Exodus - నిర్గమకాండము 28 | View All
Study Bible (Beta)

1. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము.
హెబ్రీయులకు 5:4

ఈజిప్ట్‌నుండి ఇస్రాయేల్ ప్రజలు బయట పడకముందు కుటుంబ పెద్దలు యాజులుగా వ్యవహరించి బలి అర్పించేవారు (ఆదికాండము 8:20 ఆదికాండము 26:25 ఆదికాండము 31:54). నిర్గమకాండం గ్రంథం కాలంలో ఇస్రాయేల్ జాతి అంతటికీ యాజులుగా వ్యవహరించడానికి ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు (నిర్గమకాండము 29:9). అహరోను ఈ యాజులలో ప్రధాని. ఈ యాజుల సేవ ఏమంటే ప్రజల పక్షాన అర్పణలు ఇవ్వడం, సన్నిధి గుడారం పనులు చూసుకోవడం, దేవుని ఎదుట తమ ప్రజలకు ప్రతినిధులుగా ఉండడం. క్రొత్త ఒడంబడిక సంఘంలో విశ్వాసుల బృందంలో దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్న యాజులెవరూ లేరు. క్రీస్తులో విశ్వాసులందరూ యాజులే (1 పేతురు 2:9 ప్రకటన గ్రంథం 1:6). క్రీస్తు ప్రముఖ యాజి (హెబ్రీయులకు 4:14-16 హెబ్రీయులకు 9:24 హెబ్రీయులకు 10:19-22). ప్రముఖయాజిగా క్రీస్తే తనను తాను బలిగా దేవునికి అర్పించుకున్నాడు. ఈ ఒక్క బలీ ఏ లోపం లేనిది, పరిపూర్ణమైనది. ఇది దేవుని ప్రజల పాపాలన్నిటినీ శాశ్వతంగా తొలగించివేసింది. ఈ కాలంలో యాజులైన విశ్వాసులకు జంతు బలులు చెయ్యవలసిన అవసరమేదీ లేదు. అయితే ఇప్పటికీ వారు అర్పించవలసినవి కొన్ని ఉన్నాయి – చావుకైనా బ్రతుకుకైనా దేవుని వశంలో ఉండవలసిన వారి దేహాలు (రోమీయులకు 12:1-2 ఫిలిప్పీయులకు 2:17 2 తిమోతికి 4:6 1 యోహాను 3:16), దేవునికి స్తుతి ఆరాధన (హెబ్రీయులకు 13:15), వారికి ఉన్నవన్నీ (రోమీయులకు 12:13 గలతియులకు 6:6 గలతియులకు 6:10 తీతుకు 3:14 హెబ్రీయులకు 13:2 హెబ్రీయులకు 13:6 3John 1:5-8), వారి సేవ హెబ్రీయులకు 3:16 మొదలైనవి. దేవుని సన్నిధిని వారు నేరుగా సమీపించవచ్చు. పాత ఒడంబడిక కాలం యాజులలాగే ఇతరుల కోసం విజ్ఞాపనలు చేయడం అనే వారి సేవ కొనసాగుతూ ఉంది ఎఫెసీయులకు 6:18-20 1 తిమోతికి 2:1-2.

2. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.

నిర్గమకాండము 29:29 నిర్గమకాండము 31:10 నిర్గమకాండము 39:1-31 లేవీయకాండము 8:7-9 లేవీయకాండము 8:30.

3. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేకహృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.

నిర్గమకాండము 31:3 నిర్గమకాండము 331:6 నిర్గమకాండము 35:25 నిర్గమకాండము 35:31-35 నిర్గమకాండము 36:1 యెషయా 11:2 1 కోరింథీయులకు 12:7-11 ఎఫెసీయులకు 1:17.

4. పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.

5. వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననారను తీసికొని

6. బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్ర కారునిపనిగా చేయవలెను.

“ఏఫోదు”– నిర్గమకాండము 39:2-7 లేవీయకాండము 8:7.

7. రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడియుండును.

8. మరియఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.

9. మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున

10. ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.

11. ముద్ర మీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.

12. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకముకొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును.

“యెహోవా సన్నిధానంలో”– నిర్గమకాండము 28:29-30 నిర్గమకాండము 39:6-7. అహరోను తన భుజాలమీద ఆ పేర్లు ధరించడం మన ప్రముఖయాజి అయిన క్రీస్తు దేవుని ఎదుట మన పేర్లను ధరించడంలాంటిది. భుజాలు బలానికి చిహ్నం (యెషయా 9:6 లూకా 15:4-5). యేసు తన శక్తి వల్ల ఆయన తన ప్రజలను భరిస్తూ, పోషిస్తూ దేవుడు వారిని ఎడతెగకుండా జ్ఞాపకం ఉంచుకునేలా చేస్తున్నాడు (హెబ్రీయులకు 7:24-25).

13. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను;

14. సూత్రములవలె అల్లికపనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను.

15. మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలెను. ఏఫోదుపనివలె దాని చేయవలెను; బంగారు తోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలు తోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను.

“వక్షపతకం”– నిర్గమకాండము 39:8-21. ఇక్కడి హీబ్రూ పదాలను బట్టి ప్రత్యేకంగా ఏ రత్నాలో చెప్పడం కష్టం. ఒక్కొక్క రత్నంలో ఇస్రాయేల్‌వారి ఒక్కొక్క గోత్ర నామం ఉంది. వక్షపతకాన్ని ప్రముఖయాజి అనురాగ స్థానమైన గుండెమీద కట్టుకోవాలి. మన ప్రముఖయాజి క్రీస్తు కూడా పరలోకంలో ఇప్పుడు తన విశ్వాసులందరి పేర్లు తన హృదయంపై రాసుకున్నాడు. ఆయన తన బలప్రభావాల మూలంగా వారిని పోషించడమే కాదు (9-14 వ) దేవుని సమక్షంలో వారిని ఎడతెరిపి లేకుండా ప్రేమిస్తున్నాడు.

16. అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలదై యుండవలెను.

17. దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములుగల పంక్తి మొదటిది;

18. పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది;

19. గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములుగల పంక్తి మూడవది;

20. రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.

21. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరులచొప్పున పండ్రెండుండవలెను. ముద్రమీద చెక్కినవాటివలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను.
ప్రకటన గ్రంథం 21:12-13

22. మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను.

23. పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి

24. ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను.

25. అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను.

26. మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను.

27. మరియు నీవు రెండు బంగారు ఉంగర ములుచేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పు నొద్ద, దాని యెదుటి ప్రక్కకు దిగువను, ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను.

28. అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదునుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను.

29. అట్లు అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్లునప్పుడు అతడు తన రొమ్ముమీద న్యాయవిధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను.

30. మరియు నీవు న్యాయవిధాన పతకములో ఊరీము తుమీ్మము అనువాటిని ఉంచవలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును.

“తుమ్మీం”– లేవీయకాండము 8:8 సంఖ్యాకాండము 27:21 ద్వితీయోపదేశకాండము 33:8 1 సమూయేలు 28:6 ఎజ్రా 2:63. ఊరీం, తుమ్మీం అనే పదాలకు బహుశా “కాంతులు, పరిపూర్ణతలు” అని అర్థం కావచ్చు. ప్రజలకేదన్నా సందేహం కలిగితే దేవుడు వీటి మూలంగా వారికి వెలుగు దయ చేశాడు. బహుశా అది అనుకూలమైన జవాబైతే ఒక రత్నం ధగధగలాడేది, అనుకూలం కాకపోతే రెండోది మెరిసేది అని భావించవచ్చు గాని ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడైతే దేవుని సంకల్పాన్ని దేవుని ఆత్మ విశ్వాసులకు వెల్లడి చేస్తాడు. బైబిలు కూడా దాన్ని “కాంతులు, పరిపూర్ణతలు”గా వెల్లడిస్తుంది.

31. మరియఏఫోదు నిలువుటంగీని కేవలము నీలిదారముతో కుట్టవలెను.

“నిలువుటంగీ”– నిర్గమకాండము 39:22-26. తన విధి నిర్వహణలో తన ప్రాణం పోకుండా ఉండేలా ప్రముఖయాజి అయినా సరే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నియమించిన రీతిని తు.చ. తప్పక అనుసరించాలి. సన్నిధి గుడారం సేవకు సంబంధించినంత వరకు మరణశిక్షకు గురి చేసే పొరపాట్లు ఉన్నాయి – గుడారంలో సేవ చేసే వేళ, లేదా గుడారంలోకి ప్రవేశించే వేళ యాజి దుస్తులు ధరించక పోవడం (నిర్గమకాండము 28:43), ప్రవేశించకముందు నీళ్ళతో కడుక్కోకపోవటం (నిర్గమకాండము 30:20-21), అభిషేక తైలాన్ని తప్పుగా ఉపయోగించడం (నిర్గమకాండము 30:33), తన స్వంతానికి పరిమళ హోమాన్ని చేసుకోవడం (నిర్గమకాండము 30:37-38), అపవిత్రంగా ఉండి అర్పణను తినడం (లేవీయకాండము 7:20-21), అర్పణల రక్తాన్ని గానీ కొవ్వును గానీ తినడం (లేవీయకాండము 7:25-27), సంవత్సరంలో ఒక్కసారి తప్ప రెండో సారి అతి పవిత్ర స్థలంలో ప్రవేశించడం (లేవీయకాండము 16:2), అతి పవిత్ర స్థలంలో పరిమళ ధూపాన్ని వెయ్యకపోవడం (లేవీయకాండము 16:13), సన్నిధి గుడారం ఆవరణలో గాక వేరే స్థలంలో అర్పణలు చెయ్యడం (లేవీయకాండము 7:4-14), అర్పణలు చేసిన తరువాత 3వ రోజున వాటిని తినడం (లేవీయకాండము 19:7-8), సన్నిధి గుడారంలోకి రాకూడనివారు వచ్చి పనులు చెయ్యడం (సంఖ్యాకాండము 1:51), అలాంటివారు దైవనివాసాన్ని సమీపించడం (సంఖ్యాకాండము 3:10), పవిత్రమైన వస్తువులను ముట్టుకోవడం (సంఖ్యాకాండము 4:15). దేవునికి చెందినవి ఎంత పవిత్రాలో, ఆయన ఆరాధనలోనూ సేవలోనూ మనుషులెంత జాగ్రత్తగా ఉండాలో ఇదంతా తెలియజేస్తున్నది.

32. దానినడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంఠ కవచ రంధ్రమువలె దాని రంధ్రముచుట్టు నేతపనియైన గోటు ఉండవలెను.

33. దాని అంచున దాని అంచులచుట్టు నీల ధూమ్ర రక్తవర్ణములుగల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగీ చుట్టు తగిలింపవలెను.

34. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మపండును ఆ నిలువుటంగీ క్రింది అంచున చుట్టు ఉండవలెను.

35. సేవచేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించునప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను.

36. మరియు నీవు మేలిమి బంగారు రేకుచేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను.

“రేకు”– నిర్గమకాండము 39:30-31 లేవీయకాండము 8:9. అహరోను ఈ ప్రత్యేకమైన పనికోసం వేరుచేయబడ్డాడనీ, దేవుని ఎదుట తన ప్రజలకు అతనే ప్రతినిధి అనీ అహరోనుకు అస్తమానమూ గుర్తు చేస్తూ ఉండడానికే దేవుడు దీన్ని నియమించాడు.

37. అది పాగామీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను.

38. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధ మైనవాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను; వారు యెహోవా సన్నిధిని అంగీక రింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను.

39. మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను. సన్న నారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను.

40. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను; వారికి దట్టీలను చేయవలెను; వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్లాయిలను వారికి చేయవలెను.

వ 4; నిర్గమకాండము 39:27-28 నిర్గమకాండము 39:41 లేవీయకాండము 8:13.

41. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను; వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకముచేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను.

నిర్గమకాండము 29:1-29 నిర్గమకాండము 30:30 నిర్గమకాండము 40:15 లేవీయకాండము 8:1-36 లేవీయకాండము 10:7 హెబ్రీయులకు 5:1-4.

42. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను.

నిర్గమకాండము 39:28 లేవీయకాండము 6:10 లేవీయకాండము 16:4.

43. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధస్థలములో సేవచేయుటకు బలిపీఠమును సమీపించునప్పుడైనను, వారు దోషులై చావక యుండునట్లు అది అహరోనుమీదను అతని కుమారులమీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ.

నిర్గమకాండము 20:26 ప్రముఖయాజి దుస్తులు మహిమ, సౌందర్యం కోసం (2,40 వచనాలు). ఇప్పుడు పరలోకంలో ప్రముఖయాజిగా ఉన్న క్రీస్తు చేస్తున్న పనుల వైభవానికి ఇవి గుర్తులు. క్రొత్త ఒడంబడిక కింద యాజులైన విశ్వాసులకు ప్రత్యేకమైన దుస్తులంటూ ఏమీ లేవు. వారి పవిత్ర జీవనమే దేవుడు వారిని ఇతరులనుండి వేరుపరచడానికి గుర్తు, అదే వారి మహిమ, వారి అందం.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 28 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
అహరోను మరియు అతని కుమారులు యాజకుని కార్యాలయానికి, వారి వస్త్రాలను విడిచిపెట్టారు. (1-5) 
పూర్వం కుటుంబ పెద్దలు కూడా పూజారులే దేవుడికి ప్రత్యేక కానుకలు సమర్పించేవారు. కానీ తరువాత, ఆరోన్ కుటుంబానికి చెందిన ఒక కుటుంబం మాత్రమే యాజకులుగా ఉండటానికి అనుమతించబడింది. వారు పవిత్రంగా మరియు దేవుని కోసం ప్రత్యేకించబడ్డారని చూపించే ప్రత్యేక బట్టలు ధరించారు. మత పెద్దలు పవిత్రమైన మార్గంలో ప్రవర్తించడం ఎంత ముఖ్యమో కూడా ఈ బట్టలు చిహ్నంగా ఉన్నాయి. యేసుక్రీస్తు కూడా గొప్ప ప్రధాన యాజకుడు, అతను పవిత్రుడు మరియు దేవుని కోసం ప్రత్యేకించబడ్డాడు. ఈ రోజుల్లో, దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మనం అందమైన బట్టలు ధరించాల్సిన అవసరం లేదు. బదులుగా, మనం మంచి దృక్పథాలను కలిగి ఉండటం మరియు ఇతరులతో దయగా ఉండటంపై దృష్టి పెట్టాలి. 

ఏఫోద్. (6-14) 
ప్రధాన పూజారి ఎఫోడ్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన ఫాన్సీ కోటు ధరించాడు, ఇతర పూజారులు సరళమైన వాటిని ధరించారు. ఎఫోడ్ పొట్టిగా ఉంది మరియు స్లీవ్‌లు లేవు మరియు బెల్ట్‌తో శరీరానికి దగ్గరగా ఉంచబడింది. భుజాలపై ఇజ్రాయెల్ ప్రజల పేర్లు చెక్కబడిన విలువైన రాళ్లతో చేసిన ప్రత్యేక బటన్లు ఉన్నాయి. మన ప్రధాన యాజకుడైన యేసు మనలను దేవునికి జ్ఞాపికగా ఎలా అందజేస్తాడో అలాగే ఉంది. ఏఫోదుకు అతుకులు లేవు మరియు యేసు కోటు వలె పై నుండి క్రిందికి తయారు చేయబడింది. ఏఫోదుపై ఉన్న బంగారు గంటలు పరిశుద్ధులు చేసే మంచి పనులను సూచిస్తాయి మరియు దానిమ్మపండ్లు వారు ఉత్పత్తి చేసే మంచి వస్తువులను సూచిస్తాయి.

బ్రెస్ట్ ప్లేట్, ది ఉరీమ్ మరియు తుమ్మీమ్. (15-30) 
ప్రధాన యాజకుడు రొమ్ము కవచం అని పిలువబడే ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరించాడు, అది చాలా ఫాన్సీగా ఉంది మరియు దేవుని ప్రజల ప్రతి గోత్రం పేర్లతో విలువైన రాళ్లను కలిగి ఉంది. ఒక తెగ చిన్నది అయినా లేదా చాలా ధనవంతుడు కాకపోయినా, అది దేవునికి ఇప్పటికీ ముఖ్యమైనది. యేసు తన అనుచరులందరినీ ప్రేమిస్తున్నట్లుగా మరియు శ్రద్ధగా చూసుకున్నట్లే, ప్రధాన పూజారి తన భుజాలపై మరియు ఛాతీపై గోత్రాల పేర్లను ధరించాడు. దేవుడు మనలను నిలబెట్టడానికి బలమైన బాహువులను మాత్రమే కలిగి ఉన్నాడు, కానీ అతను మనలను చాలా ప్రేమిస్తాడు మరియు మనలను తన హృదయానికి దగ్గరగా ఉంచుకుంటాడు. మనం దేవునితో మాట్లాడినప్పుడు ఇది చాలా ఓదార్పునిస్తుంది. గతంలో, ప్రజలు ఖచ్చితంగా తెలియనప్పుడు దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో గుర్తించడానికి ఊరిమ్ మరియు తుమ్మీమ్ అని పిలిచేవారు. వారు ఒక వెలుగులా మరియు ఏది సరైనదో తెలుసుకోవడానికి మార్గంగా ఉన్నారు. కొందరు అవి ప్రధాన పూజారి ధరించిన పన్నెండు ప్రత్యేక రాళ్లని అనుకుంటారు. కానీ ఇప్పుడు, దేవుని నుండి వినడానికి మరియు మనం ఏమి చేయాలనుకుంటున్నాడో అర్థం చేసుకోవడానికి సహాయం చేసే యేసు మనకు ఉన్నాడు. హెబ్రీయులకు 1:1-2 యోహాను 1:18 యేసు ఒక ప్రకాశవంతమైన మరియు నమ్మదగిన కాంతి వంటివాడు. ఎప్పుడూ నిజమే చెబుతాడు. మనం తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే సత్య స్ఫూర్తిని కూడా ఆయన మనకు ఇస్తాడు.

ఎఫోడ్ యొక్క వస్త్రం, మిట్రే యొక్క ప్లేట్. (31-39) 
పూజారి అయిన ఆరోన్ ధరించవలసిన ప్రత్యేక వస్త్రాల వస్త్రం పొడవుగా ఉంది మరియు అతని మోకాళ్ల వరకు ఉంది, కానీ చేతులు లేవు. దేవుని సేవించేటప్పుడు అతడు ఈ బట్టలు ధరించాలి. మనం కూడా ప్రభువును గౌరవంగా సేవించాలి మరియు మన తప్పులకు మనం శిక్షించబడతామని తెలుసుకోవాలి. అహరోన్ తన నుదిటిపై "ప్రభువుకు పవిత్రత" అని వ్రాసిన ప్రత్యేక బంగారు పళ్ళెం ఉంది. దేవుడు పవిత్రుడని మరియు పూజారులు కూడా పవిత్రంగా మరియు దేవునికి అంకితభావంతో ఉండాలని ఇది గుర్తు చేసింది. ఇది మనపై శాశ్వతమైన గుర్తులా ఉండాలి, మనం దేవునికి చెందినవారమని మరియు ఆయనకు అంకితం చేసుకున్నామని చూపిస్తుంది. యేసు మన ప్రత్యేక పూజారి లాంటివాడు, మన తప్పులను దేవుడు క్షమించేలా సహాయం చేస్తాడు. యేసు మరియు ఆయన మన కోసం చేసిన దాని వల్ల మనం దేవుణ్ణి సంతోషపెట్టవచ్చు.

ఆరోన్ కుమారులకు వస్త్రాలు. (40-43)
పూజారి ధరించే బట్టలు యేసు ఎంత మంచివాడో సూచిస్తాయి. మనం దేవుడిని కలిసినప్పుడు ఆ బట్టలు వేసుకోకపోతే, మనం చేసిన చెడు పనులకు శిక్ష అనుభవించి చనిపోతాము. కాబట్టి, జాగ్రత్తగా ఉండడం మరియు ఎల్లప్పుడూ సరైనది చేయడం మంచిది. ప్రకటన గ్రంథం 16:15 దేవునిచే ఎన్నుకోబడిన మరియు చాలా ప్రత్యేకమైన ప్రధాన పూజారి అని పిలువబడే వ్యక్తిని కలిగి ఉండటం మన అదృష్టం. వారు దేవుని చేత శక్తివంతులుగా మరియు పరిపూర్ణులుగా చేయబడినందున వారు తమ పనిలో నిజంగా మంచివారు. మనం సంతోషంగా ఉండాలి ఎందుకంటే మనకు ప్రధాన యాజకుడు దేవునితో మాట్లాడగలగాలి మరియు ఆయనచే అంగీకరించబడాలి. మంచి ప్రతిదీ ప్రధాన పూజారి నుండి వస్తుంది మరియు వారిలా ఉండటం అందంగా ఉంటుంది. ప్రధాన యాజకుని ప్రేమ మరియు కనికరం కారణంగా మనం దేవునితో మాట్లాడటానికి ధైర్యంగా భావించాలి మరియు మనకు అవసరమైనప్పుడు సహాయం కోసం అడగాలి. 



Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |