Isaiah - యెషయా 14 | View All

1. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులు వారిని కలిసికొందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు

1. భవిష్యత్తులో యెహోవా, తన ప్రేమను యాకోబుకు మరల చూపిస్తాడు. ఇశ్రాయేలీయులను యెహోవా మరల ఏర్పాటు చేసికొంటాడు. ఆ సమయంలో యెహోవా ఆ ప్రజలకు వారి దేశాన్ని ఇస్తాడు. అప్పుడు యూదులు కాని వారు, యూదా ప్రజల్లో చేరిపోతారు. ఈ ఇద్దరూ ఒకటిగా యాకోబు వంశం అవుతారు.

2. జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములోవారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచుకొందురు వారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి

2. ఆ రాజ్యాలు ఇశ్రాయేలు ప్రజలను ఇశ్రాయేలు దేశంలో చేర్చుకుంటారు. ఇతర రాజ్యాలకు చెందిన ఆ స్త్రీ పురుషులు ఇశ్రాయేలుకు బానిసలు అవుతారు. గతంలో ఆ ప్రజలే ఇశ్రాయేలు ప్రజలను తమకు బానిసలుగా చేసుకొన్నారు. కాని ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజ్యాలను ఓడించి, వారి మీద ఏలుబడి చేస్తారు.

3. తమ్మును బాధించినవారిని ఏలుదురు.

3. యెహోవా మీ కష్టమైన పని తీసివేసి, మిమ్మల్ని ఆదరిస్తాడు. గతంలో మీరు బానిసలు. ప్రతి కష్టమైన పనినీ మనుష్యులు మీతో బలవంతంగా చేయించారు. అయితే యెహోవా మీకు ఈ కష్టతరమైన పనిని అంతం చేస్తాడు.

4. నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?

4. ఆ సమయంలో, బబులోను రాజును గూర్చి మీరు ఈ పాట పాడటం మొదలు పెడ్తారు. ఆ రాజు మమ్మల్ని పాలించినప్పుడు నీచంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని పాలన అయిపోయింది.

5. దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు.

5. చెడ్డ పాలకుల దండాన్ని యెహోవా విరుగగొడతాడు. వారి అధికారాన్ని యెహోవా తొలగించి వేస్తాడు.

6. వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనములను లోపరచిరి.

6. బబులోను రాజు కోపంతో ప్రజలను కొట్టాడు దుష్టుడైన ఆ పాలకుడు ప్రజలను కొట్టడం మానలేదు దుష్టుడైన ఆ పాలకుడు కోపంతో ప్రజలను పాలించాడు. ప్రజలకు కీడు చేయటం అతడు ఎన్నడూ ఆపు జేయలేదు.

7. భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటినుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని

7. అయితే ఇప్పుడు దేశం మొత్తం విశ్రాంతి తీసుకొంటూంది. దేశం నెమ్మదిగా ఉంది. ప్రజలు ఇప్పుడు ఉత్సవం చేసుకోవటం మొదలు బెడుతున్నారు.

8. నిన్నుగూర్చి తమాలవృక్షములు లెబానోను దేవదారువృక్షములు హర్షించును

8. నీవు ఒక దుష్ట రాజువు కానీ ఇప్పుడు నీ పని అయిపోయింది. చివరికి తమాల వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి. లెబానోను దేవదారు వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి. ఆ చెట్లు అంటున్నాయి, “రాజు మమ్మల్ని నరికి వేశాడు. కానీ ఇప్పుడు రాజే పడిపోయాడు. అతడు మళ్లీ ఎన్నటికీ నిలబడడు.”

9. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్తశూరులను జనముల రాజుల నందరినివారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది

9. నీవు వస్తున్నందుకు, మరణ స్థానమైన పాతాళం హర్షిస్తుంది. భూలోక నాయకులందరి ఆత్మలనూ పాతాళం నీ కోసం మేల్కొలుపుతుంది. పాతాళం, రాజులను వారి సింహాసనాల మీదనుండి లేపి నిలబెడుతుంది. నీ రాకకు వారు సిద్ధంగా ఉంటారు.

10. వారందరు నిన్ను చూచినీవును మావలె బలహీనుడవైతివా? నీవును మాబోటివాడవైతివా? అందురు.

10. ఈ నాయకులంతా నిన్ను హేళన చేస్తారు.”ఇప్పుడు నీవు కూడా మాలాగే చచ్చిన శవానివి. ఇప్పుడు నీవూ మాలాగే ఉన్నావు.” అని వారంటారు.

11. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును.

11. నీ గర్వం పాతాళానికి పంపబడింది. నీ సితారాల సంగీతం, నీ గర్విష్ఠి ఆత్మ రాకను ప్రకటిస్తున్నాయి. కీటకాలు నీ శరీరాన్ని తినివేస్తాయి. వాటి మీద నీవు పరుపులా పడి ఉంటావు. పురుగులు దుప్పటిలా నీ శరీరాన్ని కప్పేస్తాయి.

12. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?
లూకా 10:18, ప్రకటన గ్రంథం 8:10

12. ఓ ప్రకాశవంతమైన నక్షత్రమా! ఉదయ పుత్రా! నీవు ఆకాశంనుండి ఎలా పడిపోయావు.? జనాంగాన్ని పతనం చేసే నీవు భూమి మీదికి ఎలా నరికి వేయబడ్డావు.

13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును
మత్తయి 11:23, లూకా 10:15

13. నీలో నీవు ఎల్లప్పుడూ ఇలా చెప్పు కొన్నావు: “సర్వోన్నతుడైన దేవునిలా నేనూ ఉంటాను. పైన ఆకాశాల్లోకి నేను వెళ్లిపోతాను. నేను, నా సింహాసనాన్ని దేవుని నక్షత్రాలకంటె పైకి హెచ్చిస్తాను. పరిశుద్ధ సభా పర్వతం మీద నేను కూర్చుంటాను. దాగియున్న ఆ కొండ మీద దేవుళ్లను నేను కలుసుకొంటాను.

14. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

14. మేఘాల మీద నేను బలిపీఠం దగ్గరకు వెళ్తాను. నేను, మహోన్నతుడైన దేవునిలా ఉంటాను.”

15. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
మత్తయి 11:23, లూకా 10:15

15. కానీ అది జరుగలేదు. నీవు దేవునితో ఆకాశంలోనికి వెళ్లలేదు. అగాధపు గోతి లోనికి పాతాళానికి నీవు కిందికి తీసుకొని రాబడ్డావు.

16. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు

16. ప్రజలు నిన్ను చూచి, నీ విషయం ఆలోచిస్తారు. నీవు కేవలం చచ్చిన శవం మాత్రమేనని ప్రజలు గమనిస్తారు. ప్రజలు అంటారు, “భూలోక రాజ్యాలన్నింటిలో భయం పుట్టించినవాడు ఇతడేనా?

17. భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా? లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పోనియ్యనివాడు ఇతడేనా?

17. పట్టణాలను నాశనం చేసినవాడు ఇతడేనా? దేశాన్ని ఎడారిగా మార్చినవాడు ఇతడేనా? యుద్ధంలో మనుష్యుల్ని బంధించి, వారిని ఇంటికి వెళ్లనీయనివాడు ఇతడేనా?”

18. జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు.

18. భూమిమీద ప్రతి రాజూ ఘనంగా మరణించాడు. ప్రతి రాజుకూ స్వంత సమాధి ఉంది.

19. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలెనున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలెనున్నావు

19. అయితే నీవు, దుష్ట చక్రవర్తివి నీ సమాధిలోనుండి తోసి వేయబడ్డావు. నరకబడిన చెట్టు కొమ్మలా నీవున్నావు. ఆ కొమ్మ నరకబడి, పారవేయబడింది. నీవు యుద్ధంలో చచ్చిపడిన వానిలా ఉన్నావు. మిగతా సైనికులు వాని మీద నడిచారు. ఇప్పుడు చచ్చిన ఇతరుల్లాగే ఉన్నావు. నీవు చావు గుడ్డల్లో చుట్టబడ్డావు.

20. నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.

20. ఇంకా ఎంతోమంది రాజులు చనిపోయారు. వారందరికీ వారి సమాధులు ఉన్నాయి. కానీ నీవు వాళ్లను చేరవు. ఎందుకంటే, నీవు నీ స్వంత దేశాన్ని నాశనం చేశావు గనుక నీ స్వంత ప్రజల్నే నీవు చంపేశావు. నీవు చేసినట్టు నీ పిల్లలు నాశనం చేయటం కొనసాగించారు. నీ పిల్లలు ఆపుజేయబడతారు.

21. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమునుబట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి.

21. అతని పిల్లలను చంపటానికి సిద్ధపడండి. వారి తండ్రి దోషి గనుక వాళ్లను చంపండి. అతని పిల్లలు మళ్లీ ఎన్నటికీ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోరు. అతని పిల్లలు మళ్లీ ఎన్నటికీ ప్రపంచాన్ని తమ పట్టణాలతో నింపరు.

22. సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే నేను వారిమీదికి లేచి బబులోనునుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టి వేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

22. “నేను నిలబడి ఆ ప్రజలకు విరోధంగా యుద్ధం చేస్తాను. ప్రఖ్యాత బబులోను పట్టణాన్ని నేను నాశనం చేస్తాను. బబులోను ప్రజలందరినీ నేను నాశనం చేస్తాను. వారి పిల్లలను, మనుమళ్లను, మునిమనుమళ్లను నేను నాశనం చేస్తాను” అని సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు. యెహోవా తానే ఆ విషయాలు చెప్పాడు.

23. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

23. బబులోనును నేను మార్చేస్తాను. ఆ స్థలం మనుష్యుల కోసం కాదు, జంతువుల కోసమే. ఆ స్థలం నీ టి మడుగు అవుతుంది. బబులోనును తుడిచి వేయటానికి ‘నాశనం అనే చీపురును’ నేను ప్రయోగిస్తాను” అని యెహోవా చెప్పాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ సంగతులు చెప్పాడు.

24. సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.

24. సర్వశక్తిమంతుడైన యెహోవా ఒక ప్రమాణం చేశాడు. యెహోవా చెప్పాడు, “సరిగ్గా నేను తలచినట్టే ఈ సంగతులు జరుగుతాయని నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ విషయాలు సరిగ్గా నా పథకం ప్రకారమే జరుగుతాయి.

25. నా దేశములో అష్షూరును సంహరించెదను నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును వాని భారము వారి భుజముమీదనుండి తొలగింపబడును.

25. అష్షూరు రాజును నేను నా దేశంలో నాశనం చేస్తాను. నా కొండలపై నేను ఆ రాజు మీద నడుస్తాను. ఆ రాజు నా ప్రజలను తనకు బానిసలుగా చేశాడు. వారి మెడల మీద అతడు ఒక కాడిపెట్టాడు. యూదా మెడమీద నుండి ఆ కాడి తొలగించి వేయబడుతుంది. ఆ భారం తొలగించబడుతుంది.

26. సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే.

26. నేను నా ప్రజల కోసం చేయాలనీ ఉద్దేశించిన సంగతి అది. రాజ్యాలన్నింటినీ శిక్షించటానికి నేను నా చేతి బలంప్రయోగిస్తాను.”

27. సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించియున్నాడు రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు?

27. యెహోవా ఒక పథకం వేసినప్పుడు ఆ పథకాన్ని ఎవ్వరూ అడ్డగించలేరు. ప్రజలను శిక్షించేందుకు యెహోవా తన చేయి పైకెత్తినప్పుడు, దానిని ఎవ్వరూ అడ్డగించలేరు.

28. రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి

28. విచారకరమైన ఈ సందేశం ఆహాబు రాజు చని పోయిన సంవత్సరం ఇవ్వబడింది.

29. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడెనని అంతగా సంతోషింపకుము సర్పబీజమునుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము.

29. ఓ ఫిలిష్తీ దేశమా, నిన్ను కొట్టే రాజు చనిపోయాడని నీవు సంతోషిస్తున్నావు. కానీ నీవు నిజంగా సంతోషపడకు. అతని పరిపాలన అంతమయిపోయింది, నిజమే. కానీ రాజు కుమారుడు వస్తాడు. పరిపాలిస్తాడు. అది ఒక సర్పం తనకంటె మరింత ఎక్కువ ప్రమాదకరమైన సర్పానికి జన్మ ఇచ్చినట్టు ఉంటుంది.

30. అప్పుడు అతిబీదలైనవారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షితముగా పండుకొందురు కరవుచేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును.

30. కానీ నా దీన ప్రజలు మాత్రం క్షేమంగా భోజనం చేయగలుగుతారు. వారి పిల్లలు క్షేమంగా ఉంటారు. మీ దీనప్రజలు పండుకొని, క్షేమంగా ఉంటారు. కానీ నేను మీ కుటుంబాన్ని ఆకలితో చంపేస్తాను. మిగిలిన మీ ప్రజలంతా చనిపోతారు.

31. గుమ్మమా, ప్రలాపింపుమీ, పట్టణమా, అంగలార్పుమీ. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు ఉత్తరదిక్కునుండి పొగ లేచుచున్నది వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడును లేడు.

31. పట్టణ ద్వారం దగ్గర ఉండే ప్రజలారా కేక వేయండి. పట్టణ ప్రజలారా, గట్టిగా కేకలు వేయండి. ఫిలిష్తియాలోని ప్రజలారా, మీరు భయపడతారు. మీ ధైర్యం వేడి మైనంలా కరిగిపోతుంది. ఉత్తరంగా చూడండి. అక్కడ ధూళి మేఘం ఉంది. అష్షూరు నుండి ఒక సైన్యం వస్తోంది. ఆ సైన్యంలో మనుష్యులంతా బలంగా ఉన్నారు.

32. జనముల దూత కియ్యవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించియున్నాడు ఆయన జనులలో శ్రమనొందినవారు దాని ఆశ్రయింతురు అని చెప్పవలెను.

32. ఆ సైన్యం, వారి దేశానికి సందేశం తీసుకువెళ్లే వారిని పంపుతుంది. ఆ సందేశకులు వారి ప్రజలకు ఏమని చెబుతారు? ఫిలిష్తియా ఓడిపోయింది. అని వారు ప్రకటిస్తారు. కానీ సీయోనును యెహోవా బలపర్చాడు. ఆయన దీన ప్రజలు భద్రత కోసం అక్కడికి వెళ్లారు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Isaiah - యెషయా 14 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

బాబిలోన్ నాశనం, మరియు దాని గర్వించదగిన చక్రవర్తి మరణం. (1-23) 
డివైన్ ప్రొవిడెన్స్ యొక్క మొత్తం రూపకల్పన దేవుని ప్రజల శ్రేయస్సు కోసం ఖచ్చితంగా నిర్దేశించబడింది. వాగ్దానం చేసిన భూమిలో స్థిరనివాసం ఏర్పాటు చేయడం దేవుని దయకు నిదర్శనం. దేవుడు ఎన్నుకున్న వారిని ఆలింగనం చేసుకోవడం చర్చికి అత్యవసరం, మరియు దేవుని ప్రజలు తమను తాము ఎక్కడ చూసినా, వారి ధర్మబద్ధమైన మరియు స్నేహపూర్వక ప్రవర్తన ద్వారా మతాన్ని ఉదాహరణగా చూపడానికి ప్రయత్నించాలి. తమ వ్యతిరేకతలో మొండిగా ఉన్నవారు దేవుని అనుచరుల నిజమైన భక్తితో వినయం పొందాలి. ఈ సూత్రాన్ని సువార్త వ్యాప్తికి కూడా అన్వయించవచ్చు, ఒకప్పుడు దాని బద్ధ విరోధులుగా ఉన్న వ్యక్తులు చివరికి దాని అధికారానికి లొంగిపోతారు. ఈ లోతైన పరివర్తనను ప్రభావితం చేసే బాధ్యతను దేవుడే స్వీకరిస్తాడు. తత్ఫలితంగా, వారు తమ వేదన మరియు భయాందోళనల నుండి ఉపశమనాన్ని పొందుతారు, వారి ప్రస్తుత కష్టాల భారాన్ని మరియు అంతకంటే గొప్ప వాటి గురించి భయాన్ని తొలగిస్తారు.
బాబిలోన్, దాని అపారమైన సంపదతో, ఐశ్వర్యంతో వర్ణించబడింది. బాబిలోనియన్ చక్రవర్తి, అటువంటి విస్తారమైన సంపదపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నాడు, ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించడానికి వారిని నియమించాడు. ఇది ప్రత్యేకంగా యూదు ప్రజలకు సంబంధించినది మరియు బాబిలోనియన్ రాజు యొక్క పాపాలను మరింత తీవ్రతరం చేసింది. నిరంకుశులు తమ తృప్తి చెందని కోరికలు మరియు కోరికల కోసం తరచుగా వారి నిజమైన సంక్షేమాన్ని త్యాగం చేస్తారు. "నేను పరిశుద్ధుడను కాబట్టి పవిత్రముగా ఉండుము" అని ఆయన ఉద్బోధించినట్లు పరమపవిత్రుడిని అనుకరించాలని కోరుకోవడం ధర్మం. అయితే, సర్వోన్నతునిలా మారాలని కోరుకోవడం పాపం, ఎందుకంటే "తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు" అని ఆయన ప్రకటించాడు. దెయ్యం మన మొదటి పూర్వీకులను పాపంలోకి నడిపించింది. అతనికి పూర్తి వినాశనం ఎదురుచూస్తుంది, మరియు పాపంలో పట్టుదలతో ఉన్నవారు విరమించుకోవలసి వస్తుంది. అతను ఓడిపోయి సమాధిలోకి దిగిపోతాడు, ఇది నిరంకుశులందరికీ సాధారణ విధి. నిజమైన కీర్తి, నిజమైన కృపకు పర్యాయపదంగా, ఆత్మతో స్వర్గానికి చేరుకుంటుంది, అయితే ఖాళీ ఆడంబరం శరీరంతో సమాధికి దిగుతుంది, అక్కడ అది దాని అంతిమ ముగింపును కలుస్తుంది. ప్రకటన గ్రంథం 18:2లో చెప్పబడినట్లుగా, సరియైన సమాధి నిరాకరించబడుట, అది నీతిని అనుసరించుటలో సంభవించినట్లయితే, అది సంతోషించుటకు ఒక కారణం. సంస్కరణల ద్వారా శుద్ధీకరణను ప్రజలు పట్టుదలతో ప్రతిఘటించినప్పుడు, వారు విధ్వంసం యొక్క చీపురు ద్వారా భూమి యొక్క ముఖం నుండి కొట్టుకుపోతారని ఊహించాలి.

అస్సిరియా నాశనం యొక్క హామీ. (24-27) 
దేవుని ప్రజలపై భారం మోపేవారు మరియు అణచివేసే వారు తమకు ఎదురుచూసే పరిణామాలను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని ఉద్దేశం ప్రకారం పిలవబడిన వారి విషయానికొస్తే, దేవుడు ఏదైతే నియమించాడో అది నిస్సందేహంగా నెరవేరుతుందనే హామీలో వారు ఓదార్పు పొందవచ్చు. అష్షూరీయులు విధించిన కాడిని బద్దలు కొట్టాలని సేనల ప్రభువు నిశ్చయించుకున్నాడు మరియు ఈ దైవిక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన చేయి చాచింది. ఆయన సంకల్పాన్ని అడ్డుకునే శక్తి ఎవరికి ఉంది? అటువంటి ప్రావిడెన్షియల్ సంఘటనల ద్వారా, సర్వశక్తిమంతుడు నిస్సందేహంగా తన పాపాన్ని అసహ్యించుకుంటాడు.

ఫిలిష్తీయుల నాశనం. (28-32)
ఫిలిష్తీయులు మరియు వారి పరాక్రమం కరువు మరియు యుద్ధం కారణంగా వారి పతనాన్ని ఎదుర్కొంటుందని మేము హామీ ఇస్తున్నాము. హిజ్కియా వారి హృదయాలలో ఉజ్జియా కంటే ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. వేడుకలకు బదులుగా, దుఃఖం ఉంటుంది, ఎందుకంటే భూమి మొత్తం నాశనం అవుతుంది. ఈ వినాశనము గర్విష్ఠులకు మరియు ధిక్కరించిన వారికి కలుగును. అయినప్పటికీ, రాబోయే ఉగ్రత నుండి ఆశ్రయం పొందే మరియు క్రీస్తు యేసు ద్వారా తన దయపై విశ్వాసం ఉంచే వినయపూర్వకమైన పాపులకు ప్రభువు సీయోనును పవిత్ర స్థలంగా స్థాపించాడు. మన చుట్టూ ఉన్న వారితో మన సౌకర్యాన్ని మరియు భద్రతను పంచుకుందాం మరియు అదే అభయారణ్యం మరియు మోక్షాన్ని కోరుకునేలా వారిని ప్రోత్సహిద్దాం.



Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |