Psalms - కీర్తనల గ్రంథము 109 | View All
Study Bible (Beta)

1. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము

శత్రువులకు వ్యతిరేకంగా శాపాలు రాసి ఉన్న కీర్తనల్లో ఇది చివరిది. ఇతర కీర్తనల్లో ఉన్న శాపాల కంటే ఇందులోనివి ఎక్కువ భయంకరమైనవి. ఈ విషయంపై నోట్ కీర్తనల గ్రంథము 35:8 చూడండి. ఇలాంటి భాగాలను చదువుతున్నప్పుడు ఇవి పవిత్రాత్మ ప్రేరణ కింద రాసి ఉన్నాయనీ, ఇవి రచయితల వ్యక్తిగతమైన పగను బయట పెట్టే కోరికలు కావనీ ఎప్పుడూ గుర్తించుకోవాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించి లోపం లేని న్యాయాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని మీరితే శాపమే (గలతియులకు 3:10 గలతియులకు 3:13; ద్వితీయోపదేశకాండము 27:14-26). నీతిన్యాయాలకు భంగం వాటిల్లి, అలా చేసిన దుర్మార్గులు పశ్చాత్తాపపడకుండా ఉన్నప్పుడు వారికి న్యాయమైన దండన కలగాలని ఈ శాపాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు విశ్వాసులు కృపా పరిపాలన కింద ఉన్నారు. తమ శత్రువులకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రార్థనలు వారు చెయ్యకూడదు గాని తమ రక్షకుణ్ణీ ఆయన శిష్యులనూ అనుసరించాలి (మత్తయి 5:43-45; లూకా 23:34; అపో. కార్యములు 7:59-60). ఈ కీర్తనలో వ 8 లోని కొన్ని మాటలను పేతురు యూదా విషయంలో చెప్పాడు (అపో. కార్యములు 1:20). కాబట్టి దీన్ని ఇస్కరియోతు కీర్తన అని కొందరు అన్నారు. యేసుప్రభువును శత్రువులకు పట్టి ఇచ్చిన ఆ దుర్మార్గుడి లక్షణాలను ఈ కీర్తన చక్కగా వర్ణిస్తున్నదనడంలో సందేహం లేదు.

2. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.

ఈ వచనాల్లో దావీదు శత్రువులను గురించి బహువచనంలో మాట్లాడుతున్నాడు. వ 6 నుంచి బహు దుష్టుడైన శత్రువును ఒక్కణ్ణి తీసుకుని వ 20 వరకు అతడి గురించే మాట్లాడాడు. ఆరంభ వచనాల్లో తన శత్రువులు చేశారని అతడు చెప్తున్న ముఖ్యమైన పాపాలు ద్వేషం, అపనిందలు మోపడం. అతడు వారిపై ప్రేమ చూపాడు. అందుకు ప్రతిగా విషపూరితమైన పగ వారు చూపారు. అతడు నీతినిజాయితీగా జీవించాడు. వారు ఆత్రుతగా అతడి గురించి అబద్ధాలు కుప్ప వేశారు. దావీదు విషయంలో కంటే యేసుప్రభువు విషయంలో ఇది మరింత సత్యం. అపనిందలు వేయడం చాలా నీచమైన పాపాల్లో ఒకటి. హింస ఒక వ్యక్తి ఆస్తిని, అతని ప్రాణాన్ని నాశనం చెయ్యవచ్చు అయితే అపనిందలు వేయడం అతడి పేరును, ప్రతిష్ఠను, పరిచర్యను నాశనంచేసే ప్రయత్నం.

3. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడు చున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు
యోహాను 15:25

4. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను.

“పగపట్టారు”– కీర్తనల గ్రంథము 35:12; కీర్తనల గ్రంథము 38:20. సరైన ప్రవర్తనకు క్రీస్తు చూపిన కొలబద్దకు ఇది సరిగ్గా వ్యతిరేకం (లూకా 6:27-31). “ప్రార్థన”– బాధల్లో ఉన్న విశ్వాసికి సహాయం, బలం దొరకగల చోటు ఎప్పుడూ అందుబాటులో ఉంది. అది దేవుని సన్నిధి.

5. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేష ముంచుచున్నారు.

యోహాను 10:31-32; యోహాను 15:18 యోహాను 15:23-25.

6. వానిమీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడిప్రక్కను నిలుచును గాక.

తనను తాను దుష్టత్వానికి ఇచ్చివేసుకున్న మనిషిపై ఖచ్చితమైన న్యాయమైన తీర్పు వచ్చిపడాలన్న మొర ఇది. కీర్తనల గ్రంథము 18:26; లేవీయకాండము 26:23-24; సామెతలు 24:12 మొదలైన వచనాల్లో వెల్లడి అయిన సూత్రాలకు అనుగుణంగా చేసిన ప్రార్థన. దుర్మార్గులకు దుర్మార్గులైన విరోధులు కావడం న్యాయం. హీబ్రూ భాషలో “నేరం మోపే శత్రువు”, “సైతాను” ఒకే పదం.

7. వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషియని తీర్పు నొందును గాక వాని ప్రార్థన పాపమగునుగాక
2 థెస్సలొనీకయులకు 2:3

“దోషి”– అతడు దుష్ట క్రియలన్నిటి గురించి సరైన తీర్పుకు గురి కావాలి. “ప్రార్థన”– సామెతలు 28:9. పశ్చాత్తాపం లేని దుర్మార్గుడి ప్రార్థనలు స్వార్థపూరితంగా కపటంగా అపనమ్మకంతో కూడినవై ఉంటాయి. అందువల్ల అవి అతడి శిక్షకే కారణమౌతాయి.

8. వాని జీవితదినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక.
యోహాను 17:12, అపో. కార్యములు 1:20

“కొద్దివే”– కీర్తనల గ్రంథము 55:23. “ఉద్యోగం”– అపో. కార్యములు 1:20. తన ఉద్యోగాన్ని దేవుని మహిమ, మనుషుల మేలు కోసం ఉపయోగించని వాడికి, దాన్ని అతనినుంచి తీసివేయడమే న్యాయం.

9. వాని బిడ్డలు తండ్రిలేనివారవుదురు గాక వాని భార్య విధవరాలగును గాక

నిర్గమకాండము 22:24; యిర్మియా 18:21. ఈ దుర్మార్గుడికి అనాథలు, విధవరాండ్రు అంటే అసలు శ్రద్ధ లేదు. తన ప్రేమ లేని స్వార్థ ప్రవర్తనకు తగిన ఫలితాలను ఇప్పుడతడు అనుభవించాలి.

10. వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురు గాక పాడుపడిన తమ యిండ్లకు దూరముగా జీవనము వెదకుదురు గాక

కీర్తనల గ్రంథము 59:15; నిర్గమకాండము 20:5; యోబు 30:5-8.

11. వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించు కొందురు గాక వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక

దుర్మార్గుల పైకి దేవుడు తేగల తీర్పు (యెషయా 1:7; విలాపవాక్యములు 5:2; యెహెఙ్కేలు 7:21).

12. వానికి కృప చూపువారు లేకపోదురు గాక తండ్రిలేనివాని బిడ్డలకు దయచూపువారు ఉండక పోదురు గాక

అతడు ఇతరుల పట్ల దయ చూపలేదు (వ 16). అతని ప్రవర్తన ప్రకారమే అతడు తీర్పుకు గురి కావాలి.

13. వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక

కీర్తనల గ్రంథము 9:5; కీర్తనల గ్రంథము 21:10; కీర్తనల గ్రంథము 37:28; సామెతలు 10:7.

14. వాని పితరులదోషము యెహోవా జ్ఞాపకములోనుంచు కొనును గాక వాని తల్లి పాపము తుడుపుపెట్టబడక యుండును గాక

సంఖ్యాకాండము 14:18; నెహెమ్యా 4:5; యెషయా 65:6-7; యిర్మియా 18:23; యిర్మియా 32:18.

15. ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి వేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక.

కీర్తనల గ్రంథము 34:16; యిర్మియా 16:17.

16. ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను.

అలాంటి దుర్మార్గులకు వ్యతిరేకంగా న్యాయం కేకలు పెడతున్నది. చివరికి వారిని పట్టుకొని నేల కూలుస్తుంది.

17. శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి యున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను.

ఆ దుర్మార్గుడు ఇతరులపై అదే పనిగా శాపాలు కుమ్మరించేవాడు. ఇప్పుడు న్యాయవంతుడైన ఈ రచయిత దేవుని పవిత్రాత్మ మూలంగా అతడిపై శాపవచనాలు పలుకుతున్నాడు. ఆ దుష్టుడు శాపాలను తన జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆ శాపాలే జలగల్లాగా అతనికి అంటుకుంటాయి.

18. తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది

19. తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక.

20. నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట లాడువారికి ఇదే యెహోవావలన కలుగు ప్రతికారము.

కీర్తనల గ్రంథము 54:5; కీర్తనల గ్రంథము 94:23; యెషయా 3:11; 2 తిమోతికి 4:14. దుర్మార్గుడి మీదికి వచ్చే శిక్ష అతనికి న్యాయంగా కలగవలసినదే గాని వేరు కాదు.

21. యెహోవా ప్రభువా, నీ నామమునుబట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము.

ఈ వచనాల్లో దావీదు దేవునితో తన విచారకరమైన స్థితిని చెప్పుకుంటున్నాడు, సహాయంకోసం అడుగుతున్నాడు. దావీదు తలంపుల్లో ముఖ్యంగా ఉన్నది అతని అవసరత కాదు, దేవుని మహిమే (కీర్తనల గ్రంథము 23:3; కీర్తనల గ్రంథము 25:11; కీర్తనల గ్రంథము 79:9; కీర్తనల గ్రంథము 106:8). దుర్మార్గుల గుణానికి దీనికి ఎంత తేడా!

22. నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చ బడియున్నది.

“అక్కర”– కీర్తనల గ్రంథము 40:17; కీర్తనల గ్రంథము 86:1. “పొడుచుకున్నట్టు”– కీర్తనల గ్రంథము 143:4; యోబు 24:12; సామెతలు 18:14.

23. సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు

“నీడ”– కీర్తనల గ్రంథము 102.11:1. మిడత అంటే ఎందుకూ కొరగాని దానికి సూచన.

24. ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను.

కీర్తనల గ్రంథము 35:13.

25. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు
మత్తయి 27:39, మార్కు 15:29

కీర్తనల గ్రంథము 22:6-7; యిర్మియా 18:16; విలాపవాక్యములు 2:15; మత్తయి 27:39.

26. యెహోవా నా దేవా, యిది నీచేత జరిగినదనియు యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియునట్లు

దేవుడిచ్చే సహాయం మూలంగా అందరూ ఆయన్ను గుర్తించాలని అతని కోరిక.

27. నాకు సహాయము చేయుము నీ కృపనుబట్టి నన్ను రక్షింపుము.

28. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును.
1 కోరింథీయులకు 4:12

దేవుడు మనల్ని దీవిస్తే, మనుషులు ఎంతైనా మనల్ని శపించవచ్చు. ఆ శాపాలన్నీ వమ్మవుతాయి.

29. నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక

కీర్తనల గ్రంథము 35:26; కీర్తనల గ్రంథము 132:18; యోబు 8:22.

30. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను.

కీర్తనల గ్రంథము 22:22; కీర్తనల గ్రంథము 35:18; కీర్తనల గ్రంథము 111:1.

31. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతి లోనుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడిప్రక్కను నిలుచుచున్నాడు.

దీనికీ వ 6కూ ఉన్న తేడా చూడండి. సైతాను మనిషి కుడివైపున నిలబడి నిందలు మోపుతాడు. ప్రభువు అక్కడ ఉండి రక్షిస్తాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Psalms - కీర్తనల గ్రంథము 109 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దావీదు తన శత్రువులపై ఫిర్యాదు చేశాడు. (1-5) 
ప్రతి విశ్వాసికి కాదనలేని సాంత్వన మూలం ఎవరెన్ని వ్యతిరేకించినా దేవుడు వారికి అండగా ఉంటాడనే భరోసా. తమను చూసుకోవడంలో ఆయన సంతోషిస్తున్నాడని తెలుసుకుని వారు నమ్మకంగా ఆయన వైపు మొగ్గు చూపగలరు. దావీదు యొక్క విరోధులు అతని భక్తిని అపహాస్యం చేసి ఉండవచ్చు, కానీ వారి ఎగతాళి అతనిని దాని నుండి తప్పించలేకపోయింది.

ఆయన వారి నాశనాన్ని ప్రవచించాడు. (6-20) 
లార్డ్ జీసస్ ఇక్కడ న్యాయమూర్తి పాత్రలో వినవచ్చు, తన విరోధులలో కొందరిపై కఠినమైన తీర్పును ప్రకటించడం, ఇతరులకు హెచ్చరిక కథ. వ్యక్తులు క్రీస్తు అందించే రక్షణను తిరస్కరించినప్పుడు, వారి ప్రార్థనలు కూడా వారి అతిక్రమణలలో లెక్కించబడతాయి. కొందరిని అవమానకరమైన మరణాల వైపు నడిపించే మరియు వారి కుటుంబాలు మరియు అదృష్టాల పతనానికి దారితీసే వాటిని పరిగణించండి, వారిని మరియు వారి వారసులను తృణీకరించి, నీచంగా మారుస్తుంది - ఇది పాపం, ఆ దుర్మార్గపు మరియు వినాశకరమైన శక్తి.
ఇప్పుడు, దుష్టుల శరీరాలు మరియు ఆత్మలపై "వెళ్ళు, మీరు శపించబడ్డారు" అనే తీర్పు యొక్క పరిణామాలను ఆలోచించండి! బాధ, వేదన, భయం మరియు నిస్సహాయతతో అది భౌతిక ఇంద్రియాలను మరియు ఆధ్యాత్మిక సామర్థ్యాలను ఎలా బాధపెడుతుందో చిత్రించండి. పాపులారా, ఈ సత్యాలను ఆలోచించండి, వణుకుతుంది మరియు పశ్చాత్తాపం చెందండి.

ప్రార్థనలు మరియు ప్రశంసలు. (21-31)
కీర్తనకర్త తనకు తానుగా దేవుని ఓదార్పులను పొందుతాడు, విశేషమైన వినయాన్ని ప్రదర్శిస్తాడు. అతను మానసిక క్షోభ మరియు శారీరక బలహీనతతో పోరాడాడు, అతని శరీరం దాదాపు వాడిపోయింది. అయినప్పటికీ, శరీరం బాగా ఆహారంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక దౌర్భాగ్యానికి విరుద్ధంగా, ఆత్మ వృద్ధి చెందుతూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు శారీరక బలహీనతను అనుభవించడం ఉత్తమం. అతను తన ప్రత్యర్థుల నుండి అపహాస్యం మరియు నిందను భరించాడు, కానీ దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు, ఇతరుల శాపాలు బరువును కలిగి ఉండవు; అన్నింటికంటే, దేవుడు శపించని వారిని ఆశీర్వదించిన వారిని వారు ఎలా శపించగలరు? అతను దేవుని మహిమ మరియు అతని పేరు యొక్క గౌరవం కోసం విజ్ఞప్తి చేస్తాడు, మోక్షం కోసం తన యోగ్యత ఆధారంగా కాదు, అతను అలాంటి దావా వేయడు, కానీ కేవలం దేవుని అపరిమితమైన దయపై మాత్రమే.
ముగింపులో, అతను తన విశ్వాసంలో ఆనందాన్ని పొందుతాడు, అతని ప్రస్తుత పరీక్షలు చివరికి విజయానికి దారితీస్తాయని హామీ ఇచ్చాడు. దేవుని చిత్తానుసారం బాధలను సహించే వారు తమ ఆత్మలను ఆయనకు అప్పగించాలి. అన్యాయంగా మరణశిక్ష విధించబడి, ఇప్పుడు పునరుత్థానం చేయబడిన యేసు, తన ప్రజలకు న్యాయవాదిగా మరియు మధ్యవర్తిగా పనిచేస్తాడు, అవినీతి ప్రపంచం మరియు ప్రధాన నిందితుడి నుండి వారిని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు.



Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |