Job - యోబు 15 | View All
Study Bible (Beta)

1. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

మొదటి తడవ మాటలు సమాప్తమయ్యాయి. విపత్తులనేవి మనిషి చేసిన పాపాల కారణంగా దేవుడు పంపించినవి అన్న సిద్ధాంతాన్ని మిత్రులు ప్రతిపాదించారు. యోబు పశ్చాత్తాపపడాలన్నారు. అయితే యోబు తన నిర్దోషత్వాన్ని సమర్థించుకుంటూ పశ్చాత్తాపపడవలసినది ఏదీ లేదన్నాడు. తన స్నేహితుల్లో జ్ఞానం, తన పట్ల సానుభూతి లోపించాయని చెప్పాడు. తన రెండో సారి మాటల్లో ఎలీఫజు ధోరణి మొదటి సారికంటే మరి కాస్త కఠినంగా ఉంది. అతని నేరారోపణలు మరింత సూటిగా ప్రత్యక్షంగా ఉన్నాయి. చివర్లో పశ్చాత్తాపాన్ని గురించిన హెచ్చరికలు లేవు.

2. జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా?

మొదటిసారి మాట్లాడినప్పటి మర్యాదను వదిలేశాడు (యోబు 4:2-6). యోబు మాటలు వడగాల్పుల్లాగా ఉన్నాయంటున్నాడు.

3. వ్యర్థసంభాషణ చేత వ్యాజ్యెమాడ దగునా? నిష్‌ ప్రయోజనమైన మాటలచేత వాదింపదగునా?

4. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.

దేవుని మంచితనాన్నీ న్యాయాన్నీ యోబు ప్రశ్నించడంవల్లే ఇలా జరిగింది అని ఎలీఫజు ఉద్దేశం.

5. నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.

యోబు కపటమైన రీతిలో తన నిర్దోషత్వం గురించి పదేపదే నొక్కి చెప్పడం ద్వారా తన పాపాలను దాచిపెడుతున్నాడనీ దేవుడంటే అతడు లెక్కలేకుండా మాట్లాడటమే అతను ఘోర పాపి అన్నదానికి రుజువు అనీ ఎలీఫజు నమ్మకం.

6. నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవినీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి.

7. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా?నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా?

యోబు తన జ్ఞానాన్ని బట్టి గర్విష్ఠి అనీ ఇతరుల మాటలను నమ్రతతో వినేందుకు ఇష్టపడడం లేదనీ ఎలీఫజు ఆరోపిస్తున్నాడు. యోబుకంటే వయస్సు పైబడిన వారి జ్ఞానాన్ని యోబు ఎదిరించి యోబును సవాలు చేస్తున్నాడు అంటున్నాడు.

8. నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?
రోమీయులకు 11:34

9. మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు?

10. నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులును మాలో నున్నారు నీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు.

11. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా నున్నదా?

తాను, తన స్నేహితులు యోబుతో పశ్చాత్తాపం గురించీ తిరిగి అతనికి పూర్వస్థితి కలగడం గురించీ పలికిన మాటలకు “దేవుని ఓదార్పు” అని పేరు పెడుతున్నాడు (యోబు 5:8-27; యోబు 8:5-7; యోబు 11:13-19). తన పాపాలకు పశ్చాత్తాపపడి దేవునివైపు తిరగవలసిన పాపి విషయంలో ఈ మాటలు మంచివే, నిస్సందేహంగా మంచి ప్రోత్సాహం, ఆదరణను కలిగించే మాటలే. అయితే అలా చేసే అవసరం యోబుకు లేదు కాబట్టి ఈ మాటలు యోబు పాలిట దేవుని ఓదార్పు మాటలు కావు.

12. నీ హృదయము ఏల క్రుంగిపోయెను?నీ కన్నులు ఏల ఎఱ్ఱబారుచున్నవి?

యోబు దేవునితో పలకడానికి సాహసించిన కొన్ని మాటలకు అతని స్నేహితులు ఖంగు తిన్నారు.

13. దేవుని మీద నీవేల ఆగ్రహపడుచున్నావు? నీ నోటనుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు?

14. శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?

ఈ మాటలు ఎలీఫజు మొదటి సారి మాట్లాడిన మాటల్లాంటివే (యోబు 4:17-19). అయితే మరింత కఠినంగా ఉన్నాయి. యోబు తాను నిర్దోషినని చెప్పుకున్నదాన్ని ఎలీఫజు ఎంత గట్టిగా వ్యతిరేకిస్తున్నాడో ఈ మాటలవల్ల అర్థమౌతున్నది. 16వ వచనంలో చివరి భాగానికి హీబ్రూలో అక్షరాలా అర్థమేమిటంటే “దుష్టత్వాన్ని తాగేవాళ్ళు.”

15. ఆలోచించుము ఆయన తన దూతల యందు నమ్మికయుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.

16. అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా.

17. నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును నేను చూచిన దానిని నీకు వివరించెదను.

యోబుకు అవసరమైన సందేశం ఒకటి తాను ఇవ్వబోతున్నానని భావించాడు ఎలీఫజు. దానికి ఈ మాటలు గంబీరమైన పీఠిక.

18. జ్ఞానులు తమ పితరులయొద్ద నేర్చుకొని మరుగుచేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను.

19. అన్యులతో సహవాసము చేయకతాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించినజ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.

20. తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడు బాధనొందును.

అతని సందేశంలో క్రొత్తదనమేమీ లేదు. అతని వాదంలో మరి కాస్త ఉన్నత స్థితికి వెళ్ళినదీ లేదు. దుష్టులకు వచ్చే శిక్షను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తున్నాడు. ఈ పాఠాన్ని యోబు స్వీకరించాలని ఎలీఫజు ఉద్దేశం. యోబుకు వాస్తవంగా సంభవించినవాటినీ, యోబు తన గురించి తాను చెప్పుకున్న వాటినీ ఉదహరించాడు ఎలీఫజు. 20 వ వచనాన్ని యోబు 2:13 తో; 24ను యోబు 7:13-15 తో పోల్చిచూడండి. 25వ వచనం వర్ణించిన మనిషిలాగా యోబు ప్రవర్తిస్తున్నాడని ఎలీఫజు నమ్మకం. యోబు పూర్తిగా ఘోరమైన అబద్ధం పైన, అంటే తనకున్నదని భావించిన నిర్దోషత్వం పైన నమ్మకం ఉంచుతున్నాడని ఎలీఫజుకు గట్టి నమ్మకం. అందుకని 31లో కనిపించే హెచ్చరిక ఇస్తున్నాడు.

21. భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు.

22. తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు.

23. అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు తిరుగు లాడును. అంధకారదినము సమీపించుచున్నదని వానికి తెలియును.

24. శ్రమయు వేదనయు వానిని బెదరించును. యుద్ధముచేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టు కొనునట్లు అవి వానిని పట్టుకొనును.

25. వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును.

26. మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును.

27. వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది వాని చిరుప్రక్కల పైని క్రొవ్వుకండలు పెరిగియున్నవి.

28. అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు ఎవరును నివసింపకూడని యిండ్లలో దిబ్బలు కావలసియున్న యిండ్లలో నివసించెదరు

29. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలువదు. వారి సస్యసంపద పంట బరువై నేలకు వంగదు

30. వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేతకొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు.

31. వారు మాయను నమ్ముకొనకుందురు గాక;వారు మోస పోయిన వారుమాయయే వారికి ఫలమగును.

32. వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.

33. ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారినిరాల్చును. ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును

34. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును

35. వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపముకందురువారి కడుపున కపటము పుట్టును.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Job - యోబు 15 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఎలీఫజు యోబును గద్దించాడు. (1-16) 
ఎలిఫజ్ జాబ్‌పై రెండవ దాడిని ప్రారంభించాడు, జాబ్ యొక్క మనోవేదనలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. దేవునిపట్ల తనకున్న గౌరవాన్ని విడిచిపెట్టాడని, ఆయన పట్ల ఎలాంటి శ్రద్ధను విస్మరించాడని మరియు ప్రార్థనకు దూరంగా ఉన్నాడని అతను అన్యాయంగా యోబును ఆరోపించాడు. మతం యొక్క సారాంశాన్ని పరిగణించండి: దేవునికి భయపడడం మరియు అతనితో కమ్యూనికేట్ చేయడం-భయం ప్రాథమిక సూత్రం మరియు ప్రార్థన ముఖ్యమైన అభ్యాసం. ఎలీఫజ్ జాబ్‌పై అహంకార ఆరోపణలను మోపాడు. అతను తన స్నేహితులు అందించే సలహా మరియు ఓదార్పును పట్టించుకోకుండా జాబ్‌ను నిందించాడు. తరచుగా, మనం మన స్వంత పదాలను ఎక్కువగా అంచనా వేస్తాము, అయితే ఇతరులు వాటిని అసంబద్ధంగా గుర్తించవచ్చు. యోబు దేవుణ్ణి ఎదిరించాడని ఎలీఫజు నిందించాడు. ఎలీఫజు వారి భక్తికి పేరుగాంచిన వారి మాటలను అర్థం చేసుకోవడం మానేసి ఉండాలి, ప్రత్యేకించి ఆ వ్యక్తి టెంప్టేషన్‌తో పోరాడుతున్నప్పుడు. స్పష్టంగా, ఈ డిబేటర్లు అసలు పాపం మరియు మానవ స్వభావం యొక్క పూర్తి అవినీతి విశ్వాసంలో గాఢంగా వేళ్లూనుకున్నారు. మనలను సహించడంలో దేవుని సహనాన్ని మరియు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు విమోచన ద్వారా మనపట్ల ఆయనకున్న అనురాగాన్ని చూసి మనం ఆశ్చర్యపడకూడదా?

దుర్మార్గుల నిశ్శబ్దం. (17-35)
దుష్టులు నిస్సందేహంగా దయనీయ స్థితిలో ఉన్నారని ఎలీఫజ్ నొక్కిచెప్పాడు. దీని నుండి, అతను దుఃఖంలో ఉన్నవారు నిస్సందేహంగా దుర్మార్గులని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాడు, తద్వారా ఉద్యోగం ఈ వర్గంలోకి వస్తుందని సూచిస్తుంది. అయితే, దేవునికి చెందిన అనేకమంది వ్యక్తులు ఈ ప్రపంచంలో శ్రేయస్సును అనుభవించారని గమనించడం ముఖ్యం. కాబట్టి, యోబు వంటి వ్యక్తి కష్టాలను మరియు పేదరికాన్ని ఎదుర్కొంటాడు అంటే వారు దేవుని అనుచరులు కాదని అర్థం కాదు.
ఎలిఫజ్ దుష్ట వ్యక్తులు, ప్రత్యేకించి ఇతరులను అణచివేసే వారు, నిరంతరం భయంతో జీవిస్తారు, గణనీయమైన అసౌకర్యాన్ని భరిస్తారు మరియు చివరికి దౌర్భాగ్యమైన ముగింపును ఎదుర్కొంటారని వివరించాడు. అహంకార తప్పిదస్థులు అనుభవించే శ్రేయస్సు అనివార్యంగా వర్ణించబడిన దుఃఖంలో ముగుస్తుందని మనం భావించాలా? ఇతరులు అనుభవించే బాధలు మనకు హెచ్చరికగా ఉండనివ్వండి. క్రమశిక్షణ యొక్క ప్రస్తుత అనుభవం తక్షణ ఆనందాన్ని కలిగించకపోయినా బాధను కలిగించకపోయినా, చివరికి దాని నుండి నేర్చుకునే వారికి నీతి యొక్క శాంతియుత దిగుబడికి దారి తీస్తుంది.
ఏ దురదృష్టం, ఏ కష్టాలు, ఎంత బరువైనవి లేదా తీవ్రమైనవి అయినప్పటికీ, ప్రభువు యొక్క అనుగ్రహాన్ని విశ్వాసి నుండి తీసివేయలేవు. ఏ శక్తి వారిని క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయగలదు?



Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |