Nehemiah - నెహెమ్యా 9 | View All
Study Bible (Beta)

1. ఈ నెల యిరువది నాలుగవ దినమందు ఇశ్రాయేలీ యులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తలమీద ధూళి పోసికొని కూడి వచ్చిరి.

1. Then on the twenty-fourth day of this month, the People of Israel gathered for a fast, wearing burlap and faces smudged with dirt as signs of repentance.

2. ఇశ్రాయేలీయులు అన్య జనులందరిలోనుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి, తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి.

2. The Israelites broke off all relations with foreigners, stood up, and confessed their sins and the iniquities of their parents.

3. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువ బడి, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చదువుచు వచ్చిరి, ఒక జాముసేపు తమ పాపములను ఒప్పు కొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి.

3. While they stood there in their places, they read from the Book of The Revelation of GOD, their God, for a quarter of the day. For another quarter of the day they confessed and worshiped their GOD.

4. లేవీయులలో యేషూవ బానీ కద్మీయేలు షెబన్యా బున్నీ షేరేబ్యా బానీ కెనానీ అనువారు మెట్లమీద నిలువబడి, యెలుగెత్తి, తమ దేవుడైన యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి.

4. A group of Levites--Jeshua, Bani, Kadmiel, Shebaniah, Bunni, Sherebiah, Bani, and Kenani--stood on the platform and cried out to GOD, their God, in a loud voice.

5. అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారునిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి - సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక.

5. The Levites Jeshua, Kadmiel, Bani, Hashabneiah, Sherebiah, Hodiah, Shebaniah, and Pethahiah said, 'On your feet! Bless GOD, your God, for ever and ever!' Blessed be your glorious name, exalted above all blessing and praise!

6. నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.
ప్రకటన గ్రంథం 10:5

6. You're the one, GOD, you alone; You made the heavens, the heavens of heavens, and all angels; The earth and everything on it, the seas and everything in them; You keep them all alive; heaven's angels worship you!

7. దేవా యెహోవా, అబ్రామును ఏర్పరచుకొని, కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇవతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే.

7. You're the one, GOD, the God who chose Abram And brought him from Ur of the Chaldees and changed his name to Abraham.

8. అతడు నమ్మకమైన మనస్సుగల వాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీ యులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు ఆతనితో నిబంధన చేసినవాడవు నీవే.

8. You found his heart to be steady and true to you and signed a covenant with him, A covenant to give him the land of the Canaanites, the Hittites, and the Amorites, The Perizzites, Jebusites, and Girgashites, --to give it to his descendants. And you kept your word because you are righteous.

9. నీవు నీతిమంతుడవై యుండి నీ మాటచొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱసముద్రమునొద్ద వారి మొఱ్ఱను నీవు వింటివి.

9. You saw the anguish of our parents in Egypt. You heard their cries at the Red Sea;

10. ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారియెడల బహు గర్వ ముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారియెదుట సూచకక్రియలను మహత్కార్యములను చూపించితివి. ఆలాగున చేయుటవలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధినొందితివి.

10. You amazed Pharaoh, his servants, and the people of his land with wonders and miracle-signs. You knew their bullying arrogance against your people; you made a name for yourself that lasts to this day.

11. మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రముమధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.

11. You split the sea before them; they crossed through and never got their feet wet; You pitched their pursuers into the deep; they sank like a rock in the storm-tossed sea.

12. ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రికాలమందు వారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయి యుండి వారిని తోడుకొనిపోతివి.

12. By day you led them with a Pillar of Cloud, and by night with a Pillar of Fire To show them the way they were to travel.

13. సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలు కరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి.

13. You came down onto Mount Sinai, you spoke to them out of heaven; You gave them instructions on how to live well, true teaching, sound rules and commands;

14. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషేద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.

14. You introduced them to your Holy Sabbath; Through your servant Moses you decreed commands, rules, and instruction.

15. వారి ఆకలి తీర్చుటకు ఆకాశమునుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలోనుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణముచేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారి కాజ్ఞాపించితివి.
యోహాను 6:31

15. You gave bread from heaven for their hunger, you sent water from the rock for their thirst. You told them to enter and take the land, which you promised to give them.

16. అయితే వారును మా పితరులును గర్వించి, లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గక పోయిరి.

16. But they, our ancestors, were arrogant; bullheaded, they wouldn't obey your commands.

17. వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచు కొని, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగు బాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంత మును బహు కృపయు గలవాడవునై యుండి వారిని విసర్జింపలేదు.

17. They turned a deaf ear, they refused to remember the miracles you had done for them; They turned stubborn, got it into their heads to return to their Egyptian slavery. And you, a forgiving God, gracious and compassionate, Incredibly patient, with tons of love-- you didn't dump them.

18. వారు ఒక పోతదూడను చేసికొనిఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, నీకు బహు విసుకు పుట్టించినను

18. Yes, even when they cast a sculpted calf and said, 'This is your god Who brought you out of Egypt,' and continued from bad to worse,

19. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు; మార్గముగుండ వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలు గిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపైనుండి వెళ్లిపోక నిలిచెను.

19. You in your amazing compassion didn't walk off and leave them in the desert. The Pillar of Cloud didn't leave them; daily it continued to show them their route; The Pillar of Fire did the same by night, showed them the right way to go.

20. వారికి భోధించుటకు నీ యుపకారాత్మను దయ చేసితివి, నీ విచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు; వారి దాహమునకు ఉదకమిచ్చితివి.

20. You gave them your good Spirit to teach them to live wisely. You never stinted with your manna, gave them plenty of water to drink.

21. నిజముగా అరణ్యములో ఏమియు తక్కువ కాకుండ నలువది సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకువాపు రాలేదు.

21. You supported them forty years in that desert; they had everything they needed; Their clothes didn't wear out and their feet never blistered.

22. ఇదియుగాక రాజ్యములను జన ములను వారికప్పగించి, వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక, వారు సీహోను అను హెష్బోను రాజుయొక్క దేశమును బాషానునకు రాజైన ఓగుయొక్క దేశమును స్వతంత్రించుకొనిరి.

22. You gave them kingdoms and peoples, establishing generous boundaries. They took over the country of Sihon king of Heshbon and the country of Og king of Bashan.

23. వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి, ప్రవేశించి స్వతంత్రించు కొనునట్లు వారి పితరులకు నీవు వాగ్దానముచేసిన దేశములోనికి వారిని రప్పింపగా

23. You multiplied children for them, rivaling the stars in the night skies, And you brought them into the land that you promised their ancestors they would get and own.

24. ఆ సంతతివారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులను ఆ దేశవాసులను జయించి, తమకు మనస్సువచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశజనులను వారి చేతికి అప్పగించితివి.

24. Well, they entered all right, they took it and settled in. The Canaanites who lived there you brought to their knees before them. You turned over their land, kings, and peoples to do with as they pleased.

25. అప్పుడు వారు ప్రాకారములుగల పట్టణ ములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని, సకలమైన పదార్థములతో నిండియున్న యిండ్లను త్రవ్విన బావులను ద్రాక్షతోటలను ఒలీవ తోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనిరి. ఆలాగున వారు తిని తృప్తిపొంది మదించి నీ మహోపకారమునుబట్టి బహుగా సంతోషించిరి.

25. They took strong cities and fertile fields, they took over well-furnished houses, Cisterns, vineyards, olive groves, and lush, extensive orchards. And they ate, grew fat on the fat of the land; they reveled in your bountiful goodness.

26. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటుచేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి, నీతట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి.

26. But then they mutinied, rebelled against you, threw out your laws and killed your prophets, The very prophets who tried to get them back on your side-- and then things went from bad to worse.

27. అందుచేత నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి, వారి శత్రువుల చేతిలోనుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి.

27. You turned them over to their enemies, who made life rough for them. But when they called out for help in their troubles you listened from heaven; And in keeping with your bottomless compassion you gave them saviors: Saviors who saved them from the cruel abuse of their enemies.

28. వారు నెమ్మదిపొందిన తరువాత నీ యెదుట మరల ద్రోహులుకాగా నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి; వీరు వారిమీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలంకించి నీ కృపచొప్పున అనేకమారులు వారిని విడిపించితివి.

28. But as soon as they had it easy again they were right back at it--more evil. So you turned away and left them again to their fate, to the enemies who came right back. They cried out to you again; in your great compassion you heard and helped them again. This went on over and over and over.

29. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన యెడల వాటివలన వాడు బ్రదుకునుగదా. వారు మరల నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచునట్లు నీవు వారిమీద సాక్ష్యము పలికినను, వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకొని నీ మాట వినకపోయిరి.

29. You warned them to return to your Revelation, they responded with haughty arrogance: They flouted your commands, spurned your rules --the very words by which men and women live! They set their jaws in defiance, they turned their backs on you and didn't listen.

30. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి, నీ ప్రవక్తలద్వారా నీ ఆత్మచేత వారిమీద సాక్ష్యము పలికితివి గాని వారు వినక పోయిరి; కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి.

30. You put up with them year after year and warned them by your spirit through your prophets; But when they refused to listen you abandoned them to foreigners.

31. అయితే నీవు మహోప కారివై యుండి, వారిని బొత్తిగా నాశనముచేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపాకనికర ములుగల దేవుడవై యున్నావు.

31. Still, because of your great compassion, you didn't make a total end to them. You didn't walk out and leave them for good; yes, you are a God of grace and compassion.

32. చేసిన నిబంధనను నిలు పుచు కృప చూపునట్టి మహా పరాక్రమశాలివియు భయం కరుడవునగు మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని యీ దినములవరకు మా మీదికిని మా రాజుల మీదికిని ప్రధానులమీదికిని మా పితరులమీదికిని నీ జను లందరిమీదికిని వచ్చిన శ్రమయంతయు నీ దృష్టికి అల్ప ముగా ఉండకుండును గాక.

32. And now, our God, the great God, God majestic and terrible, loyal in covenant and love, Don't treat lightly the trouble that has come to us, to our kings and princes, our priests and prophets, Our ancestors, and all your people from the time of the Assyrian kings right down to today.

33. మా మీదికి వచ్చిన శ్రమ లన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే; నీవు సత్యము గానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతివిు.

33. You are not to blame for all that has come down on us; You did everything right, we did everything wrong.

34. మా రాజులు గాని మా ప్రధానులు గాని మా యాజకులు గాని మా పితరులు గాని నీ ధర్మశాస్త్రము ననుసరించి నడువలేదు. నీవు వారిమీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి.

34. None of our kings, princes, priests, or ancestors followed your Revelation; They ignored your commands, dismissed the warnings you gave them.

35. వారు తమ రాజ్య పరిపాలనకాలమందు నీవు తమ యెడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలువిడిచి మారుమనస్సు పొందరైరి.

35. Even when they had their own kingdom and were enjoying your generous goodness, Living in that spacious and fertile land that you spread out before them, They didn't serve you or turn their backs on the practice of evil.

36. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృధ్ధిని అనుభవించునట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమియందు మేము దాసులమై యున్నాము.
యోహాను 8:33

36. And here we are, slaves again today; and here's the land you gave our ancestors So they could eat well and enjoy a good life, and now look at us--no better than slaves on this land.

37. మా పాపములనుబట్టి నీవు మామీద నియమించిన రాజులకు అది అతివిస్తారముగా ఫల మిచ్చుచున్నది.

37. Its wonderful crops go to the kings you put over us because of our sins; They act like they own our bodies and do whatever they like with our cattle. We're in deep trouble.

38. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరములమీదను మా పశువులమీదను అధికారము చూపు చున్నారు గనుక మాకు చాల శ్రమలు కలుగుచున్నవి.

38. 'Because of all this we are drawing up a binding pledge, a sealed document signed by our princes, our Levites, and our priests.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Nehemiah - నెహెమ్యా 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

గంభీరమైన ఉపవాసం. (1-3) 
ఈ పదం ప్రార్థనను మార్గనిర్దేశం చేస్తుంది మరియు వేగవంతం చేస్తుంది, దాని ద్వారా, ప్రార్థన సమయంలో మన బలహీనతలలో ఆత్మ మనకు సహాయం చేస్తుంది. దేవుని బోధలను శ్రద్ధగా అన్వేషించడం మన స్వంత లోపాలను మరియు ఆయన విమోచన యొక్క సమృద్ధిని క్రమంగా ఆవిష్కరిస్తుంది. తత్ఫలితంగా, ఆయనలో ఆనందాన్ని పొందుతూ పాపం గురించి దుఃఖించమని అది మనల్ని పిలుస్తుంది. దేవుని సత్యాల యొక్క ప్రతి ద్యోతకం ఆయన పవిత్ర గ్రంథాలతో నిమగ్నమవ్వడానికి మరియు ఆరాధనలో పాల్గొనడానికి మనల్ని నిరంతరం అంకితం చేయాలి.

ప్రార్థన మరియు పాపపు ఒప్పుకోలు. (4-38)
ఇక్కడ అందించబడిన వృత్తాంతం వారి ప్రార్థనల సారాంశాన్ని సంగ్రహిస్తుంది. నిస్సందేహంగా, చాలా ఎక్కువ వ్యక్తీకరించబడింది. దేవుని సేవలో మరియు మహిమపరచడంలో మనం కలిగి ఉన్న సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించడం మన విధి. మన పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు, దేవుని కనికరాన్ని గుర్తించడం కూడా ప్రయోజనకరం, తద్వారా మన వినయం మరియు పశ్చాత్తాపాన్ని మరింతగా పెంచుతాయి. వారి హృదయాల కాఠిన్యానికి భిన్నంగా ప్రభువు చర్యలు అతని దయ మరియు సహనాన్ని బహిర్గతం చేశాయి.
ప్రవచనాత్మక సాక్ష్యాలు ప్రవక్తలలోని ఆత్మకు సాక్ష్యమిచ్చాయి, వారిలో నివసించే క్రీస్తు ఆత్మ తప్ప మరొకటి కాదు. వారి మాటలు పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడ్డాయి మరియు మేము వారి మాటలను తదనుగుణంగా అంగీకరించాలి. ఫలితం ప్రభువు యొక్క దయగల స్వభావాన్ని విస్మయపరిచింది, దానితో పాటు వారి ప్రస్తుత పరిస్థితి పాపం యొక్క పర్యవసానంగా ఉందని గ్రహించడంతోపాటు, కేవలం అనర్హమైన ప్రేమ ద్వారా రక్షించాల్సిన అవసరం ఉంది. వారి ప్రవర్తనలో మానవ స్వభావం యొక్క ప్రతిబింబాన్ని మనం గ్రహించలేమా? మన దేశం మరియు మన వ్యక్తిగత చరిత్ర యొక్క వార్షికోత్సవాలను పరిశీలిద్దాం. చిన్ననాటి నుండి మనం పొందిన ఆశీర్వాదాలను గుర్తుచేసుకుందాం మరియు మన ప్రారంభ ప్రతిస్పందనలను పరిశీలిద్దాం. ఈ విషయంపై క్రమం తప్పకుండా ఆలోచించడం మనల్ని వినయంగా, కృతజ్ఞతతో మరియు అప్రమత్తంగా ఉంచుతుంది. అహంకారం మరియు మొండితనం ఆత్మను నాశనం చేసే అతిక్రమణలు అని అందరూ గుర్తుంచుకోండి.
ఏది ఏమైనప్పటికీ, విరిగిన హృదయం ఉన్నవారిలో ఆశను కలిగించడం ఎంత సవాలుగా ఉందో, అంతకుముందు వారిలో భయాన్ని కలిగించడం కూడా అంతే సవాలుగా ఉంటుంది. ఇది మీకు ప్రతిధ్వనిస్తుందా? ఈ ఓదార్పునిచ్చే వాగ్దానాన్ని పరిగణించండి: క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు! అనర్హుల భావన వల్ల దేవుణ్ణి తప్పించే బదులు, దయను కోరుతూ మరియు అవసరమైన సమయాల్లో సహాయాన్ని వెతుక్కుంటూ విశ్వాసంతో దయ యొక్క సింహాసనాన్ని చేరుకుందాం. నిజానికి, అతను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్న దేవుడు.



Shortcut Links
నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |