడిచ్చిన వ్యాధితో జబ్బుపడి చనిపోయారని మనం వినలేదు. బదులుగా, దేవుడు వారిని శత్రు సైన్యంతో శిక్షించాడు. చెడు పనులు చేసేలా చేసే వాటికి మనం దూరంగా ఉండాలి. మత్తయి 5:29-30 ఏదైనా మనల్ని చెడు పనులు చేయాలనిపిస్తే, బాధాకరమైన ముల్లులా ద్వేషించాలి. చెడు పనులు చేయడానికి ఇతరులను మోసగించే వ్యక్తులు ఎక్కువగా శిక్షించబడతారు.



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |