Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను.
1 దినవృత్తాంతములు 28:5; 1 రాజులు 1:33-40.
2. మరియు అతడు ఇశ్రా యేలీయుల యధిపతులందరిని యాజకులను లేవీయులను సమకూర్చెను.
1 దినవృత్తాంతములు 28:1.
3. అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సర ములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురుషులు.
సంఖ్యాకాండము 4:1-4 పోల్చి చూడండి. ఆలయానికి కావలసిన ముడి సరుకు, కట్టేవారి గురించి మాత్రమే కాదు దావీదు శ్రద్ధ తీసుకున్నది. దాన్ని కట్టించాక అందులో సేవకోసం సిద్ధంగా ఉన్న వ్యక్తులు కూడా కావాలి అని అతని ఉద్దేశం. చాలా దూరదృష్టి, జాగ్రత్త గల మనిషి దావీదు.
4. వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, ఆరు వేలమంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి.
1 దినవృత్తాంతములు 26:29; ద్వితీయోపదేశకాండము 17:8-13.
5. నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి.
6. గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.
1 దినవృత్తాంతములు 6:1-48.
7. లద్దాను కుమారులు ముగ్గురు;
8. పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు
9. షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు.
10. యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.
11. యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమారులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల యింటి వారిలో వారు ఒక్కవంశముగా ఎంచబడిరి.
12. కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
13. అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.
14. దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.
15. మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.
16. గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.
17. ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.
18. ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.
19. హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.
20. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు.
21. మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.
22. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.
23. మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.
24. వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్ద లైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.
ముందు 30 ఏళ్ళు, అంతకన్నా ఎక్కువ ఉన్నవారినే లెక్కించారు (వ 3), తరువాత 20 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ వయసువారిని కూడా లెక్కలోకి తీసుకున్నారు (వ 27). బహుశా 30, అంతకన్నా ఎక్కువ వయసున్నవారు ఆలయంలోని అన్ని పనులకూ చాలినంతమంది లేరేమో లేక యువకుల్ని కూడా పనిలో పెట్టడం మం
25. ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు
26. లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను.
27. దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి.
28. వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును,
1 దినవృత్తాంతములు 9:28-34. లేవీవారు యాజులకు సహాయకులు, వారి అధికారం క్రింద ఉండేవారు.
29. సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును,
30. అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి.
“ఉదయం, సాయంకాలం”– నిర్గమకాండము 29:38-41; సంఖ్యాకాండము 28:3-8. అనుదిన బలి అర్పణల సమయంలో స్తుతులు కూడా అర్పించే ఏర్పాటు ఉంది. “కృతజ్ఞత”– లేవీయకాండము 7:12-13 నోట్.
31. సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు,
“నియామకమైన పండుగలు”– లేవీ 23 అధ్యాయం చూడండి.
32. యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.
సంఖ్యాకాండము 1:53; సంఖ్యాకాండము 3:6-9 సంఖ్యాకాండము 3:38.