Genesis - ఆదికాండము 2 | View All

1. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను.

“పని...మానుకున్నాడు”– దేవుడు అలసిపోడు (యెషయా 40:28). తాను చేయదలచిన పని ముగించాడు కాబట్టి తన కార్యకలాపాన్ని చాలించాడు అంతే. మానవుడు అనుసరించాలని ఇక్కడ ఆయనొక సూత్రాన్ని నియమిస్తున్నాడు – ఆరు రోజుల పని తరువాత ఒక రోజు విశ్రాంతి (నిర్గమకాండము 20:8-11).

2. దేవుడు తాను చేసిన తన పని యేడవ దినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.
హెబ్రీయులకు 4:4-10

3. కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.
మత్తయి 12:8

4. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.

ఆదిలో భూమిమీద ఉన్న పరిస్థితులకూ ఇప్పటి పరిస్థితులకూ ఎంతో తేడా ఉన్న సంగతి స్పష్టమే. “యెహోవా”– ఇది పాత ఒడంబడికలో దేవుని పేర్లన్నిటిలో ఎక్కువ సార్లు వాడబడిన నామం. ఇది 6000 కంటే ఎక్కువ సార్లు ఉంది. ఈ పేరుకు అర్థం కోసం నిర్గమకాండము 3:14. “దినం”– బైబిల్లో ఈ పదాన్ని కనీసం నాలుగు సందర్భాల్లో వాడడం కనిపిస్తున్నది. పగలు సమయం – ఆదికాండము 1:5 ఆదికాండము 1:14 యోహాను 11:9. ఇరవై నాలుగు గంటల కాలవ్యవధి – మత్తయి 17:1 లూకా 24:21. మరింత ఎక్కువ కాల పరిమితి – యెషయా 34:8 యోహాను 9:4. 2 పేతురు 3:8 కూడా పోల్చి చూడండి. “దినం” ఉపమానరీతిగా కూడా వాడారు – 1 థెస్సలొనీకయులకు 5:5 1 థెస్సలొనీకయులకు 5:8.

5. అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటుకు నరుడు లేడు

హీబ్రూ భాషలో ఈ వచనం అర్థం చేసుకోవడం కష్టం. ఆదికాండము 1:9 కు ముందున్న పరిస్థితులను గురించి ఈ వచనం మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ దీన్ని ఈ విధంగా కూడా అనువదించవచ్చు – “భూమినుంచి ఆవిరి లేస్తూ నేలంతా తడిపింది.”

6. అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను.

7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
1 కోరింథీయులకు 15:45-47, 1 తిమోతికి 2:13

ఇది దేవుడు జరిగించిన మనిషి సృష్టి గురించిన రెండో వివరణ. మొదటి వివరణకూ దీనికీ విరుద్ధం ఏమీ లేదు గాని ఇది మరింత సమాచారాన్ని దానికి జోడిస్తూ ఉంది. మనిషి దేహం నేలలో దొరికే మూలకాలతో నిర్మితం అయింది. (ఆదికాండము 3:19). అయితే మనిషి కేవలం శరీరి మాత్రమే కాదు. మనిషికి శరీరం, ఆత్మ రెండూ ఉన్నాయి (ప్రసంగి 12:7 కీర్తనల గ్రంథము 31:5 లూకా 16:22-23 అపో. కార్యములు 7:59 2 కోరింథీయులకు 5:6-8 హెబ్రీయులకు 12:22-23 ప్రకటన గ్రంథం 6:911.మనిషి శరీర నిర్మాణంలో అంతకుముందే ఉనికిలో ఉన్న పదార్థాలను దేవుడు ఉపయోగించాడు. వృక్షాలనూ జంతుజాలాన్నీ చేసేందుకు అంతకుముందున్న పదార్థాలనూ ఉపయోగించాడో లేదో తెలియదు. ఈ విషయం దేవుడు మనకు వెల్లడి చేయలేదు.

8. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.
ప్రకటన గ్రంథం 2:7

(Gen2 10-14:1) వచనాల్లో కనిపిస్తున్న సమాచారాన్ని బట్టి ఏదెను ఎక్కడ ఉందో కొంతవరకు గ్రహించవచ్చు. టైగ్రస్, యూఫ్రటీస్ నదులు నేటి ఇరాక్ దేశం గుండా ప్రవహించి పర్షియా అగాధంలో కలుస్తున్నాయి. పీషోను, గీహోను అనే మిగతా నదుల గురించిన వివరాలు ఎవరికీ తెలియవు. ఇప్పుడవి ఉనికిలో లేవేమో. 13వ వచనంలో ఉన్న కూషు అనే ప్రదేశం నేటి ఇతియోపియా కాదు. ఇరాక్ ప్రాంతంలో ఉన్న అదే పేరు గల మరో ప్రదేశం.

9. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను.
ప్రకటన గ్రంథం 2:7, ప్రకటన గ్రంథం 22:14-19, ప్రకటన గ్రంథం 22:2

జీవవృక్షం, మేలు కీడులు తెలిపే వృక్షం అంటే ఎలాంటివో మనకు తెలియదు. ఈ చెట్ల పండ్లు తింటే కలిగే ఫలితాలు ఏమిటో మాత్రమే తెలుసు. ఒక దాని ఫలం జీవాన్ని ఇచ్చేది. మరొక దాని ఫలం విశేషమైన గ్రహింపు ఇచ్చేది. ఇది జ్ఞానం కాదు గాని మంచి చెడుల గురించిన అనుభవపూర్వకమైన తెలివి. ఈ రెండు చెట్లూ మంచివే (ఆదికాండము 1:31). చెడ్డదాన్ని దేవుడు ఎన్నడూ చేయలేదు.

10. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలుదేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.

11. మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది.

12. ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును.

13. రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.

14. మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు

“హిద్దెకెలు”– పశ్చిమ ఆసియాలోని టైగ్రిస్ నది.

15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.

ఈ దృశ్యం అతి సుందరం – దేవుడూ మానవుడూ ఒకరితో ఒకరు శాంతిగా ఉండి సంభాషణలు అన్యోన్య సహవాసం అనుభవిస్తున్నారు. మానవునికి దేవుడు తెలుసు. దేవునితో నడిచాడు. మానవుడు తోటలో, అందమైన పరిసరాల్లో, ఏ కొదువా లేకుండా ఆహ్లాదకరమైన పని చేసుకుంటూ ఉండాలన్నది అతని విషయంలో దేవుని ఉద్దేశం. మానవుణ్ణి ఆయన ఎంతో ఉన్నతమైన ఆశయం, గమ్యం కోసం సృష్టించాడు. దేవుని భూమిపై పాలకుడు మనిషి ఆదికాండము 1:28 కీర్తనల గ్రంథము 8:5-6. పని లేనివాడుగా ఉండేందుకు దేవుడు మనిషిని సృష్టించలేదు.

16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును;

17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.
రోమీయులకు 5:12

దేవుడు సృష్టికర్త, విశ్వానికి ప్రభువు. తాను సృష్టించినవారికి ఆజ్ఞలిచ్చేందుకూ వారి ప్రేమనూ విధేయతనూ పరీక్షించేందుకూ ఆయనకు సంపూర్ణమైన హక్కు, అధికారం ఉన్నాయి. మొదటి మానవునికి ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఒక చెట్టు పండును తినరాదు. ఒక వేళ ఈ ఆజ్ఞ మరో దాని విషయంలో అయివున్నా అర్థం మాత్రం ఒకటే. ఆ అర్థాన్ని ఈ మాటల్లో చెప్పవచ్చు: “నేను దేవుణ్ణి, నువ్వు మనిషివి. అన్నిటికంటే ఎక్కువగా, మరి దేనినైనా ఎవరినైనా ప్రేమించేకంటే ఎక్కువగా నన్ను ప్రేమించడం, సంపూర్ణంగా నామీద నమ్మకం ఉంచి సంతోషంగా నాకు లోబడడమే నీ ఆధిక్యత, నీ బాధ్యత. నీవు అలా చెయ్యకపోతే చనిపోతావు.” “చస్తావు”– బైబిల్లో మరణం గురించి మొట్టమొదటి సారి కనిపించడం. ఇది మానవుడి అవిధేయత, పాపం ఫలితంగా వచ్చిన సంగతిని 3వ అధ్యాయంలో చూస్తాం. మరణం అంటే ఎడబాటు. దేవునినుంచి మానవుడికి కలిగిన ఆధ్యాత్మిక ఎడబాటు (ఎఫెసీయులకు 2:1 ఎఫెసీయులకు 2:5) లేదా భౌతికంగా శరీరానికీ, ప్రాణానికీ ఎడబాటు (ప్రసంగి 12:7). రోమీయులకు 5:12 రోమీయులకు 6:23 యాకోబు 1:15.

18. మరియు దేవుడైన యెహోవా - నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.
1 కోరింథీయులకు 11:9

ఇది ప్రత్యేకంగా ఆదాముకు సంబంధించిన మాట. వ్యాకరణపరంగా కూడా ఆ ఒక్క మనిషిని ఉద్దేశించి పలికినట్టుగా ఉంది. మానవజాతి అభివృద్ధి చెందాలంటే ఇతనికి భార్య ఉండాలి. కానీ ఇప్పుడు ప్రతీ వ్యక్తి వివాహమాడి మానవజాతిని అభివృద్ధి చేయనక్కరలేదు. మనిషికి భార్య ఉండాలన్నది సాధారణ నియమం గానీ అన్ని సందర్భాల్లోనూ ఇది వర్తించదు (1 కోరింథీయులకు 7:26-27). అయితే ఈ ప్రథమ మానవుడి విషయంలో ఇది అత్యంత అవసరం.

19. దేవుడైన యెహోవా - ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.

“నేలనుంచి”– జంతుకోటి అంతా మొదట్లో నీటినుంచే ఉత్పత్తి కాలేదు. ఇది 1:24లో చెప్పినదాన్నే మరింత వివరంగా చెప్తున్న సందర్భం అయివుండే అవకాశం ఉంది. “ఇంతకుముందే చేసి” అని కూడా దీన్ని అనువదించవచ్చు. “తీసుకువచ్చాడు”– దేవుడు ఆదాముకు ఏదో ఒక ఆకారంలో అంటే దేవదూతలాగానో మానవాకారంలోనో కనిపించేవాడు. అతనితో సహవాసం చేసేందుకూ ముచ్చటించేందుకూ వచ్చేవాడు. (John 1:18) లో ఎప్పుడూ ఏ మనిషీ దేవుణ్ణి చూడలేదని రాసి ఉంది. అంటే (1 తిమోతికి 6:16) లో వర్ణించిన దేవుని ఆత్మరూపంలో ఆయన్నెవరూ చూడలేదు. కానీ పాత ఒడంబడికలో అప్పుడప్పుడూ ఆయన దేవదూత రూపంలో, మానవుడి రూపంలో కనిపించాడు. కొత్త ఒడంబడికలో ఉన్నట్టుగా యేసుక్రీస్తుగా కనిపించాడు. (ఆదికాండము 16:7).

20. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను.

మొదటినుంచి కూడా మానవుడికి భాషా సామర్థ్యత, పదాలు ఉపయోగించే జ్ఞానం ఉన్నాయి. ఈ వరం అతని పుట్టుకతోనే వచ్చింది.

21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.
1 కోరింథీయులకు 11:8

స్త్రీ కూడా జీవపరిణామం మూలంగా వచ్చింది కాదు. ఆమె కూడా దేవుని ప్రత్యేక సృష్టే (1 కోరింథీయులకు 11:8-12).

22. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.
1 తిమోతికి 2:13

23. అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.

మొదట్నుంచి దేవుడు ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే పెళ్ళి కట్టడి చేశాడు (మార్కు 10:7-8 ఎఫెసీయులకు 5:28-33).

24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
మత్తయి 19:5, మార్కు 10:7-8, 1 కోరింథీయులకు 6:16, ఎఫెసీయులకు 5:31

25. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి.

ఆదికాండము 3:7 ఆదికాండము 3:10-11



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
మొదటి సబ్బాతు. (1-3) 

దేవుడు ఆరు రోజులలో ప్రతిదీ సృష్టించాడు మరియు తరువాత సృష్టించడం మానేశాడు. అతను కొన్నిసార్లు అద్భుతాలు చేస్తాడు, కానీ అతను సాధారణంగా పని చేసే విధానాన్ని మార్చడు. దేవుడు సృష్టించడం మానేసినప్పుడు, అతను అలసిపోలేదు, అతను చేసిన దానితో అతను సంతోషంగా ఉన్నాడు. అతను ఏడవ రోజును విశ్రాంతి మరియు ఆరాధన కోసం ప్రత్యేకమైన రోజుగా చేసాడు మరియు ఇది మనమందరం చేయవలసిన పని. మొదటి వ్యక్తులు, ఆదాము మరియు హవ్వ, సబ్బాతు రోజును మొదటిసారిగా పాటించారు, మరియు యేసు మనలను రక్షించే పనిని పూర్తి చేసినందుకు క్రైస్తవులుగా మనం ఇప్పటికీ దానిని పాటిస్తున్నాము.

సృష్టి గురించిన విశేషాలు. (4-7) 

దేవునికి "యెహోవా" అనే పేరు ఉంది మరియు ప్రపంచంలోని ప్రతిదాన్ని ఆయనే సృష్టించాడని అది చూపిస్తుంది. అతను మాకు సహాయం చేయడానికి మొక్కలు మరియు వర్షం కురిపించాడు. మనకు కావాల్సినవన్నీ మన దగ్గర లేకపోయినా దేవుని ఆదుకుంటాడని నమ్మాలి. మన ఆత్మలు ముఖ్యమైనవి మరియు మన శరీరాలు కాకుండా వాటిపై దృష్టి పెట్టాలి. ఒక రోజు, మన ఆత్మలను మనం ఎలా ఉపయోగించుకున్నామో దేవునికి చెప్పవలసి ఉంటుంది, కాబట్టి మనం వాటిని బాగా చూసుకోవాలి.

ఏదేను తోట నాటడం. (8-14) 

దేవుడు ఆదాము నివసించడానికి ఒక తోటను ఎంచుకున్నాడు, ఒక ఫాన్సీ ప్యాలెస్ కాదు. సాధారణ విషయాలతో సంతోషంగా ఉండటమే మంచిది మరియు ఎల్లప్పుడూ ప్రదర్శనలు ఇవ్వకూడదు. ప్రకృతి తనకు అవసరమైన దానితో సంతోషంగా ఉంటుంది, కానీ తమ గురించి మాత్రమే శ్రద్ధ వహించే వ్యక్తులు ఎల్లప్పుడూ ఎక్కువ కోరుకుంటారు మరియు ఎప్పుడూ సంతృప్తి చెందరు. దేవుడు చేసిన వస్తువులు మాత్రమే మన ఆత్మలను నిజంగా సంతోషపెట్టగలవు. ఆదాము నివసించిన తోటను ఏదేను అని పిలిచేవారు మరియు అందులో అతనికి కావలసినవన్నీ మరియు మరిన్ని ఉన్నాయి. దేవుడు ఆదాము సంతోషంగా ఉండాలని మరియు అతని జీవితాన్ని ఆనందించాలని కోరుకున్నాడు. మనకు మంచి విషయాలు ఉన్నప్పుడు, మనం కృతజ్ఞతతో ఉండాలి మరియు దేవుని సేవ చేయడానికి వాటిని ఉపయోగించాలి. ఏదేను‌లో రెండు ప్రత్యేకమైన చెట్లు ఉన్నాయి. 1. తోటలో ఒక ప్రత్యేకమైన చెట్టు ఉంది, అది మనకు ఆహారం ఇస్తుంది మరియు జీవించడానికి సహాయపడుతుంది. యేసు ఇప్పుడు ఆ చెట్టులా ఉన్నాడు, మన జీవితాలను ఉత్తమంగా గడపడానికి సహాయం చేస్తున్నాడు. యోహాను 6:48-51. 2. దేవుడు తోటలో రెండు ప్రత్యేకమైన చెట్లను చేశాడు. ఒకటి మంచి చెడుల జ్ఞానం యొక్క చెట్టు అని పిలువబడింది. ఈ చెట్టు ప్రజలకు ఏది ఒప్పు మరియు తప్పు అని బోధించగలదు. ఈ చెట్టు పండు తినకపోవడమే మంచిదని, దాని కాయలు తినడం చెడ్డదని దేవుడు చెప్పాడు. ఆదాము నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఇది.

మనిషి అందులో ఉంచబడ్డాడు. (15) 

దేవుడు ఆదామును సృష్టించి ఒక తోటలో ఉంచాడు. దేవుడు మాత్రమే మనలను నిజంగా సంతోషపరచగలడు ఎందుకంటే ఆయన మన శరీరాలను మరియు ఆత్మలను సృష్టించాడు. పరలోకం వంటి పరిపూర్ణ ప్రదేశంలో కూడా ఆదాము ఇంకా పని చేయాల్సి వచ్చింది. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది మరియు దేవుని దృష్టిలో ఉంచుకుని చేయడం చాలా ముఖ్యం. వ్యవసాయం అనేది చాలా పాత మరియు గౌరవప్రదమైన పని, ఇది పరలోకంలో కూడా అవసరం. దేవుడు మనకు ఇచ్చే పనిలో ఆనందాన్ని పొందడం కూడా చాలా ముఖ్యం. ఆదాము తనకు ఏమీ చేయకపోతే సంతోషంగా ఉండేవాడు కాదు మరియు మన ఆహారం కోసం పనిచేయడం నేటికీ చాలా ముఖ్యం. 2 థెస్సలొనీకయులకు 3:10

దేవుని ఆజ్ఞ. (16,17) 

దేవుడు మనం ఏమి చేయాలనుకుంటున్నామో మనం ఎల్లప్పుడూ వినాలి మరియు ఆయన ఇష్టానికి విరుద్ధంగా పనులు చేయకూడదు. ఆదాము మరియు హవ్వ ఏదేను తోటలో ఉన్నప్పుడు, ఒక నిర్దిష్ట చెట్టు తప్ప వారికి కావలసిన ఏదైనా పండు తినడానికి అనుమతించబడ్డారు. వారు దేవునికి అవిధేయత చూపి, ఆ చెట్టును తింటే, వారు నొప్పి, వ్యాధి మరియు మరణం వంటి పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. వారు దేవుని ప్రేమను కూడా కోల్పోతారు మరియు చెడు భావాలతో నిండిపోతారు. దురదృష్టవశాత్తు, వారు ఆ చెట్టు నుండి తిన్నారు మరియు వారి చర్యల కారణంగా, మానవులందరూ ఇప్పుడు అదే సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రజలు సహజంగా పాపులని మరియు చెడు పనులు చేస్తారని బైబిల్ మనకు చెబుతుంది, ఇది వారిని సంతోషంగా మరియు శిక్షకు గురిచేస్తుంది. వారు ఎక్కడి నుండి వచ్చినా లేదా ఏ కాలంలో నివసించినా అందరికీ ఇది నిజం.

జంతువుల పేర్లు పెట్టడం, స్త్రీని తయారు చేయడం, వివాహం యొక్క దైవిక విషయాలు. (18-25)

దేవుడు జంతువులపై మానవులకు శక్తిని ఇచ్చాడు మరియు ఈ శక్తిని చూపించడానికి, మానవులు అన్ని జంతువులకు పేర్లు పెట్టారు. అయితే, ఈ శక్తి ఉన్నప్పటికీ, మానవులకు ఇంకా దేవుని సహాయం అవసరం. మనం దేవుణ్ణి విశ్వసిస్తే, ఆయన మన మంచి కోసం ప్రతిదీ చేస్తాడు. దేవుడు ఆదామును గాఢనిద్రలో పడవేసి, హవ్వను అతనికి భాగస్వామిగా మరియు సహాయకురాలిగా తీసుకువచ్చాడు. భాగస్వామిని తెలివిగా మరియు ప్రార్థనతో ఎంచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ సంబంధం ముఖ్యమైనది మరియు చాలా కాలం పాటు ఉంటుంది. ప్రారంభంలో, ఆదాము మరియు హవ్వ‌కు వెచ్చదనం లేదా అందం కోసం బట్టలు అవసరం లేదు ఎందుకంటే వారు సంతోషంగా ఉన్నారు మరియు వారికి కావలసినవన్నీ కలిగి ఉన్నారు. కానీ ఈ ఆశీర్వాదాలన్నీ ఉన్నప్పటికీ, మానవులు ఇప్పటికీ తప్పులు చేసారు మరియు జంతువుల వలె ప్రవర్తించారు.


Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |