Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. యెహోషువ బహుదినములు గడచిన వృద్ధుడుకాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను నీవు బహు దినములు గడచిన వృద్ధుడవు. స్వాధీనపరచుకొనుటకు అతివిస్తారమైన దేశము ఇంక మిగిలియున్నది.
1. Now Yehoshua was old and well stricken in years; and the LORD said to him, You are old and well stricken in years, and there remains yet very much land to be possessed.
2. మిగిలిన దేశము ఏదనగా, ఫిలిష్తీయుల ప్రదేశములన్నియు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని
2. This is the land that yet remains: all the regions of the Pelishtim, and all the Geshuri;
3. కనానీయులవని యెంచబడిన ఉత్తరదిక్కున ఎక్రోనీయుల సరిహద్దువరకును ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారులకు చేరిన గాజీయులయొక్కయు అష్డోదీయుల యొక్కయు అష్కెలోనీయులయొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనీయులయొక్కయు దేశమును
3. from the Shichor, which is before Mitzrayim, even to the border of `Ekron northward, which is reckoned to the Kana`anim; the five lords of the Pelishtim; the `Azati, and the Ashdodi, the Eshkeloni, the Gitti, and the `Ekroni; also the `Avvim,
4. దక్షిణదిక్కున ఆవీయుల దేశమును కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దువరకును
4. on the south; all the land of the Kana`anim, and Me`arah that belongs to the Tzidonim, to Afek, to the border of the Amori;
5. గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండదిగువ నున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవుమార్గ మువరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకును దేశము మిగిలియున్నది.
5. and the land of the Givli, and all Levanon, toward the sunrise, from Ba`al-Gad under Mount Hermon to the entrance of Hamat;
6. మన్యపు నివాసుల నందరిని సీదోనీయులనందరిని నేను ఇశ్రాయేలీయుల యెదుటనుండి వెళ్లగొట్టెదను. కావున నేను నీ కాజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను.
6. all the inhabitants of the hill-country from Levanon to Misrefot-Mayim, even all the Tzidonim; them will I drive out from before the children of Yisra'el: only allot you it to Yisra'el for an inheritance, as I have commanded you.
7. తొమ్మిది గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు
7. Now therefore divide this land for an inheritance to the nine tribes, and the half-tribe of Menashsheh.
8. రూబేనీయులు గాదీయులు తూర్పుదిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి.
8. With him the Re'uveni and the Gadi received their inheritance, which Moshe gave them, beyond the Yarden eastward, even as Moshe the servant of the LORD gave them:
9. అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయమధ్యనున్న పట్టణమునుండి దీబోను వరకు మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు
9. from `Aro`er, that is on the edge of the valley of the Arnon, and the city that is in the middle of the valley, and all the plain of Medeva to Divon;
10. అమోరీయుల రాజునైన సీహోనుయొక్క సమస్త పురములును
10. and all the cities of Sichon king of the Amori, who reigned in Heshbon, to the border of the children of `Ammon;
11. గిలాదును, గెషూరీయులయొక్కయు మాయకాతీయులయొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కావరకు బాషాను దేశమంతయు
11. and Gil`ad, and the border of the Geshuri and Ma`akhati, and all Mount Hermon, and all Bashan to Salkhah;
12. రెఫాయీయుల శేషములో అష్తారోతు లోను ఎద్రెయీలోను ఏలికయైన ఓగురాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను.
12. all the kingdom of `Og in Bashan, who reigned in `Ashtarot and in Edre`i (the same was left of the remnant of the Refa'im); for these did Moshe strike, and drove them out.
13. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మాయకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులును మాయకా తీయులును నేటివరకు ఇశ్రాయేలీయుల మధ్యను నివసించు చున్నారు.
13. Nevertheless the children of Yisra'el didn't drive out the Geshuri, nor the Ma`akhati: but Geshur and Ma`akhat dwell in the midst of Yisra'el to this day.
14. లేవిగోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్య లేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము.
14. Only to the tribe of Levi he gave no inheritance; the offerings of the LORD, the God of Yisra'el, made by fire are his inheritance, as he spoke to him.
15. వారి వంశములనుబట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చెను.
15. Moshe gave to the tribe of the children of Re'uven according to their families.
16. వారి సరిహద్దు ఏదనగా, అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణమునుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు
16. Their border was from `Aro`er, that is on the edge of the valley of the Arnon, and the city that is in the middle of the valley, and all the plain by Medeva;
17. హెష్బోనును మైదానములోని పట్టణములన్నియు, దీబోను బామోత్బయలు బేత్బయల్మెయోను
17. Heshbon, and all its cities that are in the plain; Divon, and Bamot-Ba`al, and Beit-Ba`al-Me`on,
18. యాహసు కెదేమోతు మేఫాతు
18. and Yahatz, and Kedemot, and Mefa`at,
19. కిర్యతాయిము సిబ్మాలోయలోని కొండమీది శెరెత్షహరు బెత్పయోరు పిస్గాకొండచరియలు
19. and Kiryatayim, and Sivmah, and Tzeret-Hashachar in the mount of the valley,
20. బెత్యేషి మోతు అను పట్టణములును మైదానములోని పట్టణములన్నియు, హెష్బోనులో ఏలికయు,
20. and Beit-Pe`or, and the slopes of Pisgah, and Beth-jeshimoth,
21. మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఎవీ రేకెము సూరు హోరు రేబ అను మిద్యాను రాజుల దేశమును అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను.
21. and all the cities of the plain, and all the kingdom of Sichon king of the Amori, who reigned in Heshbon, whom Moshe struck with the chiefs of Midyan, Evi, and Rekem, and Tzur, and Hur, and Reva, the princes of Sichon, who lived in the land.
22. ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడు నైన బిలామును తాము చంపిన తక్కినవారితో పాటు ఖడ్గముతో చంపిరి.
22. Bil`am also the son of Be'or, the soothsayer, did the children of Yisra'el kill with the sword among the rest of their slain.
23. యొర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు; అదియు దానిలోని పట్టణములును గ్రామములును రూబేనీయుల వంశముల లెక్కచొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము.
23. The border of the children of Re'uven was the Yarden, and the border of it. This was the inheritance of the children of Re'uven according to their families, the cities and the villages of it.
24. మోషే గాదుగోత్రమునకు, అనగా గాదీయులకు వారి వంశములచొప్పున స్వాస్థ్యమిచ్చెను.
24. Moshe gave to the tribe of Gad, to the children of Gad, according to their families.
25. వారి సరిహద్దు యాజెరును గిలాదు పట్టణములన్నియు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరువరకు అమ్మోనీయుల దేశములో సగమును
25. Their border was Ya`zer, and all the cities of Gil`ad, and half the land of the children of `Ammon, to `Aro`er that is before Rabbah;
26. హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొనీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దువరకును
26. and from Heshbon to Ramat-Hamitzpeh, and Betonim; and from Machanayim to the border of Devir;
27. లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను, అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నెరెతు సముద్రతీరమువరకునున్న యొర్దాను ప్రదేశమును.
27. and in the valley, Beit-Haram, and Beit-Nimrah, and Sukkot, and Tzafon, the rest of the kingdom of Sichon king of Heshbon, the Yarden and the border of it, to the uttermost part of the sea of Kinneret beyond the Yarden eastward.
28. వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములును గ్రామములును ఇవి.
28. This is the inheritance of the children of Gad according to their families, the cities and the villages of it.
29. మోషే మనష్షే అర్థగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశములచొప్పున మనష్షీయుల అర్థగోత్రమునకు స్వాస్థ్యము.
29. Moshe gave inheritance to the half-tribe of Menashsheh: and it was for the half-tribe of the children of Menashsheh according to their families.
30. వారి సరిహద్దు మహనయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని అరువది పట్టణములును.
30. Their border was from Machanayim, all Bashan, all the kingdom of `Og king of Bashan, and all the towns of Ya'ir, which are in Bashan, sixty cities:
31. గిలాదులో సగమును, అష్తారోతు ఎద్రయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములును మనష్షే కుమారుడైన మాకీరు, అనగా మాకీరీయులలో సగముమందికి వారి వంశములచొప్పున కలిగినవి.
31. and half Gil`ad, and `Ashtarot, and Edre`i, the cities of the kingdom of `Og in Bashan, were for the children of Makhir the son of Menashsheh, even for the half of the children of Makhir according to their families.
32. యెరికో యొద్ద తూర్పుదిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచి పెట్టిన స్వాస్థ్యములు ఇవి.
32. These are the inheritances which Moshe distributed in the plains of Mo'av, beyond the Yarden at Yericho, eastward.
33. లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు; ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము.
33. But to the tribe of Levi Moshe gave no inheritance: the LORD, the God of Yisra'el, is their inheritance, as he spoke to them.