Kings I - 1 రాజులు 18 | View All
Study Bible (Beta)

1. అనేకదినములైన తరువాత మూడవ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమైనేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను; నీవు వెళ్లి అహాబును దర్శించుమని సెలవియ్యగా,
లూకా 4:25

“వర్షం”– ఇస్రాయేల్‌వారిలో ఏ పశ్చాత్తాపమూ కలగలేదు గాని దేవుడు తన సర్వాధిపత్యం గల కృప చొప్పున ఆ దేశం, జాతి పూర్తిగా అంతరించిపోకుండేలా వర్షం పంపించేందుకు నిశ్చయించుకున్నాడు.

2. అహాబును దర్శించు టకై ఏలీయా వెళ్లిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగియుండగా

దేనికైనా సరే ఏలీయా మారు మాట లేకుండా చూపిన విధేయతను చూడండి (1 రాజులు 17:5 1 రాజులు 7:10; 1 రాజులు 18:36; 1 రాజులు 19:15 1 రాజులు 19:19). అహాబును కలుసుకోవడంలో ప్రమాదం ఉందన్న ఆలోచన అతణ్ణి ఆపలేదు. నిజంగా దేవుని సన్నిధిలో నిలుచున్న సేవకుడే ఏలీయా (1 రాజులు 17:1).

3. అహాబు తన గృహనిర్వాహ కుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయ భక్తులుగలవాడై

“ఓబద్యా”– ఇదే పేరున్న ప్రవక్త కాదు ఇతడు. అహాబు భవనంలో ఒక ఉద్యోగి.

4. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.
హెబ్రీయులకు 11:38

“యెజెబెల్”– 1 రాజులు 16:31. “దాచాడు”– తన ప్రజలను కాపాడేందుకు దేవుడు కొన్ని సార్లు ఉన్నతోద్యోగులను వాడుకోగలడు (ఎస్తేరు 4:14; అపో. కార్యములు 8:39).

5. అహాబుదేశములోని ఉదకధారలన్నిటిని నదులన్నిటిని చూడబోయి, పశువులన్నిటిని పోగొట్టుకొనకుండ గుఱ్ఱములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలిసికొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను.

6. కాబట్టి వారు దేశమంతట సంచరింపవలెనని చెరియొక పాలు తీసికొని, అహాబు ఒంట రిగా ఒక వైపునకును ఓబద్యా ఒంటరిగా నింకొక వైపునకును వెళ్లిరి.

7. ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలీయా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా యితని నెరిగి నమస్కారము చేసినా యేలినవాడవైన ఏలీయావు నీవే గదా యని అడుగగా

8. అతడునేనేయని చెప్పినీవు నీ యేలిన వాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడనితెలియజేయుమనెను.

9. అందుకు ఓబద్యానేను చావవలె నని నీ దాసుడనైన నన్ను అహాబుచేతికి నీవు అప్పగింప నేల? నేను చేసిన పాపమేమి?

10. నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా యేలిన వాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్య మొకటైనను లేదు; అతడు ఇక్కడ లేడనియు, అతని చూడలేదనియు, వారు ఆయా జనములచేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి.

11. నీవునీ యేలినవానిచెంతకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే;

12. అయితే నేను నీయొద్దనుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును, అప్పుడు
అపో. కార్యములు 8:39

13. నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని యెడల అతడు నన్ను చంపి వేయును, ఆలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు, నీ దాసుడనైన నేను బాల్యమునుండి యెహోవాయందు భయభక్తులు నిలిపిన వాడను.
హెబ్రీయులకు 11:38

“వందమందిని”– సమూయేలు కాలంలో లాగానే (1 సమూయేలు 10:5 1 సమూయేలు 10:10) ఆ కాలంలో కూడా ప్రవక్తల గుంపులుండేవి. 1 రాజులు 20:35; 2 రాజులు 2:7 2 రాజులు 2:15 చూడండి.

14. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా యేలినవాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రక్తలలో నూరు మందిని గుహకు ఏబదేసి మందిచొప్పున దాచి, అన్న పానములిచ్చి వారిని పోషించితిని.

15. ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగానీ యేలినవాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవిచేయగా

“సేనల ప్రభువైన యెహోవా”– 1 సమూయేలు 1:3 నోట్.

16. ఏలీయాఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాననెను. అంతట ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్త మానమును తెలియజేయగా ఏలీయాను కలిసికొనుటకై అహాబు బయలుదేరెను.

17. అహాబు ఏలీయాను చూచిఇశ్రాయేలువారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా
అపో. కార్యములు 16:20

“ఇస్రాయేల్...కష్టపెట్టేవాడివి”– నిజంగా ఇస్రాయేల్ వారిని కష్టపెట్టేవాడు అహాబే. అహాబులాంటివారు ఉన్నప్పటికీ ఇస్రాయేల్‌వారిని కాపాడాలనే దేవుడు ఏలీయాను పంపాడు. మానవకోటిని కష్టాలపాలు చేసేవాళ్ళు పాపులు, పాపాత్ములైన నాయకులే గాని పాపాన్ని గద్దించి పశ్చాత్తాప పడాలన

18. అతడునేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువారై యున్నారు.

“బయల్”– 1 రాజులు 16:30-33. న్యాయాధిపతులు 2:11 నోట్.

19. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారి నందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతము నకు పిలువనంపుమని చెప్పెను.

“కర్మెల్”– మధ్యధరా తీరంవరకు వ్యాపించి ఉన్న పర్వతం. “బల్ల”– దేవుని ప్రజలైన ఇస్రాయేల్‌వారి సంపదను యెజెబెల్ ఒక అబద్ధ దేవుని కపట ప్రవక్తలను పోషించేందుకు వాడుతున్నది. అబద్ధ ప్రవక్తల గురించి నోట్స్ ఆదికాండము 20:11; ద్వితీయోపదేశకాండము 13:1; ద్వితీయోపదేశకాండము 18:20; యిర్మియా 14:14; మొ।।. “అషే

20. అహాబు ఇశ్రాయేలువా రందరియొద్దకు దూతలను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వత మునకు సమకూర్చెను.

850 అబద్ధ ప్రవక్తలకు ఎదురుగా ఏలీయా ఒక్కడు! ఇలాంటి సమతూకం లేని పోటీకి అహాబు అంగీకరించడానికి సిద్ధమే. ఇలాంటిదే మరో పోటీ గురించి నిర్గమకాండము 7:11 చూడండి.

21. ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ బడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుస రించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రక టన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి.

నిర్గమకాండము 32:26; యెహోషువ 24:15; 2 రాజులు 17:41; మత్తయి 6:24. ఏది సత్యమో, తాము దేన్ని అనుసరించాలో మనుషులు నిర్ణయించుకోవాలి. జీవితం గురించి అన్ని రకాల దృక్పథాలనూ అభిప్రాయాలనూ అంగీకరించడం అనేది విశాల హృదయంగాను, సహనంగాను అనేకమంది ఎంచుతారు. కొందరు మతాలన్నీ మంచివే, దేవ

22. అప్పుడు ఏలీయాయెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి యున్నాను; అయితే బయలునకు ప్రవక్తలు నాలుగువందల ఏబదిమంది యున్నారు.

1 రాజులు 19:10 1 రాజులు 19:14. ఏలీయాకు తానెంత ఒంటరివాడో అర్థం అవుతున్నది. కీర్తనల గ్రంథము 12:1 పోల్చిచూడండి. అందరూ చూస్తూవుండగా అబద్ధ మతానికి ఎదురు నిలిచి పోరాడేది తానొక్కడే అని ఏలీయా ఉద్దేశం.

23. మాకు రెండు ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచవలెను, రెండవ యెద్దును నేను సిద్ధము చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచుదును.

24. తరువాత మీరు మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పగా జనులందరునుఆ మాట మంచిదని ప్రత్యుత్తర మిచ్చిరి.
ప్రకటన గ్రంథం 13:13

“మంటలు”– అంటే నిజ దేవుణ్ణి ఒక అద్భుత కార్యం ద్వారా తన్ను తాను వెల్లడి చేసుకోనివ్వండి అని ఏలీయా ఉద్దేశం. యెహోవా ఇలా చెయ్యగలడనీ ఏలీయాకు తెలుసు (లేవీయకాండము 9:24). బయల్ అలా చెయ్యలేడనీ తెలుసు. ఈ సవాలు న్యాయమైన పరీక్షేనని ప్రజలు అర్థం చేసుకోగలిగారు. దేవునికి సూచనగా

25. అప్పుడు ఏలీయా బయలు ప్రవక్తలను పిలిచిమీరు అనేకులైయున్నారు గనుక మీరే మొదట ఒక యెద్దును కోరుకొని సిద్ధముచేసి మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడు; అయితే మీరు అగ్నియేమియు క్రింద వేయవద్దని చెప్పగా

26. వారు తమకు ఇయ్యబడిన యెద్దును తీసికొని సిద్ధముచేసి, ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకుబయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరి గాని యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి.

“జవాబేమీ రాలేదు”– బయల్ జవాబు చెప్పలేడు కాబట్టి చెప్పలేదు. వాడు మనుషులు కల్పించిన విగ్రహాలన్నిటి లాగా ఉన్నాడు (కీర్తనల గ్రంథము 95:5; కీర్తనల గ్రంథము 115:4-7; యెషయా 41:22-24; యెషయా 44:6 యెషయా 44:15-26; హబక్కూకు 2:18-20). “చిందులు త్రొక్కడం”– తమ దేవుణ్ణి పురికొల్పేటందుకు.

27. మధ్యాహ్నము కాగా ఏలీయావాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానము చేయు చున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి యున్నదేమో అని అపహాస్యము చేయగా

“గేలి చేస్తూ”– ఏలీయాకు దేవునిలో ఎంత సాహసం, నిబ్బరం ఉన్నాయి! ఇవి దేవుడు మాట్లాడాడనీ, తాము దేవునికి విధేయులుగా ఉన్నామనీ, తెలుసుకొన్నవారికి ఉన్న ధైర్యం, నిబ్బరం.

28. వారు మరి గట్టిగా కేకలువేయుచు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసికొనుచునుండిరి.

“రక్తధారలయ్యే వరకు”– తమ దేవుని నుంచి ఏదన్నా జవాబు రావాలన్న అంతిమ ప్రయత్నం.

29. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయమువరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని, మాటయైనను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యముచేసినవాడైనను లేక పోయెను.

“సందెవేళ నైవేద్యం”– నిర్గమకాండము 29:38-41. “పూనకం వచ్చి”– అంటే పిశాచాల ప్రభావం క్రింద లేక తమలో తామే శివమెత్తి కేకలు పెట్టారు. సంఖ్యాకాండము 11:25; ఆదికాండము 20:7 నోట్స్ చూడండి. “గమనించినట్టు లేదు”– సృష్టికర్త అయిన నిజ దేవుడు ప్రార్థనకు జవాబివ్వగలడు (కీర్తనల గ్రంథము 65:2). ఇలాంటి దేవు

30. అప్పుడు ఏలీయానా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడ ద్రోయబడియున్న యెహోవా బలిపీఠమును బాగుచేసి,

“శిథిలమైపోయిన”– నిజ దేవుని ఆరాధన నిర్లక్ష్యానికి గురి అయింది అనడానికి నిదర్శనం.

31. యహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని

32. ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి

“బలిపీఠం”– తన జీవితం, పరిచర్య ఇస్రాయేల్ దేవుడైన యెహోవాకు చెందినవి అని అందరికీ తెలియాలని అతని ఉద్దేశం.

33. కట్టెలను క్రమముగా పేర్చి యెద్దును తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి, జనులు చూచుచుండగామీరు నాలుగు తొట్లనిండ నీళ్లు నింపి దహనబలి పశుమాంసముమీదను కట్టెలమీదను పోయుడని చెప్పెను

తరువాత జరగబోయే అద్భుతం వాస్తవమైనదని చూపేందుకు.

34. అదియైన తరువాతరెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును ఆలాగు చేసిరి; మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి; అప్పుడు

35. ఆ నీళ్లు బలి పీఠముచుట్టును పొర్లి పారెను; మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను.

36. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెనుయెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.

ఏలీయా నమ్మకంతో చేసిన చిన్న ప్రార్థనకూ కపట ప్రవక్తల దీర్ఘమైన గగ్గోలుతో కూడిన ప్రార్థనలకూ ఉన్న తేడా గమనించండి. మత్తయి 6:7-8 చూడండి. “ఇస్రాయేల్”– నిర్గమకాండము 4:5 మొదలైనవి – ఇస్రాయేల్‌వారితో ఒడంబడిక చేసిన దేవుడు అని అర్థం.

37. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.

ఏలీయా మనసులో ఉన్న ఉద్దేశాన్ని గమనించండి – ఏదో కళ్ళు మిరుమిట్లు కొలిపే ప్రదర్శన ఇవ్వాలని కాదు, అందరూ తనను గుర్తించాలనీ కాదు గాని నిజ దేవుడెవరో ప్రజలు తెలుసుకోవాలనే. ఈ అతి ప్రాముఖ్యమైన విషయం బైబిలంతటిలోనూ నొక్కి చెప్పబడింది – నిర్గమకాండము 9:16; యెహోషువ 4:24 మొ।।.

38. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.

వ 24. విధేయత, నమ్మకం గల ప్రార్థన ఉంటే, తనను తాను వెల్లడి చేసుకోవడానికి దేవునికున్న సమ్మతిని గమనించండి. యోహాను 14:21 యోహాను 14:23 పోల్చి చూడండి. “మంటలు”– నిర్గమకాండము 3:2 నోట్.

39. అంతట జనులందరును దాని చూచి సాగిలపడియెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.

వ 21,24,37. ఈ పోటీకి ఉన్న ఉద్దేశం (వ 37) నెరవేరింది. అయితే దీని ఫలితం శాశ్వతంగా నిలిచిపోలేదు. త్వరలోనే ఆ ప్రజలు, వారి పాలకులు దేవుణ్ణి మళ్ళీ విడిచి పెట్టేశారు. 2 రాజులు 17:7-17 చూడండి.

40. అప్పుడు ఏలీయాఒకనినైన తప్పించు కొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను.

“చంపాడు”– ఆ జాతికి దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించే ఇది జరిగింది (ద్వితీయోపదేశకాండము 13:5 ద్వితీయోపదేశకాండము 13:13-18; ద్వితీయోపదేశకాండము 18:20). తప్పుడు పూజలు అనే దుర్మార్గానికి ప్రజలను నడిపించినవారికి ఇది న్యాయమైన శిక్షే.

41. పిమ్మట ఏలీయావిస్తార మైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా

“వర్షం”– ఇంకా మేఘమేమీ కనిపించలేదు. ఇది విశ్వాస పరిభాష (1 రాజులు 17:1).

42. అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.
యాకోబు 5:18

“అహాబు... వెళ్ళాడు”– బయల్ ప్రవక్తల వధను ఆపడానికి రాజు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఏలీయా చెప్పగానే అక్కడనుంచి వెళ్ళిపోయాడు. తాను చూచిన సంభవాలను బట్టి తాత్కాలికంగా తత్తరపడినట్టుగా ఉన్నాడు. తత్తరపడ్డాడు గాని పశ్చాత్తాపపడలేదు. తరువాత ఏమి జరిగిందో మనకు తెలుసు. అ

43. తరువాత అతడు తన దాసుని పిలిచినీవు పైకిపోయి సము ద్రమువైపు చూడుమనగా వాడు మెరకయెక్కి పారజూచి ఏమియు కనబడలేదనగా అతడుఇంక ఏడు మారులు పోయి చూడుమని చెప్పెను.

“ఏడు సార్లు”– ఏలీయాకు ప్రార్థన విషయంలో ఉన్న పట్టుదల చూడండి. లూకా 11:5-10; లూకా 18:1-8 పోల్చి చూడండి.

44. ఏడవ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయానీవు అహాబు దగ్గరకు పోయినీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధ పరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను.

45. అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను; మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రె యేలునకు వెళ్లిపోయెను.

యాకోబు 5:16-18; మార్కు 11:22-25 చూడండి.

46. యెహోవా హస్తము ఏలీయానుబలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబుకంటె ముందుగా పరుగెత్తికొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను.
లూకా 12:35

“బలపరచింది”– ఏలీయాకు సహజంగా ఉండే బలాన్ని మించిన బలం అతనికి వచ్చింది. రాజు రథం కంటే వేగంగా పరిగెత్తి ముందుగానే గమ్యం చేరుకోగలిగాడు. యెషయా 40:29-31; కొలొస్సయులకు 1:29 పోల్చి చూడండి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings I - 1 రాజులు 18 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఏలీయా అహాబు రాక గురించి నోటీసు పంపాడు. (1-16) 
అత్యంత కఠినమైన తీర్పులు మాత్రమే పాపుల హృదయాలలో వినయాన్ని లేదా పరివర్తనను తీసుకురాలేవు. పాపపు అపరాధానికి ప్రాయశ్చిత్తం చేయగల శక్తి యేసుక్రీస్తు రక్తానికి మాత్రమే ఉంది మరియు దేవుని పవిత్రాత్మ మాత్రమే దాని కలుషితాన్ని శుభ్రపరచగలదు. యాజకులు మరియు లేవీయులు యూదా మరియు యెరూషలేములకు బయలుదేరినప్పుడు 2 దినవృత్తాంతములు 11:13-14లో పేర్కొన్నట్లుగా), దేవుడు వారి స్థానంలో ప్రవక్తలను నియమించాడు. ఈ ప్రవక్తలు, శామ్యూల్ స్థాపించిన ప్రవక్తల పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి ఉండవచ్చు, ఏలీయా వలె అదే స్థాయిలో ప్రవచనాత్మక స్ఫూర్తిని కలిగి ఉండకపోవచ్చు, అయినప్పటికీ వారు ఇజ్రాయెల్ దేవునితో సన్నిహితంగా ఉండేలా ప్రజలకు మార్గనిర్దేశం చేశారు. యెజెబెల్ ఈ ప్రవక్తలను నిర్మూలించడానికి ప్రయత్నించింది, కానీ కొందరు తప్పించుకొని దాక్కోగలిగారు.
దేవుడు ఎల్లప్పుడూ వివిధ సమూహాల మధ్య ఒక శేషాన్ని భద్రపరుస్తాడు, అవి ఉన్నతమైనా లేదా తక్కువైనా, మరియు విశ్వాసం, భయం మరియు అతని పేరు పట్ల ప్రేమ-పరిశుద్ధాత్మ యొక్క ఉత్పత్తులు-విమోచకుని ద్వారా అంగీకరించబడతాయి. దేవుడు తన మంత్రులకు మరియు ప్రజలకు మద్దతు ఇవ్వడానికి మిత్రులను ఎలా పెంచుకుంటాడు, సవాలు సమయాల్లో వారికి ఆశ్రయం కల్పిస్తాడు. రొట్టె మరియు నీటి కొరత ఉన్నప్పటికీ, దేవుని ప్రవక్తలు జీవించడానికి తగినంత జీవనోపాధి ఉందని ఓబద్యా నిర్ధారించాడు. అహాబు యొక్క శ్రద్ధ ప్రధానంగా అతని పశువుల కోసం ఉంది, కానీ అతను తన ఆత్మను నిర్లక్ష్యం చేశాడు మరియు దేవుని అనుగ్రహాన్ని పొందడంలో విఫలమయ్యాడు. అతను అంతర్లీన కారణాలను ఎలా పరిష్కరించాలో ఆలోచించకుండా తన పరిస్థితుల ప్రభావాలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాడు.
ఆశాజనకమైన సంకేతంలో, ప్రజలకు సానుకూల దిశను సూచిస్తూ ముందుకు సాగి, తమను తాము బహిర్గతం చేయమని దేవుడు తన మంత్రులను పిలుస్తాడు. మన ఉపాధ్యాయుల ఉనికి మనం కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, బాధల సమయాలను భరించడంలో సహాయపడుతుంది.

ఏలీయా అహాబును కలుసుకున్నాడు. (17-20) 
ఆయన ప్రజల పట్ల మరియు మంత్రుల పట్ల వారి వైఖరిని గమనించడం ద్వారా దేవుని పట్ల ప్రజల వైఖరిని ఊహించవచ్చు. చరిత్ర అంతటా, ఏలీయా వంటి అత్యంత సద్గుణ మరియు ప్రభావవంతమైన వ్యక్తులు కూడా తరచుగా శాంతికి భంగం కలిగించేవారుగా ముద్రించబడ్డారు. ఏది ఏమైనప్పటికీ, పశ్చాత్తాపం అవసరమని ప్రవచించే మరియు దేశాన్ని అప్రమత్తం చేసే వారి కంటే, దేవుని తీర్పులను ప్రేరేపించే వారు నిజంగా హాని కలిగిస్తున్నారు.

తప్పుడు ప్రవక్తలపై ఏలీయా విచారణ. (21-40) 
జనాభాలో గణనీయమైన భాగం వారి తీర్పులలో చలించిపోయారు మరియు వారి చర్యలలో అస్థిరతను ప్రదర్శించారు. యెహోవా మరియు బాల్‌ల మధ్య ఖచ్చితమైన ఎంపిక చేయాలని ఏలీయా వారిని ప్రోత్సహించాడు, ఈ ఇద్దరిలో ఎవరు స్వయం-అస్తిత్వం, సర్వోన్నత దేవుడు-ప్రపంచాన్ని సృష్టించేవాడు, పాలకుడు మరియు న్యాయాధిపతి- మరియు నిజమైన దేవుణ్ణి మాత్రమే అనుసరించాలి. దేవుని సేవించడం మరియు పాపానికి లొంగిపోవడం లేదా మన కోరికల ఆధిపత్యానికి వ్యతిరేకంగా క్రీస్తు ఆధీనంలో ఉండటం ప్రమాదకరం. యేసు నిజంగా ఏకైక రక్షకుడైతే, మన విధేయత అన్ని విషయాల్లో ఆయనకు మాత్రమే ఉండాలి. అదేవిధంగా, బైబిల్ దేవుని వాక్యమైతే, అది మన ఆరాధన మరియు అంగీకారానికి అర్హమైనది, మన అవగాహనతో దాని దైవిక బోధనలకు లోబడి ఉంటుంది.
ఏలీయా సమస్యను పరిష్కరించడానికి ఒక విచారణను ప్రతిపాదించాడు. బాల్ బాహ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, ఫలితం మానవజాతి యొక్క బెదిరింపులకు ఎప్పుడూ భయపడకుండా దేవుని సాక్షులు మరియు న్యాయవాదులందరినీ ధైర్యాన్నిస్తుంది. అగ్ని ద్వారా సమాధానం చెప్పే దేవుణ్ణి దేవుడిగా గుర్తించాలి. తీర్పును దయతో నివారించే ముందు త్యాగం ద్వారా ప్రాయశ్చిత్తం సాధించాలి. కాబట్టి, పాపాన్ని క్షమించి, పాపపరిహారార్థబలిని సేవించడం ద్వారా దానిని సూచించే శక్తిని కలిగి ఉన్న దేవుడు తప్పనిసరిగా విపత్తు నుండి విముక్తి చేయగలడు.
బాయలు ఆరాధకుల మార్గాల్లో తనను గౌరవించమని దేవుడు తన ఆరాధకులను ఎన్నడూ కోరలేదు. దెయ్యం యొక్క సేవ, కొన్నిసార్లు శరీరానికి సంతృప్తినిస్తుంది మరియు ఆనందాన్ని ఇస్తుంది, అసూయ మరియు మద్యపానం వంటి అంశాలలో కూడా క్రూరంగా ఉంటుంది. దేవుడు మన కోరికలు మరియు లోపాలను అణచివేయాలని కోరుతున్నాడు, అయినప్పటికీ శారీరక మృదుత్వం మరియు కఠినమైన అభ్యాసాలు ఆయనకు ఆనందాన్ని కలిగించవు. మీ నుండి ఇలాంటి చర్యలు ఎవరు కోరుతున్నారు?
అచంచలమైన విశ్వాసంతో మాట్లాడే కొన్ని పదాలు, దేవుని మహిమ పట్ల అమితమైన భక్తి, మానవాళి యొక్క ఆత్మల పట్ల ప్రేమ లేదా ప్రభువు యొక్క ప్రతిరూపం మరియు అనుగ్రహం కోసం దాహంతో కూడిన ఒక నీతిమంతుని యొక్క శక్తివంతమైన మరియు తీవ్రమైన ప్రార్థనను కలిగి ఉంటుంది, ఇది గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఏలీయా తన వ్యక్తిగత కీర్తిని కాదు, ప్రజల అభివృద్ధి కోసం దేవుని మహిమను కోరుకున్నాడు. ప్రజలు సమిష్టిగా ఒక ఏకగ్రీవ మరియు సంతృప్తికరమైన ముగింపుకు చేరుకున్నారు: యెహోవాయే నిజమైన దేవుడు. కొంతమంది హృదయ పరివర్తనను అనుభవించి ఉండవచ్చు, చాలా మంది నిజమైన మార్పిడికి గురికాకుండా కేవలం ఒప్పించబడ్డారు. అదే దృశ్యమాన ప్రదర్శనలను చూడని వారు అదృష్టవంతులు, అయితే ప్రత్యక్షంగా చూసిన వారి కంటే దానిని విశ్వసించారు మరియు మరింతగా ప్రభావితం చేసిన వారు.

ఏలీయా, ప్రార్థన ద్వారా, వర్షాన్ని పొందుతాడు. (41-46)
ఇజ్రాయెల్ వారి సంస్కరణలో పురోగతి సాధించింది, ప్రభువును నిజమైన దేవుడిగా గుర్తించి, బాల్ ప్రవక్తలను ఉరితీయడానికి అంగీకరించింది. ఈ పాక్షిక పరివర్తన ఫలితంగా, దేవుడు భూమిపై ఆశీర్వాదాలను కురిపించాడు. ఏలీయా తన ప్రార్థనలలో పట్టుదలతో ఉన్నాడు, మన తీవ్రమైన మరియు నమ్మకమైన ప్రార్థనలకు ప్రతిస్పందన తక్షణమే కానప్పటికీ, ప్రార్థనలో మన శ్రద్ధను కొనసాగించాలని మరియు హృదయాన్ని కోల్పోకూడదని నిరూపించాడు. చివరికి, ఒక చిన్న మేఘం కనిపించింది, అది వేగంగా ఆకాశంలో వ్యాపించింది మరియు భూమికి చాలా అవసరమైన వర్షాన్ని తెచ్చింది. ముఖ్యమైన ఆశీర్వాదాలు తరచుగా వినయపూర్వకమైన ప్రారంభం నుండి ఉద్భవించాయి, అతి చిన్న మేఘాల నుండి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. నిరాడంబరమైన ప్రారంభాల సామర్థ్యాన్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు మరియు బదులుగా విశేషమైన ఫలితాల కోసం ఎదురుచూడాలి మరియు ఓపికగా ఎదురుచూడాలి.
అస్పష్టమైన మూలాల నుండి ఉద్భవించిన విశేషమైన పురోగతిని పరిగణించండి! ఈ సూత్రం మానవ ఆత్మతో దేవుని దయగల వ్యవహారాలన్నింటికీ వర్తిస్తుంది. హృదయంలో అతని ఆత్మ యొక్క ప్రారంభ ప్రకంపనలు చాలా అరుదుగా గుర్తించబడవచ్చు, అయితే కాలక్రమేణా, అవి మానవాళిని ఆశ్చర్యపరిచే మరియు దేవదూతల నుండి ప్రశంసలను పొందే విధంగా ఆశ్చర్యపరిచేవిగా అభివృద్ధి చెందుతాయి. ఏలీయా తన ప్రయాణంలో అహాబును త్వరత్వరగా తీసుకెళ్లి అతనితో పాటు వెళ్లాడు. దేవుడు తన ఆజ్ఞలు మరియు ప్రొవిడెన్స్ వారిని పిలిచే ఏ పనికైనా తన ప్రజలను సన్నద్ధం చేస్తాడు. దైవిక న్యాయం మరియు పవిత్రత యొక్క విస్మయపరిచే ప్రదర్శనలు పాపులను భయపెట్టవచ్చు, ఒప్పుకోలు మరియు తాత్కాలిక విధేయతను ప్రేరేపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ, ఆత్మను వినయం, నమ్మకం మరియు ఆప్యాయత వైపుకు ఆకర్షించడానికి క్రీస్తు యేసులోని దయ, ప్రేమ మరియు సత్యంతో పాటు ఈ అంశాల యొక్క సమతుల్య దృక్పథం చాలా అవసరం.
పాపుల మార్పిడిలో పవిత్రాత్మ రెండు అంశాలను ఉపయోగించుకుంటుంది. వ్యక్తులు దైవిక సత్యాలచే లోతుగా ప్రభావితమైనప్పుడు, రక్షకుడు తన శిష్యుల నుండి కోరే విధులలో పాల్గొనమని వారిని ప్రోత్సహించాలి.



Shortcut Links
1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |