Job - యోబు 1 | View All
Study Bible (Beta)

1. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.
1 థెస్సలొనీకయులకు 5:22

“ఊజు”– ఈ దేశం కనానుకు తూర్పు దిశగా ఉంది (3 వ) యిర్మీయా కాలంలో ఎదోం, ఊజు దేశాలు వేరువేరుగా ఉన్నాయి (యిర్మియా 25:20-21). కానీ ఎదోంవాళ్ళు ఊజులో ఉన్నారు (విలాపవాక్యములు 4:21). కాబట్టి ఊజు బహుశా ఎదోంకు సమీపంలోనే ఉండవచ్చు. ఎలీఫజు స్వస్థలమైన తేమాను (యోబు 2:11) ఎదోం సరిహద్దుల లోపల ఉంది. “నిర్దోషి”– అంటే యోబులో పాప స్వభావం లేదని కాదు. దీని అర్థం ఏమంటే యోబు దేవుని కృపవల్ల అన్ని సద్గుణాలూ గలవాడై, అన్ని విధాలా నిజాయితీ పవిత్రతలతో కూడిన జీవితం గడిపేవాడు. అతని స్వభావంలో ఉన్న పాపం మీద దేవుడతనికి విజయాన్ని ఇచ్చాడు. మన భ్రష్ట స్వభావాన్ని గురించి ఆదికాండము 8:21; కీర్తనల గ్రంథము 51:5; కీర్తనల గ్రంథము 58:3; రోమీయులకు 3:9-19; ఎఫెసీయులకు 2:1-3 నోట్స్ చూడండి. నిర్దోషత్వం గురించి ఆదికాండము 6:9; ఆదికాండము 17:1; మత్తయి 5:48; 2 కోరింథీయులకు 7:1; ఎఫెసీయులకు 4:13; ఫిలిప్పీయులకు 3:12; కొలొస్సయులకు 1:28; కొలొస్సయులకు 4:12; యాకోబు 1:4 చూడండి. “నిజాయితీ”– ఈ మాటకు అర్థమేమంటే తన వ్యవహారాలన్నిటిలో యోబు ముక్కు సూటిగా, యథార్థంగా, నీతిగా ఉండి వంకర త్రోవలు పట్టకుండా ఉన్నాడన్నమాట (కీర్తనల గ్రంథము 7:10; కీర్తనల గ్రంథము 11:2 కీర్తనల గ్రంథము 11:7; కీర్తనల గ్రంథము 25:8; కీర్తనల గ్రంథము 112:2 కీర్తనల గ్రంథము 112:4; కీర్తనల గ్రంథము 140:13; సామెతలు 15:8; సామెతలు 16:17). “భయభక్తులు”– దైవభయం గురించిన వివరం కోసం యోబు 28:28; ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; కీర్తనల గ్రంథము 130:3-4; సామెతలు 1:7 చూడండి. దైవభయం ఉన్నవారు దుర్మార్గతనుంచి తొలగిపోతారు. నిజమైన దైవభయంలో ఉన్న విశేషమిదే (యోబు 28:28; సామెతలు 3:7; సామెతలు 8:13; సామెతలు 16:6; 2 కోరింథీయులకు 7:1). ఇక్కడ వెల్లడైన యోబు లక్షణాలు, మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండగలడో అన్నదానికి ఆదర్శం. ఈ లక్షణాలు యోబుకున్న ఆస్తిపాస్తులన్నిటి కంటే అత్యంత విలువైనవి.

2. అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.

3. అతనికి ఏడువేల గొఱ్ఱెలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను.

తూర్పు అంటే కనానుకు తూర్పు దిశగా బహుశా యూఫ్రటీస్ నదివరకు ఉన్న ప్రదేశం కావచ్చు.

4. అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ యిండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి.

5. వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.

ఈ మాటల్లో యోబుకు దేవునిపైన, తన పిల్లల పైన ఉన్న ప్రేమా, మానవ హృదయంలో సహజంగా ఉండే పాప స్వభావం గురించిన గ్రహింపూ తేటతెల్లమౌతున్నాయి. అంతేకాక కుటుంబ నాయకుడైన యాజిగా యోబు నిర్వహించే పనులను గురించి తెలుస్తున్నది. యాజి గురించి వివరణ నిర్గమకాండము 28:1. హోమబలి వివరణ లేవీ 1వ అధ్యాయం.

6. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను.

“దేవుని కుమారులు”– యోబు 2:1; యోబు 38:7; ఆదికాండము 6:2. దేవుని కుమారులు అంటే దేవదూతలు (ఆదికాండము 16:7 లో నోట్‌). ఇక్కడ జరిగిన దాన్నిబట్టి చూస్తుంటే వారు తమ తమ చర్యల గురించి దేవునికి చెప్పి వాటికి సంబంధించిన ఆజ్ఞలను తీసుకొనేందుకు వచ్చారని అర్థమౌతున్నది. “రోజు”– మనుషులకు అగోచరమైన ఆత్మల లోకంలోకి తొంగి చూచే అవకాశం ఇక్కడ మనకు కలుగుతున్నది. యోబుకు సంభవించిన దానంతటికీ మూల కారణం ఆ లోకంలోనే ఉంది. “సైతాను”– 1 దినవృత్తాంతములు 21:1 నోట్. సైతాను కూడా దేవుని ఎదుట కనిపించవలసిందే. ఒక విధంగా చూస్తే సైతాను పనిపాటలు కూడా దేవుని సర్వాతీతమైన సంకల్పం పరిధిలోనే సాగుతాయని చెప్పాలి. అంటే సైతాను చెయ్యదలచుకున్నదంతా పూర్తిగా చేసేందుకు అతనికి అధికారం లేదు. దేవునికి జ్ఞానయుక్తంగా, న్యాయంగా అనిపిస్తే సైతాను లేక ఇతర దురాత్మలు మనుషులకు కీడు చేసేందుకూ దేవుని ప్రజలను పరీక్షించేందుకూ ఆయన అనుమతిస్తాడు.

7. యెహోవా - నీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది - భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తర మిచ్చెను.

సైతాను ఎక్కడెక్కడికి వెళ్ళాడో దేవునికి తెలుసు. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమయ్యేదేమంటే సైతాను కూడా తన కార్యకలాపాల గురించి దేవునికి సంజాయిషీ ఇచ్చుకోవాలి. సైతాను భూలోకంలో తిరుగుతూ కీడు చేసే అవకాశాల కోసం చూస్తున్నాడు (1 పేతురు 5:8). దేవునిలాగా సైతాను ఒకే సమయంలో అన్ని చోట్లా ఉండలేడు.

8. అందుకు యెహోవా - నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.
1 థెస్సలొనీకయులకు 5:22

“యోబు”– ఇది సైతాను అంతవరకు గమనించని ఒక వ్యక్తివైపుకు దేవుడు అతని దృష్టి మళ్ళించడం కాదు. తరువాతి రెండు వచనాలను బట్టి సైతాను యోబును జాగ్రత్తగా కనిపెట్టి చూస్తున్నాడని అర్థమౌతున్నది. “ఎవరూ లేరు”– సాక్ష్యాత్తూ దేవుని అభిప్రాయం ప్రకారం యోబు అతని తరంలో భూమిపై ఉన్న వారందరిలోకి మంచివాడు, ఉత్తముడు. ఈ గ్రంథంలోని సత్యం పూర్తిగా గ్రహించాలంటే ఈ విషయాన్ని గుర్తించాలి.

9. అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?
ప్రకటన గ్రంథం 12:10

దేవుడంటే భయభక్తులు కలిగి భూమి అంతటిపైనా మంచివాడైన ఒక వ్యక్తి విషయంలో సైతాను అభిప్రాయం ఇదే. దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, సేవించడం ద్వారా తమకు దక్కే లాభం కోసమే మనుషులంతా అలా చేస్తారు అంటున్నాడు. మానవ జాతి అంతటిలోనూ దేవుడంటే యథార్థమైన ప్రేమ, భయభక్తులు ఉండడమనేది వట్టి మాట అంటున్నాడు. ఈ లోకంలో కనిపించే మత సంబంధమైన ఆసక్తికి మూలం కేవలం స్వలాభాపేక్ష, స్వార్థం మాత్రమే అని సైతాను అభిప్రాయం. దురదృష్టవశాన సైతాను వెలిబుచ్చిన ఈ అభిప్రాయం చాలా మట్టుకు సత్యమే. పాపాత్ములైన మనుషులు కేవలం తమ గురించే ఆలోచిస్తూ ఉంటారు. దేవుని నుంచి తమకేమి లభిస్తుందో అనే చూస్తుంటారు గాని దేవుణ్ణి ప్రేమించరు. అయితే దేవుడు వ్యక్తుల మనస్సుల్లో పని చేసి వారిని మార్చగలడు. వారికి క్రొత్త స్వభావాన్ని ఇచ్చి తన ప్రేమను వారి హృదయాల్లో నింపగలడు. అలాంటివారు దేవునికి నిజంగా సేవ చేయగలుగుతారు. ఆయనకోసం తమకున్న సమస్తాన్నీ వదులుకునేందుకు వెనుకాడరు (మార్కు 10:28; లూకా 5:11 లూకా 5:27-28; లూకా 14:33; రోమీయులకు 5:5; ఫిలిప్పీయులకు 3:8; హెబ్రీయులకు 10:32-34; హెబ్రీయులకు 11:36-38). దీనికి ఒప్పుకునేందుకు సైతాను ఇష్టపడడు. దేవుని ప్రజలపై నేరాలు మోపుతూ వారిని వ్యతిరేకిస్తూనే ఉంటాడు. మనుషులు దేవునికి ఎదురు తిరిగి ఆయన్ను తూలనాడేలా చెయ్యడమే సైతాను ఆశయం. ఇలా చేసేవాళ్ళంతా అసలు సైతాను ఉన్నాడని తెలియకపోయినా సైతాను పక్షం చేరుతున్నారన్న మాట. సైతానుకు దేవుడంటే ద్వేషం. మనుషులందరూ కూడా ఆయన్ను ద్వేషించేలా చెయ్యడమే వాడి ఆశయం. సైతానుకు మనుషులంటే కూడా ద్వేషం. దేవుడు మనుషులకు తీర్పు తీర్చి శిక్షించి నాశనం చెయ్యడమే వాడి ఆశయం.

10. నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.

సైతాను యోబును గురించి (కాబట్టి భక్తిపరులైన మనుషులందరి గురించి) తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నాడు. దేవుని ద్వారా కలిగే సంరక్షణను బట్టీ, ఇహలోక సంబంధమైన దీవెనలను బట్టీ మాత్రమే యోబు ఆయన్ను సేవించి ఆరాధిస్తున్నాడని అంటున్నాడు సైతాను. ఆ దీవెనలను, సంరక్షణను తీసేస్తే చాలు – యోబుకున్న భక్తి వాటితోనే పోతుంది. ఈ పుస్తకంలో మనం చూచేదేమంటే యోబు విషయంలో ఇది నిజం కాదు. అయితే ఒక వేళ ఇది మన విషయంలో నిజమేనా? ఆయన మన ఆస్తిమీదికీ మన పిల్లలమీదికీ విపత్తును రానిస్తే ఆయన మంచితనం మీద మనకున్న నమ్మకాన్నీ భక్తిభావాన్నీ పోగొట్టుకుంటామా?

11. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా

12. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.

యోబు విషయంలో సైతాను చేసిన సవాలును దేవుడు స్వీకరించాడు. తాను స్వయంగా యోబుకు విరోధంగా చెయ్యి ఎత్తడు గాని సైతాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని పరీక్షించేందుకు అనుమతించాడు. దేవుడు తరచుగా తన ప్రజలను పరీక్షలకు గురి కానిస్తాడు (ఆదికాండము 22:1 నోట్‌). ఇలాంటి పరీక్షల ద్వారా కలిగే ఫలితాలేవంటే దేవునికి మహిమ, ఆ పరీక్షలనుంచి విజయవంతంగా బయటపడిన వారికి బహు గౌరవమూ, ఆధ్యాత్మిక శ్రేయస్సూ. వేరే విధంగా చెప్పాలంటే దేవుడు సైతాను వేసే అపనిందలనూ, తనకూ తన ప్రజలకూ విరోధంగా సైతాను జరిపే కార్యక్రమాలన్నిటినీ మంచికే జరిగేలా చేస్తాడు (ఆదికాండము 50:20; సంఖ్యాకాండము 24:25; రోమీయులకు 8:28 నోట్స్ చూడండి). ఆత్మ సంబంధమైన విషయం చూస్తే ఆ తరంలో దేవుని సర్వ శ్రేష్ఠమైన చేతి పని యోబు (ఎఫెసీయులకు 2:10 పోల్చిచూడండి). పరీక్షకు గురి కానివ్వకుండా యోబును దాచిపెట్టే ప్రయత్నం దేవుడు చేయనిష్టపడలేదు.

13. ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి

తన చేతిలో పడిన ఆస్తిపాస్తులకూ మనుషులకూ ఏ గతి పడుతుందో సైతాను ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. వాడు నాశనకారి, హంతకుడు (యోహాను 8:44). దేవుడే గనుక అనుమతి ఇస్తే దేవుని ప్రజల్లో ప్రతి ఒక్కరికీ ఇలానే చేస్తాడు. వాడలా చెయ్యడం లేదంటే దానికి కారణం దేవుడు తన ప్రజల చుట్టూ కంచెను నిలిపి ఉంచుతున్నాడు (కీర్తనల గ్రంథము 3:3; కీర్తనల గ్రంథము 5:12; కీర్తనల గ్రంథము 32:7; ద్వితీయోపదేశకాండము 33:27; యోహాను 17:15; 1 పేతురు 1:5). సైతాను తన పక్షాన చేరినవారికి, సంపదల కోసం, హోదాల కోసం వాడి ప్రలోభాలకు లొంగిపోయిన వారికీ వాటిని అభివృద్ధి చేయవచ్చు. అయితే అవి వారి అంతిమ నాశనానికి దారి తీస్తాయని వాడిక్కూడా తెలుసు.

14. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొని పోయి

షెబావాళ్ళంటే ఉత్తర అరేబియా ప్రాంతాల్లో సంచార జీవనం గడిపే తెగ.

15. ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యున్నాననెను.

16. అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చిదేవుని అగ్ని ఆకాశమునుండి పడి గొఱ్ఱెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

“దేవుని అగ్ని”అంటే మెరుపులు, పిడుగులు అని కొందరు పండితుల అభిప్రాయం. అయితే ఇది సైతాను ఆకాశం నుంచి వారిమీద కురిపించిన అగ్ని కావచ్చు (ప్రకటన గ్రంథం 13:13 చూడండి. అక్కడ సైతాను అనుచరుడొకడు సరిగ్గా ఇదే పని చేసినట్టుగా ఉంది). ఏది ఏమైనా ఈ వార్తను యోబుకు వినిపించినవాడు మాత్రం ఆ అగ్ని కురిపించింది దేవుడే అనుకొంటే అతడు పొరపాటుగా అర్థం చేసుకున్నాడని తెలుస్తున్నది.

17. అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చికల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను.

“మాట్లాడుతూనే”– ఒక విపత్తు గురించి విన్న దెబ్బ నుంచి యోబు తేరుకోక ముందే మరో విపత్తును గురించిన వార్త వినిపిస్తున్నారు. ఒకదాని వెంట ఒకటి వేగంగా వచ్చే దుర్వార్తల మూలంగా యోబును పడద్రోసి నేలరాసి నలిపివేద్దామని సైతాను ప్రయత్నం. ఊజు దేశానికి తూర్పుగా లేక ఉత్తర తూర్పు దిశగా ఈ కల్దీయవారు నివసించేవారు.

18. అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చినీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయు చుండగా

నాశనం కలిగించే సుడిగాలులను సైతాను పంపించగలడన్న మాట. ఇప్పుడు యోబు హృదయంపై, దెబ్బ తిని ఉన్న అతని మనసుపై అన్నిటికంటే విపరీతమైన దెబ్బపడింది. 500 జతల ఎద్దులు, 500 గాడిదలు, 7000 గొర్రెలు, 3000 ఒంటెలు వీటన్నిటినీ పోగొట్టుకోవడం కంటే తన పదిమంది సంతానాన్ని కోల్పోవడం యోబు పాలిట అతి దుఃఖకరం.

19. గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది ¸యౌవనుల మీద పడినందున వారు చనిపోయిరి; దానిని నీకు తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను
మత్తయి 26:65

ఈ వాక్యం, తరువాతి వాక్యంలో బైబిల్లోని ఉత్తమోత్తమమైన క్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి మనలో యోబు పట్ల గౌరవ భావాన్ని కలిగించాలి. యోబు విశ్వాసం అతనికి కలిగిన నష్టాలు, దుఃఖం వీటన్నిటికంటే ఉన్నతంగా ఉంది. సైతాను అబద్ధికుడన్న విషయం రుజువైంది. మానవ హృదయాల్లో దేవుని కృపా పరిచర్య శక్తివంతమైనదీ నిజమైనదీ అన్న విషయం నిరూపించబడింది. సైతాను ఊహించినట్టు దేవుణ్ణి దూషించేందుకు బదులు యోబు ఆయనను స్తుతించాడు. యోబు తనకు కలిగిన నష్టాల విషయం షెబావారిని గానీ కల్దీయవారిని గానీ సుడిగాలిని అగ్నిని గానీ చివరికి సైతానునూ కూడా నిందించలేదు. జరిగినవన్నీ ప్రమాదవశానో, మనుషుల దౌర్జన్యం వల్లనో, ప్రకృతి వైపరీత్యం వల్లనో జరిగాయని అతడు భావించలేదు. ఇచ్చినది దేవుడే, తీసివేసినది దేవుడే అన్నాడు. అంతటిలో దేవుని సర్వాధిపత్యాన్ని గుర్తించాడు. దేవుడు జరగనిస్తే తప్ప అక్కడ జరిగినవన్నీ సంభవించవని యోబుకు తెలుసు. “బట్ట...క్షౌరం”– పట్టరాని సంతాపానికి గుర్తుగా.

21. నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.
1 తిమోతికి 6:7

“దిగంబరి”– కీర్తనల గ్రంథము 49:17; ప్రసంగి 5:15; 1 తిమోతికి 6:7. “తీసివేశాడు”– మనందరం దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసినవాళ్ళమే. ఆయననుంచి మంచిది ఏదైనా పొందేందుకు యోగ్యులం కాము. మనకేదైనా ఉందీ అంటే అది దేవుని ఉచిత కృపవల్లే. కొంత కాలంపాటు మనకిచ్చినదాన్ని ఆయన తీసేసుకుంటే అందులో అన్యాయమేమీ లేదు. అయితే ఇలాంటి విపత్తు తనకెందుకు వచ్చిందో ఆ కారణం తెలియకపోయినా యోబు ఈ సంగతిని గ్రహించి అంగీకరిస్తున్నాడు. “స్తుతి”– కీర్తనల గ్రంథము 22:22-23; కీర్తనల గ్రంథము 33:1-3; కీర్తనల గ్రంథము 34:1; కీర్తనల గ్రంథము 44:8; కీర్తనల గ్రంథము 50:23; కీర్తనల గ్రంథము 52:9; కీర్తనల గ్రంథము 63:3-4; ఎఫెసీయులకు 5:20; 1 థెస్సలొనీకయులకు 5:18.

22. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.

యోబుకు కలిగిన నష్టం కంటే అతి తక్కువ నష్టం వచ్చినా దేవుడు తమకు అన్యాయం చేశాడని బుద్ధిమాలి ఆలోచించేవారు ఈ ప్రపంచంలో ఎంతమంది లేరు?



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Job - యోబు 1 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యోబు యొక్క భక్తి మరియు శ్రేయస్సు. (1-5) 
యోబు శ్రేయస్సు మరియు భక్తి రెండింటినీ ఆనందించాడు. ఇది సవాలుగా మరియు అసాధారణంగా ఉన్నప్పటికీ, సంపన్న వ్యక్తి పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం సాధ్యమయ్యే పరిధికి మించినది కాదు. దైవిక దయ ద్వారా, భౌతిక సంపద యొక్క ఆకర్షణను జయించవచ్చు. యోబు యొక్క భక్తి మరియు ఐశ్వర్యం యొక్క కథనం అతని అపారమైన బాధల వృత్తాంతానికి ముందు ఉంది, ఈ కారకాలు ఏవీ పరీక్షల నుండి రోగనిరోధక శక్తిని హామీ ఇవ్వవని నొక్కి చెబుతుంది.
యోబు తన పిల్లల మధ్య సామరస్యపూర్వకమైన మరియు ఓదార్పునిచ్చే పరస్పర చర్యలను గమనించినప్పుడు, అతను సంతృప్తి చెందాడు, అయినప్పటికీ మానవ స్వభావం గురించి అతని అవగాహన వారి శ్రేయస్సు కోసం భయపడేలా చేసింది. వారిని ఆత్మపరిశీలన చేసుకోవాలని, వారి అతిక్రమణలను గుర్తించి, పాపవిముక్తి పొందాలని వారిని పురికొల్పేందుకు ఆయన చొరవ తీసుకున్నాడు. వాగ్దానం చేయబడిన విమోచకుని ద్వారా దేవుని అనుగ్రహాన్ని ఆశించే వ్యక్తిగా, అతను ప్రతి ఒక్కరికి దహనబలిని సమర్పించాడు. ఇది వారి ఆధ్యాత్మిక సంక్షేమం పట్ల ఆయనకున్న శ్రద్ధ, మానవాళి యొక్క పాపభరితమైన స్థితిని అర్థం చేసుకోవడం మరియు స్థాపించబడిన మార్గం ప్రకారం దేవుని దయపై అతని అచంచలమైన ఆధారపడటాన్ని ప్రదర్శిస్తుంది.

సాతాను ఉద్యోగాన్ని ప్రయత్నించడానికి సెలవు పొందుతాడు. (6-12) 
యోబుకు ఎదురైన పరీక్షలు సాతాను యొక్క దుష్టత్వం నుండి ఉద్భవించాయి, లోతైన మరియు ధర్మబద్ధమైన ఉద్దేశాల కోసం ప్రభువు అనుమతించాడు. దేవునికి మరియు ధర్మానికి పూర్తిగా వ్యతిరేకమైన ఒక విరుద్ధమైన ఆధ్యాత్మిక శక్తి, దేవునిపై ప్రేమను కలిగి ఉన్నవారిని బాధపెట్టడానికి, తప్పుదారి పట్టించడానికి మరియు సాధ్యమైతే, వాటిని నిర్మూలించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. అతని ప్రభావం యొక్క పరిధి అనిశ్చితంగా ఉంది, అయినప్పటికీ క్రైస్తవులు అనుభవించిన అస్థిరత మరియు అసంతృప్తిలో గణనీయమైన భాగం అతని చర్యలకు కారణమని చెప్పవచ్చు. మనం ఈ భూసంబంధమైన రాజ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు, ప్రకటన గ్రంథం 20:1లో నొక్కిచెప్పబడినట్లుగా, నిగ్రహాన్ని మరియు జాగరూకతను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, మనం అతని ప్రభావానికి లోనవుతాము.
వ్యక్తులను పాపంలోకి నెట్టడానికి సాతానుకు అంతర్లీన సామర్థ్యం లేదని గుర్తించడం చాలా ముఖ్యం; బదులుగా, అతని శక్తి వ్యక్తులు చేసే ఎంపికలపై ఆధారపడి ఉంటుంది. అలాగే, బాధను కలిగించే అతని సామర్థ్యం కేవలం దైవిక అనుమతి నుండి మాత్రమే పొందబడింది. ప్రాపంచిక సంఘటనలను దేవుడు ఏవిధంగా నిర్వహించాలో వివరించడానికి ఈ చిక్కులు మానవ పరంగా చిత్రీకరించబడ్డాయి. దేవుడు ప్రపంచ గమనాన్ని చురుగ్గా పరిపాలిస్తాడనే అవగాహనను అందించడానికి గ్రంథం ఈ భాషను ఉపయోగిస్తుంది.

యోబు ఆస్తిని కోల్పోవడం మరియు అతని పిల్లల మరణం. (13-19) 
యోబు కష్టాలను అతనిపై విధించిన సాతాను, ఖచ్చితంగా అతని పిల్లలు తమ పండుగను ప్రారంభించిన రోజున. యోబు అనేక బాధలతో మునిగిపోయాడు, ప్రతి వరుస మెసెంజర్ మునుపటి హీల్స్‌పై భయంకరమైన వార్తలను కలిగి ఉన్నాడు. అతని ప్రతిష్టాత్మకమైన మరియు విలువైన ఆస్తులలో అతని పది మంది పిల్లలు ఉన్నారు మరియు వారు విషాదకరంగా మరణించారని అతనికి తెలియజేయబడింది. అతని ఇతర దురదృష్టాల మధ్య వారి ఓదార్పునిచ్చే ఉనికి అత్యంత విలువైనదిగా ఉండే సమయంలో ఈ నష్టం అతనిని తాకింది. నిరంతరం సహాయం అందించే మన అచంచలమైన మూలం కేవలం దేవుని సన్నిధిలో నివసిస్తుందని ఇది ఒక రిమైండర్.

యోబు యొక్క సహనం మరియు భక్తి. (20-22)
యోబు దేవుని చేతి ముందు తనను తాను తగ్గించుకున్నాడు, మానవ ఉనికి యొక్క సాధారణ స్థితి నుండి తన ముగింపులను తీసుకున్నాడు, దానిని అతను స్పష్టంగా చిత్రించాడు. మనం రిక్తహస్తాలతో ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తాము, ఇతరుల నుండి ప్రాపంచిక ఆస్తులను సంపాదించుకుంటాము, అయినప్పటికీ మనం ఏమీ లేకుండా, ఇతరుల కోసం ప్రతిదీ వదిలివేస్తాము అనేది కాదనలేని నిజం. తన అనేక రకాల నష్టాల మధ్య, యోబు తప్పనిసరిగా తన అసలు స్థితికి పునరుద్ధరించబడ్డాడు. అతను చివరికి చేరుకోవాల్సిన స్థానానికి చేరుకున్నాడు, కానీ ఇప్పుడు అతను ఊహించిన దానికంటే కొంచెం ముందుగానే విడిచిపెట్టబడ్డాడు లేదా బదులుగా, నిద్రవేళకు ముందు రాత్రి దుస్తులను మార్చుకోవడం వంటిది - ఒక చిన్న అసౌకర్యం నిద్రవేళ సమీపించే కొద్దీ మరింత సహించదగినదిగా మారుతుంది.
అదే దీవెనలు ఇచ్చేవాడు కూడా వారిని దూరం చేసుకున్నాడు. యోబు తన బాధల సాధనాలను ఎలా అధిగమిస్తాడో గమనించండి, అంతిమ మొదటి కారణంపై తన దృష్టిని ఉంచుతుంది. బాధలు మనల్ని మతం నుండి దూరం చేయకూడదు; బదులుగా, వారు దాని పట్ల మన నిబద్ధతను ఉత్తేజపరచాలి. మన పరీక్షలన్నిటిలో, మన దృష్టిని ప్రభువుపై నిలిపినట్లయితే, ఆయన మనకు అవసరమైన జీవనోపాధిని అందజేస్తాడు. ప్రభువు యొక్క నీతి అసాధ్యమైనది. మనకు ఉన్నదంతా ఆయన దయ ద్వారా ప్రసాదించబడింది; మన అతిక్రమణల ద్వారా, మేము దానికి మా దావాను వదులుకున్నాము, అందువల్ల, అతను ఒక భాగాన్ని తిరిగి పొందినట్లయితే మనం గొణుగుకోకూడదు.
అసంతృప్తి మరియు అసహనం దేవునికి మూర్ఖత్వాన్ని తప్పుగా ఆపాదిస్తాయి. ఈ వైఖరుల నుండి యోబు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు మరియు మనం కూడా అలాగే చేయాలి. మనం చెడుగా ప్రవర్తించినప్పుడు దేవుడు న్యాయంగా ప్రవర్తించినట్లే, మనం మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు ఆయన జ్ఞానాన్ని ప్రదర్శించాడని మనం అంగీకరిస్తాం. సాతాను యొక్క శత్రుత్వం మరియు శక్తి మన ఆత్మలకు రక్షకుని యొక్క అమూల్యతను - డెవిల్ యొక్క పనులను తుడిచిపెట్టడానికి వచ్చిన వ్యక్తిని పెంచుతాయి. మన విమోచన కొరకు, అతను యోబు లేదా మనం గర్భం దాల్చగలిగే పరీక్షలను అధిగమించాడు.



Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |