Psalms - కీర్తనల గ్రంథము 78 | View All
Study Bible (Beta)

1. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి

ఈ కీర్తనలో ప్రవక్తగా ఆసాపు మాట్లాడుతున్నాడు (మత్తయి 13:35 చూడండి). దేవుని కృప, ఆయన చేసిన ఘన కార్యాలకూ, ఇస్రాయేల్‌వారి తిరుగుబాటు, పాపాలకూ ఇక్కడ తేడా చెప్పబడింది. ప్రజలకు వారి చరిత్రనే ఆధారం చేసుకొని హెచ్చరికలు ఇవ్వడం ఇక్కడ రచయిత ఉద్దేశం (105, 106 కీర్తనలు కూడా ఇలాంటివే). దేవుడు ఎఫ్రాయిం గోత్రాన్ని అణచివేయడానికి, యూదా గోత్రాన్ని ఉన్నత స్థితికి తేవడానికి కూడా కారణం ఇక్కడ కనిపిస్తుంది. ఈ కీర్తన చరిత్ర సంభవాల అంతరార్థం కూడా నేర్పిస్తున్నది. నేటి కాలానికి మనకెంతో అవసరమైన పాఠాలు కొన్నింటిని దీనివల్ల మనం నేర్చుకోగలం. తమ కోరికలన్నిటినీ దేవుడు తీర్చడం లేదని తరచుగా మనుషులు ఆయన్ను నిందిస్తూ ఉంటారు లేక తాము ఊహించినట్టు ఆయన ప్రవర్తించడం లేదనో లేక పాపాన్నీ తిరుగుబాటునూ ఆయన శిక్షిస్తాడనో ఆయనను తప్పులెన్నుతూ ఉంటారు. ఈ కీర్తనలో దేవుని నిజ స్వభావం, గుణాలు, మానవ భ్రష్ట స్థితి కొట్టొచ్చినట్టుగా, కూలంకషంగా బయలు పడుతున్నాయి. దేవుడెలాంటివాడో మనం ఎలాంటివారమో ఇక్కడ మనం కొంతమట్టుకు నేర్చుకోగలం. ఇక్కడ వర్ణించబడిన ఇస్రాయేల్‌వారికంటే మనం లేసమన్నా మంచి వారం అనుకోవడానికి ఎలాంటి ఆధారమూ లేదు. దేవుడిచ్చే వెలుగు, సత్యం వారికున్నంతగా మనకుంటే (కొత్త ఒడంబడిక గ్రంథం మన చేతుల్లో ఉంటే వారికున్న వెలుగు, సత్యం కంటే మనకు ఎక్కువ ఉంది గదా) వారిలాగా తిరుగుబాటు పాపకార్యాల్లో మనం పాలు పంచుకుంటే మనకు ఏ సాకూ లేదు. అపనమ్మకం వల్ల కలిగే ఫలితాలు, దానికి పడే శిక్షల గురించి ఇక్కడ సవిస్తరంగా ఉంది. ఈ కీర్తనలో అపనమ్మకం వల్ల కనబడ్డ ఫలితాలివి: మనుషులు వెనుకంజ వేయడం (9 వ), అవిధేయులుకావడం (10 వ), దేవుని అపార కరుణను మర్చిపోవడం (11 వ), వ్యర్థజీవితం గడపడం (33 వ), అబద్ధాలు పలకడం (36 వ), దేవుణ్ణి హద్దులో పెట్టాలనుకోవడం (41 వ), స్వామిభక్తి లేకుండా నమ్మరానివారుకావడం (57 వ), ఇలాంటి అపనమ్మకం మనుషుల పైకి దేవుని కోపాన్నీ గొప్ప నష్టాన్నీ తెచ్చి పెడుతుంది.

2. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను.
మత్తయి 13:35

ఈ వచనాలు, ముఖ్యంగా 7,8 వచనాలు ఆసాపు ఈ కీర్తన ఎందుకు రాశాడో తెలియ చేస్తున్నాయి. తన ప్రజలు ఏమి చెయ్యాలని దేవుడు కోరుతాడో దాన్ని ఆసాపు చేస్తున్నాడు (నిర్గమకాండము 12:26-27; నిర్గమకాండము 13:8-9; ద్వితీయోపదేశకాండము 4:9-10; ద్వితీయోపదేశకాండము 6:7 ద్వితీయోపదేశకాండము 6:20-25; ద్వితీయోపదేశకాండము 11:19; ద్వితీయోపదేశకాండము 32:46). ప్రభువును గురించిన విషయాలలో, క్రమశిక్షణలో తమ పిల్లలను పెంచడం తల్లిదండ్రుల పవిత్ర కర్తవ్యం (ఎఫెసీయులకు 6:4). విశ్వాసుల తరం ప్రతిదీ తమ తరువాతి తరంవారికి వీటిని బోధించాలి. మత్తయి 13:35 లో యేసుప్రభువు ఉపదేశ పద్ధతిని సూచిస్తూ ఈ మాటలను ఎత్తి రాయడం జరిగింది.

3. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను.

4. యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.
ఎఫెసీయులకు 6:4

5. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు నట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియలను మరువకయుండి

6. యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిరమనస్సులేనివారై తమ పితరులవలె తిరుగబడకయు

7. మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును

బైబిల్లో రెండు రకాల ఉదాహరణలు కనిపిస్తాయి – అనుసరణీయమైన మంచి ఆదర్శాలు, అనుసరించరాని చెడు మాదిరిలు. ఈ కీర్తన మిగిలిన భాగంలో కనిపించే ఇస్రాయేల్ వారి చరిత్ర ఈ రెండో రకమైన ఉదాహరణలెన్నిటినో చూపిస్తూ ఉంది. 8వ వచనంలో ఉన్న మూడు కారణాల మూలంగా వారు దారి తప్పారు. వారు దేవునిపట్ల విధేయత చూపలేదు. ఆయన పట్ల నమ్మకంగా లేరు. వీటిలోని రెండో కారణం మిగతా రెంటికీ కారణం. మనస్సును సిద్ధపరచుకొని అంతరంగిక జీవనం దేవుని దృష్టిలో సరిగా ఉండేలా చూసుకొంటూ ఉండడం అన్నిటికంటే ముఖ్యమైన విధి. బయట మనం చేసే సేవకంటే ఇది ముఖ్యం. ఎందుకంటే హృదయం సరిగ్గా లేకపోతే మన సేవ దేవునికి ప్రీతికరం కాదు, సమ్మతం కాదు (సామెతలు 4:23; లూకా 6:45).

8. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము ననుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికాజ్ఞాపించెను
అపో. కార్యములు 2:40

9. విండ్లను పట్టుకొని యుద్దసన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి

కనానును ఆక్రమించుకునే సమయంలోను, తదనంతరం కూడా ఎఫ్రాయిం గోత్రం ఇస్రాయేల్ వంశాల్లో ప్రముఖ స్థానంలోకి వచ్చింది. యెహోషువ, గిద్యోను ఈ గోత్రంవారే. మొత్తంమీద ఎఫ్రాయిం సరిగా తన నాయకత్వాన్ని నిర్వహించలేదు గనుక ఆ గోత్రాన్ని గురించి ఇక్కడ ఈ మాటలు రాసి ఉన్నాయి. ఇక్కడ ఆసాపు రాస్తున్నది ఖచ్చితంగా ఏ యుద్ధం గురించో తెలియదు. బహుశా న్యాయాధిపతులు గ్రంథంలో సాధారణంగా కనిపించే యుద్ధ పరిస్థితుల గురించి కావచ్చు.

10. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి

ఇది కేవలం ఎఫ్రాయిం విషయంలోనే గాక ఇస్రాయేల్ జాతి అంతటి విషయంలోనూ నిజమే. అయితే ఇతర గోత్రాలకంటే ఎఫ్రాయిం విషయంలో ప్రత్యేకించిన సత్యం.

11. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి.

12. ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను.

నిర్గమ 7–13 అధ్యాయాలు చూడండి. సోయన్ అంటే ఈజిప్ట్‌లో ఇస్రాయేల్‌వారు నివసించిన గోషెన్ ప్రాంతానికి ముఖ్య నగరం. ఇది ఫరో నగరం.

13. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను

నిర్గమకాండము 14:21-22.

14. పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను

నిర్గమకాండము 3:21-22; నిర్గమకాండము 14:24.

15. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను.
1 కోరింథీయులకు 10:4

నిర్గమకాండము 17:6; సంఖ్యాకాండము 20:11; కీర్తనల గ్రంథము 105:41; కీర్తనల గ్రంథము 114:8.

16. బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.

17. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపముచేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి.

చాలా విచారకరమైన మాట. వారి పక్షంగా దేవుడు చేసిన అద్భుతాలన్నీ వారిలో సరైన మార్పును కలిగించలేదు. సజీవ విశ్వాసం విధేయతలను వారి హృదయంలో నెలకొల్పలేదు. నిజానికీ అద్భుత క్రియలు ఒక వ్యక్తిలో నిజమైన నమ్మకాన్ని, విధేయతను ఎన్నడూ పుట్టించలేవు (22,32 వ; మత్తయి 11:20-24; లూకా 16:31; యోహాను 6:26). ఇది జరగాలంటే హృదయంలో దేవుని పని జరగాలి. నిజమైన పశ్చాత్తాపం కలగాలి. మానవ స్వభావంలోని ఘోర భ్రష్టత్వం బయటి క్రియల వల్ల ఓడిపోదు.

18. వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి.

కీర్తనల గ్రంథము 95:9; కీర్తనల గ్రంథము 106:14; నిర్గమకాండము 17:6; ద్వితీయోపదేశకాండము 6:16; 1 కోరింథీయులకు 10:9.

19. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా యనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి.

నిర్గమకాండము 16:2; సంఖ్యాకాండము 11:4; సంఖ్యాకాండము 20:3; సంఖ్యాకాండము 21:5. కీర్తనల గ్రంథము 23:5 పోల్చిచూడండి.

20. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అని వారు చెప్పుకొనిరి.

సంఖ్యాకాండము 11:18.

21. యెహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్నిరాజెను ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టెను.

దేవుని కోపం గురించి కీర్తనల గ్రంథము 90:7-11; సంఖ్యాకాండము 25:3 నోట్స్ చూడండి.

22. వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక యుంచలేదు.

దేవుని కోపానికి కారణం ఇది. దేవుని మహా బలప్రభావాలు, మంచితనం తేటతెల్లమౌతూ ఉన్నప్పుడు కూడా వారి అపనమ్మకం అలానే నిలిచి ఉంది. ఇది ఉద్దేశపూర్వకమైన, నిందాపాత్రమైన అపనమ్మకం. ఇంత గొప్ప కృపను కనుపరచిన గొప్ప దేవుణ్ణి సందేహించడం గొప్ప పాపం.

23. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అంతరిక్షద్వారములను తెరచెను

నిర్గమకాండము 16:4 నిర్గమకాండము 16:14-15.

24. ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారి కనుగ్రహించెను.
యోహాను 6:31, ప్రకటన గ్రంథం 2:17, 1 కోరింథీయులకు 10:3

25. దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.

26. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.

నిర్గమకాండము 16:13; సంఖ్యాకాండము 11:31-32.

27. ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.

28. వారి దండు మధ్యను వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను.

29. వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను.

కీర్తనల గ్రంథము 106:14-15; సంఖ్యాకాండము 11:33-34.

30. వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంక వారి నోళ్లలో నుండగానే

31. దేవుని కోపము వారిమీదికి దిగెను వారిలో బలిసినవారిని ఆయన సంహరించెను ఇశ్రాయేలులో ¸యౌవనులను కూల్చెను.
1 కోరింథీయులకు 10:5

32. ఇంత జరిగినను వారు ఇంకను పాపముచేయుచు ఆయన ఆశ్చర్యకార్యములనుబట్టి ఆయనను నమ్ముకొనక పోయిరి.

దయచొప్పున దేవుడు చూపిన అద్భుతాలు, ఆయన విధించిన కఠిన శిక్షలు ఇవేమీ ప్రజల హృదయాలను మార్చలేదు. ఎవరైనా వారిని సరిదిద్దుదామంటే వారు ఎప్పుడూ వెనుకంజ వేసేవారు. అయితే మిగతా మానవాళి అంతా వారికంటే ఎంతమాత్రం శ్రేష్ఠులు కాదు. మనం కూడా వారందరికంటే నయమని చెప్పడానికి ఏ మాత్రమూ వీల్లేదు (రోమీయులకు 3:9 రోమీయులకు 3:23). ఈ వచనాలు మనిషి పతనమైన పాపిష్టి స్థితిని గురించిన వ్యాఖ్యానం. ఆ స్థితిలో నీవూ నేనూ కూడా పాలుపొందినవారమే. మొత్తంమీద ప్రజలంతా పాపులు, నమ్మకం లేనివారు (32 వ), కష్టకాలంలో మాత్రమే దేవుని వైపు తిరిగేవారు (34 వ), అలాంటి సమయాల్లో కూడా యథార్థ హృదయం లేనివారు (36,37 వ), వారు చేయగల వాటన్నిటిలోనూ బలహీనులు (39 వ), దేవుణ్ణి అస్తమానమూ నొప్పించేవారు (40 వ), దేవుని శక్తికి పరిమితులు ఏర్పరచేవారు (41 వ), దేవుని దయ, అనుగ్రహమంతటినీ తేలిగ్గా మర్చిపోయేవారు (42 వ), పరీక్షా సమయం వచ్చినప్పుడు మానవ స్వభావం బయట పెట్టుకునే అసలు రంగు ఇదే. దీన్ని సరిదిద్దేందుకు దేవుడు కూడా ప్రయత్నించడం లేదు. అది చావుకు తగినదనీ ఆయన అంటున్నాడు. తనను నమ్మినవారికి సరికొత్త స్వభావాన్ని ఆయన ఇస్తాడు (రోమీయులకు 6:3-5; రోమీయులకు 7:4-6; 2 కోరింథీయులకు 5:14-17; ఎఫెసీయులకు 2:1-10; ఎఫెసీయులకు 4:22-24; కొలొస్సయులకు 3:1-4).

33. కాబట్టి ఆయన, వారి దినములు ఊపిరివలె గడచిపోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడచిపోజేసెను.

ఇస్రాయేలువారు ఎడారిలో గమ్యం, గురి లేకుండా నలభై ఏళ్ళుగా తిరుగులాడారు. పాపం, తిరుగుబాటు, అపనమ్మకానికి ఫలితాలు హృదయంలో శూన్యత, వ్యర్థ జీవితం, భవిష్యత్తును గురించిన భయం, మరణం, మన జీవితాలు ఫలరహితంగా వ్యర్థంగా అనేక భయాలతో పీడించబడుతూ ఉంటే వీటన్నిటికీ మూలం ఏమిటో అర్థం చేసుకొందాం.

34. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి.

35. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసికొనిరి.

“విడిపించినవాడు”– ఇక్కడ ఇలా తర్జుమా చేయబడ్డ హీబ్రూ పదం (గోయేల్‌) హీబ్రూ పాత ఒడంబడికలో 46 సార్లు కనిపిస్తూవుంది. కొన్ని సార్లు దేవుణ్ణి, కొన్ని సార్లు మనిషిని ఉద్దేశించి ఈ పదం వాడబడింది. దీనికి వివిధ అర్థాలు ఉన్నాయి – కష్టాలనుంచీ బానిసత్వం నుంచీ విడిపించిన విమోచకుడు (ఆదికాండము 48:16; ద్వితీయోపదేశకాండము 13:5) ఒక వ్యక్తి పోగొట్టుకున్న ఆస్తిని వెలకు కొని అతనికి తిరిగి అప్పగించే సమీప బంధువు (లేవీయకాండము 25:25) హత్యకు గురి అయిన రక్తసంబంధి విషయంలో ప్రతీకారం చేసేవాడు (సంఖ్యాకాండము 35:12) తన కుటుంబం సభ్యుని మరణం తరువాత అతని భార్యను వివాహమాడి అతనికోసం సంతానాన్ని కనడమే కాక ఆమె కోల్పోయిన ఆస్తిని కొని తిరిగి ఆమెకు అప్పగించే సమీప బంధువు (రూతు 2:20) తన ప్రజలు వేధింపులకు గురౌతూ ఉంటే వారి పక్షాన నిలబడేవాడు (సామెతలు 23:11) దేవుడు విమోచకుడుగా తన ప్రజలను దాస్యంనుంచి తప్పించాడు, వారిని వారి దేశంలోకి తిరిగి రప్పించాడు, వారి శత్రువులను శిక్షించాడు (యెషయా 49:25-26; యిర్మియా 50:33-34). క్రొత్త ఒడంబడికలో దీని అర్థం మరింత ఆధ్యాత్మికమైనది. అక్కడ విమోచకుడు యేసుప్రభువు. పాపదాస్యంనుంచి మనల్ని విడిపించేందుకు అవసరమైన వెలను చెల్లించాడు. ఆ వెల ఆయన రక్తమే. ఆ రక్తం మూలంగా విశ్వాసులకు పాపక్షమాపణ, విముక్తి, పరలోకంలో ఉన్న శాశ్వతమైన వారసత్వం లభించాయి. యేసు తన విశ్వాసుల పక్షంగా వారి శత్రువైన సైతాన్ను ఎదిరించి మానవతమీదికి మరణాన్ని తెచ్చి పెట్టిన ఈ పిశాచాన్ని ఆయన నాశనం చేసి, సైతాను చేతుల్లో పడడంమూలంగా మనిషి జారవిడుచుకొన్న దానంతటినీ తిరిగి మనిషికి సమకూరుస్తాడు. దేవుని కోసం ఫలించేందుకు తన ప్రజలంతా ఉమ్మడిగా తనకు ఆత్మ సంబంధమైన పవిత్ర వధువు కావాలని యేసుప్రభువు వారిని విమోచించాడు. మత్తయి 20:28; మత్తయి 26:28; రోమీయులకు 3:24; రోమీయులకు 7:1-4; గలతియులకు 3:13-14; ఎఫెసీయులకు 1:7 ఎఫెసీయులకు 1:14; ఎఫెసీయులకు 4:30; ఎఫెసీయులకు 5:33; కొలొస్సయులకు 1:14; హెబ్రీయులకు 9:12; 1 పేతురు 1:4 1 పేతురు 1:18-19; ప్రకటన గ్రంథం 1:5; ప్రకటన గ్రంథం 5:9-10; ప్రకటన గ్రంథం 19:6-9 చూడండి.

36. అయినను వారి హృదయము ఆయనయెడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు

మనుషులు దేవునితో అబద్ధాలాడుతారా, ఆయన్ను మోసగించేందుకు ప్రయత్నిస్తారా? నిస్సందేహంగా అలా చేస్తారు. మనుషులు నిజంగా పశ్చాత్తాపపడి దేవునికి పూర్తిగా విధేయులు కావలసిన తమ బాధ్యతను తప్పించు కొనేందుకు ఏదైనా చేస్తారు.

37. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతిచేసిరి తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి.
అపో. కార్యములు 8:21

38. అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.

నిర్గమకాండము 34:6; సంఖ్యాకాండము 14:18-20; యెషయా 48:9. దేవుడు మనుషులపై తన న్యాయమైన కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఎవ్వరూ బ్రతకలేరు.

39. కాగావారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.

కీర్తనల గ్రంథము 103:14-16; ఆదికాండము 6:3; యాకోబు 4:14.

40. అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.

“తిరుగబడ్డారు”– కీర్తనల గ్రంథము 95:8-10; కీర్తనల గ్రంథము 106:43; కీర్తనల గ్రంథము 107:11; హెబ్రీయులకు 3:16. “దుఃఖపట్టారు”– కీర్తనల గ్రంథము 95:10; యెషయా 63:10; ఎఫెసీయులకు 4:30.

41. మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.

ఇక్కడ ఇంగ్లీషు కింగ్ జేమ్స్ బైబిల్లోని తర్జుమా ప్రకారం అనువదించాము. ఇక్కడ “హద్దులో పెట్టారు” అని తర్జుమా చేసిన హీబ్రూ పదం అర్థం ఏమంత స్పష్టంగా లేదు గాని ఇతర తర్జుమాలన్నిటికంటే బహుశా ఇది ఆ పదానికి బాగా దగ్గరైనది అని నా అభిప్రాయం. అయితే దేవుడు అమిత శక్తిగలవాడు గదా! మనుషులు ఆయన బల ప్రభావాలకు హద్దు లేర్పరచగలరా? దేవుని బల ప్రభావాలకు మితం లేదు. నిజమే. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు (ఆదికాండము 18:14; యిర్మియా 32:37; మత్తయి 19:26). కానీ దేవుడు తమకు చేయగల మేలుకు మనుషులు హద్దులేర్పరచగలరు. మత్తయి 23:37-39; మార్కు 6:1-6 చూడండి. మనుషులు చూపే నమ్మకం దేవుని శక్తి వారి మధ్య మంచి పనులు జరిగించేలా చేసే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు (మత్తయి 9:29; మత్తయి 17:19-20; మత్తయి 11:22-24). అపనమ్మకం అమిత శక్తిగల దేవునికి హద్దులు కల్పిస్తుందన్నమాట.

42. ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.

న్యాయాధిపతులు 3:7; న్యాయాధిపతులు 8:34. దేవుని బల ప్రభావాలను జ్ఞాపకం చేసుకోవడానికి వారు బుద్ధి పూర్వకంగా నిరాకరించారు. ఇది నిందార్హమైనది.

43. ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.

నిర్గమ 7—13 అధ్యాయాలు.

44. ఐగుప్తీయులు త్రాగలేకుండ నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను
ప్రకటన గ్రంథం 16:4

45. ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను.

46. ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతలకప్పగించెను.

47. వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడుచేసెను.

48. వారి పశువులను వడగండ్ల పాలుచేసెను. వారి మందలను పిడుగుల పాలుచేసెను.

49. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను.

50. తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను.

51. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను.

52. అయితే గొఱ్ఱెలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను

53. వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను.

54. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణహస్తము సంపాదించిన యీ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను.

యెహోషువ 1:1-3; యెహోషువ 4:23; యెహోషువ 10:40-42; యెహోషువ 24:11-13.

55. వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను. కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచి యిచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను.

56. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనముల ననుసరింపకపోయిరి.

యెహోషువ మరణం తరువాత వచ్చిన తరంవారి పాపం గురించి ఈ వచనం చెప్తున్నది (న్యాయాధిపతులు 2:7-13). దేవుడు తరచుగా నిషేధించిన అతి హీనమైన విగ్రహ పూజ అనే పాపంలో వీరు త్వరగానే పడిపోయారు (నిర్గమకాండము 20:3-5 మొ।।). స్థలం మార్పు ద్వారా హృదయంలో మార్పు రాలేదు. వారు తమ పూర్వీకులలాగే మనుషులందరిలాగే తిరుగుబాటు మనసు, భ్రష్ట స్వభావం, అపనమ్మకం గలవారు.

57. తమ పితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి.

58. వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగ జేసిరి.

59. దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహ్యించుకొనెను.

“కోపపడ్డాడు”– కీర్తనల గ్రంథము 90:7-11; సంఖ్యాకాండము 25:3 నోట్స్. “అసహ్యం”– కీర్తనల గ్రంథము 5:6; కీర్తనల గ్రంథము 10:3; లేవీయకాండము 20:23; లేవీయకాండము 26:30; ద్వితీయోపదేశకాండము 32:19. చెడుతనం ఆయనకు ఎప్పుడూ అసహ్యమే. దాన్ని అనుసరించేవారంతా ఆయనకు అసహ్యులే.

60. షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను.

వారి పాపం ఎంత ఘోరమంటే దేవుడు తన నివాస స్థలంగా ఎన్నుకొన్న సన్నిధి గుడారాన్ని వదిలివెళ్ళిపోయాడు. షిలోహు ఎఫ్రాయిం ప్రాంతంలోనిది (9 వ).

61. ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.

ఆయన బల ప్రభావాల చిహ్నం, భూమి పై ఆయన మహిమ వెల్లడి అయిన స్థలం సన్నిధి గుడారంలో ఉన్న ఒడంబడిక మందసం. అయితే తన ప్రజల పాపం కారణంగా దాన్ని వారి శత్రువుల చేతిలో పడేలా చేశాడాయన (1 సమూయేలు 4:1-11).

62. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యముమీద ఆగ్రహించెను

న్యాయాధిపతులు 20:21; 1 సమూయేలు 4:10-11.

63. అగ్ని వారి ¸యౌవనస్థులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను.

64. వారి యాజకులు కత్తిపాలుకాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.

65. అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను.

ఈ ముగింపు వచనాల్లో ఆసాపు కావ్యరూపంలో దేవుడు జరిగించిన ఒక కొత్త కార్యం గురించి రాస్తున్నాడు. ఆయన ఎఫ్రాయిం నాయకత్వాన్ని త్రోసిపుచ్చి మరో వంశాన్ని అధికారంలోకి తెచ్చాడు. కొత్త రాజు(దావీదు)ను అభిషేకించాడు. ఒడంబడిక పెట్టె ఉండేందుకు కొత్త స్థలాన్ని ఎన్నుకున్నాడు (జెరుసలం), ఇస్రాయేల్‌వారి శత్రువులను నలిపివేశాడు. సమూయేలు రెండు గ్రంథాల్లోనూ రాసివున్న ఆయా సంఘటనల సారాంశమే ఈ భాగం.

66. ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను.

67. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు.

68. యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను.

69. తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధమందిరమును కట్టించెను

70. తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల దొడ్లలోనుండి అతని పిలిపించెను.

71. పాడిగొఱ్ఱెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను.

72. అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.

విజయవంతమైన శూరుడు, రాజు, తన ప్రజల పాలిట కాపరిగా దావీదు పాత ఒడంబడికలో క్రీస్తుకు ఒక గొప్ప సూచన.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Psalms - కీర్తనల గ్రంథము 78 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. (1-8) 
వీటిని నిగూఢమైన మరియు లోతైన వ్యక్తీకరణలుగా సూచిస్తారు ఎందుకంటే వాటికి జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. దైవిక చట్టం చర్చి యొక్క శాశ్వత ఉనికిని నిర్ధారిస్తూ, భవిష్యత్తు తరాలకు శ్రద్ధగా బోధించడానికి ఒక నిర్దిష్ట నిర్దేశంతో అందించబడింది. ఇది దయ లేదా తీర్పు యొక్క క్షణాలలో దేవుని ప్రావిడెన్స్ నుండి ప్రేరణ పొందేలా ప్రజలను ఎనేబుల్ చేయడానికి ఉద్దేశించబడింది, తద్వారా దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రోత్సహించడం. దేవుని కార్యాలను గమనించడం ఆయన ఆజ్ఞలను సమర్థించాలనే మన దృఢ నిశ్చయాన్ని గణనీయంగా బలపరుస్తుంది. కపటత్వం మతభ్రష్టత్వానికి మార్గం సుగమం చేస్తుంది; తమ హృదయాలను నీతితో సరిదిద్దడంలో విఫలమైన వారు దేవుని పట్ల తమ నిబద్ధతలో స్థిరంగా ఉండరు. విషాదకరంగా, చాలా మంది తల్లిదండ్రులు, నిర్లక్ష్యం మరియు దుర్మార్గం కారణంగా, వారి స్వంత పిల్లలకు హాని కలిగించే ఏజెంట్లుగా మారతారు. ఏదేమైనప్పటికీ, యువకులు, అన్ని చట్టబద్ధమైన ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, పాపాత్మకమైన ఆదేశాలను పాటించకూడదు లేదా పాపాత్మకమైన ప్రవర్తనలను అనుకరించకూడదు.

ఇజ్రాయెల్ చరిత్ర. (9-39) 
పాపం వ్యక్తుల ఆత్మను క్షీణింపజేస్తుంది, వారిని నిరుత్సాహపరుస్తుంది. దేవుని క్రియలను మరచిపోవడమే ఆయన చట్టాలకు అవిధేయతకు మూలకారణం. ఈ కథనం దేవుని దయ మరియు మానవ అవిధేయత మధ్య పోరాటాన్ని చిత్రీకరిస్తుంది. ప్రభువు మన ఫిర్యాదులు మరియు సందేహాలన్నింటినీ వింటాడు మరియు అతని అసంతృప్తి చాలా తీవ్రంగా ఉంటుంది. దేవుని దయ యొక్క శక్తిని అనుమానించే వారు చివరికి అతని ఆగ్రహాన్ని అనుభవిస్తారు. మోక్షం వైపు ప్రయాణంలో దేవుని ప్రావిడెన్స్‌పై నమ్మకం ఉంచలేని వారు తమ అంతిమ ఆనందం కోసం ఆయన మోక్షంపై ఆధారపడతారని నిజంగా చెప్పలేము. విశ్వాసంతో మరియు ప్రార్థనతో, వెతుకుతూ, తట్టుకుంటూ వచ్చే వారందరికీ, స్వర్గ ద్వారాలు ఎల్లప్పుడూ తెరుచుకుంటాయి. దేవునిపై మనకున్న అపనమ్మకం మన పాపాలను గొప్పగా చేస్తుంది. వారి పాపపు కోరికలను తిరస్కరించడం ద్వారా కాకుండా వాటిని మంజూరు చేయడం ద్వారా వారి రెచ్చగొట్టడం పట్ల అతను తన కోపాన్ని వ్యక్తం చేశాడు. కామం తృప్తి చెందదు. తమ మోహానికి లొంగిపోయేవారు దాని వలలో చిక్కుకుంటారు. ప్రభువు యొక్క దయకు లోనుకాని మరియు అతని తీర్పులకు లోబడని హృదయాలు నిజంగా కఠినంగా ఉంటాయి. పాపంలో పట్టుదలతో ఉన్నవారు కొనసాగుతున్న కష్టాలను ఎదుర్కొంటారని ఆశించాలి. మనం అంత పరిమితమైన సౌకర్యం మరియు ఉద్దేశ్యంతో జీవించడానికి కారణం మనం విశ్వాసంతో జీవించడంలో విఫలమవడమే. ఈ మందలింపుల నేపథ్యంలో, వారు పశ్చాత్తాపాన్ని ప్రకటించారు, కానీ అది అసంబద్ధంగా గుర్తించబడింది. ఇజ్రాయెల్ చరిత్రలో, మన స్వంత హృదయాలు మరియు జీవితాల ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. దేవుని ఓర్పు, హెచ్చరికలు మరియు దయ అతని మాటకు వ్యతిరేకంగా వారి హృదయాలను కఠినతరం చేయడానికి వారిని బలపరుస్తాయి. రాజ్యాల చరిత్ర ఈ నమూనాకు అద్దం పడుతుంది. వారి పాపాల కొలత పూర్తి అయ్యే వరకు తీర్పులు మరియు దయలు తరచుగా వినబడవు. గొప్ప ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ, చర్చిలు దేవుని ఆజ్ఞలకు దూరంగా ఉన్నాయి. నిజమైన విశ్వాసులు తాము ప్రొవిడెన్స్ దయను దుర్వినియోగం చేసిన సంవత్సరాలను గుర్తుచేసుకుంటారు. వారు చివరకు స్వర్గానికి చేరుకున్నప్పుడు, ప్రభువు సహనానికి మరియు అతని రాజ్యానికి దారితీసే కరుణకు వారు ఆశ్చర్యపోతారు.

కెనాన్‌లో వారి నివాసం. (40-55)
దేవుని దయ పొందిన వారు తమ పాపంలో ధైర్యంగా ఉండకూడదు, ఎందుకంటే వారు పొందిన దయ దాని పరిణామాలను వేగవంతం చేస్తుంది. అదేవిధంగా, తమ అతిక్రమణలకు దైవిక చీవాట్లు ఎదుర్కొనే వారు పశ్చాత్తాపాన్ని వెంబడించడంలో నిరుత్సాహపడకండి. ఇశ్రాయేలు పరిశుద్ధుడు తన మహిమను మరియు వారి అంతిమ మేలును ఉత్తమంగా అందించే విధంగా వ్యవహరిస్తాడు. గత ఆశీర్వాదాలను గుర్తుంచుకోవడంలో వారి వైఫల్యం భవిష్యత్తులో దేవుని చర్యలను పరిమితం చేయడానికి వారిని నడిపించింది. దేవుడు తన సొంత ప్రజలను ఒక గొర్రెల కాపరి తన మందను నడిపిస్తున్నట్లుగా ముందుకు నడిపించాడు, అరణ్యంలో వారిని అత్యంత శ్రద్ధతో మరియు సున్నితత్వంతో నడిపించాడు.
ఇదే పంథాలో, నిజమైన జాషువా, యేసు కూడా తన చర్చిని ఆధ్యాత్మిక అరణ్యం నుండి బయటకు నడిపిస్తాడు. అయితే, ఏ భూసంబంధమైన కెనాన్ లేదా ప్రాపంచిక ప్రయోజనాలు చర్చి ఈ ప్రపంచంలో ఒక రూపకమైన అరణ్యంలో మిగిలిపోయిందని మనం మరచిపోకూడదు. దేవుని ప్రజలకు మరింత మహిమాన్వితమైన విశ్రాంతి ఎదురుచూస్తుందని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

ఇజ్రాయెల్ పట్ల దేవుని కరుణ వారి కృతజ్ఞతతో విభేదించింది. (56-72)
ఇశ్రాయేలీయులు కనానులో స్థిరపడిన తర్వాత, తరువాతి తరాలు వారి పూర్వీకుల నమూనాను అనుసరించాయి. దేవుడు వారికి తన బోధలను అందించాడు, కానీ వారు మార్గం నుండి తప్పుకున్నారు. అహంకారపూరిత పాపాలు ఇశ్రాయేలీయులను కూడా దేవుని పరిశుద్ధత దృష్టిలో అసహ్యకరమైనవిగా చేశాయి మరియు ఆయన న్యాయానికి వారిని బహిర్గతం చేశాయి. ప్రభువు విడిచిపెట్టిన వారు నాశనానికి గురవుతారు, మరియు త్వరగా లేదా తరువాత, దేవుడు తన శత్రువులపై అవమానాన్ని తెస్తాడు.
అతను తన ప్రజలపై నీతివంతమైన ప్రభుత్వాన్ని స్థాపించాడు, తన స్వంత హృదయానికి అనుగుణంగా ఒక రాజు నేతృత్వంలో. ఇశ్రాయేలు పట్ల దేవుని అనుగ్రహానికి పరాకాష్టగా దీనిని హైలైట్ చేయడానికి కీర్తనకర్తకు తగినంత కారణం ఉంది. దావీదు క్రీస్తు యొక్క నమూనాగా పనిచేస్తాడు, గొప్ప మరియు దయగల గొర్రెల కాపరి మొదట తగ్గించబడ్డాడు మరియు తరువాత ఉన్నతంగా ఉన్నాడు. క్రీస్తు జ్ఞానం మరియు అవగాహన యొక్క ఆత్మతో నింపబడతాడని ముందే చెప్పబడింది. ప్రజలు అతని హృదయ సమగ్రత మరియు అతని చేతుల నైపుణ్యం మీద తమ విశ్వాసాన్ని ఉంచగలరు మరియు అతని ప్రభుత్వానికి మరియు శాంతికి అంతం ఉండదు.
మానవ స్వభావం యొక్క ప్రతి పరీక్ష ఇప్పటివరకు హృదయం అన్నిటికంటే మోసపూరితమైనది మరియు తీరని చెడ్డది అనే లేఖనాల సాక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తుంది. పరిశుద్ధాత్మ పరివర్తన కలిగించే పని ద్వారా మాత్రమే ఏ వ్యక్తి యొక్క భక్తిహీనతను నయం చేయవచ్చు.



Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |