Isaiah - యెషయా 10 | View All

1. విధవరాండ్రు తమకు దోపుడుసొమ్ముగా ఉండవలెననియు

1. Woe unto them that decree unrighteous decrees, and to the writers that write perverseness;

2. తలిదండ్రులు లేనివారిని కొల్లపెట్టుకొనవలెననియు కోరి న్యాయవిమర్శ జరిగింపకుండ దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించువారికిని బాధకరమైన శాసనములను వ్రాయించువారికిని శ్రమ.

2. to turn aside the needy from justice, and to rob the poor of my people of their right, that widows may be their spoil, and that they may make the fatherless their prey!

3. దర్శనదినమున దూరమునుండి వచ్చు ప్రళయదినమున మీరేమి చేయుదురు? సహాయమునొందుటకు ఎవరియొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు?
1 పేతురు 2:12

3. And what will ye do in the day of visitation, and in the desolation which shall come from far? to whom will ye flee for help? and where will ye leave your glory?

4. వారు చెరపట్టబడినవారి క్రింద దాగుకొనుచున్నారు హతులైనవారి క్రింద కూలుచున్నారు ఈలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

4. They shall only bow down under the prisoners, and shall fall under the slain. For all this his anger is not turned away, but his hand is stretched out still.

5. అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది.

5. Ho Assyrian, the rod of mine anger, the staff in whose hand is mine indignation!

6. భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.

6. I will send him against a profane nation, and against the people of my wrath will I give him a charge, to take the spoil, and to take the prey, and to tread them down like the mire of the streets.

7. అయితే అతడు ఆలాగనుకొనడు అది అతని ఆలోచనకాదు; నాశనము చేయవలెననియు చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన.

7. Howbeit he meaneth not so, neither doth his heart think so; but it is in his heart to destroy, and to cut off nations not a few.

8. అతడిట్లనుకొనుచున్నాడు నా యధిపతులందరు మహారాజులు కారా?

8. For he saith, Are not my princes all of them kings?

9. కల్నో కర్కెమీషువలె నుండలేదా? హమాతు అర్పాదువలె నుండలేదా? షోమ్రోను దమస్కువలె నుండలేదా?

9. Is not Calno as Carchemish? is not Hamath as Arpad? is not Samaria as Damascus?

10. విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహములకంటె ఎక్కువైనవి గదా?

10. As my hand hath found the kingdoms of the idols, whose graven images did excel them of Jerusalem and of Samaria;

11. షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను.

11. shall I not, as I have done unto Samaria and her idols, so do to Jerusalem and her idols?

12. కావున సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును.

12. Wherefore it shall come to pass, that, when the Lord hath performed his whole work upon mount Zion and on Jerusalem, I will punish the fruit of the stout heart of the king of Assyria, and the glory of his high looks.

13. అతడు నేను వివేకిని నా బాహుబలముచేతను నాబుద్ధిచేతను ఆలాగుచేసితిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని

13. For he hath said, By the strength of my hand I have done it, and by my wisdom; for I have understanding: and I have removed the bounds of the peoples, and have robbed their treasures, and like a valiant man I have brought down them that sit [on thrones]:

14. పక్షిగూటిలో ఒకడు చెయ్యివేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు రెక్కను ఆడించునదియైనను నోరు తెరచునదియైనను కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును.

14. and my hand hath found as a nest the riches of the peoples; and as one gathereth eggs that are forsaken, have I gathered all the earth: and there was none that moved the wing, or that opened the mouth, or chirped.

15. గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కఱ్ఱకానివానిని ఎత్తినట్లును ఉండును గదా?

15. Shall the axe boast itself against him that heweth therewith? shall the saw magnify itself against him that wieldeth it? as if a rod should wield them that lift it up, [or] as if a staff should lift up [him that is] not wood.

16. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయులమీదికి క్షయరోగము పంపును వారిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును.

16. Therefore will the Lord, Jehovah of hosts, send among his fat ones leanness; and under his glory there shall be kindled a burning like the burning of fire.

17. ఇశ్రాయేలుయొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును; అది అష్షూరుయొక్క బలురక్కసిచెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్కదినమున వాటిని మింగివేయును.

17. And the light of Israel will be for a fire, and his Holy One for a flame; and it will burn and devour his thorns and his briers in one day.

18. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతోకూడ అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును.

18. And he will consume the glory of his forest, and of his fruitful field, both soul and body: and it shall be as when a standard-bearer fainteth.

19. అతని అడవిచెట్ల శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును.

19. And the remnant of the trees of his forest shall be few, so that a child may write them.

20. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు.

20. And it shall come to pass in that day, that the remnant of Israel, and they that are escaped of the house of Jacob, shall no more again lean upon him that smote them, but shall lean upon Jehovah, the Holy One of Israel, in truth.

21. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవునివైపు తిరుగును.

21. A remnant shall return, [even] the remnant of Jacob, unto the mighty God.

22. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకవలె ఉండినను దానిలో శేషమే తిరుగును, సమూలనాశనము నిర్ణయింపబడెను. నీతి ప్రవాహమువలె వచ్చును
రోమీయులకు 9:27-28

22. For though thy people, Israel, be as the sand of the sea, [only] a remnant of them shall return: a destruction [is] determined, overflowing with righteousness.

23. ఏలయనగా తాను నిర్ణయించిన సమూలనాశనము ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సర్వలోకమున కలుగజేయును.
రోమీయులకు 9:27-28

23. For a full end, and that determined, will the Lord, Jehovah of hosts, make in the midst of all the earth.

24. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సీయోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కఱ్ఱతో నిన్ను కొట్టి నీమీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును

24. Therefore thus saith the Lord, Jehovah of hosts, O my people that dwellest in Zion, be not afraid of the Assyrian, though he smite thee with the rod, and lift up his staff against thee, after the manner of Egypt.

25. వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును.

25. For yet a very little while, and the indignation [against thee] shall be accomplished, and mine anger [shall be directed] to his destruction.

26. ఓరేబు బండయొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకధిపతియగు యెహోవా తన కొరడాలను వానిమీద ఆడించును. ఆయన దండము సముద్రమువరకు వచ్చును ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును.

26. And Jehovah of hosts will stir up against him a scourge, as in the slaughter of Midian at the rock of Oreb: and his rod will be over the sea, and he will lift it up after the manner of Egypt.

27. ఆ దినమున నీ భుజముమీదనుండి అతని బరువు తీసి వేయబడును. నీ మెడమీదనుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును.

27. And it shall come to pass in that day, that his burden shall depart from off thy shoulder, and his yoke from off thy neck, and the yoke shall be destroyed by reason of fatness.

28. అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు

28. He is come to Aiath, he is passed through Migron; at Michmash he layeth up his baggage;

29. వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామా వణకుచున్నది గెబలో బసచేతమురండని అనుచున్నారు సౌలుగిబ్యా నివాసులు పారిపోవుదురు.

29. they are gone over the pass; they have taken up their lodging at Geba; Ramah trembleth; Gibeah of Saul is fled.

30. గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి లాయిషా, ఆలకింపుము అయ్యయ్యో, అనాతోతు

30. Cry aloud with thy voice, O daughter of Gallim! hearken, O Laishah! O thou poor Anathoth!

31. మద్మేనా జనులు పారిపోవుదురు గిబానివాసులు పారిపోదురు

31. Madmenah is a fugitive; the inhabitants of Gebim flee for safety.

32. ఈ దినమే దండు నోబులో దిగును ఈ దినమే సీయోను కుమారి పర్వతమను యెరూషలేము కొండమీద వారు తమ చెయ్యి ఆడించుదురు

32. This very day shall he halt at Nob: he shaketh his hand at the mount of the daughter of Zion, the hill of Jerusalem.

33. చూడుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి యెత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును.

33. Behold, the Lord, Jehovah of hosts, will lop the boughs with terror: and the high of stature shall be hewn down, and the lofty shall be brought low.

34. ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయును లెబానోను బలవంతుడైన యొకనిచేత కూలిపోవును.

34. And he will cut down the thickets of the forest with iron, and Lebanon shall fall by a mighty one.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Isaiah - యెషయా 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

గర్వించదగిన అణచివేతదారులపై కష్టాలు. (1-4) 
ఈ శ్లోకాలు మునుపటి అధ్యాయానికి అనుసంధానించబడినవి. అన్యాయమైన శాసనాలను సృష్టించి అమలు చేసే అధికార స్థానాల్లో ఉన్నవారికి అయ్యో! మరియు వాటిని డ్రాఫ్ట్ చేసి అధికారికంగా రికార్డ్ చేసే కిందిస్థాయి అధికారుల కోసం అయ్యో! అయితే పాపాలు చేసే వారికి ఎలాంటి ఆప్షన్లు ఉన్నాయి? వారు ఎక్కడ ఆశ్రయం పొందగలరు?

అష్షూరు తన ప్రజల శిక్ష కోసం దేవుని చేతిలో ఒక పరికరం. (5-19) 
పాపం చేసిన లోతైన పరివర్తనను చూడండి. అష్షూరులోని అహంకారి రాజు తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడని భావించాడు. ప్రపంచంలోని అణచివేతలు, అయితే, దైవిక ప్రావిడెన్స్ యొక్క సాధనాలు. దేవుని ఉద్దేశం ఏమిటంటే, తన ప్రజలను వారి కపటత్వానికి సరిదిద్దడం మరియు వారిని తనకు దగ్గరగా తీసుకురావడం. అయితే సన్హెరీబు ఉద్దేశం ఇదేనా? కాదు; అతను తన సొంత దురాశ మరియు ఆశయాన్ని సంతృప్తి పరచడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు. అస్సిరియన్ ఇతర దేశాలపై తన విజయాల గురించి గొప్పగా చెప్పుకుంటాడు, వాటిని తన స్వంత కుయుక్తి మరియు శక్తికి ఆపాదించాడు. అయినప్పటికీ, దేవుడే తనను తీర్చిదిద్దాడు మరియు అతనికి అధికారం ఇచ్చాడు అని అతను గుర్తించలేకపోయాడు.
పక్షులు తమ గూళ్లను దోచుకున్నప్పుడు చేసే విధంగా అతను ఏ విధమైన ప్రతిఘటనను ఎదుర్కోకుండా, సులభంగానే ఇవన్నీ సాధించాడు. యెరూషలేము విగ్రహాలను ప్రతిష్టించడం విచారకరం అయినప్పటికీ, అన్యజనులచే అలాంటి వ్యర్థాలలో ఆమె మించిపోవడంలో ఆశ్చర్యం లేదు. క్రైస్తవులు తమ ప్రత్యేకమైన పిలుపుకు కట్టుబడి ఉండకుండా లోకసంబంధమైన కోరికలను అనుకరించడం కూడా అంతే మూర్ఖత్వం కాదా? ఒక సాధనం ప్రగల్భాలు పలకడం లేదా దాని నిర్మాతకు వ్యతిరేకంగా పోరాడడం ఎంత అసంబద్ధమో, అలాగే యెహోవాపై సన్హెరీబ్ యొక్క అహంకారం.
దేవుడు తన ప్రజలను కష్టాలను ఎదుర్కొనేందుకు అనుమతించినప్పుడు, అది వారి పాపాలను గుర్తు చేయడానికి, వారిని తగ్గించడానికి మరియు వారి విధులను నెరవేర్చడానికి వారిని కదిలించడానికి ఉపయోగపడుతుంది. అంతిమ లక్ష్యం పాప నిర్మూలన. ఈ ప్రయోజనాలను బాధ ద్వారా సాధించిన తర్వాత, అది దయతో అనుసరించబడుతుంది. సీయోను మరియు జెరూసలేంకు వ్యతిరేకంగా సన్హెరీబ్ చేసిన ప్రయత్నం చివరికి ఫలించలేదు. దేవుడు దహించే అగ్నిలా ఉంటాడు, ఆత్మ మరియు శరీరం రెండింటిలోనూ దుర్మార్గులను నాశనం చేస్తాడు. వినాశనం ఒక ప్రమాణాన్ని మోసేవాడు తడబడినట్లుగా ఉంటుంది మరియు అనుసరించే వారు గందరగోళంలో పడతారు. ఈ గొప్ప మరియు పవిత్ర ప్రభువు దేవుని సన్నిధిని ఎవరు తట్టుకోగలరు?

అతని నుండి విముక్తి. (20-34)
మన పరీక్షలు మరియు కష్టాల ద్వారా, ప్రాపంచిక సృష్టిపై మన నమ్మకాన్ని ఉంచడంలోని మూర్ఖత్వాన్ని మనం కనుగొనవచ్చు. దేవునిపై నమ్మకంగా ఆధారపడగలిగే వారు కేవలం వేషధారణలో లేదా బాహ్య వృత్తిలో కాకుండా, చిత్తశుద్ధితో ఆయన వైపు మొగ్గు చూపేవారు. దేవుడు, అవిధేయులైన ప్రజలచే న్యాయబద్ధంగా రెచ్చగొట్టబడి, వారి బాధలకు హద్దులు పెడతాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా అతని ప్రజలు భయానికి లోనవడం దైవిక చిత్తానికి విరుద్ధంగా ఉంటుంది. తన ప్రజల పట్ల దేవుని కోపం తాత్కాలికమైనది, అది దాటిన తర్వాత, మానవజాతి యొక్క కోపానికి భయపడాల్సిన అవసరం లేదు. అతని ప్రజలను క్రమశిక్షణలో ఉంచడానికి ఉపయోగించే కర్రను పక్కన పెట్టడమే కాకుండా అగ్నిలో పడవేయబడుతుంది.
దేవుని ప్రజలను ఉద్ధరించడానికి, ప్రవక్త తన చర్చి యొక్క శత్రువులపై దేవుడు చేసిన గత చర్యలను వారికి గుర్తుచేస్తాడు. దేవుని ప్రజలు వారి అణచివేతదారుల నుండి రక్షించబడతారు, అది అస్సిరియన్లు లేదా కొందరు విశ్వసిస్తున్నట్లుగా, యూదులు వారి చెర నుండి, ఇంకా విశ్వాసులు పాపం మరియు సాతాను దౌర్జన్యం నుండి రక్షించబడతారు. అభిషేకం యొక్క దైవిక కృపను పొందిన ఇజ్రాయెల్‌లోని దేవుని ప్రజల కొరకు ఈ విమోచన "అభిషేకము వలన" మంజూరు చేయబడింది. ఇది దేవుని అభిషిక్తుడైన మెస్సీయ కొరకు కూడా.

28-34 వచనాలలో, జెరూసలేం వైపు సన్హెరీబ్ ముందుకు సాగడం, దాని నాశనానికి ముప్పు వాటిల్లడం గురించి ప్రవచనాత్మక చిత్రణ ఉంది. అయితే, హిజ్కియా తన నమ్మకాన్ని ఉంచిన ప్రభువు, అడవిని నరికివేసినట్లు సన్హెరీబు సైన్యాన్ని నాశనం చేశాడు. మేము ఈ పాఠాలను క్రైస్తవ చర్చి యొక్క వివిధ యుగాలలో సారూప్య సంఘటనలకు అన్వయించవచ్చు. మన గొప్ప విమోచకుని అభిషేకం కారణంగా, ప్రతి క్రీస్తు విరోధి యొక్క కాడిని చర్చి నుండి విడదీయాలి మరియు మన ఆత్మలు పరిశుద్ధాత్మ యొక్క చర్యలో పాల్గొంటే, మనం పూర్తి మరియు శాశ్వతమైన విమోచనకు హామీ ఇవ్వగలము.



Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |