Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటిదగ్గర నిలిచియుండగా
“కల”– ఆదికాండము 40:5. ఆదికాండము 15:12 సంఖ్యాకాండము 12:6 ద్వితీయోపదేశకాండము 13:1 దగ్గర నోట్స్, రిఫరెన్సులు.
2. చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను.
3. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను.
4. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను.
5. అతడు నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను.
6. మరియు తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను.
7. అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను ఆ పీలవెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను.
8. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును లేకపోయెను.
దానియేలు 1:20 దానియేలు 2:2 దానియేలు 2:27 దానియేలు 4:7 పోల్చి చూడండి. యోసేపు తరువాత నాలుగు శతాబ్దాల అనంతరం కూడా మంత్రగాళ్ళు ఈజిప్ట్‌లో తమ మంత్రవిద్యలను సాధన చేస్తూనే ఉన్నారు – నిర్గమకాండము 7:11 నిర్గమకాండము 7:22 నిర్గమకాండము 8:7 నిర్గమకాండము 8:18-19 నిర్గమకాండము 9:11. మంత్రగాళ్ళు ఏదేదో చేసెయ్యగలరని తరుచుగా మనుషులు అనుకుంటారు గాని వాళ్ళు చేయగలిగేది చాలా తక్కువ. వీరి మంత్రాలు దైవశక్తి అని కొందరు కొన్నిసార్లు భ్రమపడుతుంటారు. ఇలాంటి మంత్ర విద్యలన్నీ దేవుని ప్రజలకు నిషేధం – ద్వితీయోపదేశకాండము 18:10-13.
9. అప్పుడు పానదాయకుల అధిపతి - నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసికొనుచున్నాను.
“పానపాత్ర అందించేవాడు”– ఆదికాండము 40:14 ఆదికాండము 40:23. ఇతడు యోసేపును మర్చిపోవడానికి అనుమతించిన దేవుడు ఇప్పుడు, అంటే సరైన సమయంలో, మళ్ళీ గుర్తు తెచ్చుకునేలా చేస్తున్నాడు.
10. ఫరో తన దాసులమీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి యింట కావలిలో ఉంచెను.
11. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొకడు వేరువేరు భావములు గల కలలు చెరి యొకటి కంటిమి.
12. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెబ్రీ పడుచువాడు మాతో కూడ ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను.
13. అతడు మాకు ఏ యే భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా
14. ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలోనుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరోయొద్దకు వచ్చెను.
“చెరసాల”– దేవుని నిర్ణీత సమయం వచ్చింది. ప్రకటన గ్రంథం 2:10 కీర్తనల గ్రంథము 31:15 పోల్చిచూడండి.
15. ఫరో యోసేపుతో నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్నయెడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి వింటినని అతనితో చెప్పినందుకు
దానియేలు 5:16.
16. యోసేపు నావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను.
“నాచేత...కాదు”– గొప్పవారైన ఇతర దైవ సేవకుల్లో కనిపించిన వినయం యోసేపులో చూస్తున్నాం – దానియేలు 2:22 దానియేలు 2:28 దానియేలు 2:30 అపో. కార్యములు 3:12 2 కోరింథీయులకు 3:5. యాకోబు 4:6 మన హృదయాలపై రాసుకుని రోజూ వల్లించుకోవలసిన మాట.
17. అందుకు ఫరో నా కలలో నేను ఏటి యొడ్డున నిలుచుంటిని.
18. బలిసినవియు, చూపున కందమైనవియునైన, యేడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను.
19. మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి యేడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు.
20. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను.
21. అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని.
22. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల యేడు మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను.
23. మరియు తూర్పు గాలిచేత చెడిపోయి యెండిన యేడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను.
24. ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియ చెప్పితిని గాని దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పెను.
25. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ యేడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు
దానియేలు 2:28-29 దానియేలు 2:45 పోల్చి చూడండి.
26. ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్సరములు.
27. కల ఒక్కటే. వాటి తరువాత, చిక్కిపోయి వికారమై పైకివచ్చిన యేడు ఆవులును ఏడు సంవత్సరములు; తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీలవెన్నులు కరవుగల యేడు సంవత్సరములు.
28. నేను ఫరోతో చెప్పు మాట యిదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను.
29. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.
30. మరియు కరవుగల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరవు దేశమును పాడుచేయును.
“కరవు”– ఒక ప్రజ పాపాలకు న్యాయమైన దండనగా దేవుడు కొన్నిసార్లు కరవును పంపుతాడు. లేవీయకాండము 26:18-20 ద్వితీయోపదేశకాండము 28:15 ద్వితీయోపదేశకాండము 28:23-24 రూతు 1:1 2 సమూయేలు 21:1 2 రాజులు 4:38 2 రాజులు 8:1 2 రాజులు 25:3 కీర్తనల గ్రంథము 105:16 చూడండి. యోసేపు ఈజిప్ట్‌లో ఉన్న ఆ కాలంలో దేవునికి మరింత విశాలమైన ఉద్దేశం ఉంది. రాబోయే అధ్యాయాల్లో అది వెల్లడౌతుంది.
31. దాని తరువాత కలుగు కరవుచేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును; ఆ కరవు మిక్కిలి భారముగా నుండును.
32. ఈ కార్యము దేవునివలన నిర్ణయింపబడియున్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను.
అంటే, దేవుడు తాను చెప్తున్న సత్యాన్ని నొక్కి వక్కాణిస్తున్నాడు. ఆదికాండము 37:5-9 ఆమోసు 7:1-9 ఆమోసు 8:1-3 చూడండి. దానియేలు 7:3-7 నోట్స్ చూడండి.
33. కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియమింపవలెను.
34. ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను అయిదవ భాగము తీసికొనవలెను.
35. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహార మంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను.
36. కరవుచేత ఈ దేశము నశించిపోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను.
37. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక
ఫరో యోసేపును సలహా అడగలేదు (వ 33–36) కానీ అతడి సలహాలో ఎంతో జ్ఞానం ఉంది గనుక వెంటనే దాన్ని అంగీకరించాడు. ఇలాంటి జ్ఞానాన్ని యోసేపుకిచ్చినది దేవుడే (అపో. కార్యములు 7:10).
38. అతడు తన సేవకులను చూచి ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను.
దానియేలు 4:8-9 దానియేలు 4:18 దానియేలు 5:11 దానియేలు 5:14 పోల్చి చూడండి.
39. మరియు ఫరో - దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు.
40. నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.అపో. కార్యములు 7:10
ఆదికాండము 39:6 నోట్. 1 సమూయేలు 2:7-8 కీర్తనల గ్రంథము 75:6-7 కీర్తనల గ్రంథము 113:7-8 యాకోబు 4:10 పోల్చిచూడండి.
41. మరియు ఫరో - చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను.
దానియేలు 2:48 దానియేలు 5:29 దానియేలు 6:3 పోల్చి చూడండి.
42. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి
“ఉంగరం”– ఎస్తేరు 3:10 నోట్.
43. తన రెండవ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు - వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.అపో. కార్యములు 7:10
ఎస్తేరు 6:6-11 పోల్చి చూడండి.
44. మరియు ఫరో యోసేపుతో - ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.
కీర్తనల గ్రంథము 105:21-22.
45. మరియు ఫరో యోసేపునకు జప్నత్ప నేహు అను పేరు పెట్టి, అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను.
యోసేపుకు పెట్టిన ఈ కొత్త పేరుకు అర్థం “రహస్యాలను వెల్లడించేవాడు”.
46. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను.అపో. కార్యములు 7:10
ఆదికాండము 37:2 చూడండి. యోసేపు ఇప్పటికి పదమూడేళ్లనుంచి ఈజిప్ట్‌లో ఉంటున్నాడు.
47. సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను.
48. ఐగుప్తు దేశమందున్న యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి, ఆయా పట్టణములలో దాని నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునుండు పొలముయొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువచేసెను.
49. యోసేపు సముద్రపు ఇసుకవలె అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్యమాయెను గనుక కొలుచుట మానివేసెను.
50. కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను.
51. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.
మనష్షే అంటే బహుశా “మరచిపోయేలా చేయడం”. ఎఫ్రాయిం అంటే “చాలా ఫలితం”. యోసేపు కష్టాలు అనుభవించిన స్థలంలో తనపట్ల దేవుని మంచితనాన్ని మనస్సులో ఉంచుకొని ఈ పేర్లు పెట్టాడు. యోసేపుకు ఇలాంటి విషయాల గురించి ఉన్న దృష్టే మనకూ ఉంటే కష్టాలకు ఆలవాలమైన ఈ లోకంలో మనకు మరింత సంతోషం ఉంటుంది.
52. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.
53. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత
54. యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను.అపో. కార్యములు 7:11
55. ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో - మీరు యోసేపు నొద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను.యోహాను 2:5, అపో. కార్యములు 7:11
వ 41,44.
56. కరవు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను;
57. మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.
“లోకంలో అంతటా”– అంటే, ప్రపంచంలో ఆ భాగంలో, వారికి తెలిసిన నాగరిక దేశాలన్నమాట, వీటిలో కనాను కూడా ఉంది.