Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఫరోయొద్దకు వెళ్లి - నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.
నిర్గమకాండము 8:1.
2. నీవు వారిని పోనియ్యనొల్లక ఇంకను వారిని నిర్బంధించినయెడల
3. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దుల మీదికిని గొఱ్ఱెల మీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును.
4. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని
నిర్గమకాండము 8:22-23.
5. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను.
6. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు.
దేవుని తీర్పు ఎదుట ఈజిప్ట్ దేవుళ్ళకు శక్తి ఏమీ లేదు. ఈజిప్ట్వారి విలువైన మందలకూ పాడి పశువులకూ ఇలాంటి విపత్తును రాకుండా చేయలేకపోయారు.
7. ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను.
ఇదంతా దేవుని మూలంగానే జరుగుతున్నదని తెలిసినా ఫరో ఆయనకు లొంగలేదు (దానియేలు 5:22-23 పోల్చి చూడండి).
8. కాగా యెహోవా - మీరు మీ పిడికిళ్లనిండ ఆవపు బుగ్గి తీసికొనుడి, మోషే ఫరో కన్నులయెదుట ఆకాశమువైపు దాని చల్లవలెను.
ఈజిప్ట్వారు గాలి దేవుణ్ణి కూడా పూజించారు (పేరు “షూ”). ఇప్పుడు యెహోవా దేవుడు తాను వాయుమండలం మీద అధిపతినని నిరూపించుకుంటున్నాడు.
9. అప్పుడు అది ఐగుప్తు దేశమంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యుల మీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పెను.రోమీయులకు 16:2
10. కాబట్టి వారు ఆవపుబుగ్గి తీసికొనివచ్చి ఫరో యెదుట నిలిచిరి. మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను.రోమీయులకు 16:2
11. ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషే యెదుట నిలువ లేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికినిపుట్టెను.
నిర్గమకాండము 7:11 నిర్గమకాండము 8:18-19 చూడండి. ఈ గ్రంథంలో మంత్రగాళ్ళు కనబడడం ఇదే ఆఖరు సారి. ఇది వారి ఘోరమైన ఓటమిని తెలియజేస్తున్నది.
12. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను.రోమీయులకు 9:18
నిర్గమకాండము 4:21 నోట్ చూడండి.
13. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను - హెబ్రీయుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరోయెదుట నిలిచినన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.
14. సమస్త భూమిలో నావంటి వారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈ సారి నేను నా తెగుళ్ళన్నియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని పంపెదను;
నిర్గమకాండము 8:10.
15. భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును.
16. నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని.ప్రకటన గ్రంథం 9:17
నిర్గమకాండము 4:21 నోట్; నిర్గమకాండము 7:5 నోట్; రోమీయులకు 9:17. దేవుడు ఈజిప్ట్ దాస్యం నుంచి తన ప్రజలను విడిపించిన వార్త చాలా దూరం ప్రాకింది (నిర్గమకాండము 15:14-16). మిద్యాను ప్రాంతంలో యిత్రోకు ఈ విషయం తెలిసింది (నిర్గమకాండము 18:4). యూఫ్రటీస్ నదీ ప్రాంతంలో నివసించే బిలాము విన్నాడు ({Num
17. నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద ఆతిశయపడుచున్నావు.
ఫరోకు ఉన్న గర్వం, తలబిరుసుతనమే అతని పతనానికి కారణం – నిర్గమకాండము 10:3 కీర్తనల గ్రంథము 101:5 కీర్తనల గ్రంథము 119:21 సామెతలు 16:18 సామెతలు 21:4 లూకా 1:51 యాకోబు 4:6.
18. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను; ఐగుపు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు.
19. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రముచేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యునిమీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.
20. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను.
సామెతలు 13:13.
21. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.
22. యెహోవా - నీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తుదేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పెను.
23. మోషే తన కఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను.
ప్రకృతి శక్తులకు నాధుడుగా యెహోవా ఇక్కడ తనను తాను కనపరచుకుంటున్నాడు. ఈజిప్ట్వాళ్ళ “గాలివాన దేవుడికి” శక్తి లేదని తేలింది.
24. ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు.ప్రకటన గ్రంథం 8:7, ప్రకటన గ్రంథం 11:19
25. ఆ వడగండ్లు ఐగుప్తుదేశమందంతట మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగ గొట్టెను.
26. అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు.
4వ వచనం; నిర్గమకాండము 8:22-23 నిర్గమకాండము 9:4.
27. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి - నేను ఈసారి పాపము చేసియున్నాను; యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులును దుర్మార్గులము;
పాపం చేశానని ఫరో కూడా ఒప్పుకుంటున్నాడు (నిర్గమకాండము 10:16). ఇలాంటి విషయం బైబిల్లో చాలా చోట్ల కనిపిస్తూవుంది (సంఖ్యాకాండము 14:40 సంఖ్యాకాండము 22:34 యెహోషువ 7:20 1 సమూయేలు 15:24 2 సమూయేలు 12:13 2 సమూయేలు 24:10 మత్తయి 27:4). అయితే ఇలా ఒప్పుకోవడం హృదయ పూర్వకమై ఉండాలి. అయితే పశ్చాత్తాపంతోబా
28. ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగాఅపో. కార్యములు 8:24
నిర్గమకాండము 8:8 నిర్గమకాండము 8:28.
29. మోషే అతని చూచి - నేను ఈ పట్టణమునుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవావైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును.
భూమి ఇస్రాయేల్ప్రజల ప్రభువైన యెహోవాదే. మరే దేవునిదీ వేరెవరిదీ కాదు. నిర్గమకాండము 19:5 నిర్గమకాండము 20:11 కీర్తనల గ్రంథము 24:1 కీర్తనల గ్రంథము 50:10-12 కీర్తనల గ్రంథము 89:11 1 కోరింథీయులకు 10:26.
30. అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను.
ఫరోలోని ఆత్మవంచననూ కపటాన్నీ మోషే గ్రహించాడు.
31. అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెను గాని
32. గోధుమలు మెరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్ట బడలేదు.
33. మోషే ఫరోను విడిచి ఆ పట్టణమునుండి బయలు వెళ్లి యెహోవావైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములును వడగండ్లును నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియుట మానెను.
34. అయితే ఫరో వర్షమును వడగండ్లును ఉరుములును నిలిచిపోవుట చూచి, అతడును అతని సేవకులును ఇంక పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకొనిరి.
నిర్గమకాండము 8:15 నిర్గమకాండము 8:31-32. సత్యాన్నీ, నిజమైన దేవుణ్ణీ తెలుసుకోవాలన్న ఆశ ఫరోకు లేదు. మానవ హృదయంలో దేవుని పట్ల చెప్పరానంత విరోధ భావం ఉంది (యోహాను 3:19-20 యోహాను 15:24-25 రోమీయులకు 1:30 రోమీయులకు 8:7 యాకోబు 4:4). ఈ విరోధభావాన్ని ఫరో పూర్తిగా బయట పెట్టుకున్నాడు.
35. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యక పోయెను.