Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.
ఒకప్పుడు యోబు గౌరవప్రతిష్ఠలు గల స్థానంలో ఉన్నాడు. ఇప్పుడతనికి పనికిరాని నీచుల హేళన, ప్రతిఘటన ఎదురయ్యాయి. తమ మధ్య ఉండేందుకు తగరని భావించి వారి తండ్రులను అక్కడి ప్రజలు వెళ్ళగొట్టేశారు (5,8 వ). ఇప్పుడైతే ఆ పోకిరి కుర్రవాళ్ళు యోబు ముఖంమీద ఉమ్మి వేసి తమకు చేతనైనంత ఇబ్బంది అతనికి కలిగిద్దామని చూస్తున్నారు (యోబు 16:10-11.
2. వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయినది.
3. దారిద్ర్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు
4. వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి.
5. వారు నరుల మధ్యనుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను
6. నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర ముండవలసి వచ్చెను.
7. తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్లచెట్లక్రింద వారు కూడియుందురు.
8. వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారు వారు దేశములోనుండి తరుమబడినవారు.
9. అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను.
10. వారు నన్ను అసహ్యించుకొందురు నా యొద్ద నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు
11. ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్లెము వదలించు కొందురు.
12. నా కుడిప్రక్కను అల్లరిమూక లేచును వారు నా కాళ్లను తొట్రిల్లచేయుదురు పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నామీద సాగింతురు.
13. వారు నిరాధారులైనను నా మార్గమును పాడుచేయుదురు నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగ జేయుదురు
14. గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.
15. భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు మేఘమువలె నా క్షేమము గతించిపోయెను.
యోబు 3:24; యోబు 6:10; యోబు 7:4-5; యోబు 13:28; యోబు 16:8 యోబు 16:17; యోబు 17:1; యోబు 19:20.
16. నా ఆత్మ నాలో కరిగిపోయి యున్నది ఆపద్దినములు నన్ను పట్టుకొనియున్నవి
17. రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడు నట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.
18. మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది.
19. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను.
20. నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తర మేమియు నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు.
మరో సారి యోబు దేవునివైపుకు తిరిగి ఫిర్యాదు చేస్తున్నాడు (యోబు 7:7-21; యోబు 10:2-22; యోబు 13:20; యోబు 14:22; యోబు 16:7-8; యోబు 17:3-4).
21. నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు
యోబు 6:4; యోబు 13:24; యోబు 16:9.
22. గాలిచేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు తుపానుచేత నన్ను హరించివేయుచున్నావు
23. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజమందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియును.
యోబు 9:22; యోబు 10:8.
24. ఒకడు పడిపోవునెడల వాడు చెయ్యిచాపడా? ఆపదలో నున్నవాడు తప్పింపవలెనని మొఱ్ఱపెట్టడా?
మరణానికి దగ్గర కావడం గురించి యోబుకు ఏమీ భయం లేకపోయినా (అసలు భయం లేదు యోబు 6:8-9; యోబు 7:15), సహాయం కోసం మొరపెడతాడు.
25. బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా?దరిద్రుల నిమిత్తము నేను దుఖింపలేదా?
మొదటినుంచీ అతని ఫిర్యాదు ఇదే తన కార్యాలకు అనుగుణంగా తనకు ప్రతిఫలం దక్కలేదు, దేవుడు తనకు అన్యాయం చేశాడు, తాను ఇతరులను చూచిన విధంగా దేవుడు తనను చూడలేదు.
26. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను.
27. నా పేగులు మానక మండుచున్నవి అపాయదినములు నన్నెదుర్కొనెను.
యోబు 3:26.
28. సూర్యుని ప్రకాశములేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను సమాజములో నిలువబడి మొఱ్ఱపెట్టుచున్నాను.
29. నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.
ఈ జంతువులు మూలుగుతున్నట్టు కీచుగొంతుతో చేసే శబ్దాలను గురించి ఇలా అని ఉండవచ్చు. తాను కూడా వాటిలాగే ఒంటరి వాడైపోయానని యోబు భావం.
30. నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను.
31. నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది.
యోబు తన ఆఖరి విలాపాన్ని కొన్ని రకాల వాయిద్యాలు చేసే ధ్వనితో పోలుస్తున్నాడు. వాటి శబ్దాలు బిగ్గరగా, నెమ్మదిగా, అంతరించిపోతూ శోకం కురిపిస్తాయి.