Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. యెహూ యేలుబడిలో ఏడవ సంవత్సరమందుయోవాషు ఏలనారంభించి యెరూషలేములో నలువది సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధు రాలైన జిబ్యా.
2 దినవృత్తాంతములు 24:1-14.
2. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధినేర్పువాడై యుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను.
2 రాజులు 11:4. యోవాషు యెహోయాదా శిక్షణ క్రింద ఉన్నంతకాలం మంచి ప్రవర్తన గలవాడు. అయితే తరువాతి కాలంలో తనకు తెలిసిన సత్యాన్ని విడిచిపెట్టాడు (2 దినవృత్తాంతములు 24:17-27). తమ జీవితాంతం వరకు దేవుణ్ణి నమ్మకంగా సేవించేవారు ధన్యులు – 2 తిమోతికి 4:6-7; హెబ్రీయులకు 3:14; హెబ్రీయులకు 6:11-12; ప్రకటన గ్రంథం 2:10 ప్రకటన గ్రంథం 2:26.
3. అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను; జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి.
1 రాజులు 3:2; 1 రాజులు 15:14; 1 రాజులు 22:43. ఆ కాలంలో ఈ ఎత్తయిన ప్రదేశాల్లో ప్రజలు అబద్ధ దేవుళ్ళను కాక యెహోవాను ఆరాధించేవారు. అయినప్పటికీ ఈ పద్ధతి తనను ఆరాధించడానికి దేవుడిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా లేదు – నిర్గమకాండము 20:24; సంఖ్యాకాండము 33:52; ద్వితీయోపదేశకాండము 7:5; ద్వితీయోపదేశకాండము 12:3 ద్వితీయోపదేశకాండము 12:5 ద్వితీయోపదేశకాండము 12:8 ద్వితీయోపదేశకాండము 12:13-14.
4. యోవాషు యాజకులను పిలిపించియెహోవా మంది రములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలాచేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతుచొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును, స్వేచ్ఛచేత నెవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును,
“వ్యక్తిగతమైన”– లేవీయకాండము 27:1-25. “సుంకం”– నిర్గమకాండము 30:11-16; నిర్గమకాండము 38:25-26; సంఖ్యాకాండము 2:32. “స్వేచ్ఛా పూర్వకంగా”– లేవీయకాండము 22:18-23; ద్వితీయోపదేశకాండము 16:10.
5. యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారియొద్ద తీసికొని, మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై యున్నదో అచ్చటనెల్ల దానిని బాగుచేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను.
6. అయితే యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమువరకును యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగుచేయకయే యుండిరి గనుక
ఆలయ నిర్మాణం క్రీ.పూ. 959లో ముగిసింది. యోవాషు పరిపాలిస్తున్న 23వ ఏడు అంటే క్రీ.పూ. 835. 4వ వచనంలోని మాటలను యోవాషు పలికిన రోజు మనకు తెలియదు. అయితే రాజు ఆజ్ఞ జారీ చేసి చాలా కాలం అయిపోయిందనీ, ఎలాంటి మరమ్మత్తులూ జరగలేదనీ మాత్రం అర్థమౌతున్నది. అలాగైతే ఈ పని కోసం యాజులకు చేరుతున్న డబ్బంతా ఏమైనట్టు? దేవుని సేవలోవారికి ఉండవలసిన ఆసక్తి ఏది? క్రైస్తవ సేవకులు, దేవుని ప్రజలంతా కూడా డబ్బు విషయాల్లో పూర్తిగా యథార్థంగా ఉండడం ఎంత ప్రాముఖ్యం! దేవుని పని కోసమని ఇచ్చిన డబ్బును దుర్వినియోగం చెయ్యడమంటే దేవునినుంచి దొంగిలించడమే. దేవుడు ఇచ్చిన పని విషయంలో ఆసక్తి లోపించడమే ఆయనపట్ల మన ప్రేమ ఎంత స్వల్పమో చూపించడమే.
7. యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగి లిన యాజకులను పిలిపించిమందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగుచేయక పోతిరి? ఇకను మీ మీ నెలవైన వారియొద్ద ద్రవ్యము తీసికొనక, మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుటకై మీరు అంతకుముందు తీసికొనినదాని నప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి యుండెను.
8. కాబట్టి యాజకులుమందిరములో శిథిల మైన స్థలములను బాగుచేయుట మా వశము లేదు గనుక జనులయొద్ద ద్రవ్యము ఇక తీసికొనమని చెప్పిరి.
9. అంతట యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి, బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా ద్వారముకాయు యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి.మార్కు 12:41
“పెట్టె”– మార్కు 12:41; లూకా 21:1. “ద్వారం...కాపలా ఉండే”– ప్రవేశించే హక్కులేని వారిని రానివ్వకుండా చూశారు వీళ్ళు.
10. పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియ జేయగా రాజుయొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి, యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి.
11. తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు, అనగా పనిచేయించు వారి కప్పగించిరి; వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్ప కారులకును కాసెపనివారికిని రాతిపనివారికిని
సరైన అజమాయిషీలో పని కొనసాగింది. పోగైన డబ్బు సరైన రీతిలో ఖర్చు అయింది. ఆలయ మరమ్మత్తులకని వచ్చిన డబ్బును వేరే దానికి ఖర్చు చేయడం జరగలేదు.
12. యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్క బడిన రాళ్లనేమి కొనుటకును, మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని, ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి.
13. యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకాలైనను, బంగారు పాత్రలైనను, వెండిపాత్రలైనను చేయబడలేదు గాని
14. మరమ్మతు పనిచేయువారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరల బాగు చేయించిరి.
15. మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనినవారు నమ్మకస్థులని వారిచేత లెక్క అడుగలేదు.
“నిజాయితీపరులు”– 2 రాజులు 22:7; 1 కోరింథీయులకు 4:2. దేవుని పనిలో నిజాయితీ ఎంతో ప్రాముఖ్యం. మన పనిలో మనం నిజాయితీ చూపకపోతే అదంతా వ్యర్థమే.
16. అపరాధ పరిహారార్థ బలులవలనను పాప పరిహారార్థ బలులవలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు, అది యాజకులదాయెను.
లేవీయకాండము 4:24 లేవీయకాండము 4:29; లేవీయకాండము 5:15-18; లేవీయకాండము 7:7; సంఖ్యాకాండము 4:9 సంఖ్యాకాండము 4:19.
17. అంతట సిరియారాజైన హజాయేలు గాతు పట్టణము మీదికి పోయి యుద్ధముచేసి దాని పట్టుకొనిన తరువాత అతడు యెరూషలేముమీదికి రాదలచియుండగా
యెహోయాదా కొడుకును యోవాషు చంపించిన తరువాత ఈ సంఘటనలు జరిగాయని 2 దినవృత్తాంతములు 24:23-26 తెలియజేస్తున్నది. “హజాయేల్”– 2 రాజులు 8:9-13; 2 రాజులు 10:32-33.
18. యూదారాజైన యోవాషు తన పితరులైన యెహోషా పాతు యెహోరాము అహజ్యా అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటిని, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరములోను రాజనగరులోనున్న పదార్థములలోను కనబడిన బంగారమంతయు తీసికొనిసిరియారాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూష లేమునొద్దనుండి తిరిగిపోయెను.
1 రాజులు 15:18; 2 రాజులు 16:8; 2 రాజులు 18:15-16. దేవుని శత్రువులకు లంచాలిచ్చేందుకు దేవుని సొమ్మును వాడడం పొరపాటు, అనవసరం కూడా. దేవుడు సంరక్షిస్తాడని నమ్మకం లేదు గనుక ఇలా జరిగింది. ఇప్పుడు యోవాషుకు అవసరమైనది పశ్చాత్తాపం.
19. యోవాషు చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
“చరిత్ర గ్రంథం”– 1 రాజులు 14:19.
20. అతని సేవకులు లేచి కుట్రచేసి సిల్లా అను చోటకి పోవుమార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి.
“చంపారు”– 2 దినవృత్తాంతములు 24:25 లో దీనికి కారణం కనిపిస్తున్నది.
21. ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులును అతనిమీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి; అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.
“దావీదు నగరం”– 2 సమూయేలు 5:6-7.