Deuteronomy - ద్వితీయోపదేశకాండము 27 | View All
Study Bible (Beta)

1. మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును ప్రజలతో ఇట్లనిరినేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరాచరింపవలెను.

1. Then Moses with the Elders of Israel commanded the people, saying, Keepe all the comandements, which I command you this day.

2. మీ దేవుడైన యెహోవా మీకిచ్చు చున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్దరాళ్లను నిలువ బెట్టి వాటిమీద సున్నము పూసి

2. And when ye shall passe ouer Iorden vnto the lande which the Lord thy God giueth thee, thou shalt set thee vp great stones, and playster them with plaister,

3. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటినతరువాత ఈ ధర్మ శాస్త్రవాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను.

3. And shalt write vpon them all the words of this Lawe, when thou shalt come ouer, that thou mayest go into the land which the Lord thy God giueth thee: a land that floweth with milke and hony, as the Lord God of thy fathers hath promised thee.

4. మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీ కాజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను.

4. Therefore when ye shall passe ouer Iorden, ye shall set vp these stones, which I command you this daye in mount Ebal, and thou shalt plaister them with plaister.

5. అక్కడ నీ దేవుడైన యెహో వాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను; వాటిమీద ఇనుప పనిముట్టు పడకూడదు.

5. And there shalt thou build vnto the Lord thy God an altar, euen an altar of stones: thou shalt lift none yron instrument vpon them.

6. చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యెహోవాకు దహనబలుల నర్పింపవలెను.

6. Thou shalt make the altar of the Lord thy God of whole stones, and offer burnt offerings thereon vnto the Lord thy God.

7. మరియు నీవు సమాధానబలుల నర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.

7. And thou shalt offer peace offrings, and shalt eate there and reioyce before the Lord thy God:

8. ఈ విధికి సంబంధించిన వాక్యము లన్నిటిని ఆ రాళ్లమీద బహు విశదముగా వ్రాయవలెను.

8. And thou shalt write vpon the stones al the words of this Law, well and plainely.

9. మరియమోషేయు యాజకులైన లేవీయులును ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరిఇశ్రాయేలీయులారా, మీరు ఊరకొని ఆలకించుడి.

9. And Moses and the Priestes of the Leuites spake vnto all Israel, saying, Take heede and heare, O Israel: this day thou art become the people of the Lord thy God.

10. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవు డైన యెహోవా మాట విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను.

10. Thou shalt hearken therefore vnto the voyce of the Lord thy God, and do his commandements and his ordinances, which I commande thee this day.

11. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేమనగా మీరు యొర్దాను దాటినతరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు

11. And Moses charged the people the same day, saying,

12. బెన్యామీను గోత్ర ములవారు ప్రజలనుగూర్చి దీవెనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను.

12. These shall stand vpon mount Gerizzim, to blesse the people when ye shall passe ouer Iorden: Simeon, and Leui, and Iudah, and Issachar, and Ioseph, and Beniamin.

13. రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువ వలెను.

13. And these shall stand vpon mount Ebal to curse: Reuben, Gad, and Asher, and Zebulun, Dan, and Naphtali.

14. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పిచేతులతో

14. And the Leuites shall answere and say vnto all the men of Israel with a loude voyce,

15. మలి చిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రా యేలీయులందరితోను చెప్పగా ఆమేన్‌ అనవలెను.

15. Cursed be the man that shall make any carued or molten image, which is an abomination vnto the Lord, the worke of the hands of the craftesman, and putteth it in a secrete place: And all the people shall answere, and say: So be it.

16. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అన వలెను.

16. Cursed be he that curseth his father and his mother: And all the people shall say: So be it.

17. తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

17. Cursed be he that remoueth his neighbors marke: And all the people shall say: So be it.

18. గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

18. Cursed be he that maketh ye blinde go out of the way: And all the people shall say: So be it.

19. పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

19. Cursed be he that hindreth the right of the stranger, the fatherles, and the widow: And all the people shall say: So be it.

20. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
1 కోరింథీయులకు 5:1

20. Cursed be hee that lyeth with his fathers wife: for he hath vncouered his fathers skirt: And all the people shall say: So be it.

21. ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తు డని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

21. Cursed be he that lieth with any beast: And all the people shall say: So be it.

22. తన సహోదరితో, అనగా తన తండ్రికుమార్తెతో గాని తన తల్లికుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

22. Cursed be he that lyeth with his sister, the daughter of his father, or the daughter of his mother: And all the people shall say: So be it.

23. తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

23. Cursed be he that lyeth with his mother in law: And all the people shall say: So be it.

24. చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాప గ్రస్తు డని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

24. Cursed be hee that smiteth his neyghbour secretly: And all the people shall say: So be it.

25. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చు కొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

25. Cursed be he that taketh a reward to put to death innocent blood: And all the people shall say: So be it.

26. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
2 కోరింథీయులకు 3:9, గలతియులకు 3:10

26. Cursed be he that confirmeth not all the wordes of this Law, to do them: And all the people shall say: So be it.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Deuteronomy - ద్వితీయోపదేశకాండము 27 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

వాగ్దానం చేసిన భూమిలో రాళ్లపై రాయాల్సిన చట్టం. (1-10) 
ప్రజలు కనానుకు వచ్చినప్పుడు, వారు ఒక ప్రత్యేక స్మారక చిహ్నాన్ని తయారు చేసి దానిపై చట్టాన్ని వ్రాయవలసి వచ్చింది. వారు ప్రార్థించడానికి ఒక బలిపీఠం కూడా చేయవలసి ఉంది. వారు గుడారం వద్ద ఉన్న బలిపీఠాన్ని మాత్రమే ఉపయోగించాలి, కానీ కొన్నిసార్లు దేవుడు సహజమైన రాళ్లను ఉపయోగించి ప్రత్యేకంగా ఒకదాన్ని చేయడానికి అనుమతించాడు. యేసు ప్రజలచే తిరస్కరించబడిన ఒక ప్రత్యేకమైన రాయి వంటివాడు, కానీ చాలా ముఖ్యమైనదిగా దేవుడు ఎన్నుకున్నాడు. బైబిల్ రెండు భాగాలను కలిగి ఉంది - పాత నిబంధన మరియు కొత్త నిబంధన. పాత నిబంధనలో, చదవడానికి భయపెట్టే నియమాలు మరియు శిక్షలు వ్రాయబడ్డాయి. కానీ కొత్త నిబంధనలో, నిరీక్షణ మరియు ఓదార్పు సందేశం ఉంది. ఇప్పుడు బైబిల్ కాపీలు ముద్రించబడడం మన అదృష్టం, కాబట్టి చాలా కాలం క్రితం ప్రజలు చేసిన అదే కఠినమైన నియమాలను మనం పాటించాల్సిన అవసరం లేదు. ప్రజలు బైబిల్‌ను సరళంగా అర్థం చేసుకోవడంలో బోధకులు సహాయం చేయడం చాలా ముఖ్యం, అయితే దానిని నిజంగా అర్థం చేసుకోవడానికి మనకు దేవుని సహాయం కూడా అవసరం. కాబట్టి, ఆయన సందేశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని మనం ప్రతిరోజూ దేవుణ్ణి అడగాలి. 

ఏబాల్ పర్వతంపై ఉచ్ఛరించాల్సిన శాపాలు. (11-26)
ఆశీర్వాదాలు పొందేందుకు ఎంపిక చేసిన ఆరు గ్రూపులు అన్నీ తల్లులు స్వేచ్ఛగా ఉన్న పిల్లలతో రూపొందించబడ్డాయి. వాగ్దానం వారి కోసం ఉద్దేశించబడింది. గలతియులకు 4:31 లేవీ అందరితోనూ ఉంటాడు. దేవుని గురించి బోధించే వ్యక్తులు కూడా వారు బోధించే వాటిని అనుసరించాలి మరియు దానిని విశ్వసించాలి. మంచి పనులు జరుగుతాయని వాగ్దానం చేయడం ద్వారా మంచి పనులు చేయమని ప్రజలను ప్రోత్సహించాలి, కానీ చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని వారిని హెచ్చరించాలి. ప్రజలు ఈ హెచ్చరికలను విన్నప్పుడు, వారు వాటిని విశ్వసిస్తున్నారని చూపించడానికి "ఆమెన్" అని చెప్పాలి. అంటే చెడు పనులు చేసే వారిని దేవుడు శిక్షిస్తాడని, అది న్యాయమైనదని వారు నమ్ముతారు. చెడ్డ పనులు చేసేవారిని శిక్షించాలి మరియు పర్యవసానాలను ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరూ, వివిధ చెడు పనులు చేసేవారు కూడా ఒకే శిక్షను ఎదుర్కొంటారు. తాము చేయవలసిన మంచి పనులు చేయని వ్యక్తులు ఇందులో ఉన్నారు. యేసు సహాయంతో మాత్రమే చెడు పనులు చేసే వ్యక్తులు క్షమించబడతారు మరియు దేవునిచే అంగీకరించబడతారు. దేవుని నియమాలు చాలా ముఖ్యమైనవి, మనం వాటిని కొద్దిగానైనా ఉల్లంఘిస్తే, మనం ఏదో తప్పు చేస్తాము. మనం దీన్ని మన స్వంతంగా పరిష్కరించుకోలేము, కానీ మనం యేసును విశ్వసించినప్పుడు, మనం మంచిగా మరియు మంచిగా ఉండటానికి ఆయన సహాయం చేస్తాడు. మనం దేవుని నియమాలను అనుసరించి, మంచి జీవితాన్ని గడిపినప్పుడు, మనం సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటాము. 



Shortcut Links
ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |