Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు.
“కృతజ్ఞతలు”– కీర్తనల గ్రంథము 7:17; కీర్తనల గ్రంథము 50:14-15; కీర్తనల గ్రంథము 56:12; లేవీయకాండము 7:12-13. ఇంతకుముందు కీర్తనలో దేవుడు దుర్మార్గులకు తీర్పు చెయ్యాలని ఆసాపు ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు జవాబు దొరికిన సందర్భంగా ఇక్కడ కృతజ్ఞతలు చెప్తున్నాడు. అక్కడైతే ఆసాపు “ఎంత కాలం!” అంటూ ఆక్రోశించాడు. ఇక్కడైతే దేవుడు తగిన సమయంలో చర్య తీసుకుంటాడన్న నిశ్చయత కనిపిస్తున్నది. “పేరు”– దేవుని స్వభావం, గుణాలు. తన ప్రజలను ఆదుకొనేందుకు ఆయన సమీపంగానే ఉన్నాడు (కీర్తనల గ్రంథము 34:18; కీర్తనల గ్రంథము 145:18; కీర్తనల గ్రంథము 148:14; ద్వితీయోపదేశకాండము 4:7; యెషయా 55:6).
2. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నాను.
2వ వచనంలో దేవుడే మాట్లాడసాగుతున్నాడు. లోకంలోని అల్లకల్లోలాన్నీ, తన ప్రజలకు వచ్చే హింసలనూ దేవుడు చూస్తున్నాడు. దుర్మార్గులు, గర్విష్ఠులు చెప్పుకునే బడాయిలు ఆయన వింటున్నాడు. సరిగ్గా ఎంతకాలం దీన్ని కొనసాగనివ్వాలో ఆయనకు తెలుసు. విశేష చర్యలు తీసుకునేందుకు దేవుడు విశేష కాలాలను నిర్ణయించాడు (దానియేలు 8:19; దానియేలు 11:27 దానియేలు 11:35; హబక్కూకు 2:3; యోహాను 7:30; అపో. కార్యములు 17:31). ప్రపంచానికి తీర్పు తీర్చేందుకు ఆయన లేచేవరకు లోకం ఆధారాలూ సమాజం పునాదులూ కూలిపోకుండా చూస్తాడు. భూమిపై దుర్మార్గంగా తమను తాము గొప్ప చేసుకునేవారి కోసం ఆయన ఈ సందేశాన్ని ఇస్తున్నాడు – “మీ కొమ్ములను పైకెత్తుకోకండి”. బైబిల్లో కొమ్ము అంటే కొన్ని సార్లు బలం, అధికారం అనే అర్థం, కొన్నిసార్లు గౌరవ ప్రతిష్ఠలు అనే అర్థం వస్తాయి (కీర్తనల గ్రంథము 89:17 కీర్తనల గ్రంథము 89:24; కీర్తనల గ్రంథము 92:10; కీర్తనల గ్రంథము 148:14; 1 సమూయేలు 2:1 1 సమూయేలు 2:10; విలాపవాక్యములు 2:3 విలాపవాక్యములు 2:17; జెకర్యా 1:21; లూకా 1:69). “పైకెత్తడం” అన్నది ఈ కీర్తన ముఖ్యాంశాల్లో ఒకటి (4,5,7 వచనాలు). మనిషి తనను తాను ఉన్నత స్థానానికి హెచ్చించుకోవచ్చు. అయితే అది అక్కడినుంచి కూలిపోవడానికే (వ 10). దేవుడే తమను హెచ్చించాలని దేవుని ప్రజలు తొణుకూ బెణుకూ లేకుండా ఎదురు చూడాలి (1 సమూయేలు 2:6-8). మనిషి మోసకరమైన కుతంత్రాల ద్వారా, మానవ బలం ద్వారా తనను తాను హెచ్చించుకుని అలా హెచ్చించినది దేవుడే అని వ్యర్థంగా అనుకోవడం తగదు.
3. భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. (సెలా. )
4. అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
5. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరుపట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
6. తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను హెచ్చుకలుగదు.
7. దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును
8. యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మింగివేయవలెను.ప్రకటన గ్రంథం 14:10, ప్రకటన గ్రంథం 15:7, ప్రకటన గ్రంథం 16:19
పురాతన కాలంలో నేరస్థులను వధించబోయే ముందు వారికి మత్తెక్కించే పదార్థం కలిపిన ద్రాక్షమద్యం త్రాగనిచ్చేవారు. ఇక్కడ కూడా ఇలాంటి చిత్రీకరణ ఉన్నట్టు ఉంది. యెషయా 51:17-23; యిర్మియా 25:15 యిర్మియా 25:27; యిర్మియా 49:12; యెహెఙ్కేలు 23:32-34; ప్రకటన గ్రంథం 14:9-10 పోల్చిచూడండి.
9. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను.
“యాకోబు దేవుడు”– పై నోట్ కీర్తనల గ్రంథము 146:5 చూడండి.
10. భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును.
దుర్మార్గులు పెరగడం విరగడం కోసమే. న్యాయవంతుల దీనస్థితి వారు వర్ధిల్లేందుకే (లూకా 14:11; లూకా 18:14).