Nehemiah - నెహెమ్యా 2 | View All
Study Bible (Beta)

1. అటుతరువాత అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసికొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడును అతనియెదుట విచారముగా ఉండలేదు.

1. It happened in the month Nisan, in the twentieth year of Artachshasta the king, when wine was before him, that I took up the wine, and gave it to the king. Now I had not been before sad in his presence.

2. కాగా రాజునీకు వ్యాధిలేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయదుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా

2. The king said to me, Why is your face sad, seeing you are not sick? this is nothing else but sorrow of heart. Then I was very sore afraid.

3. నేను మిగుల భయపడిరాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.

3. I said to the king, Let the king live forever: why should not my face be sad, when the city, the place of my fathers' tombs, lies waste, and the gates of it are consumed with fire?

4. అప్పుడు రాజుఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి

4. Then the king said to me, For what do you make request? So I prayed to the God of heaven.

5. రాజుతోనీ సముఖమందు నేను దయపొందినయెడల, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని.

5. I said to the king, If it please the king, and if your servant have found favor in your sight, that you would send me to Yehudah, to the city of my fathers' tombs, that I may build it.

6. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునియుండగానీ ప్రయాణము ఎన్నిదినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను. నేను ఇంత కాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను.

6. The king said to me (the queen also sitting by him,) For how long shall your journey be? and when will you return? So it pleased the king to send me; and I set him a time.

7. ఇదియు గాక రాజుతో నే నిట్లంటిని రాజున కనుకూలమైతే యూదాదేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది యవతల నున్న అధికారులకు తాకీదులను,

7. Moreover I said to the king, If it please the king, let letters be given me to the governors beyond the River, that they may let me pass through until I come to Yehudah;

8. పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను.

8. and a letter to Asaf the keeper of the king's forest, that he may give me timber to make beams for the gates of the castle which appertains to the house, and for the wall of the city, and for the house that I shall enter into. The king granted me, according to the good hand of my God on me.

9. తరువాత నేను నది యవతలనున్న అధికారులయొద్దకు వచ్చి వారికి రాజుయొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతోకూడ సేనాధిపతులను గుఱ్ఱపురౌతులను పంపించెను.

9. Then I came to the governors beyond the River, and gave them the king's letters. Now the king had sent with me captains of the army and horsemen.

10. హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.

10. When Sanvallat the Horonite, and Toviyah the servant, the `Ammonite, heard of it, it grieved them exceedingly, because a man had come to seek the welfare of the children of Yisra'el.

11. అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే యుండి

11. So I came to Yerushalayim, and was there three days.

12. రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితివిు. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచననునేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువుతప్ప మరి యే పశువును నాయొద్ద ఉండ లేదు.

12. I arose in the night, I and some few men with me; neither told I any man what my God put into my heart to do for Yerushalayim; neither was there any animal with me, except the animal that I rode on.

13. నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకా రములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.

13. I went out by night by the valley gate, even toward the jackal's well, and to the dung gate, and viewed the walls of Yerushalayim, which were broken down, and the gates of it were consumed with fire.

14. తరువాత నేను బుగ్గగుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను.

14. Then I went on to the spring gate and to the king's pool: but there was no place for the animal that was under me to pass.

15. నేను రాత్రి యందు మడుగు దగ్గరనుండి పోయి ప్రాకారమును చూచినమీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చితిని.

15. Then went I up in the night by the brook, and viewed the wall; and I turned back, and entered by the valley gate, and so returned.

16. అయితే నేను ఎచ్చటికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పనిచేయు ఇతరమైనవారికే గాని నేను ఆ సంగతి చెప్పి యుండలేదు.

16. The rulers didn't know where I went, or what I did; neither had I as yet told it to the Yehudim, nor to the Kohanim, nor to the nobles, nor to the rulers, nor to the rest who did the work.

17. అయితే వారితో నేనిట్లంటినిమనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు, మనకు ఇకమీదట నింద రాకుండ యెరూషలేముయొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి.

17. Then said I to them, You see the evil case that we are in, how Yerushalayim lies waste, and the gates of it are burned with fire: come, and let us build up the wall of Yerushalayim, that we be no more a reproach.

18. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నియు నేను వారితో చెప్పితిని. అందుకు వారు - మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి యీ మంచికార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి.

18. I told them of the hand of my God which was good on me, as also of the king's words that he had spoken to me. They said, Let us rise up and build. So they strengthened their hands for the good work.

19. అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మో నీయుడైన దాసుడగు టోబీయా అనువాడును, అరబీయు డైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి.

19. But when Sanvallat the Horonite, and Toviyah the servant, the `Ammonite, and Geshem the `Arvian, heard it, they ridiculed us, and despised us, and said, What is this thing that you do? will you rebel against the king?

20. అందుకు నేను - ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనయైనను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని.

20. Then answered I them, and said to them, The God of heaven, he will prosper us; therefore we his servants will arise and build: but you have no portion, nor right, nor memorial, in Yerushalayim.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Nehemiah - నెహెమ్యా 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

రాజుకు నెహెమ్యా విన్నపం. (1-8) 
మన ప్రార్థనలు హృదయపూర్వక ప్రయత్నాలతో కూడి ఉండాలి, లేకుంటే మనం దేవుడిని అపహాస్యం చేస్తున్నాము. రాజుల రాజుతో మా కమ్యూనికేషన్ నిర్దిష్ట క్షణాలకే పరిమితం కాదు; ఏ సమయంలోనైనా ఆయనను సంప్రదించే స్వేచ్ఛ మనకు ఉంది. ఆయన కృప సింహాసనానికి ప్రాప్తి కోరడం ఎల్లప్పుడూ సముచితమే. అయినప్పటికీ, దేవుని అసమ్మతి మరియు అతని ప్రజల బాధల వల్ల కలిగే దుఃఖం దేవునికి చెందిన వారికి తీవ్ర విచారాన్ని తెస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఏ భూసంబంధమైన సుఖాలు సుఖాన్ని అందించలేవు.
నెహెమ్యా తన ఆలోచనలను వ్యక్తపరచడానికి రాజు నుండి ప్రోత్సాహాన్ని పొందాడు, అది అతనికి మాట్లాడటానికి ధైర్యం కలిగించింది. అదేవిధంగా, ప్రార్థన చేయమని క్రీస్తు ఆహ్వానం మరియు సానుకూల ప్రతిస్పందన యొక్క వాగ్దానం దయతో కూడిన సింహాసనాన్ని ఆత్మవిశ్వాసంతో చేరుకోవడానికి మనల్ని ప్రోత్సహించాలి. నెహెమ్యా తన ప్రార్థనలను స్వర్గపు దేవునికి నిర్దేశించాడు, శక్తివంతమైన చక్రవర్తిపై కూడా అతని సర్వోన్నత సార్వభౌమత్వాన్ని గుర్తించాడు. లోపల చెప్పని భావాలను గ్రహించే దేవునికి తన హృదయాన్ని కురిపించాడు. దైవిక మార్గదర్శకత్వం, మద్దతు మరియు ఆశీర్వాదం కోసం వెతకడం మరియు ఆశించడం సరికాని ప్రయత్నాన్ని మనం ఎప్పుడూ ప్రారంభించకూడదు.
నెహెమ్యా ప్రార్థనకు వెంటనే సమాధానం లభించింది, ఎందుకంటే యాకోబు వంశస్థులు యాకోబు దేవుణ్ణి వెదకినప్పుడు ఎప్పుడూ నిరాశ చెందలేదు.

నెహెమ్యా యెరూషలేముకు వస్తాడు. (9-18) 
జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత, జెరూసలేం గోడను పునర్నిర్మించే పనిని చేపట్టడానికి దేవుడు తనను ప్రేరేపించాడని నెహెమ్యా యూదు సమాజానికి తెలియజేశాడు. వారి ప్రమేయం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, అతను ఒంటరిగా ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలని అనుకోలేదు. తనను మరియు తన తోటి యూదులను ధర్మబద్ధమైన చర్యలకు ప్రేరేపించడం ద్వారా, వారు ప్రాజెక్ట్ కోసం తమ సంకల్పాన్ని పరస్పరం బలపరిచారు. మనం ఉదాసీనత మరియు ఉదాసీనతతో వారిని సంప్రదించినప్పుడు మన బాధ్యతల పట్ల మన నిబద్ధత క్షీణిస్తుంది.

విరోధుల వ్యతిరేకత. (19,20)
క్రీస్తు మిషన్‌కు వ్యతిరేకంగా సర్ప వంశంతో జతకట్టిన వారి శత్రుత్వానికి తాత్కాలిక లేదా భౌగోళిక హద్దులు లేవు. మన స్వంత పరిస్థితులకు ఔచిత్యం స్పష్టంగా కనిపిస్తుంది. విశ్వాసుల సంఘం నుండి మనవి మనకు అందుతాయి. నిరంతర దాడులను ఎదుర్కొంటూ, దైవిక సమాజం యొక్క స్థితి దుర్భరం కాదా? దాని క్షీణించిన స్థితి గురించిన అవగాహన మీలో దుఃఖాన్ని కలిగిస్తుందా? పని, ఆనందం లేదా నిర్దిష్ట సమూహం పట్ల విధేయత వంటి డిమాండ్లను అనుమతించవద్దు, తద్వారా జియోన్ యొక్క శ్రేయస్సు మీకు అసంభవం అవుతుంది.



Shortcut Links
నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |