Chronicles II - 2 దినవృత్తాంతములు 36 | View All
Study Bible (Beta)

1. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి.

1. And the people of the land took Jehoahaz the son of Josiah and made him king for his father in Jerusalem.

2. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు నెలలు ఏలెను.

2. And Jehoahaz was twenty three year old when he began to reign, and he reigned three months in Jerusalem.

3. ఐగుప్తురాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి, ఆ దేశమునకు రెండువందల మణుగుల వెండిని రెండు మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి

3. For the king of Egypt put him down at Jerusalem and merced the land in an hundredth talents of silver and a talent of gold.

4. అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదామీదను యెరూషలేముమీదను రాజుగా నియమించి, అతనికి యెహోయాకీము అను మారు పేరుపెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసికొని పోయెను.

4. And the king of Egypt made Eliakim his brother king upon Juda and Jerusalem, and turned his name unto Jehoiakim, but Jehoahaz his brother Necho took and carried him to Egypt.

5. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సర ములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడచుటచేత

5. And Jehoakim was twenty five year old when he began to reign, and he reigned an eleven year in Jerusalem: and he did that displeased the LORD his God.

6. అతని మీదికి బబులోనురాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసికొని పోవుటకై గొలుసులతో బంధించెను.

6. Against him came Nabuchodonozor king of Babylon and bound him in fetters to carry him to Babylon.

7. మరియనెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబు లోనునకు తీసికొనిపోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను.

7. Thereto the king Nabuchodonozor carried off the vessels of the house of the LORD to Babylon and put them in his temple at Babylon.

8. యెహోయాకీము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు హేయదేవతలను పెట్టుకొనుటను గూర్చియు, అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను.

8. The rest of the acts of Jehoiakim, and his Abominations, and that was laid to his charge, are written in the book of the kings of Israel: and Jehoiacin his son reigned in his stead.

9. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేములో మూడు నెలల పది దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను

9. Jehoiacin was eight years old when he began to reign, and he reigned three months and ten days in Jerusalem: and did that displeased the LORD.

10. ఏడాదినాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి, అతని సహో దరుడైన సిద్కియాను యూదామీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణ ములను తెప్పించెను.
మత్తయి 1:11

10. And when the year was out, king Nabuchodonozor sent and fetched him to Babylon with the goodly vessels of the house of the LORD, and made Zedekiah his brother king over Juda and Jerusalem.

11. సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువది యొక టేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను.

11. And Zedekiah was twenty one year old when he began to reign, and reigned a eleven year in Jerusalem.

12. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడచుచు, ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు, తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను.

12. And he did that displeased the LORD his God, and humbled not himself before Jeremiah the prophet at the mouth of the LORD.

13. మరియు దేవుని నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించిన నెబుకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను.

13. And thereto he rebelled against Nabuchodonozor which had received an oath of him by God, and was too stiff necked and too hard hearted to turn unto the LORD God of Israel.

14. అదియుగాక యాజ కులలోను జనులలోను అధిపతులగువారు, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి.

14. Thereto all the rulers of the priests with the people trespassed apace after all manner of abominations of the heathen and polluted the house of the LORD which he had hallowed in Jerusalem.

15. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన
లూకా 20:10-12

15. And the LORD God of their fathers sent to them by his messengers, sending them betimes: for he had compassion on his people and on his dwelling place.

16. పెందలకడ లేచి పంపుచు వచ్చిననుఒ వారు దేవుని దూత లను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరిం చుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.
మత్తయి 5:12, లూకా 6:23, అపో. కార్యములు 7:52

16. But they mocked the messengers of God and despised their words and misused his prophets, until the wrath of the LORD so arose against his people that it was past remedy.

17. ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్న మంది రములోనే వారి ¸యౌవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు ¸యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతనిచేతి కప్ప గించెను.

17. And so he brought upon them the king of Caldeye and slew their young men with the sword in their holy temple, and neither spared young man nor maiden, neither old man, neither so much as him that stooped for age: But gave all into his hand.

18. మరియబబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మంది రపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను.

18. And all the vessels of the house of God both great and small, and the treasures of the house of GOD,(the LORDE) and the treasures of the king and his lords he carried to Babylon every whit.

19. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి.

19. And they burnt the house of God and brake down the walls of Jerusalem and burnt all the palaces thereof with fire with all the goodly stuff thereof, and marred it.

20. ఖడ్గముచేత హతులు కాకుండ తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసికొనిపోయెను. రాజ్యము పారసీకులదగువరకు వారు అక్కడనే యుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి.

20. And he carried away them that had escaped the sword, to Babylon, where they were servants to him and his children, until the kingdom of Persia began to rule,

21. యిర్మీయాద్వారా పలుక బడిన యెహోవా మాట నెర వేరుటకై విశ్రాంతిదినములను దేశము అనుభవించువరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరములకాలము అది విశ్రాంతి దినముల ననుభవించెను.

21. to fulfil the word of the LORD by the mouth of Jeremiah, until the land had her pleasure of her Sabbaths: for as long as she lay desolate, she kept Sabbath until she had fulfilled seventy year.

22. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్య మును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపురాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమం దంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

22. And the first year of Cyrus king of Persia to finish the word of the LORD by the mouth of Jeremiah, the LORD stirred up the spirit of Cyrus king of Persia, that he made a proclamation thorowout all this kingdom, and thereto to set it up in writing, saying:

23. పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞా పించునదేమనగాఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి యున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేర వచ్చును; వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక.

23. Thus sayeth Cyrus king of Persia, all the kingdoms of the earth hath the LORD God of heaven given me, which hath charged me to build him an house in Jerusalem that is in the land of Juda. Wherefore whosoever is among you of all his people, the LORD his God be with him, and let him go up. [The end of the second book of the Chronicles of the kings of Iuda.]



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 36 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

జెరూసలేం నాశనం. (1-21) 
యూదా మరియు జెరూసలేం క్షీణత కాలక్రమేణా క్రమంగా సంభవించింది. పాపులను తిరిగి పొందేందుకు దేవుడు అనుసరించిన పద్ధతులు-అతని మాట, మంత్రులు, మనస్సాక్షి మరియు ప్రొవిడెన్స్ ద్వారా-ఎవరైనా నశించిపోవాలనే అతని కరుణ మరియు అయిష్టతను చూపుతాయి. ఇది పాపం యొక్క వినాశకరమైన ప్రభావాన్ని వివరిస్తుంది. మన భూసంబంధమైన ఆశీర్వాదాలను మరియు వాటి కొనసాగింపును కాపాడుకోవడానికి, పాపం వాటిని అణగదొక్కకుండా నిరోధించాలి. దున్నడం మరియు విత్తడం ద్వారా భూమికి ఏడవ సంవత్సరం విశ్రాంతిని తరచుగా ఉల్లంఘించినప్పటికీ, వారు ఇప్పుడు దున్నబడని మరియు విత్తబడని సంవత్సరాలను పదిరెట్లు ఎదుర్కొన్నారు. అంతిమంగా, మానవుల అవిధేయత వల్ల దేవుని మహిమ తగ్గదు. వారు భూమి యొక్క విశ్రాంతిని తిరస్కరించినట్లయితే, దేవుడు దానిని అమలు చేస్తాడు. దుష్టత్వం కారణంగా యెరూషలేము పతనమైన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మనం అహంకారంతో కాకుండా పర్యవసానాలను భయపెట్టి వినయం మరియు అప్రమత్తంగా ఉండాలి.

సైరస్ యొక్క ప్రకటన. (22,23)
బందీలను పునరుద్ధరించడానికి మరియు డెబ్బై సంవత్సరాల తర్వాత యెరూషలేమును పునర్నిర్మిస్తానని దేవుడు ప్రతిజ్ఞ చేసాడు మరియు చివరికి సీయోనుకు అనుకూలమైన సమయం వచ్చింది. దేవుని చర్చి కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, అది విడిచిపెట్టబడదు; అతని ప్రజలు క్రమశిక్షణతో ఉన్నప్పుడు, వారు విడిచిపెట్టబడరు. వారు కొలిమిలోకి విసిరివేయబడటం వంటి పరీక్షల ద్వారా వెళ్ళవచ్చు, కానీ వారు అక్కడ కోల్పోరు; అవి మలినాలను తొలగించే వరకు మాత్రమే ఉంటాయి. దేవుడు చాలా కాలం పాటు వాగ్వాదంలో నిమగ్నమైనప్పటికీ, అతని వివాదం శాశ్వతమైనది కాదు.
సంఘటనల యొక్క నమ్మకమైన రికార్డును అందించే క్రానికల్స్‌పై మన అధ్యయనాన్ని ముగించినప్పుడు, పాపం ప్రపంచంలోకి మరియు దేవుని చర్చిలోకి కూడా తెచ్చిన వినాశనాన్ని పరిగణించండి. ప్రభువుకు సాక్ష్యమిచ్చిన కొంతమంది నమ్మకమైన ఆత్మల ఉనికిని కూడా గుర్తిస్తూనే, ఇక్కడ కనుగొనబడిన నిర్జనమైన వృత్తాంతాల ద్వారా మనం లోతుగా కదిలిపోదాం. మానవ స్వభావం యొక్క ఈ నిజాయితీ చిత్రణను దాని ముడి స్థితిలో మనం ఆలోచిస్తున్నప్పుడు, మన రక్షకుడైన క్రీస్తు యొక్క సమర్థనీయమైన మరియు ఆత్మ-అలంకరించే నీతి ద్వారా, సర్వశక్తిమంతుడైన దేవుని సర్వశక్తిమంతమైన దయతో రూపాంతరం చెందిన అదే స్వభావంతో మనం దానిని విభేదిద్దాం.



Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |