Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి.
రమ్మని ఆమె ఇచ్చిన ఆహ్వానాన్ని ఎంత త్వరగా ఆయన మన్నించాడో చూడండి. యెషయా 65:24 పోల్చిచూడండి. ఆమెతో కలిసి ఉండడంలో ఆయనకెంత హాయి, సంతృప్తి ఉన్నాయో చూడండి. యేసుప్రభువు తనకోసం ఎవరైతే ఆశిస్తారో సిద్ధపడి ఉంటారో వారితో ముచ్చటించేందుకు తప్పక వస్తాడు (యోహాను 14:23). సంఘంలో తనతోబాటు తన నేస్తాలనూ ప్రేమికులనూ కూడా పాలుపంచుకొనేందుకు పిలుస్తాడు.
2. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొనియున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము నా తలమంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టుచున్నాడు.
మరో దృశ్యం, మరో సమయం. ఆమె రాత్రివేళ ఒంటరిగా ఎక్కడో ఉండగా వరుడు వచ్చి ఆమెను పిలిచాడు. అతను దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడు. లేదా బయట చాలా సేపు నిలబడ్డాడు – మంచువల్ల అతని తల తడిగా ఉంది. ఏవిధంగా చూచుకొన్నా అతని ప్రేమ అర్థమౌతూనే ఉంది. అతడు వచ్చినందువల్ల ఆమె మురిసిపోయింది గాని లేచి తలుపు తీయడానికి ఏమంత ఇష్టం ఉన్నట్టు లేదు (వ 3). ఆలస్యం చేస్తూ ఉంది. మొత్తానికి ఎలానో లేచినప్పుడు కూడా తన గురించి పట్టింపే గాని అతని విషయం ఎక్కువగా ఆలోచించడం లేదు (వ 5). ఇంతకుముందు కూడా ఆమెలో ఈ పొరపాటు కనిపించకపోలేదు (పరమగీతము 1:5, పరమగీతము 1:12; పరమగీతము 2:1). ఆమె జాగు చేయడం, తానంటే పెద్దగా ఆసక్తి చూపకపోవడం అతనికి బాధ కలిగించి అతను వెళ్ళిపోయాడు (వ 6). క్రీస్తు తనకోసం అభిలాష లేని చోట ఎంతో కాలం నిలిచి ఉండడు. ఒక విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో అతనికీ క్రీస్తుకూ మధ్య సహవాస బంధం తెగిపోయిందంటే అందుకు కారణం క్రీస్తు ఎంత మాత్రం కాదు. సహవాసం కోసం ఎంత దూరమైనా ఆయన వస్తాడు. సహనంతో వేచి ఉంటాడు. అయితే తలుపు తీసేందుకు అయిష్టత, నిర్లక్ష్యం (ఇది ఆరంభ ప్రేమ అంతరించిందని సూచిస్తుంది) ఆయనకు బాధ కలిగిస్తుంది. స్వంత వ్యవహారాల్లో మునిగి ఉన్న స్థితి ఆయనతో సహవాసానికి అడ్డుపడుతుంది. తన ప్రేమలో యేసుప్రభువు మనలను పిలిచేది మనం బద్దకంగానూ మన అందాలను మనం చూసుకుని మురిసిపోయే ధోరణిలోనూ ఉండాలని కాదు. మనకు అబ్బిన దేవుని కృప, ఉచిత వరాలు మనల్ని మనం చూచుకొంటూ చంకలు కొట్టుకునేందుకు కాదు. ఆయన సన్నిధే మరీ మరీ కావాలని కోరేవారికీ, ఆ కోరికను వెల్లడించే వారికీ అది తప్పక దొరుకుతుంది. ప్రేమించే ప్రతి వ్యక్తీ తాను ప్రేమించిన వ్యక్తీ అదే విధంగా తనను ప్రేమించాలని కోరడం సహజమే కదా (పరమగీతము 8:6-7; మత్తయి 22:37). మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమంటే మన సావకాశం, మన సుఖం గురించి చూచుకోవడం కాకుండా కేవలం క్రీస్తునే సంతోష పెట్టే విధంగా ఆయన్ను ప్రేమించాలి.
3. నేను వస్త్రము తీసివేసితిని నేను మరల దాని ధరింపనేల? నా పాదములు కడుగుకొంటిని నేను మరల వాటిని మురికిచేయనేల?
4. తలుపుసందులో నా ప్రియుడు చెయ్యియుంచగా నా అంతరంగము అతనియెడల జాలిగొనెను.
5. నా ప్రియునికి తలుపుతీయ లేచితిని నా చేతులనుండియు నా వ్రేళ్లనుండియు జటామాంసి గడియలమీద స్రవించెను
6. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను అతనిమాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతని వెదకినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలుకలేదు.
7. పట్టణములో తిరుగు కావలివారు నా కెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి.
గస్తీవాళ్ళు పరమగీతము 3:3 లో ఉన్న విధంగా కాక వేరే విధంగా ఇక్కడ ఆమెపట్ల ప్రవర్తిస్తున్నారు. బహుశా 3వ అధ్యాయంలోని దృశ్యం ఆమె ప్రేమ యథార్థమైనదా కాదా అని తెలుసుకునేందుకు ఒక పరీక్ష కావచ్చు అయితే ఇక్కడ ఆమె తప్పు చేసింది. అందువల్ల శిక్ష తప్పదు తమ పొరపాటుచేతే క్రీస్తుతో సహవాసాన్ని పోగొట్టుకున్న వారి విషయంలో దేవుని విశ్వాసపాత్రులైన కావలివాళ్ళ మాటలు దెబ్బల్లాగానే బాధకరంగా ఉంటాయి. పాపం చేస్తూవున్న విశ్వాసి వేసుకున్న ముసుగును వారి మాటలు తొలగించి వేస్తాయి. అతని పాపాన్ని బయటపెట్టి తన నీతిన్యాయాలు కోల్పోయినట్టు తాను నగ్నంగా ఉన్నట్టున్నానన్న భావం కలిగిస్తాయి.
8. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినయెడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.
“ప్రేమాతిరేకంచేత స్పృహ తప్పిందని” – పరమగీతము 2:5; కీర్తనల గ్రంథము 84:2; కీర్తనల గ్రంథము 119:81.
9. స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? నీవు మాచేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి?
10. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును
ఇప్పటికి వధువు తన ప్రియుణ్ణి గురించి ఏకాగ్రతతో తలపోస్తూవుంది. 2-8 వచనాల్లో ఎదురైన అనుభవాలు ఆమెకో పాఠం నేర్పించాయి. ఈ పుస్తకంలో ఈమె తన ప్రియుణ్ణి వర్ణించే చోటు ఇదొక్కటే. అయితే యేసుప్రభువు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మనుషుల మాటలతో పూర్తిగా వివరించడం సాధ్యం కాదు. క్రొత్త ఒడంబడికలోని శుభవార్త పుస్తకాల్లో ఎక్కడా యేసుప్రభువు ఆకారం ఎలాంటిదో వర్ణించే ప్రయత్నం కనిపించదు. ఇది గమనించదగ్గ విషయం. అది పూర్తిగా అనవసరం అన్నట్టుగా విడిచిపెట్టడం జరిగింది. నిజంగా అనవసరమే. ఆ గ్రంథకర్తలు నొక్కి నొక్కి చెప్పినది ఆయన సుగుణాలు, స్వభావం, ఆయన చర్యలు, ఆయన ఉద్దేశాలు, తలంపులు, ఆశయాలు, ఆయన లక్షణాలనే.
11. అతని శిరస్సు అపరంజివంటిది అతని తలవెండ్రుకలు కాక పక్షములవలె కృష్ణ వర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.
12. అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.
13. అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.
14. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది.
15. అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము
16. అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు యెరూషలేము కూమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.
క్రీస్తు మనోహర సౌందర్యాన్ని వర్ణించాలంటే వేయి నాలుకలు చాలవు. ఆయన సౌందర్యవంతుడనీ పరిపూర్ణుడనీ మాత్రం మనం అనుకుంటే చాలు. “స్నేహితుడు”– యోహాను 15:15.