Exodus - నిర్గమకాండము 10 | View All

1. కాగా యెహోవా మోషేతో ఫరోయొద్దకు వెళ్లుము. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లును, నేను చేయు సూచకక్రియలను ఐగుప్తీయుల యెదుట కనుపరచుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారి యెదుట కలుగజేసిన సూచకక్రియలను

1. And the LORD said to Moses, Go in to Pharaoh: for I have hardened his heart, and the heart of his servants, that I might show these my signs before him:

2. నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరచితిననెను.

2. And that you may tell in the ears of your son, and of your son's son, what things I have worked in Egypt, and my signs which I have done among them; that you may know how that I am the LORD.

3. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరి - హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా - నీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.

3. And Moses and Aaron came in to Pharaoh, and said to him, Thus said the LORD God of the Hebrews, How long will you refuse to humble yourself before me? let my people go, that they may serve me.

4. నీవు నా జనులను పోనియ్య నొల్లనియెడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను.

4. Else, if you refuse to let my people go, behold, to morrow will I bring the locusts into your coast:

5. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును, తప్పించుకొనిన శేషమును, అనగా వడగండ్లదెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును.

5. And they shall cover the face of the earth, that one cannot be able to see the earth: and they shall eat the residue of that which is escaped, which remains to you from the hail, and shall eat every tree which grows for you out of the field:

6. మరియు అవి నీ యిండ్లలోను నీ సేవకులందరి యిండ్లలోను ఐగుప్తీయులందరి యిండ్లలోను నిండిపోవును. నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములో నుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో యెదుట నుండి బయలు వెళ్లెను.

6. And they shall fill your houses, and the houses of all your servants, and the houses of all the Egyptians; which neither your fathers, nor your fathers' fathers have seen, since the day that they were on the earth to this day. And he turned himself, and went out from Pharaoh.

7. అప్పుడు ఫరో సేవకులు అతని చూచి - ఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకా తెలియదా అనిరి.

7. And Pharaoh's servants said to him, How long shall this man be a snare to us? let the men go, that they may serve the LORD their God: know you not yet that Egypt is destroyed?

8. మోషే అహరోనులు ఫరోయొద్దకు మరల రప్పింపబడగా అతడు మీరు వెళ్లి మీ దేవుడైన యెహోవాను సేవించుడి; అందుకు ఎవరెవరు వెళ్లుదురని వారి నడిగెను.

8. And Moses and Aaron were brought again to Pharaoh: and he said to them, Go, serve the LORD your God: but who are they that shall go?

9. అందుకు మోషే - మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెదమనెను.

9. And Moses said, We will go with our young and with our old, with our sons and with our daughters, with our flocks and with our herds will we go; for we must hold a feast to the LORD.

10. అందుకతడు - యెహోవా మీకు తోడై యుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచనగలవారు.

10. And he said to them, Let the LORD be so with you, as I will let you go, and your little ones: look to it; for evil is before you.

11. పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి; మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి.

11. Not so: go now you that are men, and serve the LORD; for that you did desire. And they were driven out from Pharaoh's presence.

12. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చునట్లు ఐగుప్తుదేశముమీద నీ చెయ్యి చాపుము; అవి ఐగుప్తుదేశము మీదకి వచ్చి యీ దేశపు పైరులన్నిటిని, అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటని తినివేయునని చెప్పెను.
ప్రకటన గ్రంథం 9:3

12. And the LORD said to Moses, Stretch out your hand over the land of Egypt for the locusts, that they may come up on the land of Egypt, and eat every herb of the land, even all that the hail has left.

13. మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను.

13. And Moses stretched forth his rod over the land of Egypt, and the LORD brought an east wind on the land all that day, and all that night; and when it was morning, the east wind brought the locusts.

14. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి, అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను.

14. And the locust went up over all the land of Egypt, and rested in all the coasts of Egypt: very grievous were they; before them there were no such locusts as they, neither after them shall be such.

15. ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయే గాని పచ్చని దేదియు మిగిలియుండలేదు.
ప్రకటన గ్రంథం 9:3

15. For they covered the face of the whole earth, so that the land was darkened; and they did eat every herb of the land, and all the fruit of the trees which the hail had left: and there remained not any green thing in the trees, or in the herbs of the field, through all the land of Egypt.

16. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవాయెడలను మీ యెడలను పాపముచేసితిని.

16. Then Pharaoh called for Moses and Aaron in haste; and he said, I have sinned against the LORD your God, and against you.

17. మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా

17. Now therefore forgive, I pray you, my sin only this once, and entreat the LORD your God, that he may take away from me this death only.

18. అతడు ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.

18. And he went out from Pharaoh, and entreated the LORD.

19. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలవలేదు.

19. And the LORD turned a mighty strong west wind, which took away the locusts, and cast them into the Red sea; there remained not one locust in all the coasts of Egypt.

20. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను.

20. But the LORD hardened Pharaoh's heart, so that he would not let the children of Israel go.

21. అందుకు యెహోవా మోషేతో - ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తుదేశముమీద చీకటి చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను.

21. And the LORD said to Moses, Stretch out your hand toward heaven, that there may be darkness over the land of Egypt, even darkness which may be felt.

22. మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తుదేశ మంతయు మూడు దినములు గాఢాంధకార మాయెను.
ప్రకటన గ్రంథం 16:10

22. And Moses stretched forth his hand toward heaven; and there was a thick darkness in all the land of Egypt three days:

23. మూడు దినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.

23. They saw not one another, neither rose any from his place for three days: but all the children of Israel had light in their dwellings.

24. ఫరో మోషేను పిలిపించి - మీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చుననగా

24. And Pharaoh called to Moses, and said, Go you, serve the LORD; only let your flocks and your herds be stayed: let your little ones also go with you.

25. మోషే - మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణలనిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను.

25. And Moses said, You must give us also sacrifices and burnt offerings, that we may sacrifice to the LORD our God.

26. మా పశువులును మాతోకూడ రావలెను. ఒక డెక్కయైనను విడువబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలోనుండి తీసికొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరకమునుపు మాకు తెలియదనెను.

26. Our cattle also shall go with us; there shall not an hoof be left behind; for thereof must we take to serve the LORD our God; and we know not with what we must serve the LORD, until we come thither.

27. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనియ్య నొల్లక యుండెను.

27. But the LORD hardened Pharaoh's heart, and he would not let them go.

28. గనుక ఫరోనా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.
హెబ్రీయులకు 11:27

28. And Pharaoh said to him, Get you from me, take heed to yourself, see my face no more; for in that day you see my face you shall die.

29. అందుకు మోషే - నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను.
హెబ్రీయులకు 11:27

29. And Moses said, You have spoken well, I will see your face again no more.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
మిడతల తెగులు బెదిరించింది, ఫరో తన సేవకులచే కదిలించాడు, ఇశ్రాయేలీయులను విడిచిపెట్టడానికి మొగ్గు చూపాడు. (1-11) 
ఈజిప్టులో సంభవించిన తెగుళ్లు పాపం చేయడం ఎంత చెడ్డదో ప్రజలకు చూపించే మార్గం. దేవునికి వ్యతిరేకంగా పోరాడవద్దని వారు హెచ్చరికగా ఉన్నారు. ఫరో తనను క్షమించమని చెప్పినప్పటికీ, అతను దానిని నిజంగా అర్థం చేసుకోలేదు. తర్వాత జరగబోయే చెడు విషయం మిడతల దండు. ఫారో సహాయకులు మోషేతో ఒప్పందం చేసుకోమని అతనిని ఒప్పించారు, కానీ అది నిజమైన ఒప్పందం కాదు. పురుషులు వెళ్లిపోవచ్చు, కానీ వారి పిల్లలు ఉండవలసిందని ఫరో చెప్పాడు. సాతాను ప్రజలను, ముఖ్యంగా పిల్లలను దేవుని సేవ చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు. చిన్నప్పటి నుండి పిల్లలు దేవుణ్ణి ప్రేమించడం అతనికి నిజంగా ఇష్టం ఉండదు. మన పిల్లలకు దేవుని గురించి బోధించకుండా ఏదో ఒక ఆటంకం కలిగితే, సాతాను మనల్ని మోసగించడానికి ప్రయత్నించడం వల్ల కావచ్చు. పిల్లలు చిన్నప్పటి నుండి దేవుణ్ణి అనుసరించాలని గుర్తుంచుకోవాలి, కానీ వారు చెడు ప్రవర్తనలో ఇరుక్కుపోయి దేవుని గురించి ఆలోచించకుండా ఉండాలని సాతాను కోరుకుంటాడు. సాతాను మన ఆరాధనలో భాగం కావాలని కోరుకుంటాడు, కానీ యేసు దానిని అంగీకరించడు. ఇశ్రాయేలీయులు తమ ప్రియమైన వారిని బందీలుగా పట్టుకుని వెళ్లిపోకుండా చేయడానికి ఫరో ఎలా ప్రయత్నించాడో అలాగే ఉంది. 

మిడతల ప్లేగు. (12-20) 
దేవుడు మోషేకు చేయి చాచమని చెప్పాడు, అప్పుడు మిడతల గుంపు వచ్చింది. వారు చాలా మంది ఉన్నారు, వారిని ఆపడం అసాధ్యం. దేవుడు ఎంత శక్తిమంతుడో దీన్నిబట్టి తెలుస్తుంది. మిడతలు తమ దారిలో ఉన్నవన్నీ తినేశాయి, ప్రజలు తినడానికి ఉద్దేశించిన మొక్కలను కూడా తినేశాయి. సులభంగా తీసివేయబడే వాటి గురించి చింతించకుండా, దేవునితో మనకున్న సంబంధం వంటి శాశ్వతమైన వాటి కోసం పని చేయడంపై మనం దృష్టి పెట్టాలి. మోషే మరియు అహరోనులను తన కొరకు ప్రార్థించమని కోరిన ఫరో అనే నాయకుడు ఉన్నాడు. కొందరు వ్యక్తులు కలత చెందినప్పుడు వారి కోసం ప్రార్థించమని ఇతరులను అడుగుతారు, కానీ వారు తమను తాము ప్రార్థించరు. వారు నిజంగా దేవుణ్ణి ప్రేమించడం లేదని లేదా ఆయనతో మాట్లాడటం ఆనందించరని ఇది చూపిస్తుంది. ఫరో మిడతల సమస్య పోవాలని మాత్రమే కోరుకున్నాడు, కానీ అతను తన చెడు ప్రవర్తనను మార్చుకోవాలని కోరుకోలేదు. దేవుడు కోరుకున్నది చేసే గాలి వల్ల మిడతలు వచ్చాయి. గాలి మనకు స్వేచ్ఛా స్ఫూర్తి లాంటిది, కానీ అది ఎల్లప్పుడూ దేవుని ప్రణాళికను అనుసరిస్తుంది. దేవుడు తన మార్గాలను మార్చుకోవడానికి ఫరోకు అవకాశం ఇవ్వడం ద్వారా అతను దయగలవాడని మరియు క్షమించేవాడని చూపించాడు. మనం నిజంగా పశ్చాత్తాపపడితే, దేవుడు మనపట్ల మరింత దయ చూపిస్తాడు. ఫరో వినలేదు మరియు అతని మొండి మార్గాలకు తిరిగి వెళ్ళాడు మరియు వారి మనస్సాక్షిని విస్మరించే వ్యక్తులు చివరికి వారి స్వార్థ కోరికలకు లొంగిపోతారు. 


దట్టమైన చీకటి యొక్క ప్లేగు. (21-29)
ఈజిప్టులో ప్లేగు ఆఫ్ డార్క్నెస్ అని పిలవబడే ఒక చెడ్డ విషయం జరిగింది. మీరు అనుభూతి చెందేంత చీకటిగా ఉంది మరియు అది మూడు పగళ్ళు మరియు ఆరు రాత్రులు కొనసాగింది. ఫాన్సీ ప్యాలెస్‌లు కూడా చెరసాలలా చీకటిగా ఉన్నాయి. ఇది ఫరోకు విషయాల గురించి ఆలోచించే అవకాశాన్ని ఇచ్చింది, కానీ అతను దానిని తెలివిగా ఉపయోగించలేదు. ఈ చీకటి చెడు విషయాలు జరిగినప్పుడు మరియు ప్రజలు మంచి వాటిని చూడలేరు లేదా ఇతరులకు మంచి పనులు చేయలేరు. సుఖం, మంచితనం వైపు వెళ్లలేక కూరుకుపోయినట్లుంది. చెడ్డ పనులు చేసినందుకు దేవుడు వారిని శిక్షించాడు కాబట్టి కొంతమంది పూర్తిగా చీకటిలో ఉన్నారు. వారి మనస్సులు చాలా గందరగోళంగా ఉన్నాయి, ఇది వారి చుట్టూ చీకటిని కలిగించింది, ఇది ఇంతకు ముందు ఉన్న చీకటి కంటే ఘోరంగా ఉంది. మనం తప్పు చేసినప్పుడు జరిగే చెడు విషయాలకు భయపడాలి. మూడు రోజుల చీకటి చాలా భయానకంగా ఉంటే, ఎప్పటికీ చీకటిలో ఉండటం ఎంత భయానకంగా ఉంటుందో ఊహించండి. మరోవైపు మంచిగా ఉన్న వారి ఇళ్లలో వెలుగులు నింపారు. మనకు మంచి జరుగుతుందని మనం అనుకోకూడదు, వాటి కోసం మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతతో ఉండాలి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను చాలా ప్రేమిస్తాడు. ప్రపంచం చీకటిగా మరియు భయానకంగా ఉన్నప్పటికీ, ఇశ్రాయేలీయులుగా ఉండటం కాంతి మరియు మంచితనాన్ని తెస్తుంది. దేవుడు ఈజిప్షియన్ల కంటే ఇశ్రాయేలీయులకు అనుకూలంగా ఉండాలని ఎంచుకున్నప్పుడు, అది పెద్ద, అందమైన రాజభవనం కంటే చిన్న, పేద ఇంటిని ఎంచుకున్నట్లుగా ఉంది. శాపగ్రస్తుడైన చెడ్డవాని ఇంటికి, ఆశీర్వాదం పొందిన మంచివాడి ఇంటికి చాలా తేడా ఉంది. మోషే మరియు అహరోనులు తమ పిల్లలను తమతో తీసుకువెళ్లడానికి ఫరో అంగీకరించాడు, కాని వారు తమ జంతువులను తీసుకెళ్లడం అతనికి ఇష్టం లేదు. కొన్నిసార్లు చెడు పనులు చేసే వ్యక్తులు దేవునితో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ వారు తమను తాము మోసగించుకుంటారు. దేవునితో విషయాలను సరిదిద్దడానికి నియమాలు సెట్ చేయబడ్డాయి మరియు ప్రజలు దాని గురించి వాదించినప్పటికీ మార్చలేరు. మనం కోరుకున్నది కాకుండా దేవుడు కోరుకున్నది చేయాలి. మనం దేవుణ్ణి సేవించడానికి మనకున్నదంతా ఇవ్వాలి, ఎందుకంటే ఆయన దానిని ఎలా ఉపయోగిస్తాడో మనకు తెలియదు. ఫరో మోషేతో మాట్లాడడం మానేశాడు, అతను ఇంతకు ముందు సహాయం కోరాడు. తమను తాము రక్షించుకోవడానికి చాలా శక్తి ఉన్నప్పుడు ఎవరైనా చంపేస్తామని బెదిరించడం నిజంగా అర్థం. ప్రజలు నిజంగా మొండిగా ఉండి, దేవుడు చెప్పేది విననప్పుడు, వారు నిజంగా చెడ్డ పనులు చేయగలరు. ఈ కారణంగా, మోషే అడిగే వరకు తిరిగి రాలేదు. ప్రజలు దేవుని వాక్యాన్ని విస్మరించినప్పుడు, వారు నిజం కాని వాటిని విశ్వసించడం ప్రారంభించవచ్చు. 


Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |