Kings I - 1 రాజులు 16 | View All
Study Bible (Beta)

1. యెహోవా వాక్కు హనానీ కుమారుడైనయెహూకు ప్రత్యక్షమై బయెషానుగూర్చి యీలాగు సెల విచ్చెను

1. The word of Yahweh came to Jehu the son of Hanani against Baasha, saying,

2. నేను నిన్ను మంటిలోనుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా చేసితిని, అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు, ఇశ్రాయేలువారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై, వారి పాప ములచేత నాకు కోపము పుట్టించి యున్నావు.

2. Because I exalted you out of the dust, and made you prince over my people Israel, and you have walked in the way of Jeroboam, and have made my people Israel to sin, to provoke me to anger with their sins;

3. కాబట్టి బయెషా సంతతివారిని అతని కుటుంబికులను నేను సమూల ధ్వంసముచేసి, నెబాతు కుమారుడైన యరొబాము సంతతివారికి నేను చేసినట్లు నీ సంతతివారికిని చేయబోవు చున్నాను.

3. behold, I will utterly sweep away Baasha and his house; and I will make your house like the house of Jeroboam the son of Nebat.

4. పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినును; బీడుభూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశపక్షులు తినును అనెను.

4. Him who dies of Baasha in the city shall the dogs eat; and him who dies of his in the field shall the birds of the sky eat.

5. బయెషా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు, అతని బలమును గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.

5. Now the rest of the acts of Baasha, and what he did, and his might, aren't they written in the book of the chronicles of the kings of Israel?

6. బయెషా తన పితరులతో కూడ నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను; అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను.

6. Baasha slept with his fathers, and was buried in Tirzah; and Elah his son reigned in his place.

7. మరియబయెషా యరొబాము సంతతి వారివలెనే యుండి తన కార్యములచేత యెహోవా దృష్టికి కీడుచేసి ఆయనకు కోపము పుట్టిం చిన దాని నంతటిని బట్టియు, అతడు తన రాజును చంపుటను బట్టియు, అతనికిని అతని సంతతివారికిని విరోధముగ యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను.

7. Moreover by the prophet Jehu the son of Hanani came the word of Yahweh against Baasha, and against his house, both because of all the evil that he did in the sight of Yahweh, to provoke him to anger with the work of his hands, in being like the house of Jeroboam, and because he struck him.

8. యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువదియారవ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి రెండు సంవత్సర ములు ఏలెను.

8. In the twenty-sixth year of Asa king of Judah began Elah the son of Baasha to reign over Israel in Tirzah, and reigned two years.

9. తిర్సాలో తనకు గృహనిర్వాహకుడగు అర్సాయింట అతడు త్రాగి మత్తుడై యుండగా, యుద్ధ రథముల అర్ధభాగముమీద అధికారియైన జిమీ అతని మీద కుట్రచేసి లోపలికి చొచ్చి

9. His servant Zimri, captain of half his chariots, conspired against him. Now he was in Tirzah, drinking himself drunk in the house of Arza, who was over the household in Tirzah:

10. అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయెను. ఇది యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువది యేడవ సంవత్సరమున సంభ వించెను.

10. and Zimri went in and struck him, and killed him, in the twenty-seventh year of Asa king of Judah, and reigned in his place.

11. అతడు సింహాసనాసీనుడై యేలనారంభించిన తోడనే బయెషా సంతతివారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరినేగాని మిగుల నియ్యక అందరిని హతముచేసెను.

11. It happened, when he began to reign, as soon as he sat on his throne, that he struck all the house of Baasha: he didn't leave him a single man-child, neither of his relatives, nor of his friends.

12. బయెషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపముచేసి, ఇశ్రా యేలువారు పాపము చేయుటకు కారకులై, తాము పెట్టుకొనిన దేవతలచేత ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరి గనుక

12. Thus did Zimri destroy all the house of Baasha, according to the word of Yahweh, which he spoke against Baasha by Jehu the prophet,

13. వారు చేసిన పాపములనుబట్టి ప్రవక్తయైన యెహూద్వారా బయెషానుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమీ బయెషా సంతతివారినందరిని నాశనముచేసెను.

13. for all the sins of Baasha, and the sins of Elah his son, which they sinned, and with which they made Israel to sin, to provoke Yahweh, the God of Israel, to anger with their vanities.

14. ఏలా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

14. Now the rest of the acts of Elah, and all that he did, aren't they written in the book of the chronicles of the kings of Israel?

15. యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువదియేడవ సంవత్సరమున జిమీ తిర్సాలో ఏడు దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా

15. In the twenty-seventh year of Asa king of Judah did Zimri reign seven days in Tirzah. Now the people were encamped against Gibbethon, which belonged to the Philistines.

16. జిమీ కుట్రచేసి రాజును చంపించెనను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇశ్రాయేలువారందరును ఆ దినమున సైన్యాధిపతియైన ఒమీని దండుపేటలో ఇశ్రాయేలు వారిమీద రాజుగా పట్టాభిషేకము చేసిరి.

16. The people who were encamped heard say, Zimri has conspired, and has also struck the king: therefore all Israel made Omri, the captain of the host, king over Israel that day in the camp.

17. వంటనే ఒమీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరును తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి.

17. Omri went up from Gibbethon, and all Israel with him, and they besieged Tirzah.

18. పట్టణము పట్టుబడెనని జిమీ తెలిసికొని, తాను రాజనగరునందు జొచ్చి తనతో కూడ రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను.

18. It happened, when Zimri saw that the city was taken, that he went into the castle of the king's house, and burnt the king's house over him with fire, and died,

19. యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై యుండి తానే పాపము చేయుచు, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగున జరిగెను.

19. for his sins which he sinned in doing that which was evil in the sight of Yahweh, in walking in the way of Jeroboam, and in his sin which he did, to make Israel to sin.

20. జిమీచేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన రాజద్రోహమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.

20. Now the rest of the acts of Zimri, and his treason that he did, aren't they written in the book of the chronicles of the kings of Israel?

21. అప్పుడు ఇశ్రాయేలువారు రెండు జట్లుగా విడి పోయి, జనులలో సగముమంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను, సగముమంది ఒమీ పక్షమునను చేరిరి.

21. Then were the people of Israel divided into two parts: half of the people followed Tibni the son of Ginath, to make him king; and half followed Omri.

22. ఒమీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపువారిని జయింపగా తిబ్నీ చంపబడెను; ఒమీ రాజాయెను.

22. But the people who followed Omri prevailed against the people who followed Tibni the son of Ginath: so Tibni died, and Omri reigned.

23. యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియొకటవ సంవత్సరమున ఒమీ ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను; ఆ పండ్రెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను.

23. In the thirty-first year of Asa king of Judah began Omri to reign over Israel, and reigned twelve years: six years reigned he in Tirzah.

24. అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండమీద పట్టణ మొకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను.

24. He bought the hill Samaria of Shemer for two talents of silver; and he built on the hill, and called the name of the city which he built, after the name of Shemer, the owner of the hill, Samaria.

25. ఒమీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, తన పూర్వికులందరికంటె మరి దుర్మార్గముగా ప్రవర్తించెను.

25. Omri did that which was evil in the sight of Yahweh, and dealt wickedly above all who were before him.

26. అతడు నెబాతు కుమారు డైన యరొబాము దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని, ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెనో, దానిని అనుసరించి ప్రవర్తించెను.

26. For he walked in all the way of Jeroboam the son of Nebat, and in his sins with which he made Israel to sin, to provoke Yahweh, the God of Israel, to anger with their vanities.

27. ఒమీ చేసిన యితర కార్యములను గూర్చియు అతడు అగుపరచిన బలమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

27. Now the rest of the acts of Omri which he did, and his might that he shown, aren't they written in the book of the chronicles of the kings of Israel?

28. ఒమీ తన పితరులతో కూడ నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయెను.

28. So Omri slept with his fathers, and was buried in Samaria; and Ahab his son reigned in his place.

29. యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియెనిమిదవ సంవత్సరమున ఒమీ కుమారుడైన అహాబు ఇశ్రా యేలువారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఇరు వదిరెండు సంవత్సరములు ఏలెను.

29. In the thirty-eighth year of Asa king of Judah began Ahab the son of Omri to reign over Israel: and Ahab the son of Omri reigned over Israel in Samaria twenty-two years.

30. ఒమీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను.

30. Ahab the son of Omri did that which was evil in the sight of Yahweh above all that were before him.

31. నెబాతు కుమారుడైన యరొ బాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను.
ప్రకటన గ్రంథం 2:20

31. It happened, as if it had been a light thing for him to walk in the sins of Jeroboam the son of Nebat, that he took as wife Jezebel the daughter of Ethbaal king of the Sidonians, and went and served Baal, and worshiped him.

32. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను.

32. He reared up an altar for Baal in the house of Baal, which he had built in Samaria.

33. మరియు అహాబు దేవతాస్తంభమొకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజు లందరికంటె ఎక్కువగా పాపముచేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.

33. Ahab made the Asherah; and Ahab did yet more to provoke Yahweh, the God of Israel, to anger than all the kings of Israel who were before him.

34. అతని దిన ములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాదివేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను; దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున సంభవించెను.

34. In his days did Hiel the Bethelite build Jericho: he laid the foundation of it with the loss of Abiram his firstborn, and set up the gates of it with the loss of his youngest son Segub, according to the word of Yahweh, which he spoke by Joshua the son of Nun.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings I - 1 రాజులు 16 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఇశ్రాయేలులో బాషా మరియు ఏలా పాలనలు. (1-14) 
ఈ అధ్యాయం ప్రత్యేకంగా ఇజ్రాయెల్ రాజ్యం మరియు దాని అల్లకల్లోల మార్పులపై దృష్టి పెడుతుంది. వారి తీవ్రమైన అవినీతి ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ ఇప్పటికీ దేవుని ప్రజలుగా సూచిస్తారు. జెహూ బాషా వంశస్థులకు కూడా ఇదే విధమైన పతనాన్ని ఊహించాడు, ఇది జెరోబాము కుటుంబంపై బాషా చేసిన విధ్వంసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇతరుల పాపాలను పునరావృతం చేసే వారు అదే విపత్తులను ఎదుర్కొంటారని ఊహించవచ్చు, ప్రత్యేకించి కొన్ని పాపాలను బహిరంగంగా ఖండించేవారు వ్యక్తిగతంగా వాటిలో మునిగిపోతారు. బాషా స్వయంగా శాంతియుత మరణాన్ని కలుసుకున్నాడు మరియు గౌరవాలతో అంత్యక్రియలు చేయబడ్డాడు. ఈ ఖాతా మరణానంతర శిక్షల ఉనికిని నొక్కి చెబుతుంది, ఇది గొప్ప భయాన్ని రేకెత్తిస్తుంది. మద్యం సేవించే వారికి ఎలాహ్ యొక్క విధి ఒక హెచ్చరిక కథగా పనిచేస్తుంది, ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో వారికి తెలియదు. మత్తు వ్యక్తులు స్వీయ-ప్రేరేపిత వ్యాధులు మరియు బాహ్య ప్రమాదాల రెండింటికి హాని కలిగిస్తుంది. మరణం అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులను పట్టుకుంటుంది, పాపం మధ్యలో వారిని పట్టుకుంటుంది మరియు ఏ విధమైన భక్తికి సరిగ్గా సిద్ధపడదు; ఆ విధిలేని రోజు అనుకోకుండా వస్తుంది. దేవుని ప్రవచనం నెరవేరింది, అతనికి వ్యతిరేకంగా వారి రెచ్చగొట్టినందుకు బాషా మరియు ఎలాలను బాధ్యులను చేస్తుంది. విగ్రహాలు ప్రయోజనం లేదా సహాయం అందించవు కాబట్టి వారి విగ్రహాలను "వానిటీస్" అని పిలుస్తారు. ఎవరి దేవుళ్ళు కేవలం భ్రమలు ఉన్నారో వారు నిజంగా దౌర్భాగ్యులు.వ్యక్తులు దేవునితో తమ సంబంధాన్ని విడిచిపెట్టినప్పుడు, వారు ఒకరికొకరు హాని కలిగించడంలో చిక్కుకుపోతారు. ప్రతిష్టాత్మక మరియు అహంకారి వ్యక్తులు ఒకరి పతనానికి మరొకరు దోహదం చేస్తారు. ఒమ్రీ టిబ్నీకి వ్యతిరేకంగా అనేక సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో నిమగ్నమయ్యాడు. దేవుడు తన ప్రావిడెన్స్‌లోని దేశాలు మరియు వ్యక్తుల పరిపాలనను నియంత్రించే ఖచ్చితమైన సూత్రాలను మనం ఎల్లప్పుడూ గ్రహించలేకపోయినా, గత సంఘటనల నుండి మనం విలువైన అంతర్దృష్టులను సంగ్రహించవచ్చు. హింసాత్మక చర్యలు, కుట్రలు మరియు అంతర్గత కలహాలతో అణచివేత పాలకులు ఒకరినొకరు అనుసరించే సందర్భాలలో, ప్రజల అతిక్రమణల కారణంగా ప్రభువు ఆందోళనలు చేశాడని స్పష్టమవుతుంది. ఇది వారికి పశ్చాత్తాపం మరియు సానుకూల మార్పును ప్రేరేపించడానికి స్పష్టమైన పిలుపుగా పనిచేస్తుంది. ఒమ్రీ యొక్క వారసత్వం అతని దుర్మార్గపు చర్యలతో కలుషితమైంది. చరిత్రలో అనేక దుర్మార్గపు వ్యక్తులు అధికారాన్ని మరియు గుర్తింపును కూడగట్టుకున్నారు, నగరాలను నిర్మించారు మరియు వారి పేర్లను చారిత్రక రికార్డుల్లోకి చేర్చారు. అయినప్పటికీ, వారి పేర్లు జీవిత పుస్తకంలో లేవు.

ఇజ్రాయెల్‌లో జిమ్రీ మరియు ఒమ్రీల పాలనలు. (15-28) 
వ్యక్తులు దేవునితో తమ సంబంధాన్ని విడిచిపెట్టినప్పుడు, వారు ఒకరికొకరు హాని కలిగించడంలో చిక్కుకుపోతారు. ప్రతిష్టాత్మక మరియు అహంకారి వ్యక్తులు ఒకరి పతనానికి మరొకరు దోహదం చేస్తారు. ఒమ్రీ టిబ్నీకి వ్యతిరేకంగా అనేక సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో నిమగ్నమయ్యాడు. దేవుడు తన ప్రావిడెన్స్‌లోని దేశాలు మరియు వ్యక్తుల పరిపాలనను నియంత్రించే ఖచ్చితమైన సూత్రాలను మనం ఎల్లప్పుడూ గ్రహించలేకపోయినా, గత సంఘటనల నుండి మనం విలువైన అంతర్దృష్టులను సంగ్రహించవచ్చు. హింసాత్మక చర్యలు, కుట్రలు మరియు అంతర్గత కలహాలతో అణచివేత పాలకులు ఒకరినొకరు అనుసరించే సందర్భాలలో, ప్రజల అతిక్రమణల కారణంగా ప్రభువు ఆందోళనలు చేశాడని స్పష్టమవుతుంది. ఇది వారికి పశ్చాత్తాపం మరియు సానుకూల మార్పును ప్రేరేపించడానికి స్పష్టమైన పిలుపుగా పనిచేస్తుంది. ఒమ్రీ యొక్క వారసత్వం అతని దుర్మార్గపు చర్యలతో కలుషితమైంది. చరిత్రలో అనేక దుర్మార్గపు వ్యక్తులు అధికారాన్ని మరియు గుర్తింపును కూడగట్టుకున్నారు, నగరాలను నిర్మించారు మరియు వారి పేర్లను చారిత్రక రికార్డుల్లోకి చేర్చారు. అయినప్పటికీ, వారి పేర్లు జీవిత పుస్తకంలో లేవు.

అహాబు దుష్టత్వం, హీల్ జెరిఖోను పునర్నిర్మించాడు. (29-34)
అహాబు దుష్టత్వంలో మునుపటి పాలకులందరినీ మించిపోయాడు, ముఖ్యంగా యెహోవా మరియు ఇశ్రాయేలు రెండింటి పట్ల తీవ్రమైన శత్రుత్వాన్ని ప్రదర్శించాడు. అతని అతిక్రమణలు విగ్రహారాధన ద్వారా రెండవ ఆజ్ఞను ఉల్లంఘించకుండా విస్తరించాయి; అతను విదేశీ దేవతలను ఆరాధించడం ద్వారా మొదటి ఆజ్ఞను కూడా ఉల్లంఘించాడు. తక్కువ పాపాలను విస్మరించడం మరింత తీవ్రమైన అతిక్రమణలకు మార్గం సుగమం చేస్తుంది. సాహసోపేతమైన తప్పిదస్థులతో వివాహాల ద్వారా అహాబు యొక్క పొత్తులు దుష్టత్వాన్ని మరింత ధైర్యాన్ని పెంచాయి, వ్యక్తులను తీవ్ర అక్రమాల వైపు నడిపించాయి.
అహాబ్ యొక్క వ్యక్తులలో ఒకరు, అతని సాహసోపేతమైన ప్రవర్తనతో ప్రభావితమై, జెరిఖోను నిర్మించడానికి ధైర్యం చేశాడు. ఆచాన్ మాదిరిగానే, ఈ వ్యక్తి తన సొంత లాభం కోసం దేవుని గౌరవానికి అంకితం చేసిన వాటిని తిరిగి ప్రతిష్టించుకుంటూ, పవిత్రమైన వస్తువులను తారుమారు చేశాడు. అతను ఇజ్రాయెల్‌లో ప్రసిద్ధి చెందిన శాపాన్ని నేరుగా ధిక్కరిస్తూ నిర్మాణాన్ని ప్రారంభించాడు, అయితే దేవునికి వ్యతిరేకంగా తమ హృదయాలను కఠినతరం చేసే వారు తమ ప్రయత్నాలలో శ్రేయస్సును కనుగొనలేరని చరిత్ర ధృవీకరిస్తుంది. మనం ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు, అధర్మం చేసే వారందరికీ ఎదురుచూసే భయంకరమైన విధి గురించి మనం గుర్తుంచుకుందాం. భక్తిహీనుల చరిత్ర, వారి సామాజిక స్థితి లేదా స్థానంతో సంబంధం లేకుండా, అదే ఫలితం యొక్క భయంకరమైన దృష్టాంతాలను స్థిరంగా అందిస్తుంది.



Shortcut Links
1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |