Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో
1. And it chanced within a while, that Amraphel king of Sinear, Arioch king of Ellasar, Kedorlaomer king of Elam and Thydeall king of the nations:
2. వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొఱ్ఱా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి.
2. made war with Bera king of Sodom, and with Birsa king of Gomorra. And with Sineab king of Adama, and with Semeaber king of Zeboim, and with the king of Bela which Bela is called Zoar.
3. వీరందరు ఉప్పు సముద్రమైన సిద్దీములోయలో ఏకముగా కూడి
3. All these came together unto the vale of Siddim, which is now the salt sea.
4. పండ్రెండు సంవత్సరములు కదొర్లా యోమెరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి.
4. Twelve year were they subject to king Kedorlaomer, and in the thirteenth year rebelled.
5. పదునాలుగవ సంవత్సరమున కదొర్లా యోమెరును అతనితో కూడనున్న రాజులును వచ్చి అష్తారోత్ కర్నాయిములో రెఫాయీయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో
5. Therefore in the fourteenth year came Kedorlaomer and the kings that were with him, and smote the Raphaims in Astaroth Karnaim, and the Susims in Ham, and the Emims in Sabe Kariathaim,
6. ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత
6. and the Horims in their own mount Seir unto the plain of Pharan, which bordereth upon the wilderness.
7. తిరిగి కాదేషను ఏన్మిష్పతుకువచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడ కొట్టిరి.
7. And then turned they and came to the well of judgement which is Cades, and smote all the country of the Amalekites, and also the Amorites that dwell in Hazezon Thamar.
8. అప్పుడు సొదొమ రాజును గొమొఱ్ఱా రాజును అద్మా రాజును సెబోయీము రాజును సోయరను బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో,
8. Then went out the king of Sodom, and the king of Gomorra, and the king of Adama and the king of Zeboiim, and the king of Bela now called Zoar. And set their men in array to fight with them in the vale of Siddim, that is to say,
9. అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ యైదుగురు రాజులు యుద్ధము చేసిరి.
9. with Kedorlaomer the king of Elam and with Thydeall king of the Nations, and with Amraphel king of Sinear. And with Arioch king of Ellasar: four kings against five.
10. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొఱ్ఱాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి.
10. And that vale of Siddim was full of slime pits. And the kings of Sodom and Gomorra fled, and fell there. And the residue fled to the mountains.
11. అప్పుడు వారు సొదొమ గొమొఱ్ఱాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నియు పట్టుకొని పోయిరి.
11. And they took all the goods of Sodom and Gomorra and all their vitailles, and went their way.
12. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపుర ముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొనిపోగా
12. And they took Lot also Abram's brother's son and his goods (for he dwelled at Sodom) and departed.
13. తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసికొనినవారు.
13. Then came one that had escaped, and told Abram the Hebrew which dwelt in the oak grove of Mamre the Amorite, brother of Eschol and Aner: which were confederate with Abram.
14. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన యింట పుట్టి అలవరచబడిన మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను.
14. When Abram heard that his brother was taken, he harnessed his servants born in his own house three hundred and eighteen, and followed till they came at Dan.
15. రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న హోబా మట్టుకు తరిమి
15. And set himself and his servants in array, and fell upon them by night, and smote them, and chased them away unto Hoba: which lieth on the left hand of Damasco,
16. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను.
16. and brought again all the goods and also his brother Lot, and his goods, the women also and the people.
17. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను.హెబ్రీయులకు 7:1-3
17. And as he returned again from the slaughter of Kedorlaomer and of the kings that were with him, then came the king of Sodom against(to meet) him unto the vale of Saue which now is called king's dale.
18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.
18. Then Melchisedech king of Salem brought forth bread and wine. And he being the priest of the most highest God, blessed him saying:
19. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు,ప్రకటన గ్రంథం 10:5, హెబ్రీయులకు 7:4-6-10
19. Blessed be Abram unto the most highest God, possessor of heaven and earth.
20. నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్ని టిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.లూకా 18:12, హెబ్రీయులకు 7:4-6-10
20. And blessed be God the most highest, which hath delivered thine enemies into thy hands. And Abram gave him tithes of all.
21. సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసికొనుమని అబ్రాముతో చెప్పగా
21. Then said the king of Sodom unto Abram: Give me the souls, and take the goods to thy self.
22. అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీవాటిలో ఏదైనను తీసికొనననిప్రకటన గ్రంథం 10:5
22. And Abram answered the king of Sodom: I lift up my hand unto the LORD God most high possessor of heaven and earth,
23. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా యెదుట నా చెయ్యి యెత్తి ప్రమాణము చేసియున్నాను.
23. that I will not take of all that is thine, so much as a thread or a shoe latchet, lest thou shouldest say I have made Abram rich.
24. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడ వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏయే భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసికొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను.
24. Save only that which the young men have eaten and the parts of the men which went with me. Aner, Eschol and Mamre. Let them take their parts.