Job - యోబు 12 | View All
Study Bible (Beta)

1. అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

1. అప్పుడు యోబు జోఫరుకు ఇలా జవాబు ఇచ్చాడు:

2. నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును.

2. “సందేహము లేకుండ, మీరు మాత్రమే జ్ఞానం గల వాళ్లని మీరు తలస్తారు. మీరు చనిపోయినప్పుడు మీతో బాటు జ్ఞానం గతిస్తుందని మీరు తలస్తారు.

3. అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను

3. అయితే మీరు ఎంత జ్ఞాలంగలవాళ్లో నేనూ అంత జ్ఞానంగలవాడిని. నేను మీకంటే తక్కువేమి కాదు. ఇది సత్యం అని ఇతరులకు కూడా తెలుసు.

4. నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.

4. “ఇప్పుడు నా స్నేహితులు నన్ను చూసి నవ్వుతారు. వారిలా అంటారు: ‘వీడు దేవుణ్ణి ప్రార్థించాడు. వీనికి ఆయన జవాబు ఇచ్చాడు.’ “కానీ నేను మంచివాణ్ణి, నిర్దోషిని. అయినప్పటికీ ఇంకా నన్ను చూసి నా స్నేహితులు నవ్వుతూనే ఉన్నారు.

5. దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమను కొందురు. కాలుజారు వారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.

5. కష్టాలు లేని మనుష్యులు కష్టాలు ఉన్న వాళ్లను హేళన చేస్తారు. అలార టి వాళ్లు పడిపోతున్న వాళ్లను కొట్టేస్తారు

6. దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.

6. దొంగల గుడారాలకు ఇబ్బంది లేదు. దేవునికి కోపం రప్పించే వాళ్లు శాంతిగా జీవిస్తారు. వారి ఒకే దేవుడు వారి స్వంత బలమే.

7. అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును. ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.
రోమీయులకు 1:20

7. “ అయితే జంతువుల్ని అడగండి, అవి మీకు నేర్పిస్తాయి. లేక ఆకాశ పక్షుల్ని అడగండి, అవి మీకు నేర్పిస్తాయి.

8. భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు భోధించును సముద్రములోని చేపలును నీకు దాని వివరించును

8. లేక భూమితో మాట్లాడండి, అది మీకు నేర్పిస్తుంది. లేక సముద్రపు చేపలను వాటి జ్ఞానం గూర్చి మీతో చెప్పనివ్వండి.

9. వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేని వాడెవడు?

9. వాటిని యెహోవా సృష్టించాడని ప్రతి ఒక్కరికీ తెలుసు.

10. జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.

10. బతికి ఉన్న ప్రతి జంతువూ శ్వాస పీల్చే ప్రతి మనిషీ దేవుని శక్తి క్రిందనే.

11. అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా?

11. భోజనం రుచి చూడడం నాలుకకు ఎంత ఆనందమో చెవులు అని వినే మాటలను పరీక్షించవా:

12. వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది. అని మీరు చెప్పుదురు

12. ముసలి వాళ్లకు కూడా జ్ఞానం ఉంది. దీర్షాయుష్షు అవగాహన కలిగిస్తుంది. అని మేము అన్నాము.

13. జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.

13. జ్ఞానం, బలం దేవునికి చెందుతాయి. మంచి సలహా మరియు గ్రహింపు ఆయనవే.

14. ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరలకట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు.
ప్రకటన గ్రంథం 3:7

14. ఒక వేళ దేవుడు దేనినైనా పడగొడితే మనుష్యులు దాన్ని తిరిగి నిర్మించలేరు. ఒక వేళ దేవుడు ఒక మనిషిని చెరసాలలో పెడితే మనుష్యులు అతనిని విడుదల చేయలేరు.

15. ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును.

15. ఒక వేళ దేవుడు గాని వర్షాన్ని ఆపివేస్తే భూమి ఎండి పోతుంది. ఒక వేళ దేవుడు గాని వర్షాన్నిరానిస్తే అది భూమిని వరదతో నింపివేస్తుంది.

16. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున నున్నారు.

16. దేవుడు బలవంతుడు, ఆయన ఎల్లప్పుడూ గెలుస్తాడు. మోసపోయిన వాడు మోసం చేసిన వారూ ఇద్దరూ దేవునికి చెందిన వారే.

17. ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.

17. రాజుల జ్ఞానమును దేవుడు తీసి వేస్తాడు. నాయకులు వెర్రిగా వ్రవర్తించేటట్టు చేస్తాడు.

18. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును.

18. రాజులు వారి బందీలకు గొలుసులు వేస్తారు. కాని దేవుడు వాటిని తీసివేస్తాడు. అప్పుడు దేవుడు ఆ రాజుల మీద నడికట్టు వేస్తాడు.

19. యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును.
లూకా 1:52

19. తన వంశాన్ననుసరించి రక్షణ ఉందనుకొనే యాజకుల బలాన్ని దేవుడు అణచి, వాళ్లను క్రిందికి దిగజారేటట్లు చేస్తాడు.

20. వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయును పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.

20. నమ్మకమైన సలహాదారులను దేవుడు నిశ్శబ్దం చేస్తాడు. వృద్ధుల జ్ఞానమును ఆయన తీసివేస్తాడు.

21. అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.

21. నాయకులను అప్రముఖులనుగా చేస్తాడు. పాలకుల బలాన్ని ఆయన తీసివేస్తాడు.

22. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును

22. లోతైన అంధకారంలో నుండి రహస్య సత్యాలను దేవుడు చూపిస్తాడు. మరణం లాంటి చీకటి గల స్థలాలలోనికి ఆయన వెలుగు పంపిస్తాడు.

23. జనములను విస్తరింపజేయును నిర్మూలము చేయును సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును.

23. దేవుడు రాజ్యాలను పెద్దవిగా, శక్తిగలవిగా విస్తరింపజేస్తాడు. అప్పుడు ఆయన వాటిని నాశనం చేస్తాడు. ఆయన రాజ్యాలను పెద్దనిగా పెరగనిస్తాడు. అప్పుడు ఆ రాజ్యాల్లోని ప్రజలను ఆయన చెదర గొడతాడు.

24. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థక పరచునుత్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును.

24. భూలోక నాయకులను వెర్రివార్ని గాను అర్థం చేసుకోలేని వార్ని గాను దేవుడు చేస్తాడు. మార్గం లేని అరణ్యంలో సంచరించేందుకు ఆయన వారిని పంపిస్తాడు.

25. వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు మత్తుగొనిన వాడు తూలునట్లు ఆయన వారిని తూలచేయును.

25. ఆ నాయకులు చీకటిలో ముందుకు సాగుతారు. వారికి ఏ వెలుగూ లేదు. వారు తాగుబోతుల్లా నడిచేటట్టు దేవుడు వారిని చేస్తాడు.”



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Job - యోబు 12 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యోబు తన స్నేహితులను గద్దిస్తాడు. (1-5) 
యోబు తన సహచరులను తన సొంతానికి భిన్నంగా వారి ఆత్మగౌరవాన్ని పెంచినందుకు శిక్షిస్తాడు. మేము ఉపదేశాలను అవమానాల కోసం పొరపాటు చేస్తాము మరియు సలహాలు మరియు హెచ్చరికలు ఇచ్చినప్పుడు ఎగతాళిగా భావిస్తాము. ఇది మా మూర్ఖత్వం, కానీ ఈ విషయంలో, ఈ ఆరోపణకు కొంత ఆధారం ఉంది. అతని ఆర్థిక పతనం కారణంగా అతనిని నిర్లక్ష్యం చేయడం వల్ల వారి ప్రవర్తన ఉద్భవించిందని అతను ఊహించాడు. ఈ నమూనా ప్రపంచంలో సర్వసాధారణం. నీతిమంతుడు మరియు గౌరవప్రదమైన వ్యక్తి కూడా, కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, తరచుగా అసహ్యంగా చూస్తారు.

దుష్టులు తరచుగా అభివృద్ధి చెందుతారు.(6-11) 
యోబు వాస్తవిక వాదనను అందించాడు, అత్యంత సాహసోపేతమైన నేరస్థులు, దోపిడీదారులు మరియు దుష్ట వ్యక్తులు కూడా తరచుగా విజయాన్ని అనుభవిస్తారని హైలైట్ చేస్తుంది. అయితే, ఇది కేవలం అదృష్టం లేదా యాదృచ్ఛికంగా సంభవించిన ఫలితం కాదు; అది ప్రభువుచే నిర్దేశించబడినది. భూసంబంధమైన సంపద మరియు శ్రేయస్సు దేవుని దృక్కోణంలో పరిమిత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి; అతను తన విశ్వాసుల కోసం మరింత విలువైన ఆశీర్వాదాలను కలిగి ఉన్నాడు. యోబు సమస్త సృష్టిపై దేవుని పూర్తి యాజమాన్యానికి ప్రతిదానిని ఆపాదించాడు. అతను తన స్నేహితుల మాటలను అంచనా వేసే స్వేచ్ఛను అభ్యర్థిస్తాడు మరియు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పమని వారిని సవాలు చేస్తాడు.

యోబు దేవుని జ్ఞానం మరియు శక్తి గురించి మాట్లాడాడు. (12-25)
యోబు తన స్వంత దైవిక సంకల్పం ప్రకారం మానవజాతి జీవితాలను నిర్దేశించడంలో దేవుని జ్ఞానం, శక్తి మరియు అత్యున్నత అధికారాన్ని నొక్కిచెప్పే లోతైన ప్రసంగాన్ని అందించాడు, ఎవరూ ధిక్కరించలేని ఒక అజేయమైన శక్తి. చిన్న విషయాలపై ఏకీభవించని విద్యావంతులు మరియు సద్గురువులు తమ సొంత గౌరవం, ఓదార్పు మరియు ఇతరుల శ్రేయస్సు కోసం తమ భాగస్వామ్య విశ్వాసాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తే అది అభినందనీయం. ఇక్కడ మనోవేదనలకు, దూషణలకు తావు లేదు. యోబు మానవ వ్యవహారాలలో దేవుని నిష్ణాతమైన దిశను ప్రదర్శించడానికి, వారి ప్రణాళికలను అధిగమించడానికి మరియు అన్ని వ్యతిరేకతను అధిగమించడానికి అనేక ఉదాహరణలను అందిస్తుంది. అపరిమితమైన బలం మరియు తెలివి రెండింటినీ కలిగి ఉన్న దేవుడు, మూర్ఖులు మరియు నైతికంగా లోపభూయిష్టంగా ఉన్నవారిని కూడా ఉపయోగించుకునే నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఈ సామర్థ్యం లేకుండా, ప్రపంచంలో ప్రబలంగా ఉన్న కొద్దిపాటి జ్ఞానం మరియు నిజాయితీని బట్టి, గందరగోళం మరియు వినాశనం చాలా కాలం క్రితం ప్రబలంగా ఉండేవి.
ఈ కీలకమైన సత్యాలు డిబేటర్‌లకు జ్ఞానోదయం కలిగించడానికి రూపొందించబడ్డాయి, యోబు బాధల వెనుక ఉన్న దైవిక హేతువును అర్థంచేసుకోవడానికి ప్రయత్నించడంలోని వ్యర్థతను వెల్లడిస్తుంది. దేవుని మార్గాలు మానవ గ్రహణశక్తికి మించినవి, మరియు అతని తీర్పులు అంతుచిక్కనివి. ఆయన సార్వభౌమత్వాన్ని మరియు దానిలోని జ్ఞానాన్ని సమర్థించే లేఖనాలలోని అద్భుతమైన ఉదాహరణలను మనం గమనించండి. అయితే, పరాకాష్ట, మరియు కాదనలేని అత్యంత కీలకమైన ఉదాహరణ, యూదుల చేతిలో యేసు ప్రభువు శిలువ వేయబడడం. ఈ ఏకవచన సంఘటన సమస్త ప్రపంచానికి రక్షణగా ఉపయోగపడుతుందని దేవుడు తప్ప ఎవరు గ్రహించగలరు?



Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |