Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.రోమీయులకు 3:10-12
ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఎందుకంటే చిన్న చిన్న తేడాలతో దేవుడు దీన్ని 53వ కీర్తనగా తిరిగి రాయించాడు. అంతే గాక రోమ్ వారికి లేఖ 3వ అధ్యాయంలో పౌలు దీన్లోని వచనాలను ఎత్తి రాశాడు. ఇక్కడ మూర్ఖులు అని అనువదించిన హీబ్రూ పదానికి పామరులు లేక తెలివిలేనివారు అనే అర్థం రాదు. దీని అర్థం వక్ర బుద్ధిగలవారు, నైతికంగా భ్రష్టులు – గనుక సత్యాన్ని తమ మనస్సులోకి ఎక్కనీయకుండా చేసేవారు. నాస్తికుడు ఇలాంటివాడే. దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని అతడు ఎందుకు నమ్ముతున్నాడంటే అందుకు రుజువులున్నాయని కాదు గానీ లేడని అతడు చెప్పిన దేవుని పట్ల తనకు ద్వేష భావం ఉండడం మూలానే (యోహాను 15:18; రోమీయులకు 1:30; రోమీయులకు 8:7). అంటే అతని హృదయంలోని చెడు భావాలు అతని తలంపులను ఏలనిస్తున్నాడు. నాస్తికత్వం నీతి సంబంధమైన విలువలనూ కట్టుబాట్లనూ దెబ్బతీస్తుంది. (“దేవుడనేవాడు లేడంటే నేను ఏదైనా చేయవచ్చు” అని ఎవరో చెప్పినట్టు). నాస్తికుడు ఇంకా కొన్ని విధాలుగా తన మూర్ఖత్వాన్ని బయట పెడుతున్నాడు. దేవుడు లేడనే సిద్ధాంతాన్ని నిరూపించడం అసాధ్యమైనప్పటికీ, ఆ సిద్ధాంతానికి వ్యతిరేకమైన రుజువులు అనేకాలు ఉన్నప్పటికీ, అతడు దాన్ని నమ్ముతున్నాడు. దాన్ని నమ్మేలా అతడు ప్రకృతిలోనూ తన అంతర్వాణిలోనూ మారు మ్రోగుతున్న దేవుని స్వరాన్ని అణచివేయడానికి ప్రయత్నించాలి. అంతేకాక గొప్ప రుజువులతో వచ్చిన బైబిలును అతడు నిరాకరించాలి. మూర్ఖుడు దేవుడు లేడని తనలో తాను అనుకుంటాడు అని రాసి ఉంది. బయటికి చెప్పే ధైర్యం అతనికి ఉండవచ్చు, లేకపోవచ్చు. బహిరంగంగా తనకు దైవభక్తి ఉన్నట్టుగానే అతను నటిస్తూ ఉండవచ్చు.
2. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను
కీర్తనల గ్రంథము 53:2-3 చూడండి. నాస్తికుడి భ్రష్ట స్వభావం గురించిన తలంపుల నుంచి దావీదు మొత్తంగా మానవ స్వభావం భ్రష్టత్వం వైపుకు దృష్టి మరల్చాడు. మనుషులంతా దేవుడు లేడని చెప్పరు. అయితే పాపంతో నిండిన తమ పాప స్వభావం కారణంగా దేవుడు లేనట్టు ప్రవర్తిస్తారు. వారు నిజంగా దేవుడున్నాడని నమ్మితే ఆయన్ను వెదికేందుకు ప్రయత్నించరా? మనస్ఫూర్తిగా మేలు చేసేందుకు ప్రయత్నించరా? వారు అలా చేయడం లేదు గనుక తమ చర్యల ద్వారా తమ స్వభావం చెడిపోయిందనీ, దేవుని విషయం వారు కనపరచే నమ్మకం వట్టిదనీ తేలిపోతున్నది. ప్రతి వ్యక్తిలోనూ ఉండే భ్రష్ట స్వభావాన్నీ, దోషాన్నీ చూపించేందుకు పౌలు ఈ వచనాలను వాడాడు (రోమీయులకు 3:9-12). మనిషిని ఈ విధంగా వర్ణించడం మరీ కఠినంగానూ, నిరాశావాదంగానూ ఉందా? కానే కాదు. దేవుడు దీన్ని చూస్తున్నది ఈ విధంగానే. 2వ వచనంలో దావీదు మాటలు చూడండి – “యెహోవా పరలోకం నుంచి మనుషులను పరిశీలనగా చూశాడు”. దేవుడు అతనికి వెల్లడి చేసినందువల్లనే ఈ విషయం దావీదుకు తెలిసింది. మనుషులు తమ అజ్ఞానంలో, అంధకారంలో ఉంటూ తమలో ఏదో శ్రేష్ఠమైనది ఉందనుకొంటారు. అయితే దేవుడు వారికంటే సూక్ష్మ దృష్టి గలవాడు. ఆయన మనుషులు చూచినట్టు చూడడు (1 సమూయేలు 16:7; లూకా 16:13). ఈ కీర్తనలో మనుషుల గురించి దేవుడు చూచేది మాత్రమే ఉంది గాని మనుషుల అభిప్రాయం కాదు.
3. వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు
4. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు.
ప్రపంచంలో తమ కోసం ఉన్న అత్యంత ప్రధానమైనదాన్ని గురించి దుర్మార్గతలో ఉన్నవారికి ఎలాంటి గ్రహింపూ ఉండదు. అయితే దేవుని కోపం వల్ల కలిగిన భయంలో వారు ఉక్కిరి బిక్కిరి అయ్యే సమయం వస్తుంది. ప్రకటన గ్రంథం 6:15-17 చూడండి. దేవుని కోపం గురించి నోట్స్ కీర్తనల గ్రంథము 90:7-11; సంఖ్యాకాండము 25:3; ద్వితీయోపదేశకాండము 4:25 చూడండి.
5. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్ష మున నున్నాడు
6. బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు.
భ్రష్టమైపోయిన మానవత మధ్య న్యాయవంతుడైన దేవుడు తన పనిని కొనసాగిస్తూ తాను ఎన్నుకొన్న వారికి పాపవిముక్తిని కలిగిస్తున్నాడు. వారిని నిర్దోషులుగా తీర్చి ధన్యకరమైన స్థితిలోకి వారిని విమోచిస్తున్నాడు.
7. సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.రోమీయులకు 11:26-27