Kings II - 2 రాజులు 19 | View All

1. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి

1. hijkiyaa vini thana battalu chimpukoni gonepatta kattukoni yehovaa mandiramunaku poyi

2. గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజ కులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయాయొద్దకు పంపెను.

2. gruha nirvaahakudagu elyaakeemunu, shaastri shebnaanu, yaaja kulalo peddalanu, aamoju kumaarudunu pravakthayunaina yeshayaayoddhaku pampenu.

3. వీరు గోనెపట్ట కట్టుకొని అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరిహిజ్కియా సెల విచ్చునదేమనగాఈ దినము శ్రమయు శిక్షయు దూష ణయు గల దినము;పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు.

3. veeru gonepatta kattukoni athaniyoddhaku vachi athanithoo itlanirihijkiyaa sela vichunadhemanagaa'ee dinamu shramayu shikshayu doosha nayu gala dinamu;pillalu puttavachiri gaani kanutaku shakthi chaaladu.

4. జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.

4. jeevamugala dhevuni dooshinchutakai ashshooru raajaina thana yajamaanunichetha pampabadina rabshaake palikina maatalanniyu nee dhevudaina yehovaa okavela aalakinchi, nee dhevudaina yehovaaku vinabadiyunna aa maatalanubatti aayana ashshooruraajunu gaddinchunemo kaabatti nilichina sheshamukoraku neevu hechugaa praarthana cheyumu.

5. రాజైన హిజ్కియా సేవకులు యెషయాయొద్దకు రాగా

5. raajaina hijkiyaa sevakulu yeshayaayoddhaku raagaa

6. యెషయా వారితో ఇట్లనెనుమీ యజమానునికి ఈ మాట తెలియజేయుడియెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరురాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.

6. yeshayaa vaarithoo itlanenumee yajamaanuniki ee maata teliyajeyudiyehovaa selavichunadhemanagaa ashshooruraaju panivaaru nannu dooshimpagaa neevu vinina maatalaku bhayapadavaddu.

7. అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళి పోవును; తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును.

7. athanilo oka yaatmanu nenu puttinthunu, athadu vadanthi vini thana dheshamunaku velli povunu; thana dheshamandu katthichetha athani koolacheyudunu.

8. అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.

8. ashshooruraaju laakeeshu pattanamunu vidichi velli libnaa meeda yuddhamu cheyuchundagaa rabshaake poyi athani kalisikonenu.

9. అంతట కూషురాజైన తిర్హాకా తనమీదయుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడి నప్పుడు, అతడు ఇంకొకసారి హిజ్కియాయొద్దకు దూత లను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను.

9. anthata kooshuraajaina thir'haakaa thanameedayuddhamu cheyutaku vacchenani ashshooru raajunaku vinabadi nappudu, athadu inkokasaari hijkiyaayoddhaku dootha lanu pampi yeelaagu aagna icchenu.

10. యూదారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడియెరూషలేము అష్షూరురాజుచేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని యున్న నీ దేవునిచేత మోసపోకుము.

10. yoodhaaraajagu hijkiyaathoo eelaagu cheppudiyerooshalemu ashshooruraajuchethiki appagimpabadadani cheppi neevu nammukoni yunna nee dhevunichetha mosapokumu.

11. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవుమాత్రము తప్పించుకొందువా?

11. idigo ashshooru raajulu sakala dheshamulanu botthigaa nashimpajesina sangathi neeku vinabadinadhi gadaa neevumaatramu thappinchukonduvaa?

12. నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారు గాని హారాను వారు గాని, రెజెపులు గాని, తెలశ్శారులో నుండిన ఏదె నీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించు కొనిరా?

12. naa pitharulu nirmoolamuchesina gojaanuvaaru gaani haaraanu vaaru gaani, rejepulu gaani, telashshaarulo nundina ede neeyulu gaani thama dhevathala sahaayamuvalana thappinchu koniraa?

13. హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వియీము హేఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి?

13. hamaathu raaju emaayenu? Arpaaduraajunu separviyeemu hena ivvaa anu pattanamula raajulunu emairi?

14. హిజ్కియా దూతలచేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి

14. hijkiyaa doothalachethilonundi aa uttharamu theesikoni chadhivi, yehovaa mandiramuloniki poyi yehovaa sannidhini daani vippi parachi

15. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెనుయెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యా కాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోక మందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు.

15. yehovaa sannidhini itlani praarthanachesenuyehovaa, keroobula madhyanu nivasinchuchunna ishraayeleeyula dhevaa, bhoomyaa kaashamulanu kalugajesina advitheeya dhevaa, neevu loka mandunna sakala raajyamulaku dhevudavaiyunnaavu.

16. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవిని బెట్టుము.

16. yehovaa, cheviyoggi aalakimpumu; yehovaa, kannulu terachi drushtinchumu; jeevamugala dhevudavaina ninnu dooshinchutakai sanhereebu pampinavaani maatalanu chevini bettumu.

17. యెహోవా, అష్షూరురాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి

17. yehovaa, ashshooruraajulu aa janamulanu vaari dheshamulanu paaduchesi

18. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి.

18. vaari dhevathalanu agnilo vesinadhi nijame. aa raajyamula dhevathalu nijamaina dhevundlu kaaka manushyulachetha cheyabadina karralu raalle ganuka vaaru vaarini nirmoolamu chesiri.

19. యెహోవా మా దేవా; లోక మందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడ వైన యెహోవావని తెలిసికొనునట్లుగా అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము.

19. yehovaa maa dhevaa; loka mandunna samastha janulu neeve nijamugaa advitheeya dhevuda vaina yehovaavani telisikonunatlugaa athanichethilonundi mammunu rakshinchumu.

20. అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెనుఇశ్రాయేలీయుల దేవు డగు యెహోవా సెలవిచ్చు నదేమనగా అష్షూరురాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థననేను అంగీకరించియున్నాను.

20. anthata aamoju kumaarudaina yeshayaa hijkiyaa yoddhaku ee varthamaanamu pampenu'ishraayeleeyula dhevu dagu yehovaa selavichu nadhemanagaa ashshooruraajaina sanhereebu vishayamandu neevu naa yeduta chesina praarthananenu angeekarinchiyunnaanu.

21. అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగాసీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయు చున్నది; యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచు చున్నది.

21. athanigoorchi yehovaa selavichumaata yedhanagaaseeyonu kumaariyaina kanyaka ninnu dooshanacheyuchunnadhi; ninnu apahaasyamu cheyu chunnadhi; yerooshalemu kumaari ninnu chuchi thala oochu chunnadhi.

22. నీవు ఎవనిని తిరస్కరించితివి? ఎవనిని దూషించితివి? నీవు గర్వించి యెవనిని భయపెట్టితివి?

22. neevu evanini thiraskarinchithivi? Evanini dooshinchithivi? neevu garvinchi yevanini bhayapetthithivi?

23. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినేగదా నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవేగదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకునులెబానోను పార్శ్వములకును ఎక్కియున్నానుఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసి యున్నానువాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికినికర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి యున్నాను.

23. ishraayeleeyula parishuddha dhevuninegadaa nee doothalachetha yehovaanu thiraskarinchi palikinchina maatalu ivegadaa.Naa rathamula samudaayamuthoo nenu parvatha shikharamulakunulebaanonu paarshvamulakunu ekkiyunnaanu'etthugala daani dhevadaaru vrukshamulanu shreshthamaina saralavrukshamulanu narikivesi yunnaanuvaani doorapu sarihaddulalo satramulalonikinikarmelu phalavanthamulagu kshetramaina adavilonikini praveshinchi yunnaanu.

24. నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపో జేసియున్నాను.

24. nenu travvi parula neellu paanamu chesiyunnaanu naa arakaalichetha nenu dittamaina sthalamula nadula nannitini endipo jesiyunnaanu.

25. నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతనకాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నావలననే సంభవించినది.

25. nene poorvamandhe deeni kalugajesithinaniyu puraathanakaalamandhe deeni nirnayinchithinaniyu neeku vinabadaledaa? Praakaaramulugala pattanamulanu neevu paadu dibbalugaa cheyuta naavalanane sambhavinchinadhi.

26. కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.

26. kaabatti vaati kaapurasthulu balaheenulai jadisiri vibhraanthinondi polamuloni gaddivalenu kaadaveyani chelavalenu ayiri.

27. నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.

27. neevu koorchundutayu bayaluvellutayu lopaliki vachutayu naameedaveyu rankelunu naaku teliseyunnavi.

28. నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.

28. naameeda neevu veyu rankelunu neevu chesina kalahamunu naa chevulalo jocchenu ganuka naa gaalamunu nee mukkunaku thagilinchedanu. Naa kallemu nee notilo petti ninnu mallinchedanu. neevu vachina maargamunane ninnu mallinchedanu.

29. మరియయెషయా చెప్పినదేమనగాహిజ్కియా, నీ కిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు.

29. mariyu yeshayaa cheppinadhemanagaahijkiyaa, nee kidhe soochanayagunu. ee samvatsaramandu daananthata adhe pandu dhaanyamunu, rendava samvatsaramandu daani nundi kalugu dhaanyamunu meeru bhujinthuru, moodava samvatsaramuna meeru vitthanamu vitthi chelu koyuduru; draakshathootalu naati vaatiphalamu anubhavinchuduru.

30. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.

30. yoodhaa vanshamulo thappinchukonina sheshamu inkanu krindiki veru thanni meediki edigi phalinchunu.

31. శేషించు వారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు;తప్పించు కొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యముల కధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెర వేర్చును.

31. sheshinchu vaaru yerooshalemulonundi bayaludheruduru;thappinchu koninavaaru seeyonu kondalonundi bayaludheruduru; sainyamula kadhipathiyagu yehovaa aasakthi deeni nera verchunu.

32. కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు.

32. kaabatti ashshooru raajunugoorchi yehovaa selavichunadhemanagaa athadu ee pattanamuloniki raadu; daanimeeda oka baanamaina prayogimpadu; oka kedemunaina daaniki kanuparachadu; daaniyeduta muttadidibba kattadu.

33. ఈ పట్టణములోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు.

33. ee pattanamulopaliki raaka thaanu vachina maargamunane athadu thirigi povunu; idhe yehovaa vaakku.

34. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.

34. naa nimitthamunu naa sevakudaina daaveedu nimitthamunu nenu ee pattanamunu kaapaadi rakshinchudunu.

35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి.

35. aa raatriye yehovaa dootha bayaludheri ashshooru vaari dandu petalo jochi laksha yenubadhi yayidu velamandhini hathamuchesenu. Udayamuna janulu lechi choodagaa vaarandarunu mruthakalebaramulai yundiri.

36. అష్షూరురాజైన సన్హెరీబు తిరిగి పోయి నీనెవె పట్టణమునకు

36. ashshooruraajaina sanhereebu thirigi poyi neeneve pattanamunaku

37. వచ్చి నివసించిన తరువాతఒఅతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరా రాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి; అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.

37. vachi nivasinchina tharuvaatha'o'athadu nisroku anu thana dhevatha mandiramandu mrokkuchundagaa athani kumaarulaina adremmelekunu sharejerunu khadgamuthoo athani champi araa raathu dheshamuloniki thappinchukoni poyiri; appudu athani kumaarudaina esar'haddonu athaniki maarugaa raajaayenu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings II - 2 రాజులు 19 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

హిజ్కియా శాంతి సమాధానాన్ని పొందాడు. (1-7) 
రబ్షాకే దైవదూషణ ద్వారా దేవునికి చూపబడిన అగౌరవాన్ని చూసి హిజ్కియా హృదయం తీవ్రంగా కలత చెందింది. దేవుని నుండి మనకు సందేశాలను అందజేసే వారు మన తరపున దేవునితో మధ్యవర్తిత్వం వహించడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించడం చాలా ముఖ్యం. ప్రముఖ ప్రవక్త అసాధారణమైన మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. ప్రార్థనలో తమ హృదయాలను యథార్థంగా పెంచుకునే వారు దేవుని దయను పొందే అవకాశం ఉంది. మానవులు అత్యంత నిరాశలో ఉన్నప్పుడు, దేవుని జోక్యం అత్యంత అనుకూలమైనది. దేవుని సేవకులు అగౌరవంగా, అహంకారంతో లేదా చిత్తశుద్ధి లేని వారికి మాత్రమే హెచ్చరికలు ప్రకటించవచ్చు, వారు నిరుత్సాహపడిన విశ్వాసికి ఓదార్పు పదాలను అందిస్తారు.

సన్హెరీబు లేఖ. (8-19) 
బాహ్య సవాళ్లతో లేదా అంతర్గత విరోధులతో పోరాడుతున్నప్పుడు, పరీక్షించబడిన విశ్వాసికి ప్రార్థన అచంచలమైన ఆశ్రయం. దయ యొక్క సింహాసనం వద్ద, సర్వశక్తిమంతుడైన సహచరుడి ముందు, క్రైస్తవుడు వారి హృదయాన్ని బయటపెడతాడు, హిజ్కియా వలె వారి పరిస్థితిని ప్రదర్శిస్తాడు మరియు వారి పిటిషన్ను సమర్పించాడు. దేవుని మహిమ వారి కారణంతో ముడిపడి ఉందనే హామీ స్పష్టంగా కనిపించినప్పుడు, విశ్వాసం విజయాన్ని పొందుతుంది మరియు అచంచలమైన భావం వారిని సంతోషంతో నింపుతుంది. ప్రార్థనలో అత్యంత బలవంతపు విజ్ఞాపనలు దేవుని కీర్తి యొక్క గౌరవం నుండి తీసుకోబడ్డాయి.

అతని పతనం ప్రవచించబడింది. (20-34) 
సన్హెరీబ్ చేసిన ప్రతి చర్య దైవిక పరిశీలనలో పడింది. నగరాన్ని కాపాడే బాధ్యతను దేవుడే తీసుకున్నాడు; మరియు ఏదైనా లేదా ఎవరైనా అతను రక్షణ కవచం ప్రతిజ్ఞ సహాయం కానీ సురక్షితంగా ఉండకూడదు. అష్షూరు దండయాత్ర ఆ సంవత్సరం భూమిని విత్తడానికి ఆటంకం కలిగించి ఉండవచ్చు. తరువాతి సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా భావించబడింది, అయినప్పటికీ ఆ రెండు సంవత్సరాలలో వారి జీవనోపాధికి భూమి యొక్క దిగుబడి సరిపోతుందని ప్రభువు హామీ ఇచ్చాడు. సన్హెరీబు సైన్యం ఓడిపోయిన తర్వాత ఈ వాగ్దానం నెరవేరుతుంది, ఇది హిజ్కియా విశ్వాసాన్ని బలపరిచే సూచనగా ఉపయోగపడుతుంది, యూదా రాజ్యంపై ప్రభువు యొక్క భవిష్యత్తు సంరక్షకత్వానికి ముందస్తుగా అతనికి తక్షణ రక్షణ హామీనిచ్చింది. ప్రభువు దీనిని వారి నీతి ఆధారంగా కాకుండా తన స్వంత మహిమ కొరకు నెరవేర్చాలని సంకల్పించాడు. మన హృదయాలు సారవంతమైన నేలగా పనిచేస్తాయి, ఆయన వాక్యం మన జీవితాల్లో వేళ్ళూనుకోవడానికి మరియు ఫలాలను అందజేస్తుంది.

అస్సీరియన్ సైన్యం నాశనం చేయబడింది, సన్హెరిబ్ చంపబడ్డాడు. (35-37)
హిజ్కియాకు ఈ సందేశాన్ని అందించిన తర్వాత రాత్రి వారి సైన్యం యొక్క అంతర్భాగం నాశనం చేయబడింది. సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు కూడా ఎలా బలహీనంగా ఉన్నారో సాక్ష్యమివ్వండి. ఎవరైనా నిజంగా ఆయనను ఎదిరించి అభివృద్ధి చెందగలరా? అస్సిరియన్ రాజు కుమారులు అతని హంతకులుగా మారారు. ఎవరి పిల్లలు అవిధేయతను ప్రదర్శిస్తారో వారు స్వయంగా పరలోకంలో ఉన్న తమ తండ్రికి అవిధేయత చూపలేదా అని ఆలోచించాలి. ఈ ఖాతా దేవునిపై అచంచలమైన నమ్మకం మరియు విశ్వాసం యొక్క విలువకు బలవంతపు రుజువును అందిస్తుంది. అతను బాధించవచ్చు, కానీ అతను తన ప్రజలను ఎన్నటికీ విడిచిపెట్టడు. మన పరీక్షలు మనల్ని మోకాళ్లకు నెట్టివేసినప్పుడు ఇది నిజంగా ప్రశంసనీయం, అయినప్పటికీ అది మన విశ్వాస రాహిత్యాన్ని కూడా బహిర్గతం చేస్తుంది. యెహోవా ప్రకటనలపై ఆధారపడేందుకు మనమెంత అయిష్టంగా ఉన్నాం! ఆయన మోక్షాన్ని అందించే మార్గాలను తెలుసుకోవడానికి మనం ఎంత ఆత్రుతతో ఉన్నాం! ఉపశమనం త్వరగా కానప్పుడు మనం ఎంత అసహనానికి గురవుతాము! అయినప్పటికీ, ఆయన వాగ్దానాల నెరవేర్పు కోసం మనం ఎదురుచూడాలి. ప్రభూ, మా అవిశ్వాసాన్ని అధిగమించడంలో మాకు సహాయం చేయండి.



Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |