Kings II - 2 రాజులు 4 | View All

1. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్యనీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి యున్నాడని ఎలీషాకు మొఱ్ఱ పెట్టగా

1. একদা শিষ্য-ভাববাদিগণের মধ্যে এক জনের স্ত্রী ইলীশায়ের কাছে কাঁদিয়া কহিল, আপনার দাস আমার স্বামী মরিয়াছেন; আপনি জানেন, আপনার দাস সদাপ্রভুকে ভয় করিতেন; এখন মহাজন আমার দুইটী সন্তানকে দাস করিবার জন্য লইয়া যাইতে আসিয়াছে।

2. ఎలీషానా వలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియ జెప్పుమనెను. అందుకామెనీ దాసు రాలనైన నా యింటిలో నూనెకుండ యొకటి యున్నది; అది తప్ప మరేమియు లేదనెను.

2. ইলীশায় তাহাকে বলিলেন, আমি তোমার নিমিত্ত কি করিতে পারি? বল দেখি, ঘরে তোমার কি আছে? সে কহিল, এক বাটী তৈল ব্যতিরেকে আপনার দাসীর আর কিছু নাই।

3. అతడునీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరియొద్ద దొరుకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు పుచ్చుకొనుము;

3. তখন তিনি কহিলেন, যাও, বাহির হইতে তোমার সমস্ত প্রতিবাসীর কাছে শূন্য পাত্র চাহিয়া আন, অল্প আনিও না।

4. అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపల నుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా

4. পরে ভিতরে গিয়া তুমি ও তোমার পুত্রেরা ঘরে থাকিয়া দ্বার রুদ্ধ কর, এবং সেই সকল পাত্রে তৈল ঢাল; এক এক পাত্র পূর্ণ হইলে তাহা এক দিকে রাখ।

5. ఆమె అతని యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కువ రులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను.

5. পরে সে স্ত্রীলোক তাঁহার নিকট হইতে প্রস্থান করিল, আর সে ও তাহার পুত্রেরা ঘরে থাকিয়া দ্বার রুদ্ধ করিল; তাহারা পুনঃপুনঃ তাহাকে পাত্র আনিয়া দিল, এবং সে তৈল ঢালিল।

6. పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడుమరేమియు లేవని చెప్పెను. అంతలొనూనె నిలిచి పోయెను.

6. সমস্ত পাত্র পূর্ণ হইলে পর সে আপন পুত্রকে কহিল, আর পাত্র আন। পুত্র কহিল, আর পাত্র নাই। তখন তৈলের স্রোত বদ্ধ হইল।

7. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడునీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.

7. পরে সে গিয়া ঈশ্বরের লোককে সংবাদ দিল। তিনি কহিলেন, যাও, সেই তৈল বিক্রয় করিয়া তোমার ঋণ পরিশোধ কর, এবং যাহা অবশিষ্ট থাকিবে, তদ্দ্বারা তুমি ও তোমার পুত্রেরা দিনপাত কর।

8. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీభోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.
మత్తయి 10:41

8. এক দিন ইলীশায় শূনেমে যান। তথায় এক ধনবতী মহিলা ছিলেন; তিনি আগ্রহ সহকারে তাঁহাকে ভোজনের নিমন্ত্রণ করিলেন। পরে যত বার তিনি ঐ পথ দিয়া যাইতেন, তত বার আহার করণার্থে সেই স্থানে যাইতেন।

9. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగు దును.

9. আর সেই মহিলা আপন স্বামীকে কহিলেন, দেখ, আমি বুঝিতে পারিয়াছি, এই যে ব্যক্তি আমাদের নিকট দিয়া যখন তখন যাতায়াত করেন, ইনি ঈশ্বরের এক জন পবিত্র লোক।

10. కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.

10. বিনয় করি, আইস, আমরা প্রাচীরের উপরে একটী ক্ষুদ্র কুঠরী নির্ম্মাণ করি, এবং তাহার মধ্যে তাঁহার নিমিত্ত একখানি খাট, একখানি মেজ, একখানি আসন ও একটী পিলসুজ রাখি; তিনি আমাদের এখানে আসিলে সেই স্থানে থাকিবেন।

11. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను.

11. এক দিন ইলীশায় সেখানে আসিলেন; আর সেই কুঠরীতে প্রবেশ করিয়া শয়ন করিলেন।

12. పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచిఈషూనేమీయురాలిని పిలువు మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు

12. পরে তিনি আপন চাকর গেহসিকে কহিলেন, তুমি ঐ শূনেমীয়াকে ডাক। তাহাতে সে তাঁহাকে ডাকিলে সেই স্ত্রীলোকটী তাঁহার সম্মুখে দাঁড়াইলেন।

13. అతడునీవు ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్నుగూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామెనేను నా స్వజనులలో కాపుర మున్నాననెను.

13. তখন ইলীশায় গেহসিকে কহিলেন, উহাঁকে বল, দেখুন, আমাদের নিমিত্ত আপনি এই সকল চিন্তা করিলেন, এখন আপনার নিমিত্ত কি করিতে হইবে? রাজার কিম্বা সেনাপতির নিকটে আপনার কি কোন নিবেদন আছে? তিনি উত্তর করিলেন, আমি আপন লোকদের মধ্যে বাস করিতেছি।

14. ఎలీషాఆమె నేనేమి చేయకోరుచున్నదని వాని నడుగగా గేహజీఆమెకు కుమారుడు లేడు; మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను.

14. পরে ইলীশায় কহিলেন, তবে উহাঁর জন্য কি করিতে হইবে? গেহসি কহিল, নিশ্চয়ই উহাঁর পুত্র নাই, স্বামীও বৃদ্ধ।

15. అందుకతడుఆమెను పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను.

15. ইলীশায় কহিলেন, উহাঁকে ডাক; পরে তাঁহাকে ডাকিলে তিনি দ্বারে দাঁড়াইলেন।

16. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషామరుసటి యేట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండు నని ఆమెతో అనెను. ఆమె ఆ మాట వినిదైవజనుడవైన నా యేలినవాడా, ఆలాగు పలుకవద్దు; నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను.

16. তখন ইলীশায় কহিলেন, এই ঋতুতে এই সময় পুনরায় উপস্থিত হইলে আপনি পুত্র ক্রোড়ে করিবেন। কিন্তু তিনি কহিলেন, না; হে প্রভু, হে ঈশ্বরের লোক, আপনার দাসীকে মিথ্যা কথা কহিবেন না।

17. పిమ్మట ఆ స్త్రీ గర్భ వతియై మరుసటి యేట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను.

17. পরে ইলীশায়ের বাক্যানুসারে সেই স্ত্রী গর্ভধারণ করিয়া সেই সময় পুনরায় উপস্থিত হইলে, পুত্র প্রসব করিলেন।

18. ఆ బిడ్డ యెదిగిన తరువాత ఒకనాడు కోత కోయువారియొద్దనున్న తన తండ్రి దగ్గరకుపోయి అక్కడ ఉండగా వాడునా తలపోయెనే నా తలపోయెనే, అని తన తండ్రితో చెప్పెను.

18. বালকটী বড় হইলে পর সে এক দিন ছেদকদের কাছে আপন পিতার নিকটে গেল।

19. అతడు వానిని ఎత్తుకొని తల్లియొద్దకు తీసికొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా

19. পরে সে পিতাকে কহিল, আমার মাথা! আমার মাথা! তখন পিতা চাকরকে কহিলেন, তুমি ইহাকে তুলিয়া ইহার মাতার কাছে লইয়া যাও।

20. వాడు ఆ బాలుని ఎత్తికొని వాని తల్లియొద్దకు తీసికొనిపోయెను. పిల్లవాడు మధ్యాహ్నమువరకు తల్లి తొడమీద పండుకొని యుండి చనిపోయెను.

20. পরে সে তাহাকে তুলিয়া মাতার কাছে আনিলে বালকটী মধ্যাহ্নকাল পর্য্যন্ত তাঁহার ক্রোড়ে বসিয়া থাকিল, পরে মরিয়া গেল।

21. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచముమీద పెట్టి తలుపువేసి బయటికి వచ్చి

21. তখন মাতা উপরে গিয়া ঈশ্বরের লোকের খাটে তাহাকে শয়ন করাইলেন, পরে দ্বার রুদ্ধ করিয়া বাহিরে আসিলেন,

22. ఒక పనివానిని ఒక గాడిదను నాయొద్దకు పంపుము;నేను దైవజనునియొద్దకు పోయి వచ్చెదనని తన పెని మిటితో ఆమె యనగా

22. আর আপন স্বামীকে ডাকিয়া বলিলেন, বিনয় করি, তুমি চাকরদের এক জনকে ও একটী গর্দ্দভী আমার কাছে পাঠাইয়া দেও, আমি ঈশ্বরের লোকের কাছে তাড়াতাড়ি গিয়া ফিরিয়া আসিব।

23. అతడునేడు అమావాస్య కాదే; విశ్రాంతి దినముకాదే; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమెనేను పోవుట మంచిదని చెప్పి

23. তিনি কহিলেন, অদ্য তাঁহার নিকটে কেন যাইবে? অদ্য অমাবস্যাও নয়, বিশ্রামবারও নয়। নারী কহিলেন, মঙ্গল হইবে।

24. గాడిదకు గంతకట్టించి తాను ఎక్కి తన పని వానితోశీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చి తేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను.

24. আর তিনি গর্দ্দভী সাজাইয়া আপন চাকরকে কহিলেন, গর্দ্দভী চালাইয়া চল, আজ্ঞা না পাইলে আমার গতি শিথিল করিও না।

25. ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనునియొద్దకు వచ్చెను. దైవజనుడు దూరమునుండి ఆమెను చూచి అదిగో ఆ షూనేమీయురాలు;
హెబ్రీయులకు 11:35

25. পরে তিনি কর্মিল পর্ব্বতে ঈশ্বরের লোকের নিকটে চলিলেন। তখন ঈশ্বরের লোক তাঁহাকে দূর হইতে দেখিয়া আপন চাকর গেহসিকে কহিলেন, দেখ, ঐ সেই শূনেমীয়া;

26. నీవు ఆమెను ఎదు ర్కొనుటకై పరుగున పోయినీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకామెసుఖముగా ఉన్నామని చెప్పెను.

26. এক বার দৌড়িয়া গিয়া উহাঁর সহিত সাক্ষাৎ কর, আর জিজ্ঞাসা কর, আপনার মঙ্গল? আপনার স্বামীর মঙ্গল? বালকটীর মঙ্গল? তিনি উত্তর করিলেন, মঙ্গল।

27. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనునియొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టు కొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడుఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను; ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను.

27. পরে পর্ব্বতে ঈশ্বরের লোকের কাছে উপস্থিত হইয়া তিনি তাঁহার চরণ ধরিলেন; তাহাতে গেহসি তাঁহাকে ঠেলিয়া দিবার জন্য নিকটে আসিল, কিন্তু ঈশ্বরের লোক কহিলেন, উহাঁকে থাকিতে দেও, উহাঁর প্রাণ শোকাকুল হইয়াছে, আর সদাপ্রভু আমাহইতে তাহা গোপন করিয়াছেন, আমাকে জানান নাই।

28. అప్పుడు ఆమెకుమారుడు కావలెనని నేను నా యేలిన వాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా? అని అతనితో మనవి చేయగా

28. তখন স্ত্রীলোকটী কহিলেন, আমার প্রভুর কাছে আমি কি পুত্র চাহিয়াছিলাম? আমাকে প্রতারণা করিবেন না, এ কথা কি বলি নাই?

29. అతడునీ నడుము బిగించు కొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడిన యెడల వారికి నమస్కరింపవద్దు; ఎవరైనను నీకు నమస్కరించినయెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖముమీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను.
లూకా 10:4, లూకా 12:35

29. তখন ইলীশায় গেহসিকে কহিলেন, কটিবন্ধন কর, আমার এই যষ্টি হস্তে লইয়া প্রস্থান কর; কাহারও সহিত সাক্ষাৎ হইলে তাহাকে মঙ্গলবাদ করিও না, এবং কেহ মঙ্গলবাদ করিলে তাহাকে উত্তর দিও না; পরে বালকটীর মুখের উপরে আমার এই যষ্টি রাখিও।

30. తల్లి ఆ మాట వినియెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడ పోయెను.

30. তখন বালকের মাতা কহিলেন, জীবন্ত সদাপ্রভুর দিব্য, এবং আপনার জীবিত প্রাণের দিব্য, আমি আপনাকে ছাড়িব না। তখন ইলীশায় উঠিয়া তাঁহার পশ্চাতে পশ্চাতে চলিলেন।

31. గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెను గాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కన బడలేదు గనుక వాడు ఏలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను.

31. ইতিমধ্যে গেহসি তাঁহাদের অগ্রে গিয়া বালকটীর মুখে ঐ যষ্টি রাখিল, তথাপি কোন শব্দ হইল না, অবধানের কোন লক্ষণও পাওয়া গেল না। অতএব গেহসি তাঁহার সহিত সাক্ষাৎ করিতে ফিরিয়া গিয়া তাঁহাকে কহিল, বালকটী জাগে নাই।

32. ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడి యుండుట చూచి

32. পরে ইলীশায় সেই গৃহে আসিলেন, আর দেখ, বালকটী মৃত, ও তাঁহার শয্যায় শায়িত।

33. తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి
మత్తయి 6:6

33. তখন তিনি প্রবেশ করিলেন, এবং তাঁহাদের দুই জনকে বাহিরে রাখিয়া দ্বার রুদ্ধ করিয়া সদাপ্রভুর কাছে প্রার্থনা করিলেন।

34. మంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తన చేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను.

34. আর [খাটে] উঠিয়া বালকটীর উপরে শয়ন করিলেন; তিনি তাহার মুখের উপরে আপন মুখ, চক্ষুর উপরে চক্ষু ও করতলের উপরে করতল দিয়া তাহার উপরে আপনি লম্বমান হইলেন; তাহাতে বালকটীর গাত্র উত্তাপযুক্ত হইতে লাগিল।

35. తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను.

35. পরে তিনি ফিরিয়া আসিয়া গৃহমধ্যে একবার এদিক্‌ একবার ওদিক্‌ করিলেন, আবার উঠিয়া তাহার উপরে লম্বমান হইলেন; তাহাতে বালকটী সাত বার হাঁচিল, ও বালকটী চক্ষু মেলিল।

36. అప్పుడతడు గేహజీని పిలిచిఆ షూనే మీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలి చెను. ఆమె అతనియొద్దకు రాగా అతడునీ కుమారుని ఎత్తికొనుమని ఆమెతో చెప్పెను.
లూకా 7:15

36. তখন তিনি গেহসিকে ডাকিয়া কহিলেন, ঐ শূনেমীয়াকে ডাক। সে তাঁহাকে ডাকিলে স্ত্রীলোকটী তাঁহার নিকটে আসিলেন। ইলীশায় কহিলেন, আপনার পুত্রকে তুলিয়া লউন।

37. అంతట ఆమె లోప లికివచ్చి అతని కాళ్లమీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తికొనిపోయెను.

37. তখন সে স্ত্রীলোক নিকটে গিয়া তাঁহার পদতলে পড়িয়া ভূমিতে প্রণিপাত করিলেন, এবং আপন পুত্রকে তুলিয়া লইয়া বাহিরে গেলেন।

38. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి యుండగా అతడు తన పనివానిని పిలిచి పెద్దకుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటచేయుమని సెలవిచ్చెను.

38. ইলীশায় পুনর্ব্বার গিল্‌গলে উপস্থিত হইলেন; সেই সময়ে দেশে দুর্ভিক্ষ ছিল। তখন শিষ্য-ভাববাদিগণ তাঁহার সম্মুখে বসিয়াছিল; তিনি আপন চাকরকে আজ্ঞা দিলেন, বড় হাঁড়ী চড়াইয়া এই শিষ্য-ভাববাদিগণের জন্য ব্যঞ্জন পাক কর।

39. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొని వచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను.

39. তখন তাহাদের এক জন তরকারি সংগ্রহ করিতে মাঠে গেল, এবং বনশসার লতা দেখিতে পাইয়া তাহার বুনো ফলে বস্ত্র পূর্ণ করিয়া আনিল, পরে তাহা কুটিয়া পাকের হাঁড়ীতে দিল; কিন্তু সেগুলি কি, তাহা তাহারা জানিল না।

40. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచిదైవజనుడా, కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినక మానిరి.

40. পরে লোকদের ভোজনার্থে তাহা ঢালিলে তাহারা সেই ব্যঞ্জন খাইতে গিয়া চীৎকার করিয়া কহিল, হে ঈশ্বরের লোক, হাঁড়ীর মধ্যে মৃত্যু; আর তাহারা তাহা খাইতে পারিল না।

41. అతడుపిండి కొంత తెమ్మనెను. వారు తేగాకుండలో దాని వేసి, జనులు భోజనము చేయు టకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను.

41. তখন তিনি কহিলেন, তবে কিছু ময়দা আন। পরে তিনি হাঁড়ীতে তাহা ফেলিয়া কহিলেন, লোকদের জন্য ঢালিয়া দেও, তাহারা ভোজন করুক। তাহাতে হাঁড়ীতে কিছুই মন্দ থাকিল না।

42. మరియు ఒకడు బయల్షాలిషానుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను.

42. আর বাল্‌-শালিশা হইতে এক ব্যক্তি আসিল, সে ঈশ্বরের লোকের কাছে আশুপক্ক শস্যের রুটী, যবের কুড়িখানা রুটী ও ছালায় করিয়া শস্যের তাজা শীষ আনিল; আর তিনি কহিলেন, ইহা লোকদিগকে দেও, তাহারা ভোজন করুক।

43. అయితే అతని పనివాడునూరుమందికి వడ్డించుటకు ఇవి యెంతవని చెప్పగా అతడువారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను.
మత్తయి 14:20

43. তখন তাঁহার পরিচারক কহিল, আমি কি এক শত লোককে ইহা পরিবেষণ করিব? কিন্তু তিনি কহিলেন, ইহা লোকদিগকে দেও তাহারা ভোজন করুক; কেননা সদাপ্রভু এই কথা কহেন, তাহারা ভোজন করিবে, ও উদ্বৃত্ত রাখিবে।

44. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను.
లూకా 9:17, మత్తయి 14:20

44. অতএব সে তাহাদের সম্মুখে তাহা স্থাপন করিল, আর সদাপ্রভুর বাক্যানুসারে তাহারা ভোজন করিল, আর উদ্বৃত্তও রাখিল।



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings II - 2 రాజులు 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఎలీషా వితంతువుల నూనెను గుణించడం (1-7)
ఎలీషా యొక్క అద్భుత జోక్యాలు క్రీస్తు యొక్క అద్భుతాల వలె నిజమైన దయగల చర్యలు. ఈ అద్భుతాలు దైవిక శక్తి యొక్క ఆకట్టుకునే ప్రదర్శనలే కాదు, అవి ప్రయోజనం పొందిన వారి పట్ల దయతో కూడిన ప్రగాఢమైన చర్యలు కూడా. దేవుడు తన శక్తితో పాటు తన దయను ప్రదర్శిస్తాడు. ఒక నిరుపేద విధవరాలి విన్నపాన్ని ఎలీషా వెంటనే ఆలకించాడు. అప్పుల భారంతో కుటుంబాలను విడిచిపెట్టే వారు తరచుగా వారు కలిగించే బాధలను తక్కువగా అంచనా వేస్తారు. దేవునిపై విధేయత చూపే వారందరికీ, వారి రోజువారీ జీవనోపాధి కోసం దేవునిపై ఆధారపడేటప్పుడు, వారు నిర్లక్ష్యంగా ఖర్చులు మరియు రుణభారాన్ని నివారించడం. అలాంటి ప్రవర్తన సువార్త ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా వారి నిష్క్రమణ తర్వాత వారి కుటుంబాలకు కష్టాలను కూడా కలిగిస్తుంది.
ఎలీషా వితంతువును తన అప్పుల బాధకు పరిష్కారం దిశగా నడిపించాడు, తద్వారా ఆమె తనకు మరియు తన కుటుంబాన్ని పోషించుకునేలా చేసింది. ఇది ఒక అద్భుత సంఘటన ద్వారా సాధించబడినప్పటికీ, అవసరమైన వారికి సహాయం చేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాన్ని కూడా ఇది హైలైట్ చేసింది: వారి పరిమిత వనరులను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి వారి స్వంత శ్రమశక్తిని ఉపయోగించుకునేలా వారిని శక్తివంతం చేయడం ద్వారా. ఆమె అందుబాటులో ఉన్న అన్ని కంటైనర్లను అయిపోయే వరకు చమురు యొక్క అద్భుత ప్రవాహం కొనసాగింది. మన పరిమితులు దేవుని నుండి లేదా అతని సమృద్ధిగా ఉన్న దయ నుండి ఉద్భవించవు; బదులుగా, అవి మన స్వంత లోపాల నుండి ఉత్పన్నమవుతాయి. ఆయన వాగ్దానాలు కాకుండా మన విశ్వాసం సన్నగిల్లుతుంది. మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కువ నాళాలు ఉంటే, దేవుని సమృద్ధి వాటన్నింటినీ నింపగలదు - ప్రతి ఒక్కరికీ, వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా సరిపోతుంది. విమోచకుని యొక్క అపరిమితమైన సమృద్ధి పాపులు అతనిని వెతకడం మానేసినప్పుడు వారి అవసరాలను మరియు వారి మోక్షాన్ని అందించడం మాత్రమే నిలిపివేస్తుంది.
వితంతువు తన నూనె నుండి వచ్చిన డబ్బును తన అప్పు తీర్చడానికి ఉపయోగించవలసి వచ్చింది. ఆమె రుణదాతలు కనికరం చూపనప్పటికీ, ఆమె తన పిల్లలకు కేటాయింపులు చేసే ముందు తన బాధ్యతలను పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యతనిచ్చింది. క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రాథమిక సూత్రం కేవలం అప్పులను తిరిగి చెల్లించడం మరియు వ్యక్తిగత సౌకర్యాన్ని త్యాగం చేసినప్పటికీ బాధ్యతలను నెరవేర్చడం. ఇది బలవంతం ద్వారా అమలు చేయబడదు కానీ నైతిక విధి యొక్క భావం ద్వారా అమలు చేయబడుతుంది. సద్గుణాన్ని కలిగి ఉన్నవారు తమ రోజువారీ జీవనోపాధిని సరిగ్గా సంపాదించకపోతే దానిని అనుభవించడం కష్టం.
వితంతువు మరియు ఆమె పిల్లలు నూనెను అమ్మడం ద్వారా పొందిన మిగిలిన నిధులతో జీవించవలసి వచ్చింది. ఈ డబ్బు వారు స్థిరమైన జీవనోపాధిని స్థాపించడానికి పునాదిగా మారింది. మనం ఇకపై అద్భుతాలను ఊహించలేకపోయినా, మనం ఓపికగా దేవునిపై ఆధారపడితే మరియు వెదకితే దైవిక దయలను ఆశించవచ్చు. ముఖ్యంగా వితంతువులు ఆయనపై నమ్మకం ఉంచాలి. అన్ని హృదయాలపై అధికారం కలిగి ఉన్నవాడు అద్భుతాలను ఆశ్రయించకుండా సమర్థవంతమైన సరఫరాను అందించగలడు.

షూనేమిట్ స్త్రీ యొక్క ఆశీర్వాదం: ఒక కుమారుడు మంజూరు చేయబడ్డాడు (8-17)
ఎలీషా తన ఇటీవలి సేవా చర్యల ద్వారా ఇజ్రాయెల్ రాజు గౌరవాన్ని పొందాడు; ఒక సద్గుణవంతుడు తనను తాను ఉన్నతీకరించుకోవడంలో ఉన్నంత సంతృప్తిని ఇతరులకు సహాయం చేయడంలో పొందుతాడు. అయినప్పటికీ, షూనేమ్ స్త్రీకి అలాంటి దయతో కూడిన సంజ్ఞలు అవసరం లేదు. ఆప్యాయత మరియు అభిమానం పుష్కలంగా ఉన్న మన స్వంత సంఘంలో నివసించడంలో ప్రగాఢమైన తృప్తి ఉంది మరియు మనం పరోపకారంతో ప్రతిస్పందించగలము. తమ నిజమైన ఆశీర్వాదాలను గుర్తిస్తే చాలామంది తమకు అనుకూలమైన స్థితిలో ఉంటారు. తన చిత్తానికి విధేయత దాచి ఉంచబడే దాగి ఉన్న కోరికలను ప్రభువు వివేచిస్తాడు మరియు దయ చూపిన వారి తరపున తన అంకితమైన సేవకుల ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. అతను ఊహించని మరియు అనుకోని వరాలను ప్రసాదిస్తాడు. లౌకిక వ్యక్తులలో తరచుగా కనిపించే చిత్తశుద్ధికి భిన్నంగా, దేవుని సేవకుల వ్యక్తీకరణలను చిత్తశుద్ధి లేనివిగా తప్పుగా అర్థం చేసుకోకూడదు.

జీవితాన్ని పునరుద్ధరించడం: షూనేమిట్ కుమారుడు పునరుద్ధరించబడడం (18-37)
ఇక్కడ పిల్లల ఆకస్మిక ఉత్తీర్ణత విప్పుతుంది. తల్లి యొక్క అపరిమితమైన ఆప్యాయత కూడా వాగ్దానం చేసే బిడ్డ జీవితాన్ని కాపాడదు, ప్రార్థన ద్వారా కోరిన మరియు ప్రేమతో ఆదరిస్తుంది. అయినప్పటికీ, ఈ ఆకస్మిక శ్రమను ఎదుర్కుంటూ జ్ఞానవంతురాలు మరియు భక్తురాలు అయిన తల్లి తన మాటలను ఎంత అద్భుతంగా నిలుపుతోందో గమనించండి. ఒక్క ఫిర్యాదు కూడా ఆమె పెదవుల నుండి బయటపడదు. దేవుని దయాదాక్షిణ్యాలపై ఆమెకున్న దృఢ విశ్వాసం, అతను తీసివేసిన దానిని పునరుద్ధరించే అతని సామర్థ్యాన్ని విశ్వసించడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఓ, స్త్రీ, నీ విశ్వాసం నిజంగా అపారమైనది! దాన్ని చొప్పించిన వాడు సమాధానం చెప్పకుండా ఉండడు.
తన దుఃఖం మధ్య, దుఃఖంతో ఉన్న తల్లి ఆలస్యం చేయకుండా ప్రవక్త వద్దకు వెళ్లడానికి తన భర్త అనుమతిని కోరుతుంది. ఆమె తన స్వంత ఇంటిలో అప్పుడప్పుడు ఎలీషా యొక్క మార్గదర్శకత్వాన్ని కలిగి ఉండటం సరిపోదని భావించింది; ఆమె ఉన్నత హోదా ఉన్నప్పటికీ, ఆమె బహిరంగ పూజలకు హాజరవుతుంది. వారి స్నేహితులు మరియు కుటుంబాల శ్రేయస్సు గురించి విచారించడం దేవుని పిలుపులోని వ్యక్తులకు తగినది. "బాగానే ఉంది" అన్న స్పందన ఆమెకు అందుతుంది. ఇంట్లో పిల్లవాడు నిర్జీవంగా పడి ఉన్నప్పుడు అందరూ ఎలా ఉంటారు? ఇంకా, నిజానికి, దేవుడు నిర్దేశించినప్పుడు అంతా బాగానే ఉంటుంది; స్వర్గానికి వెళ్ళిన వారికి అంతా శుభమే. విచారణ ద్వారా, స్వర్గం వైపు వారి మార్గం మరింత ప్రకాశవంతమైతే, వెనుకబడి ఉన్నవారికి అంతా మంచిది.
ఏదైనా భూసంబంధమైన ఓదార్పు మన నుండి తీసివేయబడినప్పుడు, మన హృదయాలు దానితో అతిగా అనుబంధించబడలేదని దేవుని దయతో మనం ధృవీకరించగలిగితే మంచిది. అవి ఉంటే, అది అసంతృప్తితో మంజూరు చేయబడిందని మరియు కోపంతో ఉపసంహరించబడిందని అనుమానించడానికి కారణం ఉంది. విశ్వాసంలో పాతుకుపోయిన దేవునికి ఎలీషా యొక్క తీవ్రమైన క్రై, ప్రియమైన కొడుకు జీవితాన్ని పునరుద్ధరించడానికి దారి తీస్తుంది, అతనిని తన తల్లి వద్దకు తిరిగి తీసుకువస్తుంది. ఆత్మీయంగా చనిపోయిన ఆత్మలకు ఆధ్యాత్మిక జీవితాన్ని అందించాలని కోరుకునే వారు వారి పరిస్థితి పట్ల యథార్థంగా సానుభూతి పొందాలి మరియు వారి తరపున తీవ్రమైన ప్రార్థనలు చేయాలి. ఒక పరిచారకుడు నేరుగా తోటి పాపులలో దైవిక జీవితాన్ని నింపలేనప్పటికీ, అటువంటి పరివర్తన తమ శక్తిలో ఉన్నట్లుగా వారు సమానమైన ఉత్సాహంతో సాధ్యమయ్యే ప్రతి సాధనాన్ని ఉపయోగించాలి.

పోషణ యొక్క అద్భుతాలు: కుండల వైద్యం మరియు ప్రవక్తల కుమారులకు ఆహారం ఇవ్వడం (38-44)
రొట్టెల కొరత ప్రబలంగా ఉంది, అయినప్పటికీ కరువు దేవుని వాక్యం యొక్క ప్రకటన వరకు విస్తరించలేదు. ఎలీషా తన చుట్టూ ఉన్న ప్రవక్తల కుమారులను సేకరించి, తన బోధనల నుండి జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని వారికి కల్పించాడు. ఎలీషా హానికరమైన జీవనోపాధిని సురక్షితమైన మరియు పోషకమైన ధరగా మార్చాడు. ఈ గౌరవప్రదమైన ప్రవక్త మరియు అతని అతిథులకు ఒక గిన్నె వంటి సాధారణ వంటకం కూడా సరిపోతుందని గుర్తుంచుకోండి. పట్టిక కొన్నిసార్లు మనల్ని చిక్కుకోవచ్చు, మన శ్రేయస్సును పెంపొందించుకోవాల్సిన వాటిని ఒక ఆపదగా మారుస్తుంది. ఇది జాగ్రత్తగా పాల్గొనడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
జీవితం యొక్క జీవనోపాధి మరియు సౌకర్యాల మధ్య, మనం ఎల్లప్పుడూ మన మనస్సులలో మరణాల యొక్క నిశ్చయతను మరియు పాపం పట్ల అప్రమత్తతను కలిగి ఉండాలి. దేవుని మంచితనానికి కృతజ్ఞతతో కూడిన అంగీకారం మన ఆరోగ్యకరమైన మరియు ఉత్తేజకరమైన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, "నేను నిన్ను స్వస్థపరిచే ప్రభువును" అనే పదాలను ప్రతిధ్వనిస్తుంది. ఎలిషా యొక్క చర్యలు పరిమిత వనరులను సమర్థవంతంగా ఉపయోగించడాన్ని కూడా ప్రదర్శించాయి. ఉదారంగా స్వీకరించిన తరువాత, అతను ఉదారంగా పంచుకున్నాడు. కీర్తనల గ్రంథము 132:15లో చెప్పబడినట్లుగా, దేవుడు తన చర్చిని సమృద్ధిగా ఆశీర్వదిస్తానని ప్రతిజ్ఞ చేసాడు, ఆమె ఏర్పాట్లను సంతృప్తిపరుస్తాడు మరియు ఆమె తక్కువ అదృష్టవంతుల సభ్యుల అవసరాలను తీర్చాడు. పోషించేవాడు కూడా నింపుతాడు మరియు అతని ఆశీర్వాదాలు గుణించాలి.
క్రీస్తు తన అనుచరులకు ఆహారం ఇవ్వడం ఈ గణనను మించిన అద్భుతాన్ని గుర్తించినప్పటికీ, రెండు సందర్భాలు దేవునికి నమ్మకంగా సేవ చేసే వారు తమ కోసం దైవిక ప్రావిడెన్స్ కోసం ఎదురు చూడగలరని పాఠాన్ని తెలియజేస్తాయి.


Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |