Samuel II - 2 సమూయేలు 2 | View All

1. ఇది జరిగిన తరువాతయూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగాపోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగాహెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.

“అడిగాడు”– దావీదు ఎప్పుడూ ఇలా చేసేవాడు – 1 సమూయేలు 23:2 1 సమూయేలు 23:4 1 సమూయేలు 23:9-12; కీర్తనల గ్రంథము 5:8; కీర్తనల గ్రంథము 25:4-5; కీర్తనల గ్రంథము 27:11; కీర్తనల గ్రంథము 31:3 మొ।।. అతనికి ఇన్ని విజయాలు కలగడంలో ఉన్న ప్రధాన కారణాలలో ఇది ఒకటి. “హెబ్రోను”– జెరుసలంకు 30 కిలోమీటర్లు దక్షిణాన ఉన్న ఒక ముఖ్యమైన పట్టణం.

2. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలునకు భార్యయైన అబీగయీలు అను తన యిద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను.

“భార్యలు”– 1 సమూయేలు 25:42-44.

3. మరియదావీదు తనయొద్ద నున్నవారినందరిని వారి వారి యింటివారిని తోడుకొని వచ్చెను; వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి.

1 సమూయేలు 27:2-3.

4. అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి.

“రాజు”– 1 సమూయేలు 16:13.

5. సౌలును పాతిపెట్టినవారు యాబేష్గిలాదువారని దావీదు తెలిసికొని యాబేష్గిలాదువారియొద్దకు దూతలను పంపిమీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవాచేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక.

“గిలాదువాళ్ళు”– 1 సమూయేలు 31:11-13. సౌలును గట్టిగా బలపరిచిన యాబేషువాళ్ళతో ఆరంభించి, ఇస్రాయేల్ జాతినంతటినీ ఏకం చేసేందుకు దావీదు ప్రయత్నిస్తున్నాడు.

6. యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగపరచును, నేనును మీరు చేసిన యీ క్రియనుబట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను.

7. మీ యజమానుడగు సౌలు మృతినొందెను గాని యూదావారు నాకు తమమీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను.

8. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొని పోయి,

అబ్నేరు సౌలుకు దగ్గర బంధువు – 1 సమూయేలు 14:50-51. అబ్నేరు ఇక్కడ ఇలా చెయ్యడంలో దేవుని సంకల్పాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడని ఇక్కడ రాసి లేదు. ఇస్రాయేల్ అంతటిమీదా రాజుగా దేవుడు ఎన్నుకున్నది దావీదును. ఆ సంగతి అబ్నేరుకు తెలుసు – 2 సమూయేలు 3:9-10. ఇక్కడే అబ్నేరు దేవుని చిత్తం కంటే కుటుంబ సంబంధాలను ప్రధానంగా ఎంచి రాజకీయ చదరంగం ఆడుతున్నట్టున్నాడు. నేటిలాగానే ఆనాడు కూడా ఇలాంటి ఎత్తులు బాధలకే దారి తీశాయి.

9. గిలాదువారిమీదను ఆషేరీయులమీదను యెజ్రెయేలుమీదను ఎఫ్రాయిమీయులమీదను బెన్యామీనీయులమీదను ఇశ్రాయేలు వారిమీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను.

10. సౌలు కుమారుడగు ఇష్బోషెతు నలువదేండ్లవాడై యేల నారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను; అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి.

11. దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు.

2 సమూయేలు 5:5.

12. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారు డగు ఇష్బోషెతు సేవకులును మహనయీములోనుండి బయలుదేరి గిబియోనునకు రాగా

మహనయీం యొర్దాను నదికి తూర్పున ఉంది. గిబియోను అయితే పశ్చిమాన బెన్యామీను ప్రదేశంలో ఉంది.

13. సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులును బయలుదేరి వారి నెదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా

యోవాబు దావీదు అక్క కొడుకు (1 దినవృత్తాంతములు 2:13-16). అతడు దావీదు సైన్యంలో ప్రవీణతగల పరాక్రమవంతుడైన అధికారి గాని కఠినుడు, రక్తపిపాస గల మనిషి (2 సమూయేలు 3:27; 2 సమూయేలు 18:14; 2 సమూయేలు 20:9-10).

14. అబ్నేరు లేచిమన యెదుట ¸యౌవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబువారు చేయవచ్చుననెను.

ఇరు పక్షాలనుంచి ప్రతినిధులు ముందుకు వచ్చి పోరాడడం మూలంగా తమ విభేదాలను పరిష్కరించుకోవాలని ఈ సూచనలో అర్థం కావచ్చు. 1 సమూయేలు 17:8-10 పోల్చి చూడండి.

15. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన పన్నిద్దరు మంది బెన్యామీనీయులును దావీదు సేవకులలో పన్నిద్దరు మందియును లేచి మధ్య నిలిచిరి.

ఈ ప్రతినిధుల మధ్య పోరాటం వారందరి మరణానికీ దారి తీసింది. అందువల్ల ఈ రెండు గుంపులమధ్య ఎలాంటి పరిష్కారమూ జరగలేదు.

16. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తిపొడవగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము.

17. తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి.

“యుద్ధం”– రెండు సైన్యాల మధ్య జరిగింది.

18. సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషై యును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక

“సెరూయా”– దావీదు అక్క.

19. అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా

20. అబ్నేరు వెనుకకు తిరిగినీవు అశా హేలువా అని అతనిని నడుగగా అతడు నేను అశా హేలునే యనెను.

21. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి ¸యౌవనస్థులలో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అశాహేలు ఈ తట్టయినను ఆ తట్టయినను తిరుగక అతని తరుమగా

అశాహేలును గనుక తాను చంపితే మరింత సమస్య వస్తుందని అబ్నేరుకు తెలుసు. చివరికి అది అబ్నేరు చావుకు దారి తీసింది (2 సమూయేలు 3:27).

22. అబ్నేరునన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపినయెడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగల ననెను.

23. అతడునేను తొలగననగా, అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున యీటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చినవారందరు నిలువబడిరి గాని

24. యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యమార్గములోని గీహ యెదుటి అమ్మాయను కొండకు వచ్చిరి; అంతలో సూర్యుడు అస్త మించెను.

25. బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని, ఒక కొండమీద నిలువగా

26. అబ్నేరు కేకవేసికత్తి చిరకాలము భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదువుగదా; తమ సహోదరులను తరుమవద్దని నీ వెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందు వని యోవాబుతో అనెను.

గోత్రాల మధ్య అంతర్‌యుద్ధం రాకుండా చేయాలని అబ్నేరు ప్రయత్నం. యోవాబు కంటే ఇతనే శాంతిప్రియుడు. తమ మధ్య పరిష్కారం జరిగేందుకు తమ ప్రతినిధులు పోరాడాలని సూచించినది కూడా ఇతడే (వ 14). దావీదుతో శాంతి ప్రయత్నాలు జరిపినది కూడా ఇతడే (2 సమూయేలు 3:12). అయితే 8,9 వచనాల్లో ఇతడు చేసిన పనే ఈ సమస్యకు మూల కారణం.

27. అందుకు యోవాబుదేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండినయెడల జనులందరు తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగి పోయియుందురని చెప్పి

28. బాకా ఊదగా జనులందరు నిలిచి, ఇశ్రాయేలువారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి.

29. అబ్నేరును అతనివారును ఆ రాత్రి అంత మైదానము గుండ ప్రయాణము చేసి యొర్దానునది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి.

“అరాబా”– అంటే ఇక్కడ అర్థం యొర్దాను లోయ.

30. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్కచూడగా దావీదు సేవకులలో అశాహేలు గాక పందొమ్మండుగురు లేకపోయిరి.

31. అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను మూడువందల అరువది మందిని హతము చేసిరి.

32. జనులు అశాహేలును ఎత్తికొనిపోయి బేత్లెహేములోనున్న అతని తండ్రి సమాధియందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతనివారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Samuel II - 2 సమూయేలు 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దావీదు హెబ్రోనులో రాజును చేసాడు. (1-7) 
సౌలు మరణానంతరం, 1 దినవృత్తాంతములు 12:22లో పేర్కొనబడినట్లుగా అనేకులు జిక్లాగ్ వద్ద దావీదును ఆశ్రయించారు. ఏది ఏమైనప్పటికీ, డేవిడ్ యొక్క విశ్వాసం దేవునిపై దృఢంగా ఉంచబడింది, అతను తనకు రాజ్యాన్ని వాగ్దానం చేశాడు, దేవుని స్వంత సమయంలో మరియు మార్గంలో ఇవ్వబడుతుంది. దేవుని వాగ్దానానికి సంబంధించిన ఈ హామీ ఆయనను ఉత్సాహంతో దైవిక ప్రయత్నాలను కొనసాగించేలా పురికొల్పింది. అతను జీవిత కిరీటం కోసం ఎంపిక చేయబడితే, అది నిష్క్రియాత్మకతకు దారితీయదు; బదులుగా, అతను దేవుని మార్గదర్శకత్వాన్ని శ్రద్ధగా అనుసరిస్తాడు మరియు ఆయన నిర్దేశించినవన్నీ చేస్తాడు. డేవిడ్ ఈ మనస్తత్వాన్ని ఉదహరించాడు మరియు అదేవిధంగా, దేవుడు ఎన్నుకున్న వారందరూ అదే చేస్తారు.
జీవితంలో మన ప్రయాణాలు మరియు పరివర్తనల అంతటా, మన ముందు నడిపించే దేవునిలో ఓదార్పును కనుగొనడం చాలా అవసరం. విశ్వాసం మరియు ప్రార్థన ద్వారా మన ముందు దేవుణ్ణి ఉంచినట్లయితే ఈ దైవిక మార్గదర్శకత్వాన్ని మనం చూడవచ్చు. దేవుడు దావీదుకు చేసిన వాగ్దానానికి అనుగుణంగా అతని మార్గాన్ని నమ్మకంగా నడిపించాడు. దావీదు కుమారుడైన మెస్సీయ రాజ్యం దశలవారీగా స్థాపించబడినట్లే, దావీదు రాజ్యాధికారానికి క్రమంగా ఎదుగుదల జరిగింది. మెస్సీయ అందరికి ప్రభువు అయినప్పటికీ, అన్ని విషయాలు ఆయనకు పూర్తిగా లోబడి ఉండడాన్ని మనం ఇంకా చూడలేకపోవచ్చు.

అబ్నేర్ రాజు ఇష్బోషెత్‌ను అబ్నేర్ మనుషులకు మరియు యోవాబుకు మధ్య యుద్ధం చేస్తాడు. (8-17) 
దేశం మొత్తం దావీదును తిరస్కరించింది. దీని ద్వారా, ప్రభువు తన సేవకుని భవిష్యత్తులో గౌరవం మరియు ప్రయోజనం కోసం సిద్ధం చేశాడు. అతను ఎదుర్కొన్న వివిధ కష్టాల సమయంలో డేవిడ్ యొక్క నిజమైన దైవభక్తి అతని ప్రవర్తనలో ప్రదర్శించబడింది. ఈ అంశంలో, డేవిడ్ క్రీస్తుకు పూర్వగామిగా పనిచేశాడు, ఇజ్రాయెల్ కూడా వారి యువరాజుగా మరియు రక్షకునిగా తండ్రిచే అభిషేకించబడినప్పటికీ, అతనికి సమర్పించడానికి నిరాకరించింది.
అబ్నేర్ యువకులు తమ ముందు పోరాడాలని సూచించినప్పుడు మరియు అది ఆడినట్లు వివరించినప్పుడు, అతను తీవ్రమైన విషయాన్ని తేలికగా చెప్పాడు. అలాంటి మూర్ఖత్వం పాపం యొక్క గురుత్వాకర్షణను అల్పమైనది. ఈ పద్ధతిలో మానవ రక్తంతో ఆడుకునే ఎవరైనా నిజమైన మనిషి అని పిలవడానికి అర్హులు కాదు.

రెండు పార్టీలు వెనక్కి తగ్గాయి. (18-24)
మరణం తరచుగా ఊహించని మార్గాల ద్వారా వస్తుంది, మనల్ని కాపాడుతుంది. మన గర్వించదగిన విజయాలు కొన్నిసార్లు మన పతనానికి మరియు ద్రోహానికి మూలంగా మారవచ్చు. అసాహెల్ తన త్వరితగతిన మితిమీరిన విశ్వాసం అతన్ని రక్షించలేదు; బదులుగా, అది అతని మరణాన్ని వేగవంతం చేసింది.

అసాహెల్ అబ్నేర్ చేత చంపబడ్డాడు: 25-32. 
అంతర్యుద్ధంలో పాల్గొనడం వల్ల కలిగే భయంకరమైన పరిణామాల గురించి ఆలోచించమని అబ్నేర్ జోయాబ్‌ని కోరాడు. అటువంటి అసహజ సంఘర్షణల తీవ్రతను తక్కువగా అంచనా వేసే వారు, అవి పాల్గొన్న వారందరికీ చేదును తెస్తాయని త్వరలోనే గ్రహిస్తారు. వ్యక్తులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు హేతువును ఎంత సులభంగా స్వీకరిస్తారు, అయితే అది వారి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు దాని నుండి సిగ్గుపడతారు. సంఘటనల ఫలితాలు ప్రజల దృక్కోణాలను తీవ్రంగా మార్చగలవు. ఉదయం ఆహ్లాదకరంగా అనిపించేవి రాత్రి సమయానికి భయంకరంగా మారుతాయి.
ఆసక్తిగా వివాదాలలోకి ప్రవేశించే వారు తమ నిర్ణయం ముగియకముందే పశ్చాత్తాపపడతారు. సోలమన్ సలహా ఇచ్చినట్లుగా, అలాంటి వివాదాలను పూర్తిగా నివారించడం తెలివైన పని. ఈ సత్యం ప్రతి పాపానికి వర్తిస్తుంది; ప్రజలు దానిని సకాలంలో పరిగణనలోకి తీసుకుంటే, అది చివరికి చేదుకు దారితీస్తుందని వారు గుర్తిస్తారు. అసహెల్ అంత్యక్రియల ప్రస్తావన ఈ జీవితంలో వ్యక్తుల మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తు చేస్తుంది. అయితే, పునరుత్థానం సమయంలో, దైవభక్తి మరియు భక్తిహీనుల మధ్య విభజన మాత్రమే శాశ్వతత్వం కోసం ఉంటుంది.



Shortcut Links
2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |