Chronicles II - 2 దినవృత్తాంతములు 10 | View All
Study Bible (Beta)

1. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీయులందరును షెకెమునకు వెళ్లగా రెహబాముషెకెమునకు పోయెను.

1. And Rehoboam went to Shechem, for all Israel had come to Shechem to make him king.

2. రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తునుండి తిరిగిరాగా జనులు అతని పిలిపించిరి.

2. And it happened, when Jeroboam the son of Nebat heard, he being in Egypt because he had fled from the face of Solomon the king, Jeroboam returned from Egypt.

3. యరొబామును ఇశ్రాయేలువారందరును కూడి వచ్చి నీ తండ్రి మా కాడిని బరువుచేసెను;

3. And they sent and called for him. And Jeroboam and all Israel came and spoke to Rehoboam, saying,

4. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మామీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులుకన చేసినయెడల మేము నిన్ను సేవింతు మని రెహబాముతో మనవిచేయగా

4. Your father made our yoke hard; and now lighten the hard service of your father, and his heavy yoke that he put on us, and we shall serve you.

5. అతడుమీరు మూడు దినములు తాళి మరల నాయొద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్లిపోయిరి.

5. And he said to them, Come again to me in three days; and the people went away.

6. అప్పుడు రాజైన రెహ బాము తన తండ్రియైన సొలొమోను సజీవియై యుండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి - యీ జనులకు నేనేమి ప్రత్యుత్తర మియ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా

6. And King Rehoboam consulted with the aged men who had stood before his father Solomon when he was alive, saying, How do you advise to answer this people a word?

7. వారునీవు ఈ జనులయెడల దయా దాక్షిణ్యములు చూపి వారితో మంచి మాటలాడినయెడల వారు ఎప్పటికిని నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి.

7. And they spoke to him, saying, If you will be good to this people, and will please them, and will speak good words to them, then they will be your servants forever.

8. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసి వేసి, తనతోకూడ పెరిగి తన యెదుటనున్న ¸యౌవనస్థులతో ఆలోచనచేసి

8. But he left the counsel of the aged men who had advised him, and consulted with the young men who had grown up with him, those standing before him.

9. నీ తండ్రి మామీద ఉంచిన కాడిని చులుకన చేయుమని నన్నడిగిన యీ జనులకు ప్రత్యుత్తరమేమి ఇయ్యవలెనని మీరు యోచింతురో చెప్పుడని వారినడుగగా

9. And he said to them, What do you advise that we shall answer this people that have spoken to me, saying, Lighten the yoke that your father put on us?

10. అతనితో కూడ పెరిగిన యీ ¸యౌవనస్థులు అతనితో ఇట్లనిరినీ తండ్రి మా కాడిని బరువుచేసెను, నీవు దానిని చులుకన చేయుమని నీతో పలికిన యీ జనులతో నీవు చెప్పవలసినదేమనగానా చిటికెన వ్రేలు నా తండ్రియొక్క నడుముకంటె బరువుగా ఉండును;

10. And the young men who had grown up with him spoke to him, saying, You shall say this to the people who have spoken to you, saying, Your father made our yoke heavy, and you lighten our yoke, this you shall say to them, My little finger is thicker than the loins of my father;

11. నా తండ్రి బరువైన కాడి మీమీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను గాని నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము.

11. and now, my father laid a heavy yoke on you, and I will surely add to your yoke; my father chastised you with whips, and I with scorpions.

12. మూడవ దినమందు నాయొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరును మూడవ దినమందు రెహబామునొద్దకు రాగా

12. And Jeroboam and all the people came to Rehoboam on the third day, as the king commanded, saying, Return to me on the third day.

13. రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి, ¸యౌవనస్థులు చెప్పిన ప్రకారము వారితో మాటలాడి

13. And the king answered them sharply, and King Rehoboam left the counsel of the aged men,

14. వారికి కఠినమైన ప్రత్యుత్తరమిచ్చెను; ఎట్లనగానా తండ్రి మీ కాడిని బరువుచేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడా లతో దండించెదనని చెప్పెను.

14. and spoke to them according to the counsel of the young men, saying, My father made your yoke heavy, and I will surely add to it; my father chastised you with whips, and I with scorpions.

15. యెహోవా షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించక పోయెను.

15. And the king did not listen to the people, for the revolution was from God, so that Jehovah might lift up His Word that He spoke by the hand of Ahijah the Shilonite to Jeroboam the son of Nebat.

16. రాజు తాము చేసిన మనవి అంగీకరింపక పోవుట చూచి జనులుదావీదులో మాకు భాగము ఏది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు;ఇశ్రా యేలువారలారా, మీ గుడారమునకు పోవుడి; దావీదూ, నీ సంతతివారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యు త్తరమిచ్చి ఇశ్రాయేలువారందరును ఎవరి గుడారమునకు వారు వెళ్లిపోయిరి.

16. And all Israel saw that the king did not listen to them, and the people sent back to the king, saying, What part do we have in David? Yea, there is no inheritance in the son of Jesse. Each to your tents, O Israel! Now see to your house, David! And all Israel went to their tents.

17. అయితే యూదాపట్టణములలో కాపురముండు ఇశ్రాయేలువారిమీద రెహబాము ఏలుబడి చేసెను.

17. As to the sons of Israel who lived in the cities of Judah, Rehoboam reigned over them.

18. రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారి యైన హదోరమును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతని చావ గొట్టిరి గనుక రాజైన రెహబాము యెరూష లేమునకు పారిపోవలెనని త్వరపడి తన రథము ఎక్కెను.

18. And King Rehoboam sent Hadoram who was over the forced labor. And the sons of Israel threw stones at him, and he died. And King Rehoboam was alerted to mount up into a chariot to flee to Jerusalem.

19. ఇశ్రాయేలువారు ఇప్పటికిని దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసి నేటివరకును వారికి లోబడకయున్నారు.

19. And Israel rebelled against the house of David to this day.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పది తెగలు రెహబాము నుండి తిరుగుబాటు చేశారు.

మితమైన సలహాను స్వీకరించడం తెలివైన మరియు అత్యంత ప్రభావవంతమైన విధానం. సౌమ్యత శక్తి సాధించలేనిది సాధిస్తుంది. ప్రజలు సాధారణంగా మర్యాదపూర్వక పరస్పర చర్యలకు బాగా స్పందిస్తారు. దయతో మాట్లాడటానికి కనీస స్వీయ నిగ్రహం అవసరం, అయినప్పటికీ అది గణనీయమైన ప్రతిఫలాలను ఇస్తుంది. వ్యక్తులను అణగదొక్కడం అనేది వారి స్వంత అహంకారం మరియు కోరికలకు లొంగిపోయేలా అనుమతించడం తప్ప మరేమీ అవసరం లేదు. ఆ విధంగా, ప్రజలు ఎలాంటి వ్యూహాలను అనుసరించినా, దేవుడు తన ఉద్దేశ్యాన్ని అన్ని చర్యల ద్వారా నెరవేరుస్తూనే ఉంటాడు, ఆయన చెప్పిన మాటను ఫలవంతం చేస్తాడు. మన పిల్లలు అనుకూలమైనా లేదా ప్రతికూలమైనా మన ప్రవర్తన ద్వారా తరచుగా ప్రభావితమవుతారు, అయినప్పటికీ ఒకరు శ్రేయస్సు లేదా జ్ఞానాన్ని వారసులకు అందించలేరు. కావున, మన శాశ్వతమైన స్వాధీనమైన శాశ్వత ధర్మాల కోసం కృషి చేద్దాం. సంపద లేదా ప్రాపంచిక ప్రాముఖ్యతను వెంబడించడం కంటే, మన భవిష్యత్ తరాల కోసం దేవుని ఆశీర్వాదాలను కోరుకుందాం.


Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |