Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.
“దర్శనం”– బైబిల్లో సుమారు 100 సార్లు ఉన్న ఈ పదం ఇక్కడ మొదటిసారి కనిపిస్తున్నది. హీబ్రూ లో ఈ పదానికి “చూడడం”, “తేరిచూడడం” అనే అర్థాలున్నాయి. దేవుడు తన ప్రవక్తలకు అనేక సార్లు దర్శనాల ద్వారా సంగతులు వెల్లడించాడు. కొన్ని సార్లు కలలద్వారా, మరి కొన్ని సార్లు ప్రవక్త మేలుకుని ఉండగానే పరవశమైన స్థితిలోకి వెళ్ళడం ద్వారా ఈ దర్శనాలు కలిగాయి. వీరు కొన్ని సార్లు సంకేత రూపకాలైన ఆకారాలనూ పోలికలనూ చూస్తూ దేవుడు తన సంకల్పాన్ని వెల్లడిస్తూ మాట్లాడితే వినేవారు. “డాలు”– దేవుడే అబ్రాహాముకు డాలు. అబ్రాహామును హాని చేయదలచుకొన్నవారెవరన్నా ముందు దేవుణ్ణి దాటుకొని వెళ్ళాలి. ఇది దేవుని ప్రజలందరి విషయంలోనూ సత్యమే. ద్వితీయోపదేశకాండము 33:29 యోబు 1:10 కీర్తనల గ్రంథము 28:7 కీర్తనల గ్రంథము 115:9-11 పోల్చి చూడండి. “ప్రతిఫలం”– దేవుడే అబ్రాహాముకు “ప్రతిఫలం” – అతడి గొప్ప నిధి నిక్షేపాలు ఆయనే. మన సంపద దేవునిలో ఉంటే, అది దేవుడే అయితే, ఎవరైనా కన్నం వేసి దొంగిలించే ప్రమాదం లేదు (మత్తయి 6:19-21). ఇది ఎంత గొప్ప నిధి! (సంఖ్యాకాండము 18:20 ద్వితీయోపదేశకాండము 10:9 కీర్తనల గ్రంథము 73:26 ఎఫెసీయులకు 1:3 ఎఫెసీయులకు 2:7 ఎఫెసీయులకు 3:8 1 పేతురు 1:4).
2. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా
“యెహోవా, ప్రభూ”– దీనికి హీబ్రూ పదాలు “అదొనాయ్ యెహోవా”. హీబ్రూ భాష పాత ఒడంబడిక గ్రంథంలో ఈ పేరు 400 కంటే ఎక్కువ సార్లు వాడారు. అదొనాయ్ అంటే ప్రభువు, యజమాని, పరిపాలకుడు. అదొనాయ్ భూమి అంతటికీ ప్రభువు (యెహోషువ 3:11), ప్రభువులకు ప్రభువు (ద్వితీయోపదేశకాండము 10:17). దీనికి గ్రీకు పదం కురియొస్. ఇది క్రొత్త ఒడంబడిక గ్రంథంలో యేసు క్రీస్తుకు వాడిన బిరుదు నామం. అబ్రాహాము యెహోవాను తన యజమానిగా, అన్నిటికీ ప్రభువుగా గుర్తిస్తున్నాడు. తనకు కుమారుణ్ణి అనుగ్రహించగల శక్తివంతుడుగా గుర్తిస్తున్నాడు.
3. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా
అబ్రాహాముకు సంతానం లేకపోతే తన ఆస్తిని వేరొకరికి ధారాదత్తం చేయడం కన్నా అతడు చేయగలిగినది లేదు. ఇందుకు అతడు ఎలియాజరును మనసులో పెట్టుకున్నాడని అర్థమౌతున్నది.
4. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.
అబ్రాహాము భార్య శారై గొడ్రాలుగా ఉన్నప్పుడు (ఆదికాండము 11:30), పైగా పిల్లల్ని కనే వయసు దాటిపోయిన తరువాతా (హెబ్రీయులకు 11:11), దేవుడు అతనికి ఒక వారసుణ్ణి ఇస్తానని మాట ఇచ్చాడు. మానవపరంగా వారికి పిల్లలు కలగడం అసాధ్యం. అయితే దేవుడు దేన్నైనా సాధ్యం చెయ్యగలడు. మనుషులకు అసాధ్యమైనవి ఆయనకసలు లెక్కేలేదు (ఆదికాండము 18:14 యిర్మియా 32:17 యిర్మియా 32:27 లూకా 1:37).
5. మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను.రోమీయులకు 4:18, హెబ్రీయులకు 11:12
6. అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.రోమీయులకు 4:3-9-22-2, గలతియులకు 3:6, యాకోబు 2:23
ఇది బైబిల్లోని మూలవాక్కుల్లో ఒకటి. కొత్త ఒడంబడిక మూడు పుస్తకాల్లో ఇది తిరిగి రాయబడింది (రోమీయులకు 4:3 రోమీయులకు 4:9 రోమీయులకు 4:22 గలతియులకు 3:6 యాకోబు 2:23). దేవుడు అబ్రాహాము భక్తి కారణంగా గానీ దేవుని పిలుపుకు అతడు చూపిన విధేయత కారణంగా గానీ కాక అతడి నమ్మకాన్ని బట్టే అతణ్ణి నిర్దోషిగా ఎంచాడు. మనందరిలాగానే తనకు తానుగా అబ్రాహాము పాపి. మనుషులు తమను తాము పవిత్రులుగా మార్చుకోలేరు, తమలో న్యాయవంతమైన స్వభావాన్ని సృష్టించుకోలేరు. తమ సత్కార్యాలమీద ఆధారపడి దేవుని ఎదుట నిలబడలేరు (యెషయా 64:6 యిర్మియా 13:23 రోమీయులకు 3:10-12 రోమీయులకు 3:19). దేవునిపై నమ్మకం ఉంచి, ఆయన వాగ్దానాలను విశ్వసిస్తే, మన నమ్మకాన్ని దేవుడు నీతిన్యాయాలుగా పరిగణిస్తాడు (రోమీయులకు 3:22 రోమీయులకు 5:1 రోమీయులకు 10:10 ఫిలిప్పీయులకు 3:9 హెబ్రీయులకు 11:7). తన లోపరహితమైన నీతిన్యాయాలను మనకు ధరింపజేస్తాడు – యెషయా 61:10 1 కోరింథీయులకు 1:30 2 కోరింథీయులకు 5:21. ఆదికాండము 3:21. దేవుడు అబ్రాహామును చేసినట్టు మనల్ని కూడా ఈ విధంగా తన సన్నిధికి తగినవారుగా చేస్తాడు – మనమాయనను నమ్మితే.
7. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు
ఆదికాండము 11:31 ఆదికాండము 12:1
8. అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియుననగా
దేవుడు తనకో కొడుకునిస్తాడని అబ్రాహాము నమ్మాడు. అయితే కనానుదేశం గురించి తన నమ్మకం వృద్ధి చెందేలా దేవునినుంచి ఏదన్నా సూచన కోరాడు. ఈ కారణంగా దేవుడు అతణ్ణి మందలించలేదు. న్యాయాధిపతులు 6:17 న్యాయాధిపతులు 6:36-40 2 రాజులు 20:8-11 యెషయా 7:11 యెషయా 7:14 యెషయా 37:30 లూకా 1:18 కూడా చూడండి.
9. ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.
లేవీయకాండము 1:2 లేవీయకాండము 1:10 లేవీయకాండము 1:14-17 సంఖ్యాకాండము 19:2.
10. అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు
11. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను.
12. ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా
ఇదంతా అబ్రాహాముకు కలలో కనిపించింది. బైబిలు కాలాల్లో దేవుడు మనుషులకు సత్యాన్ని తెలియజేసిన పద్ధతుల్లో ఇదొకటి. ఆదికాండము 20:3 ఆదికాండము 28:12 ఆదికాండము 31:24 ఆదికాండము 37:5 ఆదికాండము 40:5 చూడండి. సంఖ్యాకాండము 12:6 ద్వితీయోపదేశకాండము 13:1 నోట్స్ చూడండి.
13. ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.అపో. కార్యములు 7:6
నిర్గమకాండము 1:11 నిర్గమకాండము 1:14 నిర్గమకాండము 2:23 ద్వితీయోపదేశకాండము 5:15.
14. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.అపో. కార్యములు 7:7
నిర్గమకాండము 3:19-22 నిర్గమకాండము 6:6 నిర్గమకాండము 7:4 నిర్గమకాండము 9:13-16 నిర్గమకాండము 12:32-38.
15. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.
ఆదికాండము 25:7-8
16. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.1 థెస్సలొనీకయులకు 2:16
“నాలుగో తరం”– 13వ వచనంలో 400 సంవత్సరాలని ఉంది. ఈ కాలంలో కంటే అబ్రాహాము రోజుల్లో మనుషులు ఎక్కువ కాలం బతికేవారు. కాబట్టి “తరం” అంటే ఇప్పటికంటే ఆ రోజుల్లో ఎక్కువ సంవత్సరాలు ఉండేది. అబ్రాహాము 175 సంవత్సరాలు, ఇస్సాకు 180, యాకోబు 147, యోసేపు 110 సంవత్సరాలు జీవించారు. “అమోరీ ప్రజలు”– ఆదికాండము 10:15-16 ఆదికాండము 14:7. అబ్రాహాము అక్కడికి రాకమునుపు వీళ్ళు కనానులో ఉంటుండేవాళ్ళు.
17. మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.
పురాతన కాలాల్లో ఏదైనా గంబీరమైన ఒడంబడిక చేసుకునేటప్పుడు కొన్ని సార్లు ఒక జంతువును చంపి దాన్ని రెండు ముక్కలుగా చేసేవారు. అప్పుడు ఒడంబడిక చేసుకునేవారు ఆ రెండు భాగాల మధ్య గుండా నడిచి వెళ్ళేవారు. యిర్మియా 34:18-19 చూడండి. ఇక్కడ దేవుడు తానే మంటల్లాగా ఈ జంతు ఖండాల మధ్య నడిచాడు. మంటలు దేవునికి గుర్తుగా ఉన్న విషయం గురించి నిర్గమకాండము 3:2 లో చూడండి.
18. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగాఅపో. కార్యములు 7:5, ప్రకటన గ్రంథం 9:14, ప్రకటన గ్రంథం 16:12
కనానుదేశాన్ని అబ్రాహాము సంతతికి ఇస్తానని ఇప్పుడు దేవుడు గంబీరమైన ఒడంబడిక చేస్తున్నాడు (ఆదికాండము 13:14-17 ఆదికాండము 17:1-8 ఆదికాండము 22:17 ఆదికాండము 26:4 ఆదికాండము 28:13-15). ఆ దేశంలో అనేక బలమైన జాతులు నివసిస్తూ ఉన్నాయి. కానీ ఎప్పటి మాదిరిగానే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకొన్నాడు. యెహోషువ 21:43-45 1 రాజులు 4:20-21 చూడండి.
19. కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను
20. హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను
21. అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.