Matthew - మత్తయి సువార్త 23 | View All

1. అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను

1. Thanne Jhesus spac to the puple, and to hise disciplis,

2. శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు

2. and seide, On the chayere of Moises, scribis and Farisees han sete.

3. గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.
మలాకీ 2:7-8

3. Therfor kepe ye, and do ye alle thingis, what euer thingis thei seien to you. But nyle ye do aftir her werkis; for thei seien, and don not.

4. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.

4. And thei bynden greuouse chargis, and that moun not be borun, and putten on schuldris of men; but with her fyngur thei wolen not moue hem.

5. మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు;
నిర్గమకాండము 13:9, సంఖ్యాకాండము 15:38-39, ద్వితీయోపదేశకాండము 6:8

5. Therfor thei don alle her werkis `that thei be seen of men; for thei drawen abrood her filateries, and magnifien hemmes.

6. విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను

6. And thei louen the first sittyng placis in soperis, and the first chaieris in synagogis;

7. సంత వీధులలో వందన ములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.

7. and salutaciouns in chepyng, and to be clepid of men maystir.

8. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు.

8. But nyle ye be clepid maister; for oon is youre maystir, and alle ye ben britheren.

9. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు.

9. And nyle ye clepe to you a fadir on erthe, for oon is your fadir, that is in heuenes.

10. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తుఒక్కడే మీ గురువు.

10. Nether be ye clepid maistris, for oon is youre maister, Crist.

11. మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను.

11. He that is grettest among you, schal be youre mynystre.

12. తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.
యోబు 22:29, సామెతలు 29:23, యెహెఙ్కేలు 21:26

12. For he that hieth himself, schal be mekid; and he that mekith hym silf, schal be enhaunsid.

13. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;

13. But wo to you, scribis and Farisees, ipocritis, that closen the kyngdom of heuenes bifore men; and ye entren not, nether suffren men entrynge to entre.

14. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.

14. Wo to you, scribis and Farisees, ipocritis, that eten the housis of widowis, and preien bi longe preier; for this thing ye schulen take more doom.

15. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్ర మును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు.

15. Wo to you, scribis and Farisees, ypocritis, that goon aboute the see and the loond, to make o prosilite; and whanne he is maad, ye maken hym a sone of helle, double more than ye ben.

16. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.

16. Wo to you, blynde lederis, that seien, Who euer swerith bi the temple of God, it is `no thing; but he that swerith in the gold of the temple, is dettoure.

17. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా?

17. Ye foolis and blynde, for what is grettere, the gold, or the temple that halewith the gold?

18. మరియుబలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.

18. And who euer swerith in the auter, it is no thing; but he that swerith in the yifte that is on the auter, owith.

19. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా?
నిర్గమకాండము 29:37

19. Blynde men, for what is more, the yifte, or the auter that halewith the yifte?

20. బలిపీఠముతోడని ఒట్టుపెట్టు కొనువాడు, దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటితోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.

20. Therfor he that swerith in the auter, swerith in it, and in alle thingis that ben ther on.

21. మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.
1 రాజులు 8:13, కీర్తనల గ్రంథము 26:8

21. And he that swerith in the temple, swerith in it, and in hym that dwellith in the temple.

22. మరియు ఆకాశముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టుపెట్టుకొను చున్నాడు.
యెషయా 66:1

22. And he that swerith in heuene, swerith in the trone of God, and in hym that sittith ther on.

23. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను.
లేవీయకాండము 27:30, మీకా 6:8

23. Wo to you, scribis and Farisees, ypocritis, that tithen mynte, anete, and cummyn, and han left tho thingis that ben of more charge of the lawe, doom, and merci, and feith. And it bihofte to do these thingis, and not to leeue tho.

24. అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండు నట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే.

24. Blynde lederis, clensinge a gnatte, but swolewynge a camel.

25. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయు దురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వము తోను నిండియున్నవి.
జెకర్యా 1:1

25. Woo to you, scribis and Farisees, ypocritis, that clensen the cuppe and the plater with outforth; but with ynne ye ben ful of raueyne and vnclennesse.

26. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.

26. Thou blynde Farisee, clense the cuppe and the plater with ynneforth, that that that is with outforth be maad clene.

27. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలి యున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి.

27. Wo to you, scribis and Farisees, ipocritis, that ben lijk to sepulcris whitid, whiche with outforth semen faire to men; but with ynne thei ben fulle of boonus of deed men, and of al filthe.

28. ఆలాగే మీరు వెలుపల మనుష్యు లకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.

28. So ye with outforth semen iust to men; but with ynne ye ben ful of ypocrisy and wickidnesse.

29. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతి మంతుల గోరీలను శృంగారించుచు

29. Wo to you, scribis and Farisees, ipocritis, that bilden sepulcris of profetis, and maken faire the birielis of iust men,

30. మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు.

30. and seien, If we hadden be in the daies of oure fadris, we schulden not haue be her felowis in the blood of prophetis.

31. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.

31. And so ye ben in witnessyng to you silf, that ye ben the sones of hem that slowen the prophetis.

32. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి.

32. And fulfille ye the mesure of youre fadris.

33. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?

33. Ye eddris, and eddris briddis, hou schulen ye fle fro the doom of helle?

34. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతొ కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు.

34. Therfor lo! Y sende to you profetis, and wise men, and scribis; and of hem ye schulen sle and crucifie, and of hem ye schulen scourge in youre sinagogis, and schulen pursue fro cite in to citee;

35. నీతిమంతు డైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవా లయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతి మంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.
ఆదికాండము 4:8, 2 దినవృత్తాంతములు 24:20-21

35. that al the iust blood come on you, that was sched on the erthe, fro the blood of iust Abel to the blood of Zacarie, the sone of Barachie, whom ye slowen bitwixe the temple and the auter.

36. ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

36. Treuli Y seie to you, alle these thingis schulen come on this generacioun.

37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.

37. Jerusalem, Jerusalem, that sleest prophetis, and stoonest hem that ben sent to thee, hou ofte wolde Y gadere togidere thi children, as an henne gaderith togidir her chikenes vndir hir wengis, and thou woldist not.

38. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది
1 రాజులు 9:7-8, యిర్మియా 12:7, యిర్మియా 22:5

38. Lo! youre hous schal be left to you desert.

39. ఇదిమొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను.
కీర్తనల గ్రంథము 118:26

39. And Y seie to you, ye schulen not se me fro hennus forth, til ye seien, Blessid is he, that cometh in the name of the Lord.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 23 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యేసు శాస్త్రులను మరియు పరిసయ్యులను గద్దించాడు. (1-12) 
మోషే ధర్మశాస్త్రాన్ని వివరించడానికి మరియు అమలు చేయడానికి శాస్త్రులు మరియు పరిసయ్యులు బాధ్యత వహించారు. అయితే, వారు మతపరమైన విషయాల్లో కపటత్వాన్ని పాటిస్తున్నారని ఆరోపించారు. మన తీర్పులు బాహ్య రూపాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి, కానీ దేవుడు, దీనికి విరుద్ధంగా, హృదయ లోతులను పరిశీలిస్తాడు. పరిసయ్యులు ఫైలాక్టరీలను తయారు చేసే అభ్యాసంలో నిమగ్నమై ఉన్నారు, అవి చట్టంలోని నాలుగు పేరాగ్రాఫ్‌లను కలిగి ఉన్న స్క్రోల్‌లు, వారి నుదిటిపై మరియు ఎడమ చేతులపై ధరించడానికి ఉద్దేశించబడ్డాయి, ఎంపిక చేయబడిన ప్రజలుగా వారి విశిష్టతను గుర్తుచేస్తుంది సంఖ్యాకాండము 15:38. దురదృష్టవశాత్తూ, పరిసయ్యులు కట్టుబాటును దాటి, వారి ఫైలాక్టరీలను పెద్దదిగా చేసి, గొప్ప మతపరమైన భక్తిని ప్రతిబింబించేలా చేశారు. అహంకారం అనేది పరిసయ్యులలో ప్రధానమైన మరియు పాలించే పాపం, మన ప్రభువైన యేసు స్థిరంగా హెచ్చరించిన బలహీనత.
మాటలో బోధించిన వారు తమ గురువులను గౌరవించడం అభినందనీయం అయితే, ఉపాధ్యాయులు డిమాండ్ చేయడం మరియు అలాంటి గౌరవం గురించి గర్వంతో ఉబ్బిపోవడం పాపం. ఈ వైఖరి క్రైస్తవ మతం యొక్క ఆత్మకు ప్రత్యక్ష విరుద్ధం. క్రీస్తు యొక్క నిజమైన శిష్యుడు ప్రముఖ స్థానాలకు ఎదగడంలో అసౌకర్యాన్ని అనుభవిస్తాడు. దురదృష్టవశాత్తూ, మనం కనిపించే చర్చిని గమనించినప్పుడు, ఈ క్రైస్తవ వ్యతిరేక స్ఫూర్తి కొంతవరకు ప్రతి మత సంఘంలోనూ మరియు వ్యక్తుల హృదయాల్లోనూ ఉందని స్పష్టమవుతుంది.

పరిసయ్యుల నేరాలు. (13-33) 
శాస్త్రులు మరియు పరిసయ్యులు తమను తాము క్రీస్తు సువార్తకు మరియు తత్ఫలితంగా ఆత్మల రక్షణకు విరోధులుగా ఉంచుకున్నారు. క్రీస్తు నుండి మనల్ని మనం దూరం చేసుకోవడం హానికరం మాత్రమే కాదు, ఇతరులు ఆయనను చేరుకోకుండా అడ్డుకోవడం మరింత ఖండించదగినది. దురదృష్టవశాత్తు, ఘోరమైన అపరాధాలను దాచడానికి దైవభక్తి కనిపించడం అసాధారణం కాదు. మారువేషంలో ఉన్న భక్తిని రెండు రెట్లు అధర్మంగా పరిగణిస్తారు. వారి ప్రాథమిక ఆందోళన దేవుని మహిమ లేదా ఆత్మల శ్రేయస్సు కాదు, బదులుగా మతం మారినవారిని సంపాదించడం ద్వారా క్రెడిట్ మరియు ప్రయోజనాన్ని పొందడం. వారి దైవభక్తి యొక్క సంస్కరణ కేవలం వారి ప్రాపంచిక ప్రయోజనాలను తీర్చడానికి ఒక సాధనంగా ఉంది, ఎందుకంటే వారు తమ వ్యక్తిగత ప్రయోజనాలకు మతాన్ని అణచివేయడానికి వివిధ వ్యూహాలను ఉపయోగించారు.
శాస్త్రులు మరియు పరిసయ్యులు ధర్మశాస్త్రంలోని చిన్న చిన్న విషయాల పట్ల నిశితంగా వ్యవహరించినప్పటికీ, మరింత ముఖ్యమైన విషయాల విషయంలో వారు అజాగ్రత్త మరియు అలసత్వం ప్రదర్శించారు. క్రీస్తు యొక్క మందలింపు చిన్న పాపం యొక్క ఖచ్చితమైన ఎగవేతపై నిర్దేశించబడలేదు; అది పాపం అయితే, అది గ్నాట్ అంత చిన్నది అయినా, దానిని పరిష్కరించాలి. ఏది ఏమైనప్పటికీ, ఒంటెను మింగడానికి సారూప్యంగా, ఏకకాలంలో మరింత ముఖ్యమైన పాపాలు చేస్తూనే ఈ సూక్ష్మబుద్ధిలో నిమగ్నమై ఉండటం విమర్శల లక్ష్యం. వారి బాహ్యరూపంలో దైవభక్తి ఉన్నప్పటికీ, వారికి నిగ్రహం మరియు నీతి లోపించింది. నిజమైన పరివర్తన అంతర్గతంగా ప్రారంభమవుతుందని క్రీస్తు నొక్కి చెప్పాడు. శాస్త్రులు మరియు పరిసయ్యులు ప్రదర్శించిన నీతి సమాధిని అలంకరించడం లేదా నిర్జీవమైన శరీరాన్ని ధరించడం వంటిది - కేవలం ప్రదర్శన కోసం.
పాపుల యొక్క మోసపూరిత స్వభావం వారు గత యుగాల పాపాలను ఎదిరించగలరని ఊహించుకుంటూ, వారి కాలపు పాపాలను అనుసరించే ధోరణిలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు క్రీస్తు కాలంలో జీవించి ఉంటే, వారు ఆయనను తిరస్కరించరని తరచుగా నమ్ముతారు. అయినప్పటికీ, క్రీస్తు తన ఆత్మ, అతని మాట మరియు అతని పరిచారకుల ద్వారా ఇప్పటికీ తిరస్కరణను ఎదుర్కొంటున్నాడు. దేవుడు, తన న్యాయంలో, తమ కోరికలను తీర్చుకోవడంలో పట్టుదలతో ఉన్నవారిని వారి స్వంత కోరికలకు అప్పగించడానికి అనుమతిస్తాడు. క్రీస్తు, తప్పులేని అంతర్దృష్టితో, వ్యక్తుల యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడిచేశాడు.

జెరూసలేం యొక్క అపరాధం. (34-39)
మన ప్రభువు యెరూషలేము నివాసులు తమ మీదికి తెచ్చుకోబోయే కష్టాలను అంచనా వేస్తున్నాడు, అయినప్పటికీ అతను స్వయంగా భరించే బాధలను వివరించలేదు. కోడిపిల్లలను తన రెక్కల క్రింద సేకరిస్తున్న కోడి యొక్క చిత్రం, రక్షకునిపై విశ్వాసం ఉంచే వారి పట్ల మరియు వారిపై ఆయన విశ్వాసపాత్రమైన సంరక్షకుల పట్ల చూపే వాత్సల్యాన్ని సముచితంగా సూచిస్తుంది. అతను పాపులను తన రక్షిత సంరక్షణ క్రింద ఆశ్రయం పొందమని, వారి భద్రతను నిర్ధారించి, వారిని నిత్యజీవం వైపుగా పోషించమని పిలుస్తాడు. ఈ ప్రకరణము యూదుల ప్రస్తుత చెదరగొట్టడం మరియు అవిశ్వాసంతో పాటు భవిష్యత్తులో క్రీస్తుగా మారడం గురించి కూడా తెలియజేస్తుంది.
జెరూసలేం మరియు దాని నివాసులు గణనీయమైన నేరాన్ని భరించారు, ఇది వారి గమనార్హమైన శిక్షకు దారితీసింది. ఏది ఏమైనప్పటికీ, నిజమైన విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, కేవలం పేరుకే ఏ క్రైస్తవ చర్చికైనా తగిన ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఈలోగా, రక్షకుడు తనను సమీపించే వారందరినీ స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపులను శాశ్వతమైన ఆనందం నుండి వేరుచేసే ఏకైక అడ్డంకి వారి మొండితనం మరియు అవిశ్వాసం.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |