Nehemiah - నెహెమ్యా 13 | View All
Study Bible (Beta)

1. ఆ దినమందు వారు మోషేగ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవునియొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు.

1. उसी दिन मूसा की पुस्तक लोगों को पढ़कर सुनाई गई; और उस में यह लिखा हुआ मिला, कि कोई अम्मोनी वा मोआबी परमेश्वर की सभा में कभी न आने पाए;

2. వారు అన్నపానములు తీసికొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్రాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను.

2. क्योंकि उन्हों ने अन्न जल लेकर इस्राएलियों से भेंट नहीं की, वरन बिलाम को उन्हें शाप देने के लिये दक्षिणा देकर बुलवाया था-- तौभी हमारे परमेश्वर ने उस शाप को आशीष से बदल दिया।

3. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీయులలోనుండి వెలివేసిరి.

3. यह व्यवस्था सुनकर, उन्हों ने इस्राएल में से मिली जुली भीड़ को अलग अलग कर दिया।

4. ఇంతకుముందు మన దేవుని మందిరపు గదిమీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబీయాతో బంధు త్వము కలుగజేసికొని

4. इस से पहिले एल्याशीब याजक जो हमारे परमेश्वर के भवन की कोठरियों का अधिकारी और तोबिरयाह का सम्बन्धी था।

5. నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవ భాగమును క్రొత్త ద్రాక్షా రసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకుల కును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద, అతనికి ఒకగొప్ప గదిని సిద్ధముచేసి యుండెను.

5. उस ने तोबिरयाह के लिये एक बड़ी कोठरी तैयार की थी जिस में पहिले अन्नबलि का सामान और लोबान और पात्रा और अनाज, नये दाखमधु और टटके तेल के दशमांश, जिन्हें लेवियों, गवैयों और द्वारपालों को देने की आज्ञा थी, रखी हुई थी; और याजकों के लिये उठाई हुई भेंट भी रखी जाती थीं।

6. ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్త హషస్త యేలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్నిదినము లైన తరువాత రాజునొద్ద సెలవుపుచ్చుకొని

6. परन्तु मैं इस समय यरूशलेम में नहीं था, क्योंकि बाबेल के राजा अर्तक्षत्रा के बत्तीसवें वर्ष में मैं राजा के पास चला गया। फिर कितने दिनों के बाद राजा से छुट्टी मांगी,

7. యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబీ యాకు ఒక గది యేర్పరచి చేసిన కీడంతయు తెలిసికొని

7. और मैं यरूशलेम को आया, तब मैं ने जान लिया, कि एल्याशीब ने तोबिरयाह के लिये परमेश्वर के भवन के आंगनों में एक कोठरी तैयार कर, क्या ही बुराई की है।

8. బహుగా దుఃఖపడి ఆ గదిలోనుండి టోబీయాయొక్క సామగ్రియంతయు అవతల పారవేసి, గదులన్నియు శుభ్రముచేయుడని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి.

8. इसे मैं ने बहुत बुरा माना, और तोबिरयाह का सारा घरेलू सामान उस कोठरी में से फेंक दिया।

9. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరల తెప్పించితిని.

9. तब मेरी आज्ञा से वे कोठरियां शुठ्ठ की गई, और मैं ने परमेश्वर के भवन के पात्रा और अन्नबलि का सामान और लोबान उन में फिर से रखवा दिया।

10. మరియు లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందక పోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని

10. फिर मुझे मालूम हुआ कि लेवियों का भाग उन्हें नहीं दिया गया है; और इस कारण काम करनेवाले लेवीय और गवैये अपने अपने खेत को भाग गए हैं।

11. నేను అధిపతులతో పోరాడిదేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి, వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని.

11. तब मैं ने हाकिमों को डांटकर कहा, परमेश्वर का भवन क्यों त्यागा गया है? फिर मैं ने उनको इकट्ठा करके, एक एक को उसके स्थान पर नियुक्त किया।

12. అటుతరువాత యూదులందరును ధాన్య ద్రాక్షారసతైలములలో పదియవ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి.

12. तब से सब यहूदी अनाज, नये दाखमधु और टटके तेल के दशमांश भणडारों में लाने लगे।

13. నమ్మకముగల మనుష్యులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులగా నియమించితిని; వారి చేతిక్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను; మరియు తమ సహో దరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింప బడెను.

13. और मैं ने भणडारों के अधिकारी शेलेम्याह याजक और सादोक मुंशी को, और लेवियों में से पदायाह को, और उनके नीचे हानान को, जो मत्तन्याह का पोता और जक्कूर का पुत्रा था, नियुक्त किया; वे तो विश्वासयोग्य गिने जाते थे, और अपने भाइयों के मय बांटना उनका काम था।

14. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని, నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము.

14. हे मेरे परमेश्वर ! मेरा यह काम मेरे हित के लिये स्मरण रख, और जो जो सुकर्म मैं ने अपने परमेश्वर के भवन और उस में की आराधना के विषय किए हैं उन्हे मिटा न डाल।

15. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలుతొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొని వచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమ్మినవారిని గద్దించితిని.

15. उन्हीं दिनों में मैं ने यहूदा में कितनों को देखा जो विश्रामदिन को हैदों में दाख रौंदते, और पूलियों को ले आते, और गदहों पर लादते थे; वैसे ही वे दाखमधु, दाख, अंजीर और भांति भांति के बोझ विश्रामदिन को यरूशलेम में लाते थे; तब जिस दिन वे भोजनवस्तु बेचते थे, उसी दिन मैं ने उनको चिता दिया।

16. తూరుదేశస్థులును కాపురముండి, యెరూషలేములోను విశ్రాంతిదినములో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి.

16. फिर उस में सोरी लोग रहकर मछली और भांति भांति का सौदा ले आकर, यहूदियों के हाथ यरूशलेम में विश्रामदिन को बेचा करते थे।

17. అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీ రెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు?

17. तब मैं ने यहूदा के रईसों को डांटकर कहा, तुम लोग यह क्या बुराई करते हो, जो विश्रामदिन को अपवित्रा करते हो?

18. మీ పితరులును ఇట్లు చేసి దేవునియొద్దనుండి మనమీదికిని యీ పట్టణ స్థులమీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని.

18. क्या तुम्हारे पुरखा ऐसा नहीं करते थे? और क्या हमारे परमेश्वर ने यह सब विपत्ति हम पर और इस नगर पर न डाली? तौभी तुम विश्रामदिन को अपवित्रा करने से इस्राएल पर परमेश्वर का क्रोध और भी भड़काते जाते हो।

19. మరియు విశ్రాంతిదినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతిదినము గడచువరకు వాటిని తియ్యకూడదనియు నేనాజ్ఞాపించితిని మరియు విశ్రాంతిదినమున ఏ బరువైనను లోపలికి రాకుండ గుమ్మములయొద్ద నా పనివారిలో కొందరిని కావలి యుంచితిని.

19. सो जब विश्रामवार के पहिले दिन को यरूशलेम के फाटकों के आस- पास अन्ध्ेरा होने लगा, तब मैं ने आज्ञा दी, कि उनके पल्ले बन्द किए जाएं, और यह भी आज्ञा दी, कि वे विश्रामवार के पूरे होने तक खोले न जाएं। तब मैं ने अपने कितने सेवकों को फाटकों का अधिकारी ठहरा दिया, कि विश्रामवार को कोई बोझ भीतर आने न पाए।

20. వర్తకులును నానావిధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూష లేము అవతల బసచేసికొనగా

20. इसलिये व्योपारी और भांति भांति के सौदे के बेचनेवाले यरूशलेम के बाहर दो एक बेर टिके।

21. నేను వారిని గద్దించి వారితో ఇట్లంటినిమీరు గోడచాటున ఎందుకు బసచేసి కొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని; అప్పటినుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు.

21. तब मैं ने उनको चिताकर कहा, तुम लोग शहरपनाह के साम्हने क्यों टिकते हो? यदि तुम फिर ऐसा करोगे तो मैं तुम पर हाथ बढ़ाऊंगा। इसलिये उस समय से वे फिर विश्रामबार को नहीं आए।

22. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయు లకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము.

22. तब मैं ने लेवियों को आज्ञा दी, कि अपने अपने को शुठ्ठ करके फाटकों की रखवाली करने के लिये आया करो, ताकि विश्रामदिन पवित्रा माना जाए। हे मेरे परमेश्वर ! मेरे हित के लिये यह भी स्मरण रख और अपनी बड़ी करूणा के अनुसार मुझ पर तरस खा।

23. ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధు లైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి.

23. फिर उन्हीं दिनों में मुझ को ऐसे यहूदी दिखाई पड़े, जिन्हों ने अशदोदी, अम्मोनी और मोआबी स्त्रियां ब्याह ली थीं।

24. వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆ యా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.

24. और उनके लड़केबालों की आधी बोली अशदोदी थी, और वे यहूदी बोली न बोल सकते थे, दोनों जाति की बोली बोलते थे।

25. అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసిమీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమా రులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి

25. तब मैं ने उनको डांटा और कोसा, और उन में से कितनों को पिटवा दिया और उनके बाल नुचवाए; और उनको परमेश्वर की यह शपथ खिलाई, कि हम अपनी बेटियां उनके बेटों के साथ ब्याह में न देंगे और न अपने लिये वा अपने बेटों के लिये उनकी बेेटियां ब्याह में लेंगे।

26. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతనివంటి రాజు లేకపోయినను, అతడు తన దేవునిచేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా నియమింపబడినను, అన్యస్త్రీలు అతనిచేత సహా పాపము చేయించలేదా?

26. क्या इस्राएल का राजा सुलैमान इसी प्रकार के पाप में न फंसा थ? बहुतेरी जातियों में उसके तुल्य कोई राजा नहीं हुआ, और वह अपने परमेश्वर का प्रिय भी था, और परमेश्वर ने उसे सारे इस्राएल के ऊपर राजा नियुक्त किया; परन्तु उसको भी अन्यजाति स्त्रियों ने पाप में फंसाया।

27. కాగా ఇంత గొప్పకీడు చేయునట్లును, మన దేవునికి విరోధముగా పాపము చేయు నట్లును అన్యస్త్రీలను వివాహము చేసికొనిన మీవంటివారి మాటలను మేము ఆలకింపవచ్చునా? అని అడిగితిని.

27. तो क्या हम तुम्हारी सुनकर, ऐसी बड़ी बुराई करें कि अन्यजाति की स्त्रियां ब्याह कर अपने परमेश्वर के विरूद्ध पाप करें?

28. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానినిబట్టి నేను అతని నాయొద్దనుండి తరిమితిని.

28. और एल्याशीब महायाजक के पुत्रा योयादा का एक पुत्रा, होरोनी सम्बल्लत का दामाद था, इसलिये मैं ने उसको अपने पास से भगा दिया।

29. నా దేవా, వారు యాజక ధర్మమును, యాజకధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధ నను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచకొనుము.

29. हे मेरे परमेश्वर उनकी हानि के लिये याजकपद और याजकों ओर लेवियों की वाचा का तोड़ा जाना स्मरण रख।

30. ఈలాగున వారు ఏ పరదేశులలోను కలియకుండ వారిని పవిత్రపరచి, ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవచేయునట్లు నియమించితిని.

30. इस प्रकार मैं ने उनको सब अन्यजातियों से शुठ्ठ किया, और एक एक याजक और लेवीय की बारी और काम ठहरा दिया।

31. మరియు కావలసి వచ్చినప్పుడెల్ల కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసికొని వచ్చునట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.

31. फिर मैं ने लकड़ी की भेंट ले आने के विशेष समय ठहरा दिए, और पहिली पहिली उपज के देने का प्रबन्ध भी किया। हे मेरे परमेश्वर ! मेरे हित के लिये मुझे स्मरण कर।



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Nehemiah - నెహెమ్యా 13 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

నెహెమ్యా మిశ్రమ సమూహాన్ని మారుస్తాడు. (1-9) 
ఇజ్రాయెల్ ఒక విలక్షణమైన దేశం, ఇది ఇతర దేశాల నుండి భిన్నంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని బహిరంగంగా చదవడం యొక్క విలువను పరిగణించండి. మనం దానికి సరైన శ్రద్ధ ఇచ్చినప్పుడు, అది మన తప్పులు మరియు బాధ్యతలు, సద్గుణాలు మరియు దుర్గుణాలను వెల్లడిస్తుంది మరియు మనం ఎక్కడ తప్పుదారి పట్టించామో తెలియజేస్తుంది. దుష్టత్వం నుండి మనల్ని మనం విడదీయడానికి ప్రభావితమైనప్పుడు మనం ప్రయోజనం పొందుతాము. తమ అంతరంగం నుండి పాపాన్ని తొలగించడానికి ప్రయత్నించేవారు, పవిత్రమైన నివాసాలు, దానితో సంబంధం ఉన్న అన్ని ఆస్తులను మరియు దానికి ఇంధనంగా ఉన్న ప్రతిదాన్ని బహిష్కరించాలి. వారు మాంసం యొక్క కోరికలకు పోషణ మరియు ప్రోత్సాహం వలె పనిచేసే అన్నింటినీ తీసివేయాలి; ఇది నిజంగా దానిని లొంగదీసుకునే నిజమైన చర్య. పశ్చాత్తాపం ద్వారా హృదయం నుండి పాపం బహిష్కరించబడిన తర్వాత, విశ్వాసం ద్వారా క్రీస్తు యొక్క విమోచన శక్తిని అన్వయించిన తర్వాత, అది దేవుని ఆత్మ ద్వారా ప్రసాదించిన సద్గుణాలతో అలంకరించబడి, అన్ని రకాల నీతి కోసం దానిని సిద్ధం చేయాలి.

దేవుని ఇంటిలో నెహెమ్యా యొక్క సంస్కరణ. (10-14) 
పవిత్రత ఉన్న వ్యక్తి ఇతరులను ప్రతికూల ఉదాహరణగా ఉంచకుండా నిరోధించడంలో విఫలమైతే, అది ఎవరినీ నిందలు మరియు పర్యవసానాలకు అర్హమైన నుండి రక్షించకూడదు. లేవీయులు దుర్మార్గంగా ప్రవర్తించారు; వారు తమ హక్కును పొందలేదు. వారి మతపరమైన విధులు తగినంత జీవనోపాధిని అందించనందున వారు తమకు మరియు వారి కుటుంబాలకు జీవనోపాధిని వెతకవలసి వచ్చింది. సరిపోని మద్దతు వెనుకబడిన మంత్రిత్వ శాఖకు దారి తీస్తుంది. పనిలో ఉన్నవారు నిర్లక్ష్యం చేయబడినప్పుడు, పని స్వయంగా నష్టపోతుంది. దీనికి పాలకుల వైఫల్యమే కారణమని నెహెమ్యా పేర్కొన్నాడు. తమ విశ్వాసాన్ని మరియు దాని ఆచారాలను విడిచిపెట్టిన మత పెద్దలు మరియు వ్యక్తులు, అలాగే కట్టుబడి ఉండడాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేయని అధికారులతో పాటు బాధ్యత వహించాల్సి ఉంటుంది. నెహెమ్యా లేవీయులను తిరిగి వారి పాత్రలకు చేర్చడంలో మరియు సరైన నష్టపరిహారాన్ని నిర్ధారించడంలో సమయాన్ని వృథా చేయలేదు. ప్రతి సందర్భంలోనూ, నెహెమ్యా తనను మరియు తన వ్యవహారాలను దైవిక మార్గదర్శకత్వానికి అప్పగించి దేవుని వైపు తిరిగాడు. అతను తన మాతృభూమిలో మతం యొక్క పునరుద్ధరణ మరియు నిర్వహణకు దోహదపడ్డాడు అనే ఆలోచనలో అతను సంతృప్తిని పొందాడు. ఈ సందర్భంలో, అతను అహంకారంతో కాకుండా తన నిజమైన ఉద్దేశాల గురించి వినయపూర్వకమైన చిత్తశుద్ధితో దేవునికి విజ్ఞప్తి చేస్తాడు. అతని ప్రార్థన దేవుడు "నన్ను గుర్తుంచుకో" అని, వ్యక్తిగత ప్రతిఫలం కోసం కాదు. తన మంచి పనులను విస్మరించవద్దని, వాటిని విస్తృతంగా గుర్తించాలని లేదా జరుపుకోవాలని కాదు. ఏది ఏమైనప్పటికీ, అతను చివరికి తన సద్గుణ చర్యలకు బహుమతులు మరియు గుర్తింపును పొందుతాడు. దేవుడు తరచుగా మన అభ్యర్థనలు మరియు అంచనాలను మించిపోతాడు.

సబ్బాత్-బ్రేకింగ్ నిగ్రహించబడింది. (15-22) 
నిజమైన భక్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రభువు దినం యొక్క పవిత్రతకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమైనది. పవిత్రమైన సబ్బాత్‌లను విస్మరించినప్పుడు మతం వృద్ధి చెందదు. యూదు ప్రజలు ప్రార్థనా స్థలాన్ని విడిచిపెట్టి, సబ్బాత్‌ను అపవిత్రం చేసినప్పుడు మతపరమైన భక్తిలో విస్తృతమైన క్షీణత మరియు నైతిక ప్రవర్తన క్షీణించడంలో ఆశ్చర్యం లేదు. చాలా మంది సబ్బాత్‌ను అగౌరవంగా ప్రవర్తించినప్పుడు తమ చర్యల తీవ్రతను గుర్తించడంలో విఫలమవుతారు. మన ప్రతికూల ప్రభావం ఫలితంగా ఇతరులు చేసే అతిక్రమణలకు మేము బాధ్యత వహిస్తాము. నెహెమ్యా సబ్బాత్ అపవిత్రతను ఖండించదగిన చర్యగా ఖండిస్తున్నాడు, ఇది నిజానికి దేవుని పట్ల మరియు మన స్వంత శ్రేయస్సు పట్ల విస్మయం నుండి ఉద్భవించింది. సబ్బాత్‌ను ఉల్లంఘించడం అనేది వారిపై దేవుని తీర్పులకు దారితీసిన అతిక్రమణలలో ఒకటి అని అతను నిరూపించాడు. వారు హెచ్చరికను పట్టించుకోకపోతే మరియు వారి పాపపు మార్గాల్లో కొనసాగితే, తదుపరి పరిణామాలు ఆశించబడతాయి. ఈ సమస్యను పరిష్కరించడంలో నెహెమ్యా యొక్క ధైర్యం, అభిరుచి మరియు జ్ఞానం మనకు అనుసరించడానికి ఒక ఉదాహరణగా ఉపయోగపడతాయి మరియు అతను సాధించిన పునరుద్ధరణ శాశ్వతమైనదని నమ్మడం సహేతుకమైనది. అతను తన స్వంత లోపాలను అంగీకరిస్తాడు మరియు తన పాపాలను బహిరంగంగా ఒప్పుకుంటాడు, దేవుని నుండి న్యాయం కోరడానికి తనకు ఎటువంటి ఆధారం లేదని గుర్తించి, బదులుగా దైవిక దయ కోసం హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాడు.

వింత భార్యల తొలగింపు. (23-31)
తల్లిదండ్రుల్లో ఎవరికైనా దైవభక్తి లేకుంటే, ఆ తల్లిదండ్రుల చెడిపోయిన స్వభావం పిల్లలు వారసత్వంగా పొందే అవకాశం ఉంది. క్రైస్తవులు అసమాన భాగస్వామ్యాలను నివారించడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. పిల్లలను పెంచేటప్పుడు, వారి ప్రసంగాన్ని జాగ్రత్తగా నిర్వహించడం చాలా ముఖ్యం, వారు అపవిత్రమైన లేదా అపవిత్రమైన భాషని అవలంబించకుండా చూసుకోవాలి. అలాంటి వివాహాల తప్పును నెహెమ్యా ఎత్తి చూపాడు. ద్వితీయోపదేశకాండము 25:2-3 లో చట్టంలో వివరించిన విధంగా అధికారులు క్రమశిక్షణతో ఉండాలని నెహెమ్యా సూచించడంతో ప్రత్యేకించి ప్రతిఘటించిన వారు పరిణామాలను ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిలో నెహెమ్యా యొక్క ప్రార్థనలు క్రింది విధంగా ఉన్నాయి: "ఓ నా దేవా, వాటిని గుర్తుంచుకో" అని అతను విజ్ఞప్తి చేశాడు. వారి సరియైన ప్రవర్తన మరియు బాధ్యతలను వారికి గుర్తు చేయమని, వారిని దోషులుగా నిర్ధారించి, మార్చమని ప్రభువును వేడుకుంటున్నాడు. తరచుగా, ప్రజలు తమ కోసం చేసిన మంచి పనులను మరచిపోతారు, కాబట్టి నెహెమ్యా దేవుని ప్రతిఫలానికి తనను తాను అప్పగించుకుంటాడు. ఇది మన స్వంత పిటిషన్ల యొక్క సంక్షిప్త సారాంశంగా ఉపయోగపడుతుంది; "నా దేవా, మంచి కోసం నన్ను గుర్తుంచుకో" అని వేడుకోవడం కంటే సంతోషం కోసం మనకు ఇంకేమీ అవసరం లేదు. అలసిపోని అంకితభావం మరియు ఉపయోగకరమైన జీవితాల తర్వాత, మన చర్యలకు గాఢంగా పశ్చాత్తాపం చెందడానికి మరియు హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెందడానికి, "నన్ను విడిచిపెట్టు, ఓహ్ నా దేవా, నీ దయ యొక్క విస్తారత ప్రకారం."



Shortcut Links
నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |