Chronicles I - 1 దినవృత్తాంతములు 29 | View All
Study Bible (Beta)

1. రువాత రాజైన దావీదు సర్వసమాజముతో ఈలాగు సెలవిచ్చెనుదేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయముగల బాలుడై యున్నాడు, కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది.

1. And kynge Dauid sayde vnto all the congregacion: God hath chosen Salomon one of my sonnes, which yet is yonge and tender. But the worke is greate: for it is not a mans palace, but the LORDE Gods.

2. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధములరాళ్లను, మిక్కిలి వెలగల నానావిధరత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని.

2. Yet haue I after all my abilite prepared vnto the house of God, golde for the vessels of golde, syluer for them of syluer, brasse for them of brasse, yron for the of yron, wod for them of wod, Onix stones, set Rubyes, & stones of dyuerse coloures, & all precious stones, & Marble stones in multitude.

3. మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.

3. Besydes this, for the good wyl yt I haue to the house of God,

4. గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారు చేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను

4. I haue of myne awne proper good thre M. taletes of golde of Ophir, & seuen M. taletes of pure syluer, which I geue vnto the holy house of God, besyde all yt I haue prepared, to ouerlaye ye walles of the house,

5. ఈ దినమునయెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా?

5. yt the same which ought to be of golde, maye be of golde: & that it which ought to be of syluer, maye be of syluer: and for all maner of worke by the hande of the craftesmen. And who is now fre wyllinge, to fyll his hande this daye vnto the LORDE?

6. అప్పుడు పితరుల యిండ్లకు అధిపతులును ఇశ్రాయేలీయుల గోత్రపు అధి పతులును సహస్రాధిపతులును శతాధిపతులును రాజు పనిమీద నియమింపబడిన అధిపతులును కలసి

6. Then were the prynces of the fathers, ye prynces of the trybes of Israel, the captaynes ouer thousandes & ouer hundreds, the rulers ouer the kynges busynes, fre wyllinge,

7. మనఃపూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి.

7. & gaue to ye mynistracion in the house of God fyue M. talentes of golde, and ten M. guldens, and ten M. talentes of syluer, eightene M. taletes of brasse, and an hundred M. taletes of yron.

8. తమయొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవామందిరపు బొక్కసముమీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి.

8. And by whom so euer were foude stones, they gaue them to the treasure of the house of the LORDE, vnder the hade of Iehiel the Gersonite.

9. వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనః పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి.

9. And ye people were glad that they were fre wyllinge: for they gaue it wt a good wyll (euen with all their hert) vnto the LORDE. And Dauid also ye kynge reioysed greatly,

10. రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెనుమాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు.

10. and praysed God, and sayde before the whole congregacion: Praysed be thou O LORDE God of Israel oure father,

11. యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.
ప్రకటన గ్రంథం 5:12

11. vnto the belongeth worshippe and power, glory, victory & thankes: for all that is in heauen and earth, is thine: thine is ye kyngdome, and thou art exalted aboue all prynces.

12. ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.

12. Thine are riches and honoure before ye, thou reignest ouer all, in thy hande consisteth power and might, in thy hade is it to make euery man greate and stronge.

13. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.

13. Now thake we the oure God, and prayse ye name of thy glory:

14. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము.

14. For who am I? What is my people? that we shulde be able with a fre wyll to offre, as this is done? For of the commeth all, and of thy hande haue we geuen it the:

15. మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు
హెబ్రీయులకు 11:13

15. For we are but pilgrems & straugers before the, as were all oure fathers. Oure life vpon earth is as a shadowe, and here is no abydinge.

16. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామముయొక్క ఘనతకొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన యీ వస్తుసముదాయమును నీవలన కలిగినదే, అంతయు నీదియై యున్నది.

16. O LORDE oure God, all this abundaunce that we haue prepared to buylde the an house vnto thy name, came of thy hande, and is thine alltogether.

17. నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.

17. I knowe my God, that thou tryest the hert, and that vnfaynednes is acceptable vnto the: therfore haue I geue all this with an vnfayned hert, eue with a good wyll, and now haue I had ioye to se thy people (which here are present) offre with a fre wyll vnto the.

18. అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయ పూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము; వారి హృదయమును నీకు అనుకూలపరచుము.

18. O LORDE God of oure fathers Abraham, Isaac, & Israel, kepe thou euermore soch purposes and thoughtes in ye hertes of thy people, & prepare thou their hertes vnto the.

19. నా కుమారుడైన సొలొమోను నీ యాజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించునట్లును నేను కట్టదలచిన యీ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయ చేయుము.

19. And graunte my sonne Salomon a perfecte hert, that he maye kepe thy comaundementes, thy testimonies, & thy statutes, that he maye do all, & buylde this palace, which I haue prepared.

20. ఈలాగు పలికిన తరువాత దావీదుఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి.

20. And Dauid sayde vnto the whole cogregacion: O prayse the LORDE yor God. And all the cogregacion praysed ye LORDE God of their fathers, & bowed them selues, & worshipped the LORDE & then the kynge,

21. తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహన బలిగా వెయ్యి యెద్దులను వెయ్యి గొఱ్ఱె పొట్టేళ్లను వెయ్యి గొఱ్ఱెపిల్లలను వాటి పానార్పణలతో కూడ ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి.

21. and offred sacrifices vnto the LORDE. And on ye nexte morow offred they burntofferynges, a M. bullockes, a M. rames, a M. labes wt their drynkofferynges, & plenteously offred they amonge all Israel.

22. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి.

22. And they ate and dranke the same daie before the LORDE with greate ioye, and made Salomon the sonne of Dauid kynge ye seconde tyme, and anoynted him to be ye prynce for the LORDE, & Sadoc to be the prest.

23. అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా యెహోవా సింహా సనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులై యుండిరి.

23. Thus sat Salomon vpon the seate of ye LORDE, kynge in his fathers steade, & prospered. And all Israel obeyed him,

24. అధిపతులందరును యోధులందరును రాజైన దావీదు కుమారులందరును రాజైన సొలొమోనునకు లోబడిరి.

24. & all ye rulers & mightie men, & all kynge Dauids children submytted themselues vnto kynge Salomon.

25. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి యెదు టను బహుగా ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీ యులను ఏలిన యే రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతని కనుగ్రహించెను.

25. And ye LORDE made Salomon excellent & greate in ye sighte of all Israel, and gaue him soch a glorious kyngdome, as none had before him ouer Israel.

26. యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను.

26. So had Dauid now bene kynge ouer all Israel.

27. అతడు ఇశ్రా యేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను.

27. And ye tyme that he was kynge ouer Israel, is fortye yeares: At Hebron reigned he seuen yeare, and at Ierusalem thre & thirtie yeare,

28. అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను.

28. & dyed in a good age, full of dayes, riches and honoure. And Salomon his sonne was kynge in his steade.

29. రాజైన దావీదునకు జరిగినవాటన్నిటినిగూర్చియు, అతని రాజరిక మంతటినిగూర్చియు, పరాక్రమమునుగూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములనుగూర్చియు,

29. These actes of kynge Dauid (both ye first and last) beholde, they are wrytten amonge the actes of Samuel the Seer, and amonge the actes of the prophet Nathan, and amoge the actes of Gad the Seer,

30. దీర్ఘదర్శి సమూయేలు మాటలనుబట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలనుబట్టియు వ్రాయబడి యున్నది.

30. with all his kyngdome, power and tymes which passed vnder him, both vpon Israel & vpon all the kyngdomes of the earth.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles I - 1 దినవృత్తాంతములు 29 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దావీదు రాజులను మరియు ప్రజలను ఇష్టపూర్వకంగా అందించమని ప్రేరేపించాడు. (1-9) 
భక్తితో కూడిన కార్యకలాపాలు మరియు పరోపకార చర్యలు బాధ్యతతో కాకుండా ఇష్టపూర్వకంగా చేపట్టాలి. ఎందుకంటే సంతోషకరమైన హృదయంతో ఇచ్చేవారిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ విషయంలో డేవిడ్ సానుకూల నమూనాగా పనిచేస్తాడు. అతను బలవంతం లేదా ప్రదర్శనల కోసం తన సమర్పణలు చేసాడు, కానీ అతనికి దేవుని పవిత్ర స్థలంతో లోతైన అనుబంధం ఉన్నందున. ఈ ఉదాత్తమైన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తన ప్రయత్నాలకు పరిమితి లేదని అతను నమ్మాడు. మంచితనం వైపు ఇతరులను ప్రేరేపించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారు ముందుగా తామే ముందుండాలి.

అతని కృతజ్ఞత మరియు ప్రార్థన. (10-19) 
గణనీయమైన మొత్తంలో బంగారం మరియు వెండితో అలంకరించబడిన ఆలయం మరియు దాని చుట్టుపక్కల నిర్మాణాల వైభవాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. ఏది ఏమైనప్పటికీ, క్రీస్తులో కనుగొనబడిన అపరిమితమైన సంపద ఆలయ మహిమను అధిగమించింది, దేవాలయం భూమిపై ఉన్న సాధారణ నివాసాన్ని మించిపోయింది. ఈ గణనీయమైన అర్పణల గురించి ప్రగల్భాలు పలికే బదులు, దావీదు వినయంగా ప్రభువుకు కృతజ్ఞతలు తెలిపాడు. వారు లార్డ్ యొక్క ఆలయానికి విరాళంగా అందించిన ప్రతిదీ నిజానికి ఆయనకు చెందినది; మరణం యొక్క అనివార్యత కారణంగా దానిని నిలుపుకునే ఏ ప్రయత్నమైనా స్వల్పకాలికంగా ఉండేది. వారు తమ ఆస్తులను అందించగలిగిన ఉత్తమమైన మరియు అత్యంత అర్థవంతమైన ఉపయోగం వాటిని అందించిన వ్యక్తి సేవకు వాటిని అంకితం చేయడం.

సొలొమోను సింహాసనాసీనుడయ్యాడు. (20-25) 
ఈ విస్తారమైన సమావేశం దేవుణ్ణి ఆరాధించడంలో దావీదుతో ఐక్యమైంది. సంఘం యొక్క స్పీకర్‌తో తమను తాము సర్దుబాటు చేసుకునే వారు కేవలం శారీరక సంజ్ఞల ద్వారా మాత్రమే కాకుండా, వారి ఆత్మలను పెంచడం ద్వారా దాని ఆశీర్వాదాలలో నిజంగా పాలుపంచుకుంటారు. సొలొమోను దైవిక సింహాసనాన్ని ఆక్రమించాడు. సోలమన్ రాజ్యం మెస్సీయ యొక్క ఆధిపత్యాన్ని సూచిస్తుంది, అతని సింహాసనం ప్రభువు సింహాసనం.

డేవిడ్ పాలన మరియు మరణం. (26-30)
మేము శామ్యూల్ యొక్క రెండవ పుస్తకాన్ని పరిశీలిస్తున్నప్పుడు, డేవిడ్ తన చివరి క్షణాలలో అద్భుతమైన పరివర్తన ఒక ఆశ్చర్యకరమైన ద్యోతకం వలె వస్తుంది. అతని పశ్చాత్తాపం అతని అతిక్రమణ యొక్క పరిమాణాన్ని సమం చేసింది మరియు అతని పరీక్షల అంతటా మరియు అతని తరువాతి సంవత్సరాలలో అతని ప్రవర్తన అతని ప్రజలను సానుకూలంగా ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. దేవునికి స్తోత్రములు, ఎందుకంటే అత్యంత ఘోరమైన పాపులు కూడా పశ్చాత్తాపం వైపు తిరిగినప్పుడు మరియు రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగం యొక్క విమోచన శక్తిలో ఆశ్రయం పొందినప్పుడు విజయవంతమైన నిష్క్రమణను ఊహించగలరు. జీవితంలో మరియు మరణంలో దేవుని స్వంత హృదయం తర్వాత మనిషి యొక్క ప్రవర్తన మరియు స్వభావాన్ని, వారి తప్పును తప్ప అతనితో ఏమీ పంచుకోని నిజాయితీ లేని అనుచరులతో పోల్చడం బోధనాత్మకం. ఈ వ్యక్తులు డేవిడ్ యొక్క తప్పుల ద్వారా తమ దుశ్చర్యలను సమర్థించుకోవడానికి దుర్మార్గంగా ప్రయత్నిస్తారు. మనం ప్రలోభాలకు లొంగిపోకుండా మరియు పాపం ద్వారా మనల్ని మనం చిక్కుకోకుండా, దేవునికి అగౌరవాన్ని కలిగించకుండా మరియు మన స్వంత మనస్సాక్షికి హాని కలిగించకుండా అప్రమత్తంగా మరియు ప్రార్థన అవసరం. అపరాధ సమయాల్లో, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమాన్వితమైన పునరుత్థానాన్ని ఎదురుచూస్తూ, పశ్చాత్తాపం మరియు సహనం యొక్క డేవిడ్ యొక్క నమూనాను మనం అనుకరిద్దాం.



Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |