ప్రకటన 16:1 మరియుమీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయ ములోనుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.
ప్రకటన 16:2 - 12 అంతట మొదటి దూత ..... నీళ్లు యెండి పోయెను.
జీవముగల దేవుని తెలుసుకొనక ఎంత కాలము జీవితము కొనసాగిస్తాడు మానవుడు !? ఆ క్రూరమృగముయొక్క ముద్రగలవారికిని దాని ప్రతిమకు నమస్కారముచేయువారి మీదికి దేవుని ఉగ్రత పాత్రలు క్రుమ్మరింప బడుట ఈ 16వ అధ్యాయములో చూపిస్తున్నారు దర్శన కర్తయైన యేసుక్రీస్తు. పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తముమ త్రాగిన ఈ భూమిమీదికి దేవుని ఉగ్రత దిగివచ్చున్నది.
ఆదాము పాపము చేసినప్పుడు: నీ నిమిత్తము నేల శపింపబడియున్నది (ఆది 3:17) అంటున్నారు. అలాగే మరో మారు: నరుల చెడు తనము భూమిమీద గొప్పది (ఆది 6:5) అంటున్నారు దేవుడు. ప్రియ నేస్తం, నేను పాపము చేస్తే, నేను పాపక్షమాపణ పొందక పోతే నేనే కదా నరకానికి పోయేది అనుకుంటున్నావా. అది భూమికి, అందున్న సమస్త జీవరాశికి ప్రమాదమే అని గ్రహించాలి మనము.
ఒక మనిషి రక్షించబడితే,భూమిమీద సమాధానము, పరలోకములో సంతోషము. పాపము ఎంత భయంకరమైనదో దాని ప్రభావము భూమిమీద ఎలా వుంటుందో స్పష్టము చేస్తుంది ఈ ఏడు పాత్రల దర్శనము. ఒక్కో పాత్ర భూమియొక్క ఒక్కో భాగము మీద కుమ్మరింపబడుట ధ్యానము చేద్దాం. ప్రభును మనతో నుండి నడిపించును గాక. ప్రభువును , సర్వాధికారియూనైన దేవుని తీర్పులు సత్యములును న్యాయములునైయున్నవి.
జీవముగల దేవుని విస్మరించి ప్రకృతి ఆరాధకునిగా మారిన నేటి మనిషి దైవ దూషణ ఒక ఆయుధముగా ధరించి విమర్శించుట నేర్చుకున్నాడు. ప్రతి మారుమూల ప్రాంతాలకు సైతం సువార్త అందుతున్నప్పటికీ పెడచెవిని బెట్టి మారుమనస్సు పొందని వారిగతి ఏమౌతుందో తెలుసుకుందాం, అనేకులకు తెలియ పరచుదాం. ప్రభువు మనతో నుండి ఆయన ఆజ్ఞ మేరకు సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త అందించుదాం. ఆమెన్
మొదటి (తెగులు) పాత్ర - బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను
రెండవ (తెగులు) పాత్ర – సముద్రము లోని జీవరాశి మరణము సంభవించెను
మూడవ (తెగులు) పాత్ర - నదుల లోని జీవరాశి మరణము సంభవించెను
నాలుగవ (తెగులు) పాత్ర – సూర్య తాపముచే మరణము సంభవించెను
ఐదవ (తెగులు) పాత్ర – అనేక వేదనలు పుండ్లు పుట్టెను
ఆరవ (తెగులు) పాత్ర – పరిశుద్ధులతో యుద్ధము చేయు దయ్యములు, రక్షణ వస్త్రములు పోగొట్టుకొని దిగంబరులైన విశ్వాసులు
ప్రకటన 16:13 -21 మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు … … … ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.
ఆరవ (తెగులు) పాత్ర – పరిశుద్ధులతో యుద్ధము చేయు దయ్యములు, రక్షణ వస్త్రములు పోగొట్టుకొని దిగంబరులైన విశ్వాసులు
భూరాజులు యుద్ధములు చేయునట్లు సాతాను తాను పంపిన అపవిత్రాత్మల చేత వారిని రేపుచూ లోకములో సమాధానము లేకుండా చేయుచున్నది. దాని సైన్యము దయ్యముల ఆత్మలే అని తెలియబడుచున్నది. దేవునికి దేవుని ప్రజలకు విరోధులుగా వారు చెలరేగి అశాంతి నెలకొల్పునట్లు అది వారికి బోధించుచున్న అబద్ద ప్రవక్త. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము.
అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు (మత్త 24:7-9). ప్రియ స్నేహితుడా, యుద్ద్ధములు, కరవులు, భూకంపములు లోకమునకు వేదనలు వస్తే; క్రైస్తవులు శ్రమల పాలు కావడము ఏమిటీ? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి మనలను మోసపరచెదరు. అంత్యదినములలోవినిపిస్తున్న బోధలు అన్నీ నమ్మకూడదు సుమా. వాక్యము ధ్యానము చేద్దాం, ప్రభువే మనతో మాటాడుతారు. ఆమెన్
ఏడవ (తెగులు) పాత్ర – భూమిమీది కట్టడములన్నియూ నాశనమగునట్లు మహా భూకంపము కలిగెను.