Kings II - 2 రాజులు 17 | View All

1. యూదారాజైన ఆహాజు ఏలుబడిలో పండ్రెండవసంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలెను.

1. In the twelfth year of Ahaz king of Juda, Hosea son of Elah began to reign in Samaria upon Israel, and continued nine years,

2. అతడు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంతమట్టుకు చేయకపోయినను, యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను.

2. and did that displeased the LORD, but not so evil as did the kings of Israel that were before him.

3. అతని మీదికి అష్షూరురాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను.

3. And Salmanasar king of Assiria came upon him, and Hosea became his servant and gave him presents.

4. అతడు ఐగుప్తురాజైన సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేట ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరురాజునకు పన్ను ఇయ్యకపోగా, హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలిసికొని అతనికి సంకెళ్లు వేయించి బందీగృహములో ఉంచెను.

4. And the king of Assiria found treason in Hosea, because he had sent messengers to Sua king of Egypt, and sent no presents unto the king of Assiria, as he was yearly wont to do. Therefore the king of Assiria besieged him and put him in prison.

5. అష్షూరురాజు దేశమంతటిమీదికిని షోమ్రోనుమీదికిని వచ్చి మూడు సంవత్సరములు షోమ్రో నును ముట్టడించెను.

5. And then the king of Assiria came thorowout all the land, and came to Samaria and besieged it three years.

6. హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెర గొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణ ములలోను వారిని ఉంచెను.

6. And in the ninth year of Hosea, the king of Assiria took Samaria and carried Israel away unto Assiria and put them in Hala, in Habor on the river of Gozan, and in the cities of the Medes.

7. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశ ములో నుండియు, ఐగుప్తురాజైన ఫరోయొక్క బలము క్రిందనుండియు, తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపముచేసి యితర దేవతలయందు భయభక్తులు నిలిపి

7. For the children of Israel had sinned against the LORD their God which brought them out of the land of Egypt, from under the hand of Pharao king of Egypt, and feared other gods.

8. తమయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలురాజులు నిర్ణ యించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి.

8. And they walked in the ordinance of the heathen which the LORD cast out before the children of Israel, and in the things which the kings of Israel had made.

9. మరియఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములు గల పట్టణనివాసులును తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని

9. And the children of Israel wrapped themselves in things that were not well toward the LORD their God. And they built them Hillaltars in all their cities, both in the towers where they kept watch and also in the strong towns.

10. యెత్తయిన కొండలన్నిటిమీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి, అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి

10. And they made them Images and groves on every high hill and under every green tree.

11. తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులవాడుక చొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి

11. And there they sacrificed in the Hillaltars, as did the heathen which the LORD carried away at their coming, and wrought wicked deeds, to anger the LORD withal.

12. చేయకూడదని వేటినిగూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటిని చేసి పూజించు చుండిరి.

12. And they served Idols, whereof the LORD had said to them: ye shall not do so.

13. అయిననుమీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్త లందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రా యేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను,

13. And the LORD testified to Israel and to Juda, by all the prophets and by all the sears, saying: Turn from your wicked ways and keep my commandments and mine ordinances according to all the laws which I commanded your fathers, and as I sent to you by my servants the prophets.

14. వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.

14. Notwithstanding they would not hear, but hardened their necks, like to the necks of their fathers that did not believe the LORD their God.

15. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణ యించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుస రించుచు, వ్యర్థులైవారి వాడుకలచొప్పున మీరు చేయ కూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి.

15. And they refused his ordinances and his appointment that he had made with their fathers, and the witness which he had witnessed to them and followed vanity and became vain, like to the heathen that were round about them, of which the LORD had charged them, that they should not do like them.

16. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని యనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభ ములను నిలిపి ఆకాశసమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించిరి.

16. But they left the commandments of the LORD their God and made them Images of metal, even two calves: and made groves and bowed themselves unto all the Host of heaven, and served Baal.

17. మరియు తమ కుమారులను కుమార్తె లను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టిం చిరి.

17. And they sacrificed their sons and their daughters in fire, and used witchcraft and enchantments, and were sold to work wickedness in the sight of the LORD, for to anger him.

18. కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్ల గొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.

18. Wherefore the LORD was exceeding wroth with Israel and put them out of his sight, that there was left but the tribe of Juda onely,

19. అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టినవారై ఇశ్రాయేలువారు చేసికొనిన కట్టడలను అనుసరించిరి.

19. and thereto Juda kept not the commandments of the LORD their God, but walked in the ordinances of Israel which they had made.

20. అంతట యెహోవా ఇశ్రాయేలువారి సంతతివారినందరిని విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖమునుండి వెళ్లగొట్టెను.

20. Therefore the LORD cast up all the seed of Israel and vexed them and delivered them into the hands of spoilers, until he had cast them out of his sight.

21. ఆయన ఇశ్రా యేలు గోత్రములను దావీదు ఇంటివారిలోనుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసికొనిరి. ఈ యరొబాము ఇశ్రాయేలువారు యెహోవాను అనుసరింపకుండ ఆయనమీద వారిని తిరుగ బడచేసి, వారు ఘోరపాపము చేయుటకు కారకు డాయెను.

21. And Israel divided themselves, from the house of David, and made Jeroboam the son of Nabat king. Which Jeroboam thrust Israel away from the LORD and made them sin a great sin.

22. ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాప ములలో దేనిని విడువక వాటి ననుసరించుచు వచ్చిరి గనుక

22. And so the children of Israel walked in all the sin of Jeroboam which he had set up, and departed not therefrom,

23. తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెల విచ్చిన మాటచొప్పున, ఆయన ఇశ్రాయేలువారిని తన సముఖములోనుండి వెళ్లగొట్టెను. ఆ హేతువుచేత వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశ ములోనికి చెరగొని పోబడిరి; నేటివరకు వారచ్చట ఉన్నారు.

23. until the LORD had put Israel away out of his sight, as he said by all his servants the prophets. And so he translated Israel out of their land to Assiria, even unto this day.

24. అష్షూరురాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలోనుండి జనులనురప్పించి, ఇశ్రాయేలువారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వంతంత్రించు కొని దాని పట్టణములలో కాపురము చేసిరి.

24. And the king of Assiria brought from Babylon and from Cutha, and from Ava and from Hemath and from Sepharuaim, and put them in the cities of Samaria instead of the children of Israel. And they possessed Samaria and dwelt in the cities thereof.

25. అయితే వారు కాపురముండ నారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను.

25. But at the beginning of their dwelling, they feared not the LORD. Wherefore the LORD sent lions upon them which slew them.

26. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియ కున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రా యేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరురాజుతో మనవి చేయగా

26. Then men told the king of Assiria, saying: The nations which thou hast translated and put in the cities of Samaria, know not the manner of the God of the land, and therefore he hath sent lions upon them, which slay them, because they know not the manner of the God of the land.

27. అష్షూరు రాజు అచ్చటనుండి తేబడిన యాజకు లలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొనిపోవుడి; అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను.

27. Then the king of Assiria commanded saying: carry thither one of the priests which ye brought thence, and let him go and dwell there, and teach them the fashion how to serve the God of the country.

28. కాగా షోమ్రో నులోనుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి, యెహోవాయందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను గాని

28. And then one of the priests which they had carried thence, went and dwelt in Bethel, and taught them how they should fear the LORD.

29. కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నతస్థలముల మందిరములలో వాటిని ఉంచుచువచ్చిరి; మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసికొనిరి.

29. How be it every nation made their own gods and put them in the houses of the Hillaltars which the Samaritans had made, every nation in their cities where they dwelt.

30. బబులోనువారు సుక్కోత్బెనోతు దేవతను, కూతావారునెర్గలు దేవతను, హమాతువారు అషీమా దేవతను,

30. The men of Babylon made Socoth, Benoth. The men of Cuth made Nergal. They of Hemath made Asima.

31. ఆవీయులు నిబ్హజు దేవతను తర్తాకు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టు కొనుచుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను ఆద్రమ్మె లెకు అనెమ్మెలెకు అను సెపర్వయీముయొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి.

31. The Evites made Nebahaz, and Tharthak. And the Sepharuites burnt their children in fire unto Adramelech and Anamelech, the gods of Sepharuites.

32. మరియు జనులు యెహోవాకు భయపడి, ఉన్నత స్థలములనిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసికొనగా వారు జనులపక్షమున ఉన్నతస్థలములలో కట్టబడిన మందిరములయందు బలులు అర్పించుచుండిరి.

32. And they feared the LORD, yet they made them priests of the lowest of the people, for the Hillaltars, which sacrificed for them in the houses of the Hillaltars.

33. ఈ ప్రకారముగా వారు యెహోవాయందు భయభక్తులుగలవారైయుండి, తాము ఏ జనులలోనుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి.

33. And so they feared the LORD, and yet served their own gods after the manner of the people from whence they were brought.

34. నేటి వరకు తమ పూర్వమర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు; యెహోవాయందు భయభక్తులు పూనక వారితో నిబంధనచేసి మీరు ఇతర దేవతలకు భయపడ కయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు,

34. Unto this day they do after the old manner: they neither fear the LORD, neither do after their own ordinances and customs, and after the law and commandment which the LORD commanded the children of Jacob whose name he called Israel,

35. మహాధికారము చూపి బాహు బలముచేత ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారముచేసి బలులు అర్పింపవలెనని ఇశ్రాయేలని పేరుపెట్టబడిన యాకోబు సంతతివారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు

35. and made an appointment with them and charged them saying: Fear not any other gods, nor bow yourselves to them nor serve them, nor sacrifice to them:

36. ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధు లను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు.

36. But to the LORD which brought you out of the land of Egypt with great power and a stretched out arm: him fear and to him bow and to him do sacrifice.

37. మరియుఇతర దేవతలను పూజింపక మీరు బ్రదుకు దినములన్నియు మోషే మీకు వ్రాసియిచ్చిన కట్టడలను విధులను, అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను.

37. And the ordinances, customs, law and commandment which I wrote for you, see that ye be diligent to do for evermore, and fear not any other gods.

38. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను.

38. And the appointment that I have made with you, see ye forget not, and that you fear none other gods:

39. మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవారై యుండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను

39. but the LORD your God ye shall fear, and he shall deliver you out of the hands of all your enemies.

40. వారు ఆయన మాటవినక తమ పూర్వపు మర్యాదచొప్పుననే జరిగించుచు వచ్చిరి.

40. How be it they heard not, but did after the old manner.

41. ఆ ప్రజలు ఆలాగున యెహోవాయందు భయ భక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి యింటివారును వారి సంతతివారును నేటివరకు చేయుచున్నారు.

41. And even so did these nations fear the LORD and serve their images thereto: and so did their children, and their children's children too. Even as did their fathers, so do they unto this day.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings II - 2 రాజులు 17 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఇజ్రాయెల్‌లో హోషేయా పాలన, ఇశ్రాయేలీయులు అస్సిరియన్లచే బందీలను తీసుకువెళ్లారు. (1-6) 
తప్పు యొక్క పరిధి దాని సంపూర్ణతకు చేరుకున్న తర్వాత, ప్రభువు ఇకపై సంయమనం చూపడు. షోమ్రోనులో నివసించే ప్రజలు తప్పనిసరిగా గణనీయమైన బాధలను ఎదుర్కొన్నారు. పేద ఇశ్రాయేలీయులలో కొంత భాగం భూమిలోనే ఉండిపోయింది, అయితే బందీలుగా మరియు దూరంగా రవాణా చేయబడిన వారు వివిధ దేశాల మధ్య ఎక్కువగా చెదరగొట్టబడ్డారు.

ఇశ్రాయేలీయుల బందిఖానా. (7-23) 
పది తెగల పతనానికి సంబంధించిన రాజ్యం గురించిన సంక్షిప్త వృత్తాంతం ముందుగా ప్రస్తావించబడినప్పటికీ, ఈ శ్లోకాలు దాని గురించి విస్తృతంగా విశదీకరించాయి మరియు అంతర్లీన కారణాలను అందిస్తాయి. ఈ విధ్వంసం సర్వశక్తిమంతుడి నుండి ఉద్భవించింది, అస్సిరియన్లు అతని ఉగ్రతకు సాధనంగా మాత్రమే పనిచేశారు యెషయా 10:5. ఒక దేశం లేదా కుటుంబానికి పాపాన్ని పరిచయం చేసేవారు తప్పనిసరిగా ప్లేగును ప్రవేశపెడతారు మరియు ఫలితంగా వచ్చే అన్ని హానికి వారు జవాబుదారీగా ఉంటారు. లోకంలో స్పష్టంగా కనిపించే దుష్టత్వం ఎంత విస్తృతమైనదో, మానవత్వంలో దాగి ఉన్న పాపాలు-చెడు ఆలోచనలు, కోరికలు మరియు ఉద్దేశాలు- మరింత ముఖ్యమైనవి. కొన్ని పాపాలు బహిరంగంగా అవమానకరమైనవి అయితే, కృతఘ్నత, నిర్లక్ష్యం, దేవుని పట్ల శత్రుత్వం మరియు తదుపరి విగ్రహారాధన మరియు అపవిత్రత చాలా హానికరమైనవి. ప్రతి పాపాత్మకమైన మార్గం నుండి పూర్తిగా వైదొలగకుండా మరియు దేవుని ఆజ్ఞలను పాటించాలనే నిబద్ధత లేకుండా నిజమైన దైవభక్తి ఉనికిలో ఉండదు. ఈ పరివర్తన అన్ని భక్తిహీనత మరియు అన్యాయానికి వ్యతిరేకంగా అతని నీతియుక్తమైన కోపానికి సంబంధించి దేవుని సాక్ష్యంలో నిజమైన విశ్వాసం నుండి ఉద్భవించాలి, అలాగే క్రీస్తు యేసు ద్వారా ఆయన దయతో కూడిన ఏర్పాటు.

ఇజ్రాయెల్ దేశంలో ఉంచబడిన దేశాలు. (24-41)
సర్వశక్తిమంతుడి నుండి వెలువడే భయం కొన్ని సమయాల్లో ఇజ్రాయెల్‌లో నివసించడానికి వివిధ దేశాల నుండి తీసుకువచ్చిన వారి మాదిరిగానే, ఇంకా నిజమైన మార్పిడికి గురికాని వ్యక్తుల నుండి బలవంతపు లేదా నిజాయితీ లేని సమ్మతిని పొందగలదు. అయినప్పటికీ, అలాంటి వ్యక్తులు దేవుని గురించి అనర్హమైన అవగాహనలను కలిగి ఉంటారు. వారు మిడిమిడి ఆచారాల ద్వారా ఆయనను సంతోషపెట్టాలని ఎదురుచూస్తారు మరియు వారి భక్తిని ప్రాపంచిక ప్రేమలతో మరియు వారి కోరికలలో మునిగిపోవడానికి నిష్ఫలంగా ప్రయత్నిస్తారు.
జ్ఞానం యొక్క ప్రారంభాన్ని సూచించే దేవుని యొక్క గౌరవప్రదమైన విస్మయం, మన హృదయాలను పట్టుకుని, మన ప్రవర్తనకు మార్గనిర్దేశం చేస్తుంది, తద్వారా రాబోయే ఏవైనా మార్పులకు మనం సిద్ధంగా ఉంటాము. భూసంబంధమైన స్థావరాలు ప్రమాదకరమైనవి; మన జీవితాంతం ముందు మనం ప్రయాణించే మార్గాల గురించి అనిశ్చితంగా ఉంటాము మరియు ఈ ప్రపంచం నుండి మన నిష్క్రమణ అనివార్యం. అయినప్పటికీ, నీతిమంతులు తమ నుండి తీసివేయలేని అమూల్యమైన భాగాన్ని ఎంచుకున్నారు.



Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |