Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడియింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీ యులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.
1. जब दाऊद सिकलग में कीश के पुत्रा शाऊल के डर के मारे छिपा रहता था, तब ये उसके पास वहां आए, और ये उन वीरों में से थे जो युठ्ठ में उसके सहायक थे।
2. వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు.
2. ये धनुर्धारी थे, जो दाहिने- बायें, दोनों हाथों से गोफन के पत्थर और धनुष के तीर चला सकते थे; और ये शाऊल के भाइयों में से बिन्यामीनी थे।
3. వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి; ఇతని తరువాతివాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,
3. मुख्य तो अहीएजेर और दूसरा योआश था जो गिबावासी शमाआ का पुत्रा था; फिर अजमावेत के पुत्रा यजीएल और पेलेत, फिर बराका और अनातोती येहू।
4. ముప్పదిమందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీ యుడైన యోజాబాదు,
4. और गिबोनी यिशमायाह जो तीसों में से एक वीर और उनके ऊपर भी था; फिर यिर्मयाह, यहजीएल, योहानान, गदेरावासी योजाबाद।
5. ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా,
5. एलूजै, यरीमोत, बाल्याह, शमर्याह, हारूपी शपत्याह।
6. కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,
6. एल्काना, यिशिरयाह, अजरेल, योएजेर, याशोबाम, जो सब कोरहवंशी थे।
7. గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.
7. और गदोरवासी यरोहाम के पुत्रा योएला और जबद्याह।
8. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాద వేగము గలవారు.
8. फिर जब दाऊद जंबल के गढ़ में रहता था, तब ये गादी जो शूरवीर थे, और युठ्ठ विद्या सीखे हुए और ढाल और भाला काम में लानेवाले थे, और उनके मुह सिंह के से और वे पहाड़ी मृग के समान वेग से दौड़नेवाले थे, ये और गादियों से अलग होकर उसके पास आए।
9. వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,
9. अर्थात् मुख्य तो एजेर, दूसरा ओबद्याह, तीसरा एलीआब।
10. నాల్గవవాడు దుష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,
10. चौथा मिश्मन्ना, पांचपां यिर्मयाह।
11. ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,
11. छठा अत्तै, सातवां एलीएल।
12. ఎనిమిదవ వాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు,
12. आठवां योहानान, नौवां एलजाबाद।
13. పదియవవాడు యిర్మీయా, పదకొండవవాడు మక్బన్నయి.
13. दसवां यिर्मयाह और ग्यारहवां मकबन्नै था।
14. గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడు నూరుమందికి అధిపతి, అత్య ధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి,
14. ये गादी मुख्य योठ्ठा थे, उन में से जो सब से छोटा था वह तो एक सौ के ऊपर, और जो सब से बड़ा था, वह हजार के ऊपर था।
15. యొర్దాను గట్టులమీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పులోయలలోను పడమటిలోయలలోను ఉన్న వారినందరిని తరిమివేసినవారు వీరే.
15. ये ही वे हैं, जो पहिले महीने में जब यरदन नदी सब कड़ाड़ों के ऊपर ऊपर बहती थी, तब उसके पार उतरे; और पूर्व और पश्चिम दानों ओर के सब तराई के रहनेवालों को भगा दिया।
16. మరియు బెన్యామీనీయులలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి.
16. और कई एक बिन्यामीनी और यहूदी भी दाऊद के पास गढ़ में आए।
17. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెనుమీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.
17. उन से मिलने को दाऊद निकला और उन से कहा, यदि तुम मेरे पास मित्राभाव से मेरी सहायता करने को आए हो, तब तो मेरा मन तुम से लगा रहेगा; परन्तु जो तुम मुझे धोखा देकर मेरे शत्रुओं के हाथ पकड़वाने आए हो, तो हमारे पितरों का परमेश्वर इस पर दृष्टि करके डांटे, क्योंकि मेरे हाथ से कोई उपद्रव नहीं हुआ।
18. అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడైదావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమా ధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలు కగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.
18. अब आत्मा अमासै में समाया, जो तीसों वीरों में मुख्य था, और उस ने कहा, हे दाऊद ! हम तेरे हैं; हे यिशै के पुत्रा ! हम तेरी ओर के हैं, तेरा कुशल ही कुशल हो और तेरे सहायकों का कुशल हो, क्योंकि तेरा परमेश्वर तेरी सहायता किया करता है। इसलिये दाऊद ने उनको रख लिया, और अपने दल के मुखिये ठहरा दिए।
19. సౌలుమీద యుద్ధముచేయబోయిన ఫిలిష్తీయులతో కూడ దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబం ధులలో కొందరును అతని పక్షముచేరిరి; దావీదు ఫిలిష్తీ యులకు సహాయము చేయకపోయెను, ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణ హాని చేయునని యెంచి ఫిలిష్తీయుల అధికారులు అతని పంపివేసిరి.
19. फिर कुछ मनश्शेई भी उस समय दाऊद के पास भाग गए, जब वह पलिश्तियों के साथ होकर शाऊल से लड़ने को गया, परन्तु उसकी कुछ सहायता न की, क्योंकि पलिश्तियों के सरदारों ने सम्मति लेने पर वह कहकर उसे बिदा किया, कि वह हमारे सिर कटवाकर अपने स्वामी शाऊल से फिर मिल जाएगा।
20. అంతట అతడు సిక్లగునకు తిరిగి పోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపువారికి అధిపతులు అతని పక్షముచేరిరి.
20. जब वह सिक्लग को जा रहा था, तब ये मनश्शेई उसके पास भाग गए; अर्थात् अदना, योजाबाद, यदीएल, मीकाएल, योजाबाद, एलीहू और सिल्लतै जो मनश्शे के हजारों के मुखिये थे।
21. వారందరును పరాక్రమ శాలులును సైన్యాధిపతులునై యుండిరి; ఆ దండును హతముచేయుటకు వారు దావీదునకు సహాయముచేసిరి.
21. इन्हों ने लुटेरों के दल के विरूद्ध दाऊद की सहायता की, क्योंकि ये सब शूरवीर थे, और सेना के प्रधान भी बन गए।
22. దావీదు దండు దేవుని సైన్యమువలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతనియొద్దకు వచ్చు చుండిరి.
22. वरन प्रतिदिन लोग दाऊद की सहायता करने को उसके पास आते रहे, यहां तक कि परमेश्वर की सेना के समान एक बड़ी सेना बन गई।
23. యెహోవా నోటిమాట ప్రకారము సౌలుయొక్క రాజ్యమును దావీదుతట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతనియొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క యెంతయనగా
23. फिर लोग लड़ने के लिये हथियार बान्धे हुए होब्रोन में दाऊद के पास इसलिये आए कि यहोवा के वचन के अनुसार शाऊल का राज्य उसके हाथ में कर दें : उनके मुखियों की गिनती यह है।
24. యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధసన్నద్ధులై యున్నవారు ఆరువేల ఎనిమిదివందలమంది.
24. यहूदा के ढाल और भाला लिए हुए छे हजार आठ सौ हथियारबन्ध लड़ने को बाए।
25. షిమ్యోనీయులలో యుద్ధ మునకు తగినశూరులు ఏడువేల నూరుమంది.
25. शिमोनी सात हजार एक सौ तैयार शूरवीर लड़ने को आए।
26. లేవీయులలో అట్టివారు నాలుగువేల ఆరువందలమంది.
26. लेवीय चार हजार छे सौ आए।
27. అహరోను సంతతివారికి యెహోయాదా అధిపతి, అతనితోకూడ ఉన్నవారు మూడువేల ఏడు వందలమంది.
27. और हारून के घराने का प्रधान यहोयादा था, और उसके साथ तीन हजार सात सौ आए।
28. పరాక్రమశాలియైన సాదోకు అను ¸యౌవనునితో కూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.
28. और सादोक नाम एक जवान वीर भी आया, और उसके पिता के घराने के बाईस प्रधान आए।
29. సౌలు సంబంధులగు బెన్యా మీనీయులు మూడువేలమంది; అప్పటివరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచుండిరి.
29. और शाऊल के भाई बिन्यामीनियों में से तीन हजार आए, क्योंकि उस समय तक आधे बिन्यामीनियों से अधिक शाऊल के घराने का पक्ष करते रहे।
30. తమపితరుల యింటివారిలో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో ఇరువదివేల ఎనిమిది వందలమంది.
30. फिर एप्रैमियों में से बड़े वीर और अपने अपने पितरों के घरानों में नामी पुरूष बीस हजार आठ सौ आए।
31. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరు పేరుగా నియమింపబడినవారు పదునెనిమిదివేలమంది.
31. और मनश्शे के आधे गोत्रा में से दाऊद को राजा बनाने के लिये अठारह हजार आए, जिनके नाम बताए गए थे।
32. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానముకలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి.
32. और इस्साकारियों में से जो समय को पहचानते थे, कि इस्राएल को क्या करना उचित है, उनके प्रधान दो सौ थे; और उनके सब भाई उनकी आज्ञा में रहते थे।
33. జెబూలూ నీయులలో సకలవిధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగినవారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపులేకుండ యుద్ధము చేయగలవారును ఏబదివేలమంది.
33. फिर जबूलून में से युठ्ठ के सब प्रकार के हथियार लिए हुए लड़ने को पांति बान्धनेवाले योठ्ठा पचास हजार आए, वे पांति बान्ध्नेवाले थे : और चंचल न थे।
34. నఫ్తాలీయులలో వెయ్యిమంది అధిపతులు, వారితోకూడ డాలును ఈటెను పట్టుకొనిన వారు ముప్పది యేడువేలమంది.
34. फिर नप्ताली में से प्रधान तो एक हजार, और उनके संग ढाल और भाला लिए सैंतीस हजार आए।
35. దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరువది యెనిమిదివేల ఆరు వందల మంది.
35. और दानियों में से लड़ने के लिये पांति बान्धनेवाले अठाईस हजार छे सौ आए।
36. ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేలమంది.
36. और आशेर में से लड़ने को पांति बान्धनेवाले चालीस हजार योठ्ठा आए।
37. మరియు యొర్దాను నది అవతలనుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకలవిధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన యీ యోధులందరు దావీదును ఇశ్రాయేలుమీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగినవారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి.
37. और यरदन पार रहनेवाले रूबेनी, गादी और मनश्शे के आधे गोत्रियों में से युठ्ठ के सब प्रकार के हथियार लिए हुए एक लाख बीस हजार आए।
38. ఇశ్రాయేలులో కడమ వారందరును ఏకమనస్కులై దావీదును రాజుగా నియ మింపవలెనని కోరియుండిరి.
38. ये सब युठ्ठ के लिये पांति बान्धनेवाले दाऊद को सारे इस्राएल का राजा बनाने के लिये हेब्रोन में सच्चे मन से आए, और और सब इस्राएली भी दाऊद को राजा बनाने के लिये सहमत थे।
39. వారి సహోదరులు వారికొరకు భోజనపదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతోకూడ అచ్చట మూడు దినములుండి అన్న పానములు పుచ్చుకొనిరి.
39. और वे वहां तीन दिन दाऊद के संग खाते पीते रहे, क्योंकि उनक भाइयों ने उनके लिये तैयारी की थी।
40. ఇశ్రాయేలీయులకు సంతోషము కలిగియుండెను గనుక ఇశ్శాఖారు జెబూలూను నఫ్తాలి అనువారి పొలిమేరలవరకు వారికి సమీపమైనవారు గాడిదలమీదను ఒంటెలమీదను కంచరగాడిదల మీదను ఎద్దుల మీదను ఆహారవస్తువులైన పిండివంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్షపండ్ల గెలలను ద్రాక్షారసమును నూనెను గొఱ్ఱెలను పశువులను విస్తార ముగా తీసికొనివచ్చిరి.
40. और जो उनके निकट वरन इस्साकार, जबूलून और नप्ताली तक रहते थे, वे भी गदहों, ऊंटों, खच्चरों और बैलों पर मैदा, अंजीरों और किशमिश की टिकियां, दाखमधु और तेल आदि भोजनवस्तु लादकर लाए, और बैल और भेड़- बकरियां बहुतायत से लाए; क्योंकि इस्राएल में आनन्द मनाया जारहा था।