Kings II - 2 రాజులు 9 | View All
Study Bible (Beta)

1. అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెనునీవు నడుము బిగించుకొని యీ తైలపుగిన్నె చేత పట్టుకొని రామో త్గిలాదునకు పోయి
లూకా 12:35

1. The prophet Elisha summoned a member of the prophetic brotherhood to him, 'Hitch up your clothes, take this flask of oil, and go to Ramoth in Gilead.

2. అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెక్కడ నున్నాడని తెలిసికొని అతనిని దర్శించి, అతని సహోదరుల మధ్యనుండి అతనిని చాటుగా రప్పించి, లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి

2. When you arrive there, look for Jehu son of Jehoshaphat, son of Nimshi. Then, when you find him, tell him to get up and leave his companions, and take him into an inner room.

3. తైలపుగిన్నె తీసికొని అతని తలమీద తైలము పోసినేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపుతీసి పారి పొమ్ము.

3. Take the flask of oil then and pour it over his head, and say, 'Yahweh says this: I have anointed you king of Israel.' Then open the door and flee as fast as you can.'

4. ¸యౌవనుడైన ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చునప్పటికి సైన్యాధిపతులు కూర్చుని యుండిరి.

4. The young man left for Ramoth in Gilead

5. అప్పుడతడు అధిపతీ, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా యెహూయిందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు అధిపతీ నిన్ను గూర్చినదే యనెను; అందుకు యెహూ లేచి యింటిలో ప్రవేశిం చెను.

5. and when he arrived, found the senior officers of the army sitting together. 'I have a message for you, commander,' he said. 'For which of us?' asked Jehu. 'For you, commander,' he answered.

6. అప్పుడు ఆ ¸యౌవనుడు అతని తలమీద తైలము పోసి అతనితో ఇట్లనెనుఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగాయెహోవా జనులైన ఇశ్రాయేలు వారిమీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను.

6. Jehu then got up and went into the house. And the young man poured the oil on his head, saying, 'Yahweh, God of Israel, says this, 'I have anointed you king of Yahweh's people, of Israel.

7. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసినదానిని బట్టియు, యెహోవా సేవకులందరిని హతము చేసిన దానిని బట్టియు, యెజెబెలునకు ప్రతికారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతివారిని హతముచేయుము.
ప్రకటన గ్రంథం 6:10, ప్రకటన గ్రంథం 19:2

7. You will strike down the family of Ahab your master, and I shall avenge the blood of my servants the prophets and all of Yahweh's servants, on Jezebel

8. అహాబు సంతతివారందరును నశింతురు; అల్పులలోనేమి ఘనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండ కుండ అందరిని నిర్మూలము చేయుము.

8. and on the whole family of Ahab. I shall destroy every manjack of Ahab's family, fettered or free in Israel.

9. నెబాతు కుమారు డైన యరొబాము కుటుంబికులను అహీయా కుమారుడైన బయెషా కుటుంబికులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబికులను నేను అప్పగించుదును.

9. I shall make the House of Ahab like the House of Jeroboam son of Nebat and of Baasha son of Ahijah.

10. యెజెబెలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కలచేత తినివేయబడును. ఆ ¸యౌవనుడు ఈ మాటలు చెప్పి తలుపుతీసి పారిపోయెను.

10. As for Jezebel, the dogs will eat her in the field of Jezreel; no one will bury her.' ' With this, he opened the door and made his escape.

11. యెహూ బయలుదేరి తన యజమానుని సేవకులయొద్దకు రాగా ఒకడుఏమి సంభ వించినది? ఆ వెఱ్ఱివాడు నీయొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా, అతడువానిని వాని మాటలు మీరెరిగెయున్నారని చెప్పెను.

11. Jehu came out to his master's officers. 'Is all well?' they asked him. 'Why did this madman come to you?' 'You know the fellow and how he talks,' he answered.

12. కాబట్టి వారు అదంతయు వట్టిది; జరిగినదానిని మాకు తెలియజెప్పుమనగా అతడిట్లనెనునేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేయు చున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను.

12. 'Evasion!' they cried, 'Come on, tell us.' He replied, 'He said this and that to me. He said, 'Yahweh says this: I have anointed you king of Israel.' '

13. అంతట వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించియెహూ రాజైయున్నాడని చాటించిరి.
లూకా 19:36

13. Whereupon they all took their cloaks and spread them under him on the bare steps; they sounded the trumpet and shouted, 'Jehu is king!'

14. ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాముమీద కుట్రచేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలువారందరును సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామో త్గిలాదు దగ్గర కావలి యుండిరి.

14. Jehu son of Jehoshaphat, son of Nimshi plotted against Jehoram. (At the time, Jehoram, with all Israel, was holding Ramoth in Gilead against an attack by Hazael king of Aram,

15. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనులవలన తాను పొందిన గాయములను బాగు చేసి కొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతట యెహూనీకనుకూలమైతే ఈ సంగతి తెలియ బడకుండునట్లు ఈ పట్టణములోనుండి యెవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనియ్యకుమని ఆజ్ఞ ఇచ్చి

15. but King Jehoram had gone back to Jezreel to recover from the wounds which he had received from the Aramaeans while he was fighting against Hazael king of Aram.) 'If you agree,' Jehu said, 'let no one leave the town to go and take the news to Jezreel.'

16. రథముయెక్కి, యెజ్రెయేలు ఊరిలో యెహో రాము మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను మరియయూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి యుండెను.

16. Jehu then mounted his chariot and left for Jezreel; Jehoram had taken to his bed there, and Ahaziah king of Judah had gone down to visit him.

17. యెజ్రెయేలు గోపురముమీద కావలివాడు నిలిచి యుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచిసైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచివారిని ఎదుర్కొనబోయిసమా ధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమని వానితో సెలవిచ్చెను.

17. The lookout posted on the tower of Jezreel saw Jehu's troop approaching. 'I can see a body of men,' he shouted. Jehoram gave the order: 'Have a horseman sent to meet them and ask, 'Is all well?' '

18. కాబట్టి యొకడు గుఱ్ఱ మెక్కిపోయి అతనిని ఎదుర్కొనిసమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూసమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడుపంపబడినవాడు వారిని కలిసికొనెను గాని తిరిగి రాక నిలిచెనని సమాచారము తెలిపెను.

18. The horseman went to meet Jehu and said, 'The king says, 'Is all well?' ' 'What has it to do with you whether all is well?' Jehu replied. 'Fall in behind me.' The lookout reported, 'The messenger has reached them and is not coming back.'

19. రాజు రెండవ రౌతును పంపగా వాడు వారియొద్దకు వచ్చిసమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూసమధానముతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను.

19. The king sent a second horseman who reached them and said, 'The king says, 'Is all well?' ' 'What has it to do with you whether all is well?' Jehu replied. 'Fall in behind me.'

20. అప్పుడు కావలి వాడువీడును వారిని కలిసికొని తిరిగిరాక నిలిచెను మరియు అతడు వెఱ్ఱి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీకుమారుడైన యెహూ తోలడమువలెనే యున్న దనెను.

20. The lookout reported, 'He has reached them and is not coming back. The manner of driving is like that of Jehu son of Nimshi: he drives like a madman.'

21. రథము సిద్ధము చేయుమని యెహోరాము సెల వియ్యగా వారు అతని రథము సిద్ధముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోరామును యూదారాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి.

21. 'Harness!' Jehoram cried; and they harnessed his chariot. Then Jehoram king of Israel and Ahaziah king of Judah, each in his chariot, set out to meet Jehu. They reached him in the field of Naboth of Jezreel.

22. అంతట యెహోరాముయెహూను చూచియెహూ సమాధానమా? అని అడు గగా యెహూనీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమా ధాన మెక్కడనుండి వచ్చుననెను.
ప్రకటన గ్రంథం 2:20, ప్రకటన గ్రంథం 9:21

22. As soon as Jehoram saw Jehu he asked, 'Is all well, Jehu?' 'What a question!' he replied, 'when all the while the prostitutions and countless sorceries of your mother Jezebel go on.'

23. యెహోరాము రథము త్రిప్పి అహజ్యా, ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను.

23. At this, Jehoram wheeled and fled, saying to Ahaziah, 'Treason, Ahaziah!'

24. అప్పుడు యెహూ తన బలముకొలది విల్లు ఎక్కు పెట్టి యెహోరామును భుజ ములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండ దూసి పోయెను గనుక అతడు తన రథమునందే యొరిగెను.

24. But Jehu had drawn his bow; he struck Jehoram between the shoulder-blades, the arrow went through the king's heart, and he sank down in his chariot.

25. కాగా యెహూ తన అధిపతియైన బిద్కరును పిలిచి యిట్లనెను అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము; మనమిద్దరమును అతని తండ్రియైన అహాబు వెనుక గుఱ్ఱములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతనిమీద ఈ శిక్షమోపిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.

25. 'Pick him up,' Jehu said to Bidkar, his equerry, 'and throw him into the field of Naboth of Jezreel. Remember how, when you and I manned a chariot together behind Ahab his father, Yahweh pronounced this sentence against him,

26. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతికారము చేయుదును; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి యీ భూభాగమందు పడవేయుము అనెను.

26. 'This I swear. Yesterday I saw the blood of Naboth and the blood of his sons -- Yahweh says this. And in this same field I shall requite you -- Yahweh says this.' So pick him up, and throw him into the field, as Yahweh declared should happen!'

27. యూదారాజైన అహజ్యా జరిగిన దాని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను; అయినను యెహూ అతని తరిమి, రథమునందు అతని హతముచేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను.
ప్రకటన గ్రంథం 16:16

27. When Ahaziah king of Judah saw this, he fled along the Beth-ha-Gan road, but Jehu went in pursuit of him. 'Strike him down too,' he said. And they wounded him in his chariot at the slope of Gur, which is near Ibleam, and he took refuge in Megiddo, where he died.

28. అప్పుడు అతని సేవకులు అతనిని రథముమీద వేసి యెరూషలేమునకు తీసికొని పోయి దావీదు పురమందు అతని పితరుల సమా ధిలో అతని పాతిపెట్టిరి.

28. His servants carried him in a chariot to Jerusalem and buried him in his tomb in the City of David.

29. అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము ఏలు బడిలో పదకొండవ సంవత్సరమందు యూదాను ఏల నారంభించెను.

29. Ahaziah had become king of Judah in the eleventh year of Jehoram son of Ahab.

30. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజె బెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసికొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా

30. When Jehu went back to Jezreel, Jezebel was told. She made up her eyes with mascara, adorned her head and appeared at the window.

31. యెహూ గుమ్మముద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచినీ యజమానుని చంపినవాడా, జిమీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా

31. As Jehu came through the gateway she said, 'How did Zimri get on after killing his master?'

32. అతడు తలయెత్తి కిటికీ తట్టు చూచినా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి.

32. Jehu looked up to the window and said, 'Who is on my side? Who?' And two or three officials looked down at him.

33. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుఱ్ఱములమీదను చిందెను. మరియు గుఱ్ఱ ములచేత అతడు దానిని త్రొక్కించెను.

33. 'Throw her down,' he said. They threw her down and her blood spattered the walls and the horses; and Jehu rode over her.

34. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాతఆ శాపగ్రస్తు రాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొనిపాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా

34. He went in and ate and drank, then said, 'See to this accursed woman, and give her burial; after all, she was a king's daughter.'

35. వారు దానిని పాతిపెట్ట బోయిరి; అయితే దాని కపాలమును పాదములును అర చేతులును తప్ప మరి ఏమియు కనబడలేదు.

35. But when they went to bury her, they found nothing but her skull, feet and hands.

36. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెనుఇది యెజెబెలని యెవరును గుర్తుపట్టలేకుండ యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును.

36. They came back and told Jehu, who said, 'This is the word of Yahweh which he spoke through his servant Elijah the Tishbite, 'The dogs will eat the flesh of Jezebel in the field of Jezreel;

37. యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగ మందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీ యుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున యిది జరిగెను.

37. the corpse of Jezebel will be like dung spread on the fields, so that no one will be able to say: This was Jezebel.' '



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings II - 2 రాజులు 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యెహూను అభిషేకించడానికి ఎలీషా పంపాడు. (1-10)
అటువంటి సంఘటనలు మరియు ఇలాంటి పరిస్థితులలో, దైవిక ప్రావిడెన్స్ యొక్క దాగి ఉన్న పనిని మనం తప్పక గుర్తించాలి, వ్యక్తులకు సంబంధించిన అతని ఉద్దేశాలను నెరవేర్చడానికి మార్గనిర్దేశం చేయాలి. యెహూను ఇశ్రాయేలు అభిషిక్త పాలకుడిగా యెహోవా ఎన్నుకున్నాడు. ప్రభువు తన ప్రజలలో విశ్వాసపాత్రమైన భాగాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, వారి మధ్య తన ఆరాధనను కాపాడాలని ఆయన ఉద్దేశించాడు. యెహూకు ఈ దైవిక ఉద్దేశం గుర్తుకు వచ్చింది. అతను అహాబు వంశాన్ని కూల్చివేయడానికి నిర్దేశించబడ్డాడు మరియు అతను దేవుని ఆజ్ఞలను అనుసరించి, నీతియుక్తమైన ఉద్దేశ్యాలతో వ్యవహరించినంత కాలం, అతను విమర్శలు లేదా ప్రతిఘటన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేవుని ప్రవక్తల వధ ముఖ్యంగా హైలైట్ చేయబడింది. జెజెబెల్ విగ్రహారాధన చేయడంలో మరియు యెహోవాను మరియు ఆయన సేవకులను వ్యతిరేకించడంలో పట్టుదలతో ఉంది మరియు ఆమె అతిక్రమాలు పరాకాష్టకు చేరుకున్నాయి.

 యెహూ మరియు కెప్టెన్లు. (11-15) 
చరిత్ర అంతటా, పాపంలో ఉన్నవారికి దైవిక సందేశాన్ని నమ్మకంగా తెలియజేసే వ్యక్తులు స్థిరమైన మనస్సు గల వ్యక్తులుగా పరిగణించబడ్డారు. వారి వివేచన, కమ్యూనికేషన్ మరియు ప్రవర్తన సాధారణ జనాభాకు భిన్నంగా ఉంటాయి; వారు తమ లక్ష్యాల సాధనలో గణనీయమైన కష్టాలను సహిస్తారు మరియు ఇతరులకు అంతుచిక్కని ఉద్దేశ్యాల ద్వారా నడపబడతారు. ముఖ్యంగా, ఈ ఆరోపణను ప్రాపంచిక విషయాలలో పాతుకుపోయిన మరియు దైవభక్తి లేని వారిచే మోపబడింది - ఇది పిచ్చి యొక్క నిజమైన స్థితి. దీనికి విరుద్ధంగా, దేవునికి అంకితమైన ఈ సేవకుల సూత్రాలు మరియు చర్యలు జ్ఞానం మరియు హేతుబద్ధతను ప్రదర్శిస్తాయి. ఈ మిషన్‌ను ప్రారంభించేటప్పుడు యెహూ దేవుని వాక్యంపై ఒక నిర్దిష్ట విశ్వాసంతో నడిచినట్లు కనిపిస్తుంది.

యోరామ్ మరియు అహజ్యా యెహూ చేత చంపబడ్డారు. (16-29) 
యెహూ ఉత్సాహపూరితమైన స్ఫూర్తిని కలిగి ఉన్నాడు. దేవుని జ్ఞానం తనకు అప్పగించబడిన వ్యక్తుల ఎంపికలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, కోపాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రతిష్టను స్థాపించకూడదు. తన స్వంత భావోద్వేగాలను నేర్చుకునే వ్యక్తి శక్తిమంతుల కంటే గొప్ప శక్తిని కలిగి ఉంటాడు. జోరాము నాబోతు ప్లాట్‌కు సమీపంలో యెహూని ఎదుర్కొన్నాడు. కొన్నిసార్లు, డివైన్ ప్రొవిడెన్స్ అద్దంలో ప్రతిబింబం అసలైనదానికి అనుగుణంగా ఉండేలా, అతిక్రమణతో శిక్షను సరిచేయడానికి సంఘటనలను నిర్ధారిస్తుంది. యెషయా 57:21 సూచించినట్లుగా పాపపు మార్గం ఎన్నటికీ ప్రశాంతతకు దారితీయదు. పాపులు దేవునితో శాంతిని ఎలా పొందగలరు? ఒకరు పాపంలో ఉన్నంత కాలం శాంతి అస్పష్టంగా ఉంటుంది, కానీ పశ్చాత్తాపం సంభవించినప్పుడు మరియు తప్పును విడిచిపెట్టినప్పుడు, శాంతి అనుసరిస్తుంది. జోరామ్ చట్టం యొక్క ఆదేశాలకు లోబడి, తప్పు చేసిన వ్యక్తిగా అతని మరణాన్ని కలుసుకున్నాడు. అహజ్యా అహాబు వంశంతో సంబంధం కలిగి ఉన్నాడు, అతని పాపపు చర్యల ద్వారా వారితో కలిసిపోయాడు. దుర్మార్గులతో చేరడం ప్రమాదకరం; అది మనలను అపరాధం మరియు బాధలలో చిక్కుకుంటుంది.

జెజెబెల్‌ను కుక్కలు తింటాయి. (30-37)
దైవిక ప్రతీకారం కోసం భయపడే భావం నుండి తనను తాను దాచుకునే బదులు, జెజెబెల్ తన భయాన్ని అవహేళనగా విస్మరించింది. దేవుని ప్రభావానికి లొంగని హృదయం ఎంతటి విపత్కర పరిస్థితులను కూడా ధైర్యంగా సవాలు చేస్తుందో సాక్ష్యమివ్వండి. వినయపూర్వకమైన ప్రావిడెన్స్‌ల నేపథ్యంలో పశ్చాత్తాపపడని హృదయం కంటే రాబోయే పతనానికి స్పష్టమైన సంకేతం లేదు. ఇతరులను దుర్మార్గంలోకి నడిపించడానికి మరియు సత్యం మరియు ధర్మం యొక్క మార్గాల నుండి వారిని మళ్లించడానికి మోసాన్ని ఉపయోగించుకునే వారు యెజెబెల్ చర్యలు మరియు విధిని జాగ్రత్తగా చూసుకోండి. యెహూ యెజెబెలును ఎదుర్కోవడానికి సహాయాన్ని పిలిపించాడు. సంస్కరణ ప్రయత్నాలు సాగుతున్నప్పుడు, విచారించడం అత్యవసరం, దానికి మద్దతుగా ఎవరు నిలుస్తారు? ఆమె పరిచారకులు ఆమెను అప్పగించారు, ఫలితంగా ఆమె చనిపోయింది. ఆ విధంగా, ఆమె తన గర్వం మరియు క్రూరత్వం యొక్క పరిణామాలను ఎదుర్కొంది. ఈ ఫలితం గురించి ఆలోచించి, ప్రభువు న్యాయం గెలుస్తుందని ప్రకటించండి. మనం మన భౌతిక శరీరాలను ఆకర్షిస్తున్నప్పుడు, వాటి అంతర్లీన ప్రాముఖ్యతను మనం గుర్తుంచుకుందాం; త్వరలో, అవి భూగర్భ పురుగులు లేదా ఉపరితలంపై నివసించే జంతువులకు విందుగా మారుతాయి. మానవాళిలోని అన్ని రకాల అధర్మం మరియు అధర్మాన్ని లక్ష్యంగా చేసుకునే రాబోయే దైవిక కోపం నుండి మనమందరం ఆశ్రయం పొందుదాం.



Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |