Kings II - 2 రాజులు 3 | View All

1. అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను.

1. Ioram the sonne of Achab was kynge ouer Israel at Samaria in ye eightenth yeare of Iosaphat kynge of Iuda, & raigned xij. yeares,

2. ఇతడు తన తలి దండ్రులు చేసిన ప్రకారము చేయక, తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను

2. & dyd yt which was euell in ye sighte of ye LORDE, but not as his father & his mother: for he put awaye ye pilers of Baal, which his father caused to make.

3. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను.

3. Neuertheles he cleued vnto ye synnes of Ieroboa & sonne of Nebat, which made Israel for to synne, & departed not there fro.

4. మోయాబు రాజైన మేషా అనేకమైన మందలుగల వాడై లక్ష గొఱ్ఱెపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱెపొట్టేళ్లను ఇశ్రాయేలురాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు.

4. Mesa ye kynge of the Moabites had many shepe, & payed tribute vnto the kynge of Israel wt the woll of an hundreth thousande labes, & of an hudreth thousande rames.

5. అయితే అహాబు మరణమైన తరువాత మోయాబురాజు ఇశ్రాయేలురాజుమీద తిరుగుబాటు చేయగా

5. But whan Achab was deed, the kynge of ye Moabites fell awaye fro the kynge of Israel.

6. యెహో రాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలువారినందరిని సమకూర్చెను.

6. At ye same tyme wete kynge Ioram fro Samaria, & mustered all Israel,

7. యూదారాజైన యెహోషా పాతునకు వర్తమానము పంపిమోయా బురాజు నామీద తిరుగుబాటు చేసియున్నాడు; నీవు వచ్చి నాతోకూడ మోయాబీయులతో యుద్ధము చేసెదవా అని యడుగగా అతడునేను నీవాడనైయున్నాను, నా జనులు నీ జనులే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే; నేను బయలుదేరి వచ్చెదనని ప్రత్యుత్తరమిచ్చెను.

7. & sent vnto Iosaphat kynge of Iuda, sayenge: The kynge of the Moabites is fallen awaye fro me, come thou wt me to fighte agaynst ye Moabites. He sayde: I wil come vp, I am euen as thou, and my people as yi people, and my horses as thy horses.

8. మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడుఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను.

8. And sayde morouer: Which waye wil we go vp? He sayde: by the waye in the wyldernesse of Edom.

9. ఇశ్రాయేలురాజును యూదారాజును ఎదోమురాజును బయలుదేరి యేడు దిన ములు చుట్టు తిరిగిన తరువాత, వారితో కూడనున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను.

9. So the kynge of Israel, the kynge of Iuda, & the kynge of Edom wente forth. And whan they had gone aboute seue dayes iourney, ye hoost & the catell yt were amonge the had no water.

10. ఇశ్రా యేలురాజుకటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా

10. Then sayde the kynge of Israel: Alas, the LORDE hath called these thre kynges, to delyuer the in to the hande of the Moabites.

11. యెహోషా పాతు అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణచేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యడిగెను. అంతట ఇశ్రాయేలురాజు సేవకులలో ఒకడుఏలీయా చేతులమీద నీళ్లుపోయుచు వచ్చిన1షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా

11. But Iosaphat sayde: Is here no prophet of ye LORDE, yt we maye axe coucell at ye LORDE by him? Then answered one of ye kynge of Israels seruauntes, & saide: Here is Eliseus ye sonne of Saphat, which poured water vpon Elias handes.

12. యహోషాపాతు యెహోవా ఆజ్ఞ యితని ద్వారామనకు దొరుకుననెను. ఇశ్రాయేలురాజును యెహోషాపాతును ఎదోమురాజును అతని యొద్దకుపోగా

12. Iosaphat sayde: The worde of ye LORDE is with him. So the kynge of Israel & Iosaphat, and ye kynge of Edom wente downe vnto him.

13. ఎలీషా ఇశ్రాయేలురాజును చూచినాతో నీకు నిమిత్తమేమి? నీ తలిదండ్రులుంచుకొనిన ప్రవక్తలయొద్దకు పొమ్మని చెప్పెను. ఆలాగనవద్దు, మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా, రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలురాజు అతనితో అనినప్పుడు

13. But Eliseus sayde vnto the kynge of Israel: What hast thou to do wt me? go to the prophetes of thy father & to yi mothers prophetes. The kinge of Israel saide vnto him: No, for ye LORDE hath called these thre kynges, to delyuer them in to the handes of the Moabites.

14. ఎలీషా ఇట్లనెనుఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదారాజైన యెహోషా పాతును నేను గౌరవము చేయనియెడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును.

14. Eliseus sayde: As truly as the LORDE Zebaoth lyueth, before whom I stode, yf I regarded not Iosaphat the kynge of Iuda, I wolde not regarde the, ner set oughte by ye.

15. నాయొద్దకు వీణ వాయించగల యొకనిని తీసి కొనిరమ్ము. వాద్యకు డొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను.

15. So bringe me now a mynstrell. And whan the mynstrell played vpo the instrument, the hande of the LORDE came vpo him.

16. యెహోవా సెలవిచ్చినదేమనగాఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి;

16. And he sayde: Thus sayeth the LORDE: Make pittes by this broke.

17. యెహోవా సెలవిచ్చునదేమనగాగాలియే గాని వర్షమే గాని రాక పోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును.

17. For thus sayeth the LORDE: Ye shal se nether wynde ner rayne, yet shall the broke be full of water, that ye and youre housholdes & youre catell maie drynke.

18. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును.

18. Yee and that is but a small thinge in the sighte of the LORDE. And the Moabites shal he delyuer in to youre handes,

19. మీరు ప్రాకారములుగల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి, మంచి చెట్లనెల్ల నరికి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను.

19. so yt ye shal smyte all the stronge cities, and all ye chosen cities & shal fell downe all the good trees, and stoppe all the welles of water and all the good feldes shall ye make waist with stones.

20. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను.

20. On the morow, whan the meatofferynge is offered, beholde, there came water ye waye from Edom, and fylled ye londe with water.

21. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని, అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరిని సమకూర్చు కొని దేశపు సరిహద్దునందు నిలిచిరి.

21. But whan the Moabites herde, yt the kynges came vp to fighte agaynst the, they called all ye harnessed men, & their rulers, & stode on ye border.

22. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా, అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తమువలె కనబడెను

22. And whan they rose early in ye mornynge, & the Sonne wete vp vpon ye water, the Moabites thoughte the water ouer agaynst the to be eue as reed as bloude,

23. గనుక వారు అది రక్తము సుమా; రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి; మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి.

23. & they sayde: It is bloude, ye kynges haue destroyed them selues wt the swerde, & one hath smytten another. Now Moab get the vp to the spoyles.

24. వారు ఇశ్రాయేలువారి దండుదగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారియెదుట నిలువలేక పారిపోయిరి; ఇశ్రా యేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి.

24. But whan they came to the tentes of Israel, the Israelites gat vp, & smote the Moabites, & they fled before them. Neuertheles they came in, & smote Moab,

25. మరియు వారు పట్టణములను పడ గొట్టి, సమస్తమైన మంచి భూభాగములమీదను తలయొక రాయి వేసి నింపి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, మంచి చెట్లన్నిటిని నరికివేసిరి. కీర్హరెశెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచి యుండెను గాని వడిసెలలు విసరువారు దాని చుట్టుకొని రాళ్లు విసరుచు వచ్చిరి.

25. & brake downe the cities, & euery one cast his stone vpon all the good feldes, and made them full, and stopped all ye welles of water, and felled downe all the good trees, tyll there remayned but the stones in the brickwall, and they compased them aboute with slynges, and smote them.

26. మోయాబురాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదూయు ఏడువందల మందిని ఏర్పరచుకొని, ఎదోమురాజునొద్దకు తీసికొని పోవు టకు యత్నించెను గాని అది వారివలన కాకపోయెను.

26. But wha the kynge of ye Moabites sawe yt the battayll was to stroge for him, he toke to him seuen C. men, which drue ye swerde, to fall vpon the kynge of Edom: neuertheles they were not able.

27. అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసికొని, పట్టణపు ప్రాకారముమీద దహన బలిగా అర్పిం పగా ఇశ్రాయేలు వారిమీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.

27. Then toke he his first sonne, which shulde haue bene kynge in his steade, and offred him for a burntofferynge vpon the wall. Then came there a greate wrath ouer Israel, that they departed from him, and turned agayne into their londe.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings II - 2 రాజులు 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యెహోరామ్, ఇజ్రాయెల్ రాజు. (1-5) 
యెహోరామ్ దేవుని తీర్పు నుండి పాఠాన్ని పాటించాడు మరియు అతని మధ్య నుండి బాల్ విగ్రహాన్ని తొలగించాడు. అయినప్పటికీ, అతను దూడలను పూజించడంలో పట్టుదలతో ఉన్నాడు. నిజంగా పశ్చాత్తాపపడని లేదా తమను తాము మార్చుకోని వారు కేవలం తమకు ప్రయోజనం లేని పాపాలను వదిలివేస్తారు, అదే సమయంలో వారు లాభం పొందుతారని నమ్ముతారు.

మోయాబుతో యుద్ధం, ఎలీషా మధ్యవర్తిత్వం. (6-19) 
ఇశ్రాయేలీయుల రాజు వారి దుస్థితి మరియు వారు ఎదుర్కొన్న ఆసన్నమైన ఆపద గురించి విచారం వ్యక్తం చేశాడు. అతను ఈ రాజులను సమావేశానికి పిలిపించాడు, అయినప్పటికీ అతను పరిస్థితిని దైవిక ప్రావిడెన్స్‌కు ఆపాదించాడు. కీర్తనల గ్రంథము 84:6లో చెప్పబడినట్లుగా, మానవ మూర్ఖత్వం ఒక వ్యక్తిని ఎలా తప్పుదారి పట్టించగలదో ఇది వివరిస్తుంది. నీటి మూలాన్ని ప్రశ్నించడం అనవసరం. దేవుడు ద్వితీయ ప్రభావాలకు కట్టుబడి ఉండడు. దేవుని కృప యొక్క పోషణను శ్రద్ధగా కోరుకునే వారు దానిని పొందుతారు మరియు దాని ద్వారా విజయవంతమైన పరివర్తనను సాధిస్తారు.

నీరు సరఫరా చేయబడింది, మోయాబు అధిగమించబడింది. (20-27)
దేవునితో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉన్న వారి సాంగత్యాన్ని ఆస్వాదించడం నిజమైన ఆశీర్వాదం, వారి ప్రార్థనల ద్వారా ప్రబలంగా ఉంటుంది. దేవునికి ప్రియమైన వారి యొక్క తీవ్రమైన ప్రార్థనల ఫలితంగా రాజ్యం యొక్క బలం మరియు శ్రేయస్సు నిలకడగా మరియు అభివృద్ధి చెందుతుంది. ఆయన దృష్టిలో అత్యంత ఐశ్వర్యవంతులైన వారిని మనం అత్యంత గౌరవంగా చూస్తాం. పాపులు ఒక భ్రాంతికరమైన శాంతిని ప్రకటించినప్పుడు, వారు విపత్తుతో కళ్ళుమూసుకుంటారు; వారి నిర్లక్ష్యపు ఊహ నిరాశకు దారి తీస్తుంది. చరిత్ర అంతటా, సాతాను ప్రభావంతో మరియు అతని ప్రేరేపణతో, భయానకమైన పనులు జరిగాయి, అత్యంత దయగల హృదయాలు కూడా వెనక్కి తగ్గేలా చేశాయి - మోయాబు రాజు స్వంత కుమారుడి విషాద త్యాగం వంటివి. అత్యంత దుష్ట వ్యక్తులను విపరీతమైన స్థితికి నెట్టకుండా ఉండటం వివేకం; బదులుగా, మనం వారిని దేవుని తీర్పుకు అప్పగించాలి.



Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |