Corinthians I - 1 కొరింథీయులకు 3 | View All

1. సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.

“ఆధ్యాత్మిక”– దేవుని ఆత్మలేని మనుషులతో పోల్చుకుంటే విశ్వాసులంతా ఆధ్యాత్మిక వ్యక్తులే (1 కోరింథీయులకు 2:14-16; రోమీయులకు 8:5-9) కానీ విశ్వాసుల్లో కూడా కొంతమంది ఇతరులకన్న ఎంతో ఆధ్యాత్మికమైనవారు. దురదృష్టవశాత్తూ అప్పుడప్పుడు కొందరు విశ్వాసులు భ్రష్ట స్వభావాన్ని అనుసరించి నడుచుకునే లోకప్రజల మాదిరిగానే ప్రవర్తిస్తుంటారు. మొత్తం మీద కొరింతు క్రైస్తవులు ఇలాంటివారే. ఆధ్యాత్మికంగా చూస్తే వారింకా చంటిపిల్లల్లాంటివారే. దేవుని లోతైన సంగతులు పౌలు వారికి బోధించడానికి వీల్లేక పోయింది (1 కోరింథీయులకు 2:6; హెబ్రీయులకు 5:11-14 పోల్చి చూడండి). 1 కోరింథీయులకు 2:14-16 1 కోరింథీయులకు 3:1 లో పౌలు మూడు రకాల వ్యక్తుల గురించి చెప్పాడు. “సహజ సిద్ధమైన” వ్యక్తి – అంటే దేవుని ఆత్మ లేనివాడు; “ఆధ్యాత్మిక వ్యక్తి” – దేవుని ఆత్మ కలిగి ఆత్మ ప్రకారం నడచుకునేవాడు; “శరీర స్వభావాన్ని అనుసరించే వ్యక్తి” – దేవుని ఆత్మ తనలో ఉన్నా తన విధానాలు కొన్నింటిలో దేవుని ఆత్మ లేనట్టు నడుచుకునేవాడు.

2. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా?

3. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?

వారు శరీర స్వభావాన్ని అనుసరించేవారు అనడానికి రుజువు ఇదే. ఎందుకంటే విశ్వాసుల మధ్య కక్షలు, కలహాలు దేవుని ఆత్మమూలంగా రావు గాని మనుషుల భ్రష్ట స్వభావం నుంచి వస్తాయి (గలతియులకు 5:19-20; యాకోబు 3:14-18). క్రీస్తులో విశ్వాసులు “మామూలు మనుషుల్లాగా” ప్రవర్తించ కూడదు. వారు దేవుని పవిత్ర ప్రజ. దేవుని ఆత్మ వారిలో ఉన్నాడు. ఉన్నత జీవిత విధానానికి వారు పిలవబడ్డారు.

4. ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?

1 కోరింథీయులకు 1:11-12. నేటికి కూడా చాలామంది విశ్వాసులు తమ చీలికలు, వర్గాల ద్వారా, తమ శాఖ, సంఘ డినామినేషన్ విషయంలో వారికున్న గర్వం ద్వారా, మనుషులకు ఘనత ఇవ్వడం ద్వారా తమ లోక సంబంధమైన, శరీర సంబంధమైన స్వభావాన్ని కనపరచుకొంటూ ఉన్నారు.

5. అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి

ప్రభువే ప్రాముఖ్యమైన వ్యక్తి అనీ, ఆయన వాక్కును ప్రకటించేవారంతా కేవలం సేవకులనీ, తమలో తాము ఏమీ కాదనీ విశ్వాసులు గుర్తించాలి (వ 7). వివిధ సేవకులకు వివిధమైన పనులు అప్పగించేవాడు ప్రభువే (వ 5). ఆ పనిని అభివృద్ధి చేసేవాడూ దేవుడే, మనుషులు కాదు (వ 7). దేవుడు మాత్రమే సత్యానికీ ఆధ్యాత్మిక జీవానికీ దీవెనలకూ ఉత్పత్తి స్థానం. పౌలు, అపొల్లో లాంటి నిజ సేవకులకు ఉన్న గురి ఒక్కటే (వ 8). విశ్వాసులు దీన్ని గుర్తించి ఏక హృదయంతో, ఏక మనస్సుతో వారందరినీ స్వీకరించాలి (1 కోరింథీయులకు 1:10), అంతేగాని వారిలో ఎవరినైనా గొప్ప చేయకూడదు. “మహిమా...ప్రభువు”– దేవునికి మాత్రమే ఇవ్వదగిన ఒక బిరుదును పౌలు క్రీస్తుకు ఇస్తున్నాడు. కీర్తనల గ్రంథము 24:10 పోల్చి చూడండి. అక్కడ యెహోవా దేవుణ్ణి “మహిమ స్వరూపి అయిన రాజు” అన్నాడు రచయిత. అపో. కార్యములు 7:2; యాకోబు 2:1 కూడా చూడండి. యేసే యెహోవాదేవుడని చూపే ఇతర రిఫరెన్సులు లూకా 2:11 నోట్‌లో ఉన్నాయి. మనుషులు దేవత్వంలోని ఒక వ్యక్తిని చంపారన్న సత్యమే వారికి దేవుడు తెలియదని, దేవుని జ్ఞానం వారికి లేదని తెలియజేస్తున్నది.

6. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే

7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.

“ఏమీ లేదు”– దేవుని సేవకుడు ఎవరికైనా తన గురించి ఉండవలసిన సరియైన అభిప్రాయం ఇది. 1 కోరింథీయులకు 15:9; 2 కోరింథీయులకు 3:5; ఎఫెసీయులకు 3:8; 1 తిమోతికి 1:15 చూడండి. నిర్గమకాండము 3:11; న్యాయాధిపతులు 6:15; యిర్మియా 1:6 కూడా చూడండి. పౌలు సేవ అంత ఫలవంతం కావడానికి నిస్సందేహంగా ఇది ఒక కారణం. మనుషుల పొగడ్తలు, నిందలు, గౌరవం, తృణీకారం వేటినీ అతడు లెక్క చెయ్యలేదు.

8. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.

వ 14.

9. మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.

“దేవుని పొలం”– మత్తయి 13:24. “దేవుని కట్టడం”– వ 16; ఎఫెసీయులకు 2:19-22; 1 పేతురు 2:5.

10. దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

వ 7లో పౌలు తనలో ఏమీ లేదని చెప్పాడు. ఇక్కడ క్రీస్తు సేవకుడుగా తాను చేసినదంతా దేవుని కృపవల్లే అంటున్నాడు. తన సమర్థతలు, అవకాశాలు అన్నీ దేవుడే ఉచితంగా ఇచ్చినవి. 2 కోరింథీయులకు 3:5-6 కూడా చూడండి.

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే.
యెషయా 28:16

యెషయా 28:16; అపో. కార్యములు 4:11; ఎఫెసీయులకు 2:20; 1 పేతురు 2:6. పౌలు క్రీస్తును గురించిన సత్యాన్ని ప్రకటించడం ద్వారా ఉపదేశించడం ద్వారా తనలో పని చేస్తున్న దేవుని ఆత్మ ప్రభావం మూలంగా మనుషులను క్రీస్తులో నమ్మకం పెట్టుకొనేలా నడిపించడం ద్వారా కొరింతులో పునాది వేశాడు. ఆ తరువాత అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కట్టేవారు ఇతరులు అక్కడ పని మొదలు పెట్టారు.

12. ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల,

కట్టేవారు ఆధ్యాత్మిక వ్యక్తులై ఉండి దేవుని వాక్కులోని అమూల్య సత్యాలను ఉపదేశిస్తూ వాటిని అనుసరించేవారైతే వారు కట్టేదానిలో విలువ గల లోహాలు, మణిమాణిక్యాలూ వాడుతున్నట్టన్నమాట. అలా కాకుండా వారు లోక సంబంధులు, సొంత ఆలోచనలను ఉపయోగిస్తూ ఉంటే వారు చెక్క, గడ్డి, కసవును ఉపయోగిస్తున్నారన్నమాట.

13. వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

తన సేవకులందరి పనికీ దేవుడు తీర్పు తీర్చే రోజు గురించి పౌలు మాట్లాడుతున్నాడు. వ 13లో అది తేటతెల్లం చేసే తీర్పు, మంటలతో వచ్చే తీర్పు, పరీక్షించే తీర్పు అని దాని గురించి పౌలు వివరిస్తున్నాడు. ఒక మనిషి చేసిన పని ఎంత అన్నది కాదు ఆ రోజున వచ్చే ప్రశ్న. దాని నాణ్యత ఎలాంటిది అని చూడడం జరుగుతుంది. దేవుని అగ్నిపరీక్షకు ముందు కంటికి చక్కగా కనిపించడం కాదు. దాని తరువాత ఏమి మిగిలి ఉంది అన్నది ముఖ్యం. ఎంత శ్రద్ధగా, భయం, వణకుతో (1 కోరింథీయులకు 2:3) దేవుని సేవకులు తమ పని చెయ్యాలో గదా!

14. పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును.

మత్తయి 16:27; 2 కోరింథీయులకు 5:10; ప్రకటన గ్రంథం 22:12.

15. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

నష్టం అంటే తనకు రాగలిగి ఉండే ప్రతిఫలం విషయంలో నష్టం. 2 యోహాను 8 పోల్చి చూడండి. “మంటలు”– 1 పేతురు 4:17-18 పోల్చి చూడండి.

16. మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

వ్యక్తిగతంగానూ, సమూహంగానూ కూడా క్రీస్తు విశ్వాసులు దేవుని ఆలయం. దేవాలయం అంటే ఆరాధన జరిగే స్థలం, దేవునికి అర్పణలు చెల్లించే స్థలం (రోమీయులకు 12:1-2; హెబ్రీయులకు 13:15-16; 1 పేతురు 2:5). దేవుని సన్నిధి నిలిచి ఉండే స్థలం అది (కీర్తనల గ్రంథము 11:4; యోహాను 17:23; అపో. కార్యములు 2:4; రోమీయులకు 8:9). దేవునికి ఇప్పుడు భూమిపై ఉన్న ఆలయం విశ్వాసులు మాత్రమే. దేవుణ్ణి, ఆయన విశ్వాసులను తిరస్కరించేవాడు మనుషులు కట్టిన ఆలయాలకు వెళ్ళవచ్చు గానీ దేవుడు అక్కడ లేడు (అపో. కార్యములు 17:24).

17. ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు.

“పాడు చేస్తే”– ఇక్కడ గాయపరచడం, హాని చేయడం, చెడగొట్టడం అని అర్థం. విశ్వాసులు దేవుని ఆలయాన్ని నాశనం చెయ్యరు. వారే ఆయన ఆలయం. ఆ రోజుల్లో (ఈ కాలంలో కూడా) అనేక క్రైస్తవ సంఘాల్లో గందరగోళం కలిగిస్తూ ఉన్న కపట బోధకులను దృష్టిలో ఉంచుకుని పౌలు ఈ మాట చెప్పి ఉండాలి – రోమీయులకు 16:17-18. కొరింతులో ఇలాంటివారు కొందరు క్రీస్తు సిలువను అలా ఉంచి లోక సంబంధమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తూ, శుభవార్తను వక్రం చేస్తున్నట్టున్నారు. 2 కోరింథీయులకు 11:4, 2 కోరింథీయులకు 11:13-15, 2 కోరింథీయులకు 11:18 చూడండి. దేవుని ఆలయాన్ని పాడు చేసేది అలాంటి ఉపదేశమే. తన పవిత్రమైన పనిని పాడు చేసేందుకు చూచే మనుషులతో దేవుడు చాలా కఠినంగా వ్యవహరిస్తాడన్న విషయంలో సందేహం అవసరం లేదు.

18. ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞానిఅగునట్టు వెఱ్ఱివాడు కావలెను.

“మోసగించుకోకూడదు”– 1 కోరింథీయులకు 6:9; 1 కోరింథీయులకు 15:33. “జ్ఞానిని”– దేవుని దృష్టిలో జ్ఞానవంతులెవరంటే లోక సంబంధమైన జ్ఞానాన్ని వెంటాడుతూ ఉండేవారు కాదు గాని దాన్ని త్రోసిపుచ్చి క్రీస్తు శుభవార్తలో నమ్మకం ఉంచేవారే. అయితే అలాంటివారు లోక సంబంధమైన జ్ఞానం ఉన్నవారి దృష్టిలో వెర్రివారు.

19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;
యోబు 5:13

1 కోరింథీయులకు 1:20; యోబు 5:13.

20. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.
కీర్తనల గ్రంథము 94:11

కీర్తనల గ్రంథము 94:11. మన సొంత జ్ఞానం వ్యర్థం, తెలివితక్కువతనం గనుక దాన్ని నిరాకరించుకోవాలి.

21. కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.

వ 4; 1 కోరింథీయులకు 1:12, 1 కోరింథీయులకు 1:29, 1 కోరింథీయులకు 1:31. మనుషులు దేవుని చేతిలో కేవలం సాధనాలు. ఆ సాధనాలను తయారు చేసి ఉపయోగిస్తున్న దేవునికే స్తుతి అంతా అర్పించాలి.

22. పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.

దేవుడు తన విశ్వాసుల మేలుకోసం తన సేవకులను నియమించాడు (వ 5; ఎఫెసీయులకు 4:11-13). విశ్వాసులను నాటి నీరు పోసి ఎదిగేలా చేసే పొలం ఈ భూమి అంతా. ఈ జీవితంలో జరిగే సంభవాలన్నీ వారి మేలుకోసమే పని చేస్తాయి (రోమీయులకు 8:28). చావు కూడా విశ్వాసులదే – వారి మర్త్య దేహం నుంచీ, పాపమంతటి నుంచి కష్టాలన్నిటి నుంచీ వారిని విడుదల చేసి, దేవునితో మరింత ఉన్నతమైన, ఉత్తమమైన జీవితానికి తలుపు తెరిచే మంచి బహుమానం అది. రాబోయే కాలంలో వచ్చేవి కూడా వారివే – వారు దేవుని వారసులు, క్రీస్తుతో కూడా వారసత్వం పంచుకునేవారు (రోమీయులకు 8:17; మత్తయి 5:5; ఎఫెసీయులకు 1:14; ప్రకటన గ్రంథం 21:7). అలాగైతే మనుషుల విషయంలో ఆ గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? ఒకరికన్నా మరొకరు గొప్ప చేసుకోవడం ఎందుకు?

23. మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.

విశ్వాసులు క్రీస్తుకు చెందినవారే గాని మనుషులకు చెందినవారు కారు (యోహాను 6:37, యోహాను 6:39; యోహాను 17:6). ఆయన విషయంలోనే వారు అతిశయించాలి (1 కోరింథీయులకు 1:31). క్రీస్తు దేవునికి చెందినవాడు – 1 కోరింథీయులకు 11:3; 1 కోరింథీయులకు 15:28; మత్తయి 3:17; యోహాను 3:16; యోహాను 14:28.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Corinthians I - 1 కొరింథీయులకు 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

కొరింథీయులు తమ వివాదాలకు మందలించారు. (1-4) 
సువార్త యొక్క ప్రాథమిక సత్యాలు, మానవత్వం యొక్క పాపభరితం మరియు దేవుని దయ, పశ్చాత్తాపం మరియు యేసుక్రీస్తుపై విశ్వాసం అవసరం, సంక్లిష్ట రహస్యాలను లోతుగా పరిశోధించడం కంటే ప్రజలతో మరింత ప్రభావవంతంగా ప్రతిధ్వనిస్తూ సరళమైన భాషలో ఉత్తమంగా తెలియజేయబడతాయి. విస్తృతమైన సిద్ధాంత జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పటికీ, వ్యక్తులు ఇప్పటికీ విశ్వాసం మరియు వ్యక్తిగత అనుభవం యొక్క ఆచరణాత్మక అంశాలలో నూతనంగా ఉండవచ్చు. మతపరమైన విషయాలపై వివాదాలు మరియు తగాదాలలో పాల్గొనడం ప్రాపంచిక ప్రవర్తన యొక్క విచారకరమైన అభివ్యక్తిని ప్రతిబింబిస్తుంది. నిజమైన మత విశ్వాసం వివాదానికి బదులు శాంతిని ప్రోత్సహిస్తుంది. దురదృష్టవశాత్తూ, క్రైస్తవ మతాన్ని అనుసరించేవారిగా చెప్పుకునే అనేకులు తరచుగా అందరిలాగే జీవిస్తూ, ప్రవర్తించడాన్ని గమనించడం చాలా నిరుత్సాహపరుస్తుంది. కొంతమంది బోధకులతో సహా అనేకమంది విశ్వాసులు తమ ప్రాపంచిక స్వభావాన్ని అహంకారపూరిత సంఘర్షణల ద్వారా, వాదాల పట్ల మక్కువతో మరియు ఇతరులను కించపరచడానికి మరియు విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారు.

క్రీస్తు యొక్క నిజమైన సేవకులు ఆయన లేకుండా ఏమీ చేయలేరు. (5-9) 
కొరింథీయులు వివాదాస్పదమైన పరిచారకులు దేవునిచే ఉపయోగించబడిన సాధనాలు మాత్రమే. మంత్రులను దేవుడి స్థాయికి ఎగబాకడం తప్పనిసరి. మొక్కలు నాటినవాడు మరియు నీరు పోసేవాడు ఇద్దరూ ఏకమై, ఒకే యజమానికి సేవ చేస్తూ, ఒకే విధమైన ద్యోతకంతో బాధ్యతలు నిర్వర్తించబడతారు, ఒక ఉమ్మడి పనిలో మునిగిపోతారు మరియు ఉమ్మడి ప్రయోజనానికి కట్టుబడి ఉంటారు. ప్రతి ఒక్కరు ఒకే ఆత్మ నుండి ప్రత్యేకమైన బహుమతులను కలిగి ఉంటారు, అదే లక్ష్యాల కోసం కేటాయించారు మరియు హృదయపూర్వకంగా అదే లక్ష్యాన్ని కొనసాగించాలి. ఎవరైతే ఎక్కువ కృషి చేస్తారో వారు ఉత్తమ ఫలితాలను పొందుతారు మరియు అత్యంత విశ్వసనీయతను ప్రదర్శించేవారు గొప్ప ప్రతిఫలాలను అందుకుంటారు. వారు దేవుని మహిమను మరియు విలువైన ఆత్మల మోక్షాన్ని అభివృద్ధి చేయడంలో అతనితో సహకరిస్తారు. వారి ప్రయత్నాల గురించి బాగా తెలిసిన దేవుడు వారి శ్రమ వృధా కాకుండా చూస్తాడు. వారు అతని సాగు మరియు నిర్మాణ ప్రయత్నాలలో భాగస్వాములు, మరియు అతను వారి పనిని శ్రద్ధగా పర్యవేక్షిస్తాడు.

అతను మాత్రమే పునాది, మరియు ప్రతి ఒక్కరూ అతను దానిపై ఏమి నిర్మిస్తాడో శ్రద్ధ వహించాలి. (10-15) 
అపొస్తలుడు తెలివైన మాస్టర్-బిల్డర్‌గా పనిచేశాడు, అతనికి శక్తినిచ్చిన దేవుని దయకు ధన్యవాదాలు. ఆధ్యాత్మిక గర్వం ఖండించదగినది; ఇది మన వ్యర్థాన్ని పోషించడానికి మరియు మనమే విగ్రహాలను నిర్మించుకోవడానికి దేవుని గొప్ప అనుగ్రహాలను ప్రభావితం చేస్తుంది. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి, గట్టి పునాదిపై పేలవమైన నిర్మాణానికి సంభావ్యతను గుర్తించాలి. ఫౌండేషన్ మద్దతు ఇవ్వలేని లేదా దాని స్వభావానికి విరుద్ధంగా ఉన్న ఏదీ జోడించకూడదు.
క్రైస్తవ మతం యొక్క వృత్తితో పాపం యొక్క అవినీతిని మిళితం చేయకుండా, పూర్తిగా మానవ లేదా శరీరానికి సంబంధించిన జీవనశైలిని దైవ విశ్వాసంతో కలపడం నుండి మనం దూరంగా ఉండాలి. క్రీస్తు యుగయుగాల అచంచలమైన శిలగా నిలుస్తాడు, దేవుడు లేదా పాపి విధించిన బరువును పూర్తిగా మోయగలడు. మోక్షం ఆయనలోనే ఉంది; అతని ప్రాయశ్చిత్తం యొక్క సిద్ధాంతం లేకుండా, మన ఆశలకు పునాది లేదు.
ఈ పునాదిపై ఆధారపడిన వారిలో, రెండు వర్గాలు ఉద్భవించాయి. కొందరు యేసులో అందించబడిన సత్యానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు మరియు మరేమీ బోధించరు. ఇతరులు, అయితే, పరీక్ష రోజు వచ్చినప్పుడు పరిశీలనను తట్టుకోలేని ఘనమైన పునాది మూలకాలపై నిర్మిస్తారు. మనలో మరియు ఇతరులలో మనం మోసపోయినప్పటికీ, ఎటువంటి దాపరికం లేకుండా మన చర్యలను వారి నిజమైన వెలుగులో బహిర్గతం చేసే రోజు ఆసన్నమైంది.
సత్యమైన మరియు స్వచ్ఛమైన మతాన్ని దాని అన్ని కోణాలలో ప్రచారం చేసేవారు మరియు వారి పని విచారణను సహించేవారు, వారు అర్హులైన దానికంటే గొప్ప బహుమతిని పొందుతారు. దీనికి విరుద్ధంగా, ఆరాధనలో అవినీతి అభిప్రాయాలు, సిద్ధాంతాలు లేదా తప్పుదోవ పట్టించే పద్ధతులు ఉన్నవారు ఆ రోజున వారి అబద్ధాలను బహిర్గతం చేస్తారు, తిరస్కరించబడతారు మరియు తిరస్కరించబడతారు. అలంకారిక అగ్నికి సంబంధించిన ఈ సూచన మతపరమైన ఆచారాలు లేదా సిద్ధాంతాలను అక్షరాలా నాశనం చేయడం కంటే పరీక్ష ప్రక్రియను నొక్కి చెబుతుంది. ఈ విచారణ పాల్ మరియు అపోలోస్ వంటి వ్యక్తుల పనులను కలిగి ఉంది, దేవుని వాక్యం వెలుగులో మన ప్రయత్నాల దిశను అంచనా వేయమని మరియు స్వీయ-తీర్పులో నిమగ్నమవ్వమని మనల్ని ప్రోత్సహిస్తుంది, తద్వారా మనం ప్రభువు నుండి తీర్పును ఎదుర్కోకూడదు.

క్రీస్తు చర్చిలు స్వచ్ఛంగా ఉంచబడాలి మరియు వినయంగా ఉండాలి. (16,17) 
లేఖనంలోని ఇతర విభాగాలలో, కొరింథీయులలోని తప్పుడు బోధకులు దుర్మార్గమైన సిద్ధాంతాలను ప్రచారం చేశారని స్పష్టమవుతుంది. అటువంటి బోధనలు కలుషితం, అపవిత్రం మరియు నిర్మాణం యొక్క పవిత్రతను అణగదొక్కే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి, ఇది దేవునికి స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనదిగా నిర్వహించబడుతుంది. దేవుని చర్చి యొక్క పవిత్రతకు భంగం కలిగించే నిర్లక్ష్య సూత్రాలను వ్యాప్తి చేసే వారు చివరికి తమ మీద తాము నాశనం చేసుకుంటారు.
క్రీస్తు, తన ఆత్మ ద్వారా, నిజమైన విశ్వాసులందరిలో నివసిస్తున్నాడు. క్రైస్తవులు వృత్తి ద్వారా తమ పవిత్రతను ప్రకటిస్తారు మరియు హృదయం మరియు ప్రవర్తన రెండింటిలోనూ స్వచ్ఛత మరియు పరిశుభ్రతను కలిగి ఉండాలని భావిస్తున్నారు. ఎవరైనా తమను తాము పరిశుద్ధాత్మ దేవాలయంగా భావించి, వ్యక్తిగత పవిత్రత లేదా చర్చి యొక్క శాంతి మరియు స్వచ్ఛత పట్ల ఉదాసీనంగా ఉంటారు.

మరియు వారు మనుష్యులలో కీర్తించకూడదు, ఎందుకంటే పరిచారకులు మరియు మిగతావన్నీ క్రీస్తు ద్వారా వారివి. (18-23)
మన స్వంత జ్ఞానం గురించి ఉన్నతమైన అభిప్రాయాన్ని కలిగి ఉండటం కేవలం స్వీయ ముఖస్తుతి, మరియు ఈ స్వీయ-వంచన సులభంగా అనుసరించవచ్చు. ప్రాపంచిక వ్యక్తులు అత్యంత గౌరవించే జ్ఞానాన్ని దేవుడు మూర్ఖత్వంగా పరిగణిస్తాడు, అతను దానిని న్యాయంగా అసహ్యించుకోగలడు మరియు అప్రయత్నంగా గందరగోళానికి గురిచేస్తాడు. చాలా తెలివిగల వ్యక్తుల ఆలోచనలు కూడా వ్యర్థం, బలహీనత మరియు మూర్ఖత్వం వంటి అంశాలను కలిగి ఉంటాయి. ఇది మనలో వినయాన్ని పెంపొందించాలి మరియు క్రీస్తు ద్వారా వెల్లడి చేయబడిన సరళమైన సత్యాల నుండి మనలను మళ్లించే మానవ జ్ఞానం మరియు నైపుణ్యం యొక్క ఆకర్షణను తప్పించి, దేవునిచే ఉపదేశించబడాలనే సుముఖతను పెంపొందించాలి.
దేవుని దయ యొక్క ఉద్దేశ్యాన్ని ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంది. నిజమైన విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక సంపదను పరిగణించండి; మంత్రులు మరియు ఆర్డినెన్స్‌లతో సహా "అన్నీ మీదే". ఇంకా, ప్రపంచం కూడా వారి పారవేయడం వద్ద ఉంది. సాధువులు అనంతమైన జ్ఞానానికి తగినట్లుగా భావిస్తారు మరియు వారు దానిని దైవిక ఆశీర్వాదంతో స్వీకరిస్తారు. జీవితం వారికి చెందినది, స్వర్గపు జీవితానికి సిద్ధమయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది మరియు పాపం మరియు దుఃఖం నుండి వారి తండ్రి ఇంటికి దయగల మార్గదర్శిగా మరణం వారిది. ప్రయాణంలో మద్దతు కోసం ప్రస్తుత పరిస్థితులు వారివి మరియు ప్రయాణం ముగింపులో శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే భవిష్యత్తు అవకాశాలు వారివి. మనం క్రీస్తుకు చెందినవారమై, ఆయన పట్ల యథార్థంగా ఉంటే, మంచిదంతా మనకే చెందుతుంది మరియు మనకు హామీ ఇవ్వబడుతుంది. విశ్వాసులు అతని రాజ్యంలో ఉన్నారు, అతని ఆధిపత్యాన్ని అంగీకరిస్తారు మరియు అతని ఆదేశాలకు ఇష్టపూర్వకంగా లొంగిపోతారు. సువార్త యొక్క సారాంశం దేవునిలో ఉంది, క్రీస్తు ద్వారా, పాపభరిత ప్రపంచాన్ని తనతో పునరుద్దరించుకోవడం మరియు రాజీపడిన ప్రపంచంపై అతని దయ యొక్క సంపదను పోయడం.



Shortcut Links
1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |