దీనిలో యెషయా మొదటి భాగం ముగిసింది. యెషయా 1–35 అధ్యాయాలు అష్షూరువారు యూదాను ముట్టడించక ముందు రాశాడు. ఆ అధ్యాయాల్లో ఉన్న అనేక సంగతులను ఆ సంభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాశాడు. 36,37 అధ్యాయాల్లో జెరుసలం దగ్గర అష్షూరు సైన్యాలు ఓడిపోవడం గురించి ఉంది. 39 అధ్యాయంలో ఒక క్రొత్త ప్రమాదం తల ఎత్తడం చూస్తున్నాం. అది యూదా పై బబులోనువారు దాడి చెయ్యడం. వీరు మాత్రం అష్షూరులాగా విఫలం కారు. జెరుసలంను పట్టుకుని దాని ప్రజలను తీసుకుపోతారు. 40–66 అధ్యాయాలు దీన్ని దృష్టిలో ఉంచుకుని రాశాడు యెషయా. అతడు భవిష్యత్తులో బబులోను పతనాన్ని గురించీ, అక్కడినుంచి యూదులు స్వదేశానికి తిరిగి రావడం గురించీ, జెరుసలంకు కలగబోయే వైభవం గురించీ రాశాడు. అంతే గాక యూదుల, ఇతర ప్రజల శాశ్వత రక్షణ ఎవరిపై ఆధారపడి ఉంటుందో ఆయనను – అంటే అభిషిక్తుడు అయిన యేసు క్రీస్తుప్రభువును, యెషయా స్పష్టంగా ఇక్కడ చూపెడుతున్నాడు.