Proverbs - సామెతలు 6 | View All
Study Bible (Beta)

1. నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల

ఎవరైనా అప్పు తీసుకుంటే ఒకవేళ అతడు అది తీర్చలేకపోతే నేనే తీరుస్తానని మరొకడు బాధ్యత వహించడం, లేక అలాంటివే వేరే బాధ్యతలేవైనా ఉంటే వాటి గురించి ఈ వచనాలు చెప్తున్నాయి. ఇలా చెయ్యడం తెలివి తక్కువతనమని జ్ఞాని అంటున్నాడు (సామెతలు 17:18). ఇది పేదరికానికీ, స్వతంత్రం కోల్పోవడానికీ (సామెతలు 11:15; సామెతలు 22:26-27) దారి తీస్తుంది.

2. నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు

3. నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము.

4. ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.

5. వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.

6. సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.

సామెతలు గ్రంథంలో సోమరితనం గురించి చాలా చోట్ల రాసి ఉంది. సోమరి లక్షణాలను, అందువల్ల వచ్చే ఫలితాలను నేర్చుకుంటాం (సామెతలు 10:26; సామెతలు 13:4; సామెతలు 15:19; సామెతలు 19:24; సామెతలు 20:4; సామెతలు 22:13; సామెతలు 24:30-34; సామెతలు 26:13-16). ఎలాంటి ప్రాధాన్యతా లేని అల్ప ప్రాణి చీమకు కూడా సోమరికంటే ఎక్కువ బుద్ధి ఉంది (వ 6).

7. వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను

8. అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.

9. సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?

10. ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు

11. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.

12. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును దుష్టుడునై యున్నాడు

ఈ రకమైన పోకిరీవాడు తన కపటం, మోసం, కుట్రల చేత ఇతరులను నాశనం చేయబూనుకుంటాడు. న్యాయ బద్ధమైన రీతిలో వాడి అంతం ఉంటుంది. కీర్తనల గ్రంథము 18:25-26 నోట్.

13. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగచేయును వ్రేళ్లతో గురుతులు చూపును.

14. వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును.

15. కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండ ఆ క్షణమందే నలుగగొట్టబడును.

16. యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు

ఈ మాటలను మన హృదయంపై రాసుకొని అనుదినం వాటిని చదువుతూ ఉందాం. దేవునికి అసహ్యమైన వాటిని అనుసరించడం, ఆయన ద్వేషించేవాటిని ప్రేమించడం చెప్పరాని పిచ్చితనం.

17. అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును

“గర్వం”– కీర్తనల గ్రంథము 10:4-5; కీర్తనల గ్రంథము 18:27; కీర్తనల గ్రంథము 101:5; యెషయా 13:11 మొ।।. “అబద్ధాలాడే”– సామెతలు 12:22; సామెతలు 19:22; కీర్తనల గ్రంథము 58:3; కీర్తనల గ్రంథము 62:4; కీర్తనల గ్రంథము 63:11; కీర్తనల గ్రంథము 101:7; యోహాను 8:44; కొలొస్సయులకు 3:9; ప్రకటన గ్రంథం 21:8. ఇది సత్య స్వరూపియైన ఏకైక దేవునికి అత్యంత హేయకరమైన పాపం. కానీ ఇది మనుషుల్లో సామాన్యంగా కనిపిస్తూ ఉంటుంది. “రక్తం”– సామెతలు 1:16; ద్వితీయోపదేశకాండము 19:10; యెషయా 1:21; యెషయా 59:7.

18. దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును

“హృదయం”– సామెతలు 24:2; యెషయా 65:2; ఆదికాండము 6:5. “పాదాలు”– సామెతలు 1:16; యెషయా 59:7; రోమీయులకు 3:15.

19. లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.

“అబద్ధాలు”– సామెతలు 12:17-18; సామెతలు 25:18; నిర్గమకాండము 20:16. దేవునికి ఏడు విషయాలంటే అసహ్యం. వాటిలో రెండు విషయాలు అబద్ధాల గురించే. బైబిలులో దేవుడు అబద్ధాలను ఇంత ఖచ్చితంగా ఖండిస్తాడు. “జగడాలు”– సామెతలు 15:18; జెకర్యా 8:17; 1 కోరింథీయులకు 3:3; గలతియులకు 5:19-20; ఫిలిప్పీయులకు 2:2; కీర్తనల గ్రంథము 133:1.

20. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.

సామెతలు 1:8; సామెతలు 3:21.

21. వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.

సామెతలు 3:3; సామెతలు 7:1-3; ద్వితీయోపదేశకాండము 6:8.

22. నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.

సామెతలు 4:11.

23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.

సామెతలు 10:17; కీర్తనల గ్రంథము 19:8; కీర్తనల గ్రంథము 119:105.

24. చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును.

సామెతలు 5:9-21 చూడండి.

25. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము.

“ఆశించకు”– నిర్గమకాండము 20:17; మత్తయి 5:28; 2 పేతురు 1:4.

26. వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును.

సామెతలు 5:10; సామెతలు 7:22-23.

27. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?

28. ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా?

29. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.

30. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా.

31. వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను.

32. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే

సామెతలు 7:7; సామెతలు 9:4, సామెతలు 9:16; 1 కోరింథీయులకు 6:18. వ్యభిచారి దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే గాక మనుషుల ఎదుటా, దేవుని ఎదుటా సిగ్గు, శిక్షల విషయమైన అపాయంలోకి చొరబడు తున్నాడు. అంతేకాక తన శరీరానికి వ్యతిరేకంగా తానే పాపం చేస్తాడు. ఇదంతా క్షణిక సుఖం కోసమే. ఇలాంటివాడు మూర్ఖుడు కాకపోతే మరేమిటి?

33. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు.

34. భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు.

35. ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Proverbs - సామెతలు 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ర్యాష్ ష్యూరిటీకి వ్యతిరేకంగా హెచ్చరికలు. (1-5) 
దేవుని బోధలకు అనుగుణంగా జీవించడం మన ప్రస్తుత జీవితంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మన భౌతిక సంపద మనకు అప్పగించబడింది మరియు దానిని ఎలా ఉపయోగించాలో మనం ప్రభువుకు జవాబుదారీగా ఉంటాము. తొందరపాటు వెంచర్లు లేదా ప్రణాళికలతో మనల్ని ఇబ్బందులు, ప్రలోభాలకు గురిచేయడం సరైన మార్గం కాదు. ఒక వ్యక్తి తన సామర్థ్యాన్ని మరియు తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్న దానికంటే ఎక్కువ మొత్తం కోసం హామీదారుగా ఎప్పటికీ మారకూడదు, అది వారి కుటుంబానికి హాని కలిగించదని నిర్ధారించుకోండి. ప్రతి నిబద్ధతను వ్యక్తిగత రుణంగా చూడాలి.
తోటి మానవుల నుండి క్షమాపణ కోరడానికి మనం అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, దేవుని నుండి క్షమాపణ కోరడంలో మనం మరింత శ్రద్ధ వహించాలి. ఆయన ముందు మిమ్మల్ని మీరు వినయం చేసుకోండి, మీ న్యాయవాదిగా క్రీస్తుతో దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకోండి మరియు మీ పాపాల క్షమాపణ మరియు ఆధ్యాత్మిక ఆపదల నుండి రక్షణ కోసం హృదయపూర్వకంగా ప్రార్థించండి.

బద్ధకానికి మందలింపు. (6-11)
ఒకరి వ్యాపారంలో శ్రద్ధ వహించడం అనేది తెలివైన చర్య మరియు ప్రతి ఒక్కరికి నైతిక బాధ్యత. ఈ శ్రద్ధ కేవలం ప్రాపంచిక సంపదలను సాధించడమే కాదు, ఇతరులకు భారంగా మారకుండా లేదా సమాజానికి అవమానం కలిగించకుండా చూసుకోవాలి. వినయపూర్వకమైన చీమ కూడా సోమరి వ్యక్తులతో పోల్చినప్పుడు శ్రద్ధకు ఒక నమూనాగా పనిచేస్తుంది, మనకు విలువైన పాఠాలు నేర్పుతుంది మరియు మన లోపాలను గుర్తు చేస్తుంది.
కాలక్రమేణా, నిష్క్రియ మరియు స్వీయ-భోగ అలవాట్లు ప్రజల జీవితాల్లో పాతుకుపోతాయి. పర్యవసానంగా, జీవితం జారిపోతుంది మరియు పేదరికం, మొదట్లో దూరమై, ముందుకు సాగుతున్న ప్రయాణికుడిలాగా క్రమంగా దగ్గరవుతుంది. అది చివరకు వచ్చినప్పుడు, అది బలీయమైన విరోధిగా కనిపిస్తుంది, ప్రతిఘటించలేని శక్తివంతంగా కనిపిస్తుంది.
ఈ సూత్రాలను ఆత్మకు సంబంధించిన విషయాలకు కూడా అన్వయించవచ్చు. చాలా మంది పాపపు నిద్రతో ఆకర్షితులవుతారు మరియు ప్రాపంచిక ఆనందం యొక్క భ్రమలతో బంధించబడ్డారు. అలాంటి వ్యక్తులను వారి ఆధ్యాత్మిక నిద్ర నుండి లేపడానికి మనం ప్రయత్నం చేయకూడదా? మన స్వంత మోక్షాన్ని కాపాడుకోవడానికి మనం శ్రద్ధగా పని చేయకూడదా?

దేవునికి అసహ్యకరమైన ఏడు విషయాలు. (12-19) 
పనిలేకుండా ఉన్నవారు మరియు సోమరిపోతులు తమ నిష్క్రియాత్మకతకు ఖండించబడటానికి అర్హులైతే, తప్పులో చురుకుగా పాల్గొనే వారు ఎంత ఎక్కువగా ఉంటారు? అటువంటి వ్యక్తి యొక్క వివరణను పరిగణించండి: వారు తెలివిగా మరియు ఉద్దేశపూర్వకంగా ప్రతిదీ చెబుతారు మరియు చేస్తారు. వారి పతనం అకస్మాత్తుగా మరియు రక్షించే అవకాశం లేకుండా వస్తుంది.
దేవునికి అసహ్యకరమైన ప్రవర్తనల జాబితా ఇక్కడ వివరించబడింది. మానవ జీవిత శ్రేయస్సును అణగదొక్కే ఆ పాపాలు అతనికి ముఖ్యంగా అభ్యంతరకరమైనవి. మనలో ఈ పాపాలను మనం అసహ్యించుకోవాలి; ఇతరులలో వాటిని ఇష్టపడకపోవడం సరిపోదు. అటువంటి ప్రవర్తనలన్నింటి నుండి దూరంగా ఉండి, అప్రమత్తంగా ఉంటూ, వాటికి వ్యతిరేకంగా బలం కోసం ప్రార్థిద్దాం మరియు అలాంటి చర్యలకు పాల్పడే వారి సామాజిక స్థితితో సంబంధం లేకుండా ఎవరికైనా గట్టిగా దూరం చేద్దాం.

దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని ఉద్బోధించడం. (20-35)
దేవుని వాక్యం ప్రతి సందర్భంలోనూ మనకు అందించే జ్ఞానాన్ని కలిగి ఉంది. నమ్మకమైన ఉపదేశాల వల్ల మనం ఎన్నటికీ నిరుత్సాహపడకూడదు. ఈ పాపం యొక్క ప్రాబల్యం, వ్యభిచారం యొక్క స్వాభావిక గురుత్వాకర్షణ, దాని హానికరమైన పర్యవసానాలు మరియు అది ఆధ్యాత్మిక జీవితాన్ని నిస్సందేహంగా ఎలా నాశనం చేస్తుందో పరిశీలిస్తే, దానికి వ్యతిరేకంగా హెచ్చరికలు తరచుగా రావడంలో ఆశ్చర్యం లేదు.
ఈ అధ్యాయంలోని ఇతివృత్తాలను గమనిద్దాం. మనం ఒకప్పుడు అపరిచితులుగా, ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఇష్టపూర్వకంగా మనకు హామీదారుగా వ్యవహరించిన వ్యక్తిని గుర్తుచేసుకుందాం. అటువంటి ఆశాజనకమైన అవకాశాలు, ప్రోత్సాహకాలు మరియు రోల్ మోడల్స్ ఉన్న క్రైస్తవులు శ్రద్ధగా మరియు అప్రమత్తంగా ఉండకూడదా? దేవుణ్ణి సంతోషపెట్టేవాటిని మరియు ఆయన ఉదారంగా ప్రతిఫలమిచ్చేవాటిని మనం విస్మరిస్తామా? మన మనస్సులలో మరియు ఆప్యాయతలలో విషం చొరబడే ప్రతి మార్గం నుండి మనం శ్రద్ధగా కాపాడుకుందాం.



Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |