Kings II - 2 రాజులు 7 | View All

1. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెనుయెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగారేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక టింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.

1. Listen to the word of Yahweh,' Elisha said. 'Yahweh says this, 'By this time tomorrow a measure of finest flour will sell for one shekel, and two measures of barley for one shekel, at the gate of Samaria.' '

2. అందుకు ఎవరిచేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతియెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడునీవు కన్నులార దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను.

2. The equerry on whose arm the king was leaning retorted to Elisha, 'Even if Yahweh made windows in the sky, could this word come true?' 'You will see it with your own eyes,' Elisha replied, 'though you will eat none of it.'

3. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగు లుండగా వారు ఒకరినొకరు చూచిమనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను?

3. Now at the entrance to the gate -- for they were afflicted with virulent skin-disease -- there were four men and they debated among themselves, 'Why sit here waiting for death?

4. పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నం దున అచ్చట చచ్చిపోదుము; ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము; పదండి, సిరియనుల దండుపేట లోనికి, పోవుదము రండి, వారు మనలను బ్రదుకనిచ్చిన బ్రదుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని

4. If we decide to go into the city, what with the famine in it, we shall die there; if we stay where we are, we shall die just the same. Come on, let us go over to the Aramaean camp; if they spare our lives, we live; if they kill us, well, then we die.'

5. సందెచీకటియందు సిరియనుల దండు పేటలోనికి పోవలె నని లేచి, సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడక పోయిరి.

5. So at dusk they set out and made for the Aramaean camp, but when they reached the confines of the camp there was not a soul there.

6. యెహోవా రథముల ధ్వనియు గుఱ్ఱముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా వారుమనమీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి యున్నాడని సిరియనులు ఒకరితో నొకరు చెప్పుకొని

6. For Yahweh had caused the Aramaeans in their camp to hear a noise of chariots and horses, the noise of a great army; and they had said to one another, 'Listen! The king of Israel has hired the Hittite and Egyptian kings against us, to attack us.'

7. లేచి తమ గుడారములలోనైనను గుఱ్ఱములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని, సందె చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి.

7. So in the dusk they had made off and fled, abandoning their tents, their horses and their donkeys; leaving the camp just as it was, they had fled for their lives.

8. కాబట్టి ఆ కుష్ఠ రోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చియొక గుడారము జొచ్చి భోజనపానములుచేసి, అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొని పోయి దాచిపెట్టి, తిరిగి వచ్చి మరియొక గుడారము జొచ్చి అచ్చటనుండి సొమ్ము ఎత్తికొని పోయి దాచిపెట్టిరి.

8. The men with skin-disease, then, reached the confines of the camp. They went into one of the tents and ate and drank, and from it carried off silver and gold and clothing; these they took and hid. Then they came back and, entering another tent, looted it too, and took and hid their booty.

9. వారు మనము చేయునది మంచి పనికాదు, నేటిదినము శుభవర్త మానముగల దినము, మనము ఊరకొననేల? తెల్లవారువరకు మనము ఇచ్చట నుండిన యెడల ఏదైన నొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని

9. Then they said to one another, 'We are doing wrong. This is a day of good news, yet we are holding our tongues! If we wait till morning, we shall certainly be punished. Come on, let us go and take the news to the palace.'

10. వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచిమేము సిరియనుల దండుపేటకు పోతివిు. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుఱ్ఱ ములును కట్టబడిన గాడిదలును ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరును లేరని వానితో అనగా

10. Off they went and shouted out to the guards on the city gate, 'We have been to the Aramaean camp. There was not a soul there, no sound of anyone, only tethered horses and tethered donkeys, and their tents just as they were.'

11. వాడు ద్వారపాల కుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారము తెలియజెప్పగా

11. The gatekeepers shouted the news, which was reported inside the palace.

12. రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచిసిరియనులు మనకు చేసినదానిని నేను మీకు చూపింతును; మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుకవారు పట్టణములోనుండి బయటకు వచ్చినయెడల మనము వారిని సజీవులనుగా పట్టు కొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచనచేసి, పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను.

12. The king got up while it was still dark and said to his officers, 'I can tell you what the Aramaeans have done to us. They know we are starving, so they have left the camp to hide in the open country. 'They will come out of the city,' they think, 'we shall catch them alive and get into the city.' '

13. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మన విచేసెనుఇంతకుముందు ఇశ్రాయేలువారలలో బహు మంది మనుష్యులు లయమై పోయిరి గదా ఇక అయిదుగురు లయమై పోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన యెడల పట్టణమందు మిగిలియున్న రౌతులలొ అయిదు గురిని తీసికొని పోనిమ్ము; మనము వారిని పంపి చూచెదమని చెప్పెను.

13. One of his officers replied, 'Five of the surviving horses still left us had better be taken -- they would die in any case like all the rest. Let us send them and see.'

14. వారు జోడు రథములను వాటి గుఱ్ఱములను తీసికొనగాసిరియనుల సైన్యమువెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను.

14. So they took two chariot teams and the king sent them after the Aramaean army, saying, 'Go and see.'

15. కాబట్టి వారు వారివెనుక యొర్దాను నదివరకు పోయి, సిరియనులు తొంద రగా పోవుచు, పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి, ఆ దూతలు తిరిగివచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా

15. They followed them as far as the Jordan, finding the whole way strewn with clothes and gear which the Aramaeans had thrown away in their panic. The scouts returned and informed the king.

16. జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను.

16. Then the people went out and plundered the Aramaean camp: a measure of finest flour sold for one shekel, and two measures of barley for one shekel, as Yahweh had promised they would.

17. ఎవని చేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవ జనునియొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పినప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడుచేత అతడు మరణమాయెను.

17. The king had detailed the equerry, on whose arm he leaned, as commander of the guard on the gate, but the people trampled on him in the gateway and he died, as the man of God had foretold when the king had come down to him.

18. మరియురూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్ననిపిండియు, రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను.

18. (What Elisha had said to the king came true, 'Two measures of barley will sell for one shekel, and a measure of finest flour for one shekel, by this time tomorrow at the gate of Samaria.'

19. ఆ యధి పతియెహోవా ఆకాశమందు కిటి కీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడునీవు కన్నులార చూచెదవుగాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను.

19. And the equerry in question had replied to the man of God, 'Even if Yahweh made windows in the sky, could this word come true?' 'You will see it with your own eyes,' Elisha had answered, 'though you will eat none of it.'

20. జనులు ద్వార మందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను.

20. And that was what happened to him: for the people trampled on him in the gateway and he died.)



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings II - 2 రాజులు 7 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఎలీషా పుష్కలంగా ప్రవచించాడు. (1,2)
మానవ నిరాశ దేవుడు తన అద్భుతమైన శక్తిని వ్యక్తపరచడానికి ఒక సందర్భాన్ని అందిస్తుంది. అతను తన ప్రజలు బలహీనంగా ఉన్నప్పుడు వారి తరపున తనను తాను బహిర్గతం చేయడానికి ఎంచుకున్నాడు. నమ్మడానికి నిరాకరించడం అనేది దేవునితో ఒకరి సంబంధాన్ని చెడగొట్టడమే కాకుండా ఆయన ఉద్దేశించిన ఆశీర్వాదాలను కూడా అడ్డుకునే ఘోరమైన నేరం. ఈ విధి నిత్యజీవం యొక్క హామీని అనుమానించే వారికి ఎదురుచూస్తుంది - వారు దానిని దూరం నుండి చూడవచ్చు కానీ దాని సారాంశాన్ని ఎన్నటికీ రుచి చూడలేరు. దేవుడి దయతో పశ్చాత్తాపం చెందితే తప్ప భూసంబంధమైన రక్షలు మరియు ఆశీర్వాదాలు అంతిమంగా శాశ్వత విలువను కలిగి ఉండవని పాపులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

 సిరియన్ సైన్యం యొక్క ఫ్లైట్. (3-11) 
తన అభీష్టానుసారం, దేవుడు చాలా లొంగని హృదయాన్ని కూడా వణుకు పుట్టించగలడు. దేవుని పట్ల భక్తిని కలిగి ఉండడానికి నిరాకరించే వారు ఒక ఆకు యొక్క చిన్న శబ్దానికి భయపడతారు. సిరియన్లు బయలుదేరిన వెంటనే కుష్టురోగులు వచ్చే విధంగా దైవిక ప్రావిడెన్స్ సమయాన్ని నిర్దేశించింది. వారి అంతర్గత నైతిక దిక్సూచి వారు తమ స్వంత శ్రేయస్సుపై మాత్రమే దృష్టి సారిస్తే వారికి విపత్తు సంభవించవచ్చని వారిని హెచ్చరించింది. సహజసిద్ధమైన కరుణ మరియు ప్రతీకారం యొక్క భయం అధర్మం యొక్క స్వీయ-కేంద్రీకరణపై శక్తివంతమైన నియంత్రణలుగా పనిచేస్తాయి. ఈ భావాలు ప్రపంచంలో సామరస్యాన్ని మరియు దయను నిలబెట్టడానికి దోహదం చేస్తాయి. అయితే, క్రీస్తు యొక్క అమూల్యమైన సంపదలను కనుగొన్న వారు ఇతరులతో సంతోషకరమైన వార్తలను పంచుకోవడంలో ఆలస్యం చేయరు. స్వప్రయోజనాల కంటే అతని పట్ల వారి భక్తితో ప్రేరేపించబడి, వారు తమ సహోదరుల మధ్య తమ ప్రాపంచిక ఆస్తులను సంతోషంగా పంచుకుంటారు.

సమరయ పుష్కలంగా సరఫరా చేయబడింది. (12-20)
ఇజ్రాయెల్ అవసరాలు వారు ఊహించని విధంగా తీర్చబడిన విధానం చూడండి. ఇది మన అత్యంత సవాలుగా ఉన్న క్షణాలలో దేవుని శక్తి మరియు దయపై ఆధారపడటానికి మనల్ని ప్రోత్సహించాలి. దేవుని హామీలను సురక్షితంగా విశ్వసించవచ్చు, ఎందుకంటే ఆయన నుండి ఒక్క మాట కూడా నెరవేరదు. ఎలీషా ప్రకటన యొక్క చెల్లుబాటును ప్రశ్నించిన గొప్ప వ్యక్తి అతని సంశయవాదాన్ని నిశ్శబ్దంగా మరియు అతని సందేహాన్ని అవమానకరంగా మార్చిన సమృద్ధిని చూశాడు. ఇందులో, అతను తన స్వంత వైఖరి యొక్క మూర్ఖత్వాన్ని గుర్తించాడు, అయినప్పటికీ అతను చూసిన పుష్కలంగా అతను పాలుపంచుకోలేదు. న్యాయంగా, ప్రపంచంలోని వాగ్దానాల నుండి నిరుత్సాహాన్ని ఎదురుచూసే వారు తరచుగా దేవుని వాగ్దానాల వల్ల నిరాశకు గురవుతారు, ఇది అపోహ. దేవుడు తన శక్తి, ప్రొవిడెన్స్ మరియు కట్టుబాట్లను లక్ష్యంగా చేసుకున్న అపనమ్మకాన్ని ఎంత లోతుగా బాధపెడతాడు అనే పాఠాన్ని లోతుగా పరిశోధించండి. నిస్సందేహంగా దోషులకు ఎదురయ్యే దేవుని హెచ్చరికల యొక్క అచంచలమైన నిశ్చయతతో పాటు జీవితంలోని అనిశ్చితి మరియు దాని ఆనందాల గురించి ఆలోచించండి. మనం ఆయన ఉపదేశాల క్రింద నిలబడతామా లేక ఆయన వాగ్దానాల గ్రహీతలమా అని పరిశీలించమని దేవుని మార్గనిర్దేశనాన్ని మనము వేడుకుందాము.



Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |