Genesis - ఆదికాండము 50 | View All
Study Bible (Beta)

1. యోసేపు తన తండ్రి ముఖముమీద పడి అతని గూర్చి యేడ్చి అతని ముద్దుపెట్టుకొనెను.

“కన్నీళ్ళు విడిచాడు”– ఆదికాండము 45:14.

2. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి.

“యాకోబు” చనిపోయాడు (ఆదికాండము 49:33), “ఇస్రాయేల్” మృతదేహాన్ని సుగంధద్రవ్యాలతో సిద్ధం చేశారు. చివరికి అతడు తన యాకోబు స్వభావాన్ని కోల్పోయాడు. ఆదికాండము 32:18 చూడండి.

3. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతనికొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను. అతనిగూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి.

సమాధి చెయ్యడం కోసం దేహాన్ని సిద్ధం చెయ్యడంలో పురాతన ఈజిప్ట్‌వారు ఆరితేరినవారు. 3,500 ఏళ్ళ తరువాత కూడా వారు సిద్ధపరచిన శవాలు కొన్ని చెడిపోకుండా ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

4. అతనిగూర్చిన అంగలార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో యింటి వారితో మాటలాడి - మీ కటాక్షము నామీద నున్నయెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి

5. నా తండ్రి నాచేత ప్రమాణము చేయించి - ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను.

ఆదికాండము 47:29-31 నోట్.

6. అందుకు ఫరో అతడు నీచేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను.

7. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను; అతనితో ఫరో యింటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరును

8. యోసేపు యింటివారందరును అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారును వెళ్లిరి. వారు తమ పిల్లలను తమ గొఱ్ఱెల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి.

9. మరియు రథములును రౌతులును అతనితో వెళ్లినందున ఆ సమూహము బహు విస్తారమాయెను.

10. యెర్దానునకు అవతలనున్న ఆఠదు కళ్లమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి యేడు దినములు దుఃఖము సలిపెను.

11. ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్లము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి - ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్‌ మిస్రాయిము అను పేరు పెట్టబడెను, అది యొర్దానునకు అవతల నున్నది.

“ఆబేల్ మిస్రాయిం”– అంటే “ఈజిప్ట్‌వారి విలాపం”.

12. అతని కుమారులు తన విషయమై అతడు వారి కాజ్ఞాపించినట్లు చేసిరి.

13. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసికొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతి పెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానముకొరకు స్వాస్థ్యముగానుండు నిమిత్తము మమ్రే యెదుట హిత్తెయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను
అపో. కార్యములు 7:16

ఆదికాండము 23:16-20 చూడండి.

14. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులును అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరును తిరిగి ఐగుప్తునకు వచ్చిరి.

15. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతిపొందుట చూచి ఒకవేళ యోసేపు మనయందు పగపట్టి మన మతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని

ఆదికాండము 37:28 ఆదికాండము 42:21-22 చూడండి. యోసేపు వారిపట్ల ఎంత ఆదరం చూపినప్పటికీ వారి మనసులు దోషభరితంగానే ఉండి వారు భయపడేలా చేశాయి. ఈ విధంగా యాకోబు వారిని చెప్పమన్న సంగతి ఎక్కడా రాసి లేదు. ఒకవేళ యాకోబు నిజంగానే వారికలా చెప్పి ఉండవచ్చు.

16. యోసేపునకు ఈలాగు వర్తమాన మంపిరి

17. - నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిన దేమనగా - మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులా అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను.

“ఏడ్చాడు”– ఆదికాండము 45:14. తనపై వారికి నమ్మకం లేదని తెలిసి యోసేపుకు దుఃఖం కలిగింది. మన అపనమ్మకం కూడా యేసు ప్రభువుకు విచారం కలిగించదా?

18. మరియు అతని సహోదరులు పోయి అతని యెదుట సాగిలపడి ఇదిగో - మేము నీకు దాసులమని చెప్పగా

“ఎదుట”– ఆదికాండము 37:8-10.

19. యోసేపు - భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా?

దేవుడొక్కడే మనుషుల తీర్పరి అంటున్నాడు యోసేపు. పగ తీర్చుకోవడం అవసరమైతే అలా తీర్చుకునేవాడు ఆయనే (రోమీయులకు 12:17 రోమీయులకు 12:19). సంఖ్యాకాండము 31:2 నోట్ చూడండి.

20. మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.

ఈ ఒక్క వచనంలో దేవునిపై యోసేపు దృఢమైన నమ్మకం, ఆధ్యాత్మిక సత్యాలను గురించి అతని గ్రహింపు, దేవుని సంకల్పం గురించిన అతని సంపూర్ణమైన అంగీకారం కనిపిస్తున్నాయి (ఆదికాండము 45:5-7 ద్వితీయోపదేశకాండము 23:5 కీర్తనల గ్రంథము 76:10 రోమీయులకు 8:28 పోల్చి చూడండి). మానవ చరిత్ర అంతటిలోనూ లోకానికి రాజాది

21. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను.

“దయగా మాట్లాడాడు”– యోసేపు జీవితంలో జరిగిన కొన్ని సంగతులకూ, క్రీస్తు జీవితంలోని కొన్ని సంఘటనలకూ చాలా దగ్గర పోలికలున్నాయి. వీరిద్దరినీ వీరి తండ్రులు ప్రత్యేకంగా ప్రేమించారు (ఆదికాండము 37:3 మత్తయి 3:17 యోహాను 3:35 యోహాను 5:20). ఇద్దరినీ వారి స్వంత ప్రజలే ద్వేషించార

22. యోసేపు అతని తండ్రి కుటుంబపువారును ఐగుప్తులో నివసించిరి, యోసేపు నూటపది సంవత్సరములు బ్రదికెను.

23. యోసేపు ఎఫ్రాయిముయొక్క మూడవతరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి.

24. యోసేపు తన సహోదరులను చూచి - నేను చనిపోవుచున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను
హెబ్రీయులకు 11:22

ఆదికాండము 13:15 ఆదికాండము 26:3 ఆదికాండము 35:12 చూడండి.

25. మరియయోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించుకొనెను.

26. యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.

“నూట పదేళ్ళు”– హెబ్రీయులకు 11:22 చూడండి. ఆదికాండం గ్రంథమంతా మనుషుల ఆయుర్ధాయం తగ్గుతూ వస్తున్నట్టు గమనించవచ్చు (ఆదికాండము 5:27 ఆదికాండము 9:29 ఆదికాండము 11:10-32 ఆదికాండము 25:7 ఆదికాండము 37:28 ఆదికాండము 47:28). తరువాతి కాలంలో ఇదింకా తగ్గిపోయింది (కీర్తనల గ్రంథము 90:10). “శవపేటికలో ఉంచారు”– ఆదికాం



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 50 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
యాకోబు కోసం సంతాపం. (1-6) 
మంచి మరియు నమ్మకమైన జీవితాన్ని గడిపిన మన ప్రియమైనవారు పరలోకానికి వెళ్లారని మేము విశ్వసిస్తున్నప్పటికీ, మేము ఇప్పటికీ బాధపడతాము మరియు వారిని కోల్పోతాము. అయితే, మన విశ్వాసం మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి మరియు వారి జ్ఞాపకశక్తికి గౌరవం చూపడానికి సహాయం చేస్తుంది. మనం ఇకపై వారి ఆత్మపై మన ప్రేమను చూపించలేము, కానీ భవిష్యత్తులో పునరుత్థానం కోసం దానిని సిద్ధం చేయడం ద్వారా వారి శరీరాన్ని గౌరవించవచ్చు. యోసేపు తన తండ్రికి ఇలా చేశాడు. మన ఆత్మ లేకుండా మన శరీరాలు ముఖ్యమైనవి కావు మరియు అవి కాలక్రమేణా క్షీణిస్తాయి.

అతని అంత్యక్రియలు. (7-14) 
యాకోబు చనిపోయిన తర్వాత, ఈజిప్టులోని చాలా మంది ముఖ్యమైన వ్యక్తులు అతని అంత్యక్రియలకు అతని కుటుంబంతో సహా వచ్చారు. వారు హెబ్రీయులను తెలుసుకున్న తర్వాత వారిని ఎక్కువగా ఇష్టపడటం మరియు గౌరవించడం ప్రారంభించారు. అంత్యక్రియలకు హాజరుకాని వ్యక్తులు అందరూ ఎంత విచారంగా ఉన్నారో గమనించారు. మంచి వ్యక్తులు చనిపోతే, అది పెద్ద నష్టం మరియు మనం చాలా బాధపడాలి. మతం గురించి బోధించే వ్యక్తులు హెబ్రీయుల గురించి చెడు ఆలోచనలు కలిగి ఉండకుండా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. 

జోసెఫ్ సోదరులు అతని క్షమాపణను కోరుతున్నారు, అతను వారిని ఓదార్చాడు. (15-21) 
యాకోబు కుమారులు ఈజిప్టులో కొనసాగడానికి వివిధ ఉద్దేశ్యాలు కారణం కావచ్చు, అబ్రాహాము వారి బానిసత్వం గురించి ప్రవచనాత్మక దృష్టితో ఉన్నప్పటికీ. మానవ స్వభావం యొక్క సాధారణ స్వభావాన్ని బట్టి జోసెఫ్‌ను అంచనా వేస్తే, కారణం లేకుండా అతన్ని ద్వేషించి గాయపరిచిన వారిపై అతను ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాడని వారు భావించారు. ప్రతిఘటించలేక, పారిపోలేక, తమను తాము లొంగదీసుకుని అతన్ని మృదువుగా చేయడానికి ప్రయత్నించారు. వారు యాకోబు దేవుని సేవకులుగా అతనితో వేడుకున్నారు. తన కలల పూర్తి నెరవేర్పును చూసి జోసెఫ్ చాలా ప్రభావితమయ్యాడు. తనకు భయపడవద్దని, దేవునికి భయపడమని ఆయన వారిని నిర్దేశిస్తాడు; ప్రభువు ముందు తమను తాము తగ్గించుకోవడం మరియు దైవిక క్షమాపణ కోరడం. అతను వారికి తన స్వంత దయ గురించి హామీ ఇస్తాడు. జోసెఫ్ ఎంత అద్భుతమైన స్ఫూర్తిని కలిగి ఉన్నారో చూడండి మరియు చెడుకు మంచిని అందించడానికి అతని నుండి నేర్చుకోండి. అతను వారిని ఓదార్చాడు మరియు వారి భయాలన్నింటినీ తొలగించడానికి, అతను వారితో దయగా మాట్లాడాడు. విరిగిన ఆత్మలను కట్టడి చేసి ప్రోత్సహించాలి. మనం ప్రేమించే మరియు క్షమించే వారికి మనం మంచి చేయడమే కాదు, దయతో మాట్లాడాలి. 

అతని ఎముకలకు సంబంధించిన జోసెఫ్ దిశ, అతని మరణం. (22-26) 
జోసెఫ్ మంచి కొడుకు మరియు దేవుడు అతనికి ఇచ్చిన దేశంలో చాలా కాలం జీవించాడు. అతను చనిపోతాడని తెలిసినప్పుడు, అతను తన సోదరులతో ఏదో ఒక రోజు తిరిగి కనానుకు వెళ్తామని చెప్పాడు. దేవుడు తనను ఓదార్చినట్లే, వారు ఓదార్పు పొందాలని కోరుకున్నాడు. వారు కనానులో స్థిరపడే వరకు తన ఎముకలను పాతిపెట్టకుండా ఉంచమని, మంచి భవిష్యత్తును గూర్చిన దేవుని వాగ్దానాన్ని విశ్వసించాలని వారికి గుర్తు చేయమని చెప్పాడు. మరణానంతరం తిరిగి జీవించాలనే ఆలోచనను జోసెఫ్ విశ్వసించాడు మరియు తన సహోదరులు కనాను గురించి నిరంతరం ఆలోచించాలని మరియు ఆశ కలిగి ఉండాలని అతను కోరుకున్నాడు. జోసెఫ్ చాలా మంచి వ్యక్తి, సరైన పనులు చేసి తన కుటుంబానికి సహాయం చేశాడు. అతను చనిపోయాడు, కానీ దేవునికి మంచి పనులు చేయడం ఎలాగో ధైర్యంగా ఎలా ఉండాలో చూపించాడు. మనం కూడా దీన్ని చేయగలం, మనం చాలా అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా మరణిస్తున్నప్పుడు కూడా, మనకు సహాయం చేస్తాడని దేవునిపై నమ్మకం ఉంచవచ్చు. బైబిల్‌లోని గొప్ప వ్యక్తులు కూడా ఇదే చేశారు. వారు దేవుణ్ణి విశ్వసించారు మరియు కష్టంగా ఉన్నప్పటికీ దేవుడు ఎల్లప్పుడూ తమతో ఉంటాడని తెలుసు. 




Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |