Ezekiel - యెహెఙ్కేలు 36 | View All

1. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి,

1. And you, Son of Man, prophesy to the mountains of Israel, and say, You+ mountains of Israel, hear the word of Yahweh.

2. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆహా ప్రాచీనములైన ఉన్నతస్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి.

2. Thus says the Sovereign Yahweh: Because the enemy has said against you+, Aha! And, The ancient high places are ours in possession;

3. వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లు గాను, నిందించువారిచేత జనుల దృష్టికి మీరు అపహాస్యా స్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మను పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసియున్నారు.

3. therefore prophesy, and say, Thus says the Sovereign Yahweh: Because, even because they have made you+ desolate, and swallowed you+ up on every side, that you+ might be a possession to the residue of the nations, and you+ are taken up in the lips of talkers, and the evil report of the people;

4. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను పాడైన స్థలములతోను నిర్జనమైన పట్టణములతోను

4. therefore, you+ mountains of Israel, hear the word of the Sovereign Yahweh: Thus says the Sovereign Yahweh to the mountains and to the hills, to the watercourses and to the valleys, to the desolate wastes and to the cities that are forsaken, which have become a prey and derision to the residue of the nations that are round about;

5. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సంతుష్టహృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచు కొనిన ఎదోమీయులనందరిని బట్టియు, శేషించిన అన్య జనులనుబట్టియు నారోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను.

5. therefore thus says the Sovereign Yahweh: Surely in the fire of my jealousy I have spoken against the residue of the nations, and against all Edom, that have appointed my land to themselves for a possession with the joy of all their heart, with despite of soul, in order that its pasture ground [may be delivered] for plunder.

6. కాబట్టి ఇశ్రాయేలు దేశమునుగూర్చి ప్రవచనమెత్తి, పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ఈ మాట తెలియజెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు అన్య జనులవలన అవమానము నొందితిరి గనుక రోషముతోను కోపముతోను నేను మాట ఇచ్చియున్నాను.

6. Therefore prophesy concerning the land of Israel, and say to the mountains and to the hills, to the watercourses and to the valleys, Thus says the Sovereign Yahweh: Look, I have spoken in my jealousy and in my wrath, because you+ have borne the shame of the nations:

7. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీ చుట్టునున్న అన్య జనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను.

7. therefore thus says the Sovereign Yahweh: I have sworn, [saying,] Surely the nations that are round about you+, they will bear their shame.

8. ఇశ్రాయేలు పర్వతములారా, యిక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగు నా జనులు వచ్చెదరు, మీరు చిగురుపెట్టి వారికొరకు మీ ఫలములు ఫలించుదురు.

8. But you+, O mountains of Israel, you+ will shoot forth your+ branches, and yield your+ fruit to my people Israel; for they are at hand to come.

9. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు.

9. For, look, I am for you+, and I will turn to you+, and you+ will be tilled and sown;

10. మీ మీద మానవ జాతిని, అనగా ఇశ్రాయేలీయులనందరిని, విస్తరింపజేసెదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడై పోయిన పట్టణములు మరల కట్టబడును.

10. and I will multiply man on you+, all the house of Israel, even all of it; and the cities will be inhabited, and the waste places will be built;

11. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

11. and I will multiply on you+ man and beast; and they will increase and be fruitful; and I will cause you+ to be inhabited after your+ former estate, and will do better [to you+] than at your+ beginnings: and you+ will know that I am Yahweh.

12. మానవజాతిని, అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీరికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు.

12. Yes, I will cause man to walk on you+, even my people Israel; and they will possess you, and you will be their inheritance, and you will no more from now on bereave them.

13. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారే.

13. Thus says the Sovereign Yahweh: Because they say to you+, You [land] are a devourer of man, and have been a bereaver of your nation;

14. నీవు మనుష్యులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు

14. therefore you will devour man no more, neither bereave your nation anymore, says the Sovereign Yahweh;

15. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండ చేసెదను, జనములవలన కలుగు అవమానము నీవికభరింపవు, నీవు నీ జనులను పుత్రహీనులగా చేయకయుందువు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

15. neither will I let you hear anymore the shame of the nations, neither will you bear the reproach of the peoples anymore, neither will you cause your nation to stumble anymore, says the Sovereign Yahweh.

16. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

16. Moreover the word of Yahweh came to me, saying,

17. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి, దుష్‌ప్రవర్తనచేతను దుష్‌క్రియలచేతను దానిని అపవిత్రపరచిరి, వారి ప్రవర్తన బహిష్టయైన స్త్రీయొక్క అపవిత్రతవలె నా దృష్టికి కనబడుచున్నది.

17. Son of Man, when the house of Israel dwelt in their own land, they defiled it by their way and by their doings: their way before me was as the uncleanness of a woman in her impurity.

18. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైయును, విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచినదాని విషయమైయును నేను నా క్రోధమును వారిమీద కుమ్మరించి

18. Therefore I poured out my wrath on them for the blood which they had poured out on the land, and because they had defiled it with their idols;

19. వారి ప్రవర్తనను బట్టియు వారి క్రియలను బట్టియు వారిని శిక్షించి, నేను అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆ యా దేశములకు చెదరిపోయిరి.

19. and I scattered them among the nations, and they were dispersed through the countries: according to their way and according to their doings I judged them.

20. వారు తాము వెళ్లిన స్థలములలోని జనులయొద్ద చేరగా ఆ జనులువీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములోనుండి వచ్చినవారే గదా, అని చెప్పుటవలన నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి.
రోమీయులకు 2:24

20. And when the people came to the nations, where they went, they profaned my holy name; in that men said of them, These are the people of Yahweh, and have gone forth out of his land.

21. కాగా ఇశ్రాయేలీయులు పోయిన యెల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని.

21. But I had regard for my holy name, which the house of Israel had profaned among the nations, where they went.

22. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటనచేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును.

22. Therefore say to the house of Israel, Thus says the Sovereign Yahweh: I don't do [this] for your+ sake, O house of Israel, but for my holy name, which you+ have profaned among the nations, where you+ went.

23. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి యెదుట మీయందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
మత్తయి 6:9

23. And I will sanctify my great name, which has been profaned among the nations, which you+ have profaned in the midst of them; and the nations will know that I am Yahweh, says the Sovereign Yahweh, when I will be sanctified in you+ before their eyes.

24. నేను అన్యజనులలోనుండి మిమ్మును తోడుకొని, ఆ యా దేశములలో నుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను.

24. For I will take you+ from among the nations, and gather you+ out of all the countries, and will bring you+ into your+ own land.

25. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.
హెబ్రీయులకు 10:22

25. And I will sprinkle clean water on you+, and you+ will be clean: from all your+ filthiness, and from all your+ idols, I will cleanse you+.

26. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.
2 కోరింథీయులకు 3:3

26. A new heart also I will give you+, and a new spirit I will put inside you+; and I will take away the stony heart out of your+ flesh, and I will give you+ a heart of flesh.

27. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.
1 థెస్సలొనీకయులకు 4:8

27. And I will put my Spirit inside you+, and cause you+ to walk in my statutes, and you+ will keep my ordinances, and do them.

28. నేను మీ పితరుల కిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు నేను మీ దేవుడనై యుందును.

28. And you+ will dwell in the land that I gave to your+ fathers; and you+ will be my people, and I will be your+ God.

29. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరవురానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును.

29. And I will save you+ from all your+ uncleannesses: and I will call for the grain, and will multiply it, and lay no famine on you+.

30. అన్యజనులలో కరవును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను భూమిపంటను నేను విస్తరింపజేసెదను.

30. And I will multiply the fruit of the tree, and the increase of the field, that you+ may receive no more the reproach of famine among the nations.

31. అప్పుడు మీరు మీ దుష్‌ప్రవర్తనను మీరు చేసిన దుష్‌క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములను బట్టియు హేయక్రియలను బట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు.

31. Then you+ will remember your+ evil ways, and your+ doings that were not good; and you+ will loathe yourselves in your+ own sight for your+ iniquities and for your+ disgusting behaviors.

32. మీ నిమిత్తము నేను ఈలాగున చేయుటలేదని తెలిసికొనుడి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తననుగూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి.

32. I don't do [this] for your+ sake, says the Sovereign Yahweh, be it known to you+: be ashamed and confounded for your+ ways, O house of Israel.

33. మీ దోషములవలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయునాడు పాడైపోయిన స్థలములు మరల కట్టబడును.

33. Thus says the Sovereign Yahweh: In the day that I cleanse you+ from all your+ iniquities, I will cause the cities to be inhabited, and the waste places will be built.

34. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును.

34. And the land that was desolate will be tilled, whereas it was a desolation in the sight of all who passed by.

35. పాడైన భూమి ఏదెను వనమువలె ఆయెననియు, పాడుగాను నిర్జనముగానున్న యీ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయెననియు జనులు చెప్పుదురు.

35. And they will say, This land that was desolate has become like the garden of Eden; and the waste and desolate and ruined cities are fortified and inhabited.

36. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టు శేషించిన అన్యజనులు తెలిసికొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తును.

36. Then the nations that are left round about you+ will know that I, Yahweh, have built the ruined places, and planted that which was desolate: I, Yahweh, have spoken it, and I will do it.

37. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయు విషయములో వారిని నాయొద్ద విచారణచేయనిత్తును, గొఱ్ఱెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను.

37. Thus says the Sovereign Yahweh: For this, moreover, I will be inquired of by the house of Israel, to do it for them: I will increase them with man like a flock.

38. నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొనునట్లు ప్రతిష్ఠితములగు గొఱ్ఱెలంత విస్తారముగాను, నియామకదినములలో యెరూషలేమునకు వచ్చు గొఱ్ఱెలంత విస్తారముగాను వారి పట్టణములయందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించునట్లు నేను చేసెదను.

38. As the flock for sacrifice, as the flock of Jerusalem in her appointed feasts, so will the waste cities be filled with flocks of man; and they will know that I am Yahweh.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 36 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అన్యజనులను అణచివేసేవారి నుండి భూమి విడిపింపబడుతుంది. (1-15) 
దేవుని అనుచరుల పట్ల అసహ్యం మరియు విమర్శలను వ్యక్తం చేసే వారు ప్రతికూలత చివరికి తమలో తాము ప్రతిబింబించడాన్ని కనుగొంటారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలపై తన అనుగ్రహాన్ని పొందుతాడు. ఇతరులు మనతో అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ, ఫిర్యాదు చేయడానికి మాకు ఎటువంటి ఆధారం లేదు, ఎందుకంటే ప్రజలు ఎంత దయలేని వ్యక్తులుగా ఉంటే, దేవుడు అంత కనికరం చూపిస్తాడు. వారు తమ న్యాయమైన భూభాగానికి పునరుద్ధరించబడతారు. ఇది స్వర్గపు కనానును సూచిస్తుంది, ఇది దేవుని పిల్లలందరికీ వారసత్వంగా ఉంది మరియు చివరికి వారు ఎక్కడ సమీకరించబడతారు. విధేయతతో తన వద్దకు తిరిగి వచ్చే ప్రజలకు దేవుడు తన దయను అందించినప్పుడు, వారి మనోవేదనలన్నీ పరిష్కరించబడతాయి. ఈ భవిష్యవాణి యొక్క పూర్తి సాక్షాత్కారం భవిష్యత్ సంఘటన కోసం ఉద్దేశించబడింది.

ప్రజలు పూర్వపు పాపాలను గుర్తుకు తెచ్చుకుంటారు మరియు విమోచన వాగ్దానం చేస్తారు. (16-24) 
ఆ సంఘం యొక్క పునరుద్ధరణ, క్రీస్తు ద్వారా మన విమోచనానికి ప్రతీక, మన రక్షణ యొక్క అంతిమ ఉద్దేశ్యం దేవునికి మహిమ తీసుకురావడమే అని నొక్కి చెబుతుంది. ఒక సంఘం యొక్క అతిక్రమణలు వారి భూమిని కలుషితం చేస్తాయి, అది దేవునికి అసహ్యంగా మరియు దాని నివాసులకు ఆతిథ్యం ఇవ్వకుండా చేస్తుంది. దేవుని పవిత్ర నామం ఆయన సర్వోన్నత నామం; అతని పవిత్రత అతని గొప్పతనాన్ని ఏర్పరుస్తుంది మరియు మరొకటి నిజంగా వ్యక్తి యొక్క స్థాయిని పెంచదు.

అలాగే పవిత్రత, మరియు సువార్త ఆశీర్వాదాలు. (25-38)
నీరు మన కలుషితమైన ఆత్మలను పాపం నుండి శుద్ధి చేయడాన్ని సూచిస్తుంది. అయితే, నీరు భౌతిక శరీరం నుండి మలినాన్ని మాత్రమే తొలగించగలదు. సాధారణంగా, నీరు పవిత్రాత్మ యొక్క పవిత్రీకరణ ప్రభావం యొక్క మతకర్మ చిహ్నంగా పనిచేస్తుంది, ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త రక్తంతో కలిసి ఉంటుంది. విశ్వాసం పాపపు పనుల నుండి ప్రక్షాళన కోసం మనస్సాక్షికి రెండవదాన్ని వర్తింపజేసినప్పుడు, మొదటిది పాపం యొక్క కలుషితము నుండి ఆత్మ యొక్క సామర్థ్యాలను శుద్ధి చేస్తుంది. కొత్త ఒడంబడికలో భాగమైన వారు కొత్త హృదయాన్ని మరియు కొత్త ఆత్మను పొందుతారు, వారు కొత్త జీవన విధానానికి అనుగుణంగా జీవించడానికి వీలు కల్పిస్తారు. దేవుడు తన పవిత్ర చిత్తానికి మృదువుగా మరియు విధేయతతో కూడిన మాంసపు హృదయాన్ని ప్రసాదిస్తాడు. జీవం లేని రాయిని సజీవ మాంసంగా మార్చినంత ముఖ్యమైన మార్పును రూపాంతర దయ ఆత్మలో తీసుకువస్తుంది. దేవుడు తన ఆత్మను మనలో ఉంచుతానని వాగ్దానం చేస్తాడు, గురువుగా, మార్గదర్శిగా మరియు పరిశుద్ధుడుగా పనిచేస్తాడు. మన బాధ్యతల కోసం మనల్ని సన్నద్ధం చేయడానికి దేవుని దయ యొక్క హామీ ఆ బాధ్యతలను నెరవేర్చడానికి మన అచంచలమైన నిబద్ధతను మరియు ప్రయత్నాన్ని ప్రేరేపించాలి. ఈ వాగ్దానాలు ప్రతి యుగంలో నిజమైన విశ్వాసులందరికీ అమలు చేయబడాలి మరియు నెరవేర్చబడతాయి.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |