Numbers - సంఖ్యాకాండము 34 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను - నీవు ఇశ్రాయేలీయులతో

1. And Jehovah spake unto Moses, saying,

2. కనాను దేశమున, అనగా పొలిమేరలచొప్పున మీరు చీట్లువేసి స్వాస్థ్యముగా పంచుకొను కనానుదేశమున

2. Command the children of Israel, and say unto them, When ye come into the land of Canaan (this is the land that shall fall unto you for an inheritance, even the land of Canaan according to the borders thereof),

3. మీరు ప్రవేశించుచుండగా, మీ దక్షిణదిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు, అనగా

3. then your south quarter shall be from the wilderness of Zin along by the side of Edom, and your south border shall be from the end of the Salt Sea eastward;

4. మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరమువరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనమయొద్ద తిరిగి సీనువరకు వ్యాపించును. అది దక్షిణమునుండి కాదేషు బర్నేయవరకు వ్యాపించి, అక్కడనుండి హసరద్దారువరకు పోయి, అక్కడనుండి అస్మోనువరకు సాగును.

4. and your border shall turn about southward of the ascent of Akrabbim, and pass along to Zin; and the goings out thereof shall be southward of Kadesh-barnea; and it shall go forth to Hazar-addar, and pass along to Azmon;

5. అస్మోనునుండి ఐగుప్తు నదిnవరకు సరిహద్దు తిరిగి సముద్రమువరకు వ్యాపించును.

5. and the border shall turn about from Azmon unto the brook of Egypt, and the goings out thereof shall be at the sea.

6. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.

6. And for the western border, ye shall have the great sea and the border [thereof]: this shall be your west border.

7. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దనుండి హోరు కొండవరకు ఏర్పరచుకొనవలెను.

7. And this shall be your north border: from the great sea ye shall mark out for you mount Hor;

8. హోరు కొండ యొద్దనుండి హమాతునకు పోవుమార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపించును.

8. from mount Hor ye shall mark out unto the entrance of Hamath; and the goings out of the border shall be at Zedad;

9. అక్కడనుండి సరిహద్దు జిప్రోనువరకు వ్యాపించును, దాని చివర హసరేనానునొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు.

9. and the border shall go forth to Ziphron, and the goings out thereof shall be at Hazar-enan: this shall be your north border.

10. తూర్పు సరిహద్దు హసరేనానునుండి షెపామువరకు మీరు ఏర్పరచుకొన వలెను.

10. And ye shall mark out your east border from Hazar-enan to Shepham;

11. షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లావరకు నుండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నె రెతు సముద్రమునొడ్డును తగిలియుండును.

11. and the border shall go down from Shepham to Riblah, on the east side of Ain; and the border shall go down, and shall reach unto the side of the sea of Chinnereth eastward;

12. ఆ సరిహద్దు యొర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రముదనుక వ్యాపిం చును. ఆదేశము చుట్టునున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై యుండునని వారి కాజ్ఞాపించుము.

12. and the border shall go down to the Jordan, and the goings out thereof shall be at the Salt Sea. This shall be your land according to the borders thereof round about.

13. మోషే ఇశ్రాయేలీయులతోమీరు చీట్లచేత పొంద బోవుచున్న దేశము ఇది. యెహోవా తొమ్మిది గోత్రములకును అర్ధగోత్రమునకును దీని నియ్యవలెనని ఆజ్ఞాపించెను;

13. And Moses commanded the children of Israel, saying, This is the land which ye shall inherit by lot, which Jehovah hath commanded to give unto the nine tribes, and to the half-tribe;

14. ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులును గాదీయులును తమ తమ స్వాస్థ్యముల నొందిరి.

14. for the tribe of the children of Reuben according to their fathers' houses, and the tribe of the children of Gad according to their fathers' houses, have received, and the half-tribe of Manasseh have received, their inheritance:

15. మనష్షే అర్ధగోత్రపువారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ రెండు గోత్రపువారును అర్ధ గోత్రపువారును సూర్యోదయ దిక్కున, అనగా తూర్పు దిక్కున యెరికోయొద్ద యొర్దాను ఇవతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను.

15. the two tribes and the half-tribe have received their inheritance beyond the Jordan at Jericho eastward, toward the sunrising.

16. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

16. And Jehovah spake unto Moses, saying,

17. ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా, యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు.

17. These are the names of the men that shall divide the land unto you for inheritance: Eleazar the priest, and Joshua the son of Nun.

18. మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక ప్రధానుని ఏర్పరచుకొనవలెను.

18. And ye shall take one prince of every tribe, to divide the land for inheritance.

19. వారెవరనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు.

19. And these are the names of the men: Of the tribe of Judah, Caleb the son of Jephunneh.

20. షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు,

20. And of the tribe of the children of Simeon, Shemuel the son of Ammihud.

21. బెన్యామీనీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు.

21. Of the tribe of Benjamin, Elidad the son of Chislon.

22. దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని,

22. And of the tribe of the children of Dan a prince, Bukki the son of Jogli.

23. యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్రప్రధాని,

23. Of the children of Joseph: of the tribe of the children of Manasseh a prince, Hanniel the son of Ephod.

24. ఎఫ్రాయిమీయుల గోత్రములో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని,

24. And of the tribe of the children of Ephraim a prince, Kemuel the son of Shiphtan.

25. జెబూలూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని,

25. And of the tribe of the children of Zebulun a prince, Elizaphan the son of Parnach.

26. ఇశ్శాఖారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని,

26. And of the tribe of the children of Issachar a prince, Paltiel the son of Azzan.

27. ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని.

27. And of the tribe of the children of Asher a prince, Ahihud the son of Shelomi.

28. నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని.

28. And of the tribe of the children of Naphtali a prince, Pedahel the son of Ammihud.

29. కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించినవారు వీరే.

29. These are they whom Jehovah commanded to divide the inheritance unto the children of Israel in the land of Canaan.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 34 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
వాగ్దానం చేయబడిన భూమి యొక్క హద్దులు. (1-15) 
కనాను ఒక చిన్న భూభాగం, కేవలం 160 మైళ్ల పొడవు మరియు 50 మైళ్ల వెడల్పు మాత్రమే ఉంది, అయితే ఇది ఇజ్రాయెల్ ప్రజలకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది వారి పూర్వీకుడైన అబ్రహాము మరియు అతని కుటుంబానికి వాగ్దానం చేయబడింది. దేవుడు చాలా కాలంగా తెలిసిన ప్రదేశం ఇదే. అది దేవునికి సంబంధించిన ప్రత్యేక తోటలాగా, చిన్నదే అయినా చాలా ఫలవంతంగా ఉండేది. ప్రపంచమంతా దేవునిదే అయినప్పటికీ, చాలా మందికి ఆయన గురించి తెలియదు లేదా ఆయనను అనుసరించడం లేదు.దేవునికి మంచి పనులు చేస్తున్నందున కొంతమంది మాత్రమే సంతోషంగా ఉన్నారు. దేవుడు భూమిపై ఉన్న తన ప్రజలకు చాలా వస్తువులను ఇవ్వడు, కానీ దేవుణ్ణి ప్రేమించేవారు మరియు అతని ఆశీర్వాదాలు కలిగి ఉన్నవారు చాలా కాకపోయినా తమ వద్ద ఉన్న దానితో సంతోషంగా ఉంటారు. దేవుడు లేకుండా చాలా కలిగి ఉండటం కంటే దేవునితో కొంచెం కలిగి ఉండటం మంచిది. 

భూమిని విభజించడానికి నియమించబడిన వారు. (16-29)
భూమిని అందరికీ పంచడానికి దేవుడు కొంతమందిని ఎంచుకున్నాడు. ఈ వ్యక్తులు నిజంగా సంతోషంగా ఉన్నారు మరియు దేవుడు వారికి సహాయం చేసినందున వారు గెలిచినట్లు భావించారు. వారికి ప్రత్యేక పనిని అప్పగించారు.



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |